మనం కరెంట్ వాడుకున్నందుకు, నీళ్ళు వాడుకున్నందుకు, ఇల్లు కట్టుకునేందుకు, రోడ్లు మొదలయిన మౌలిక సదుపాయాల కోసం టాక్స్ రూపంలోనో, బిల్లు రూపంలోనో ప్రభుత్వానికి కొంత డబ్బు కడతాం. ప్రతి వ్యక్తీ తమ ఆదాయాన్ని చూపిస్తూ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ప్రతి ఉద్యోగికి లేదా ప్రతి వ్యక్తికీ ఎంత టాక్స్ కట్టాలి అన్న అవగాహన ఉండదు. అవగాహన లేని వ్యక్తిని ప్రభుత్వం వదిలేయదు. ప్రభుత్వానికి అవకాశం దొరికినపుడు వ్యక్తిగత కక్షలు ఉన్నపుడు నిలదీసి ప్రశ్నిస్తుంది. ఇంటి పన్ను విధించిన పద్ధతిలోనే ఆదాయ పన్ను కూడా ఇంటికే పంపే వీలు లేదు. ఎవరికి వారు ఇంటిపన్ను మధింపు చేయలేరు. ఇంటి కొలతల ప్రకారం ప్రభుత్వం పన్ను వేస్తుంది. 130 కోట్లమందిలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు ఎంతమంది ఉంటారు? రహదారులు, విద్యుత్, నీరు వాడుకున్నందుకు డబ్బు కడతాం. ఎవరి స్వంత తెలివితేటలతో మోసం చేసో, బెదిరించో డబ్బు సంపాదిస్తే అది ఎలా వచ్చిందో ప్రభుత్వానికి చెప్పాలి. ఇంటిలో ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అనెది ప్రభుత్వానికి తెలిసే వీలు లేదు కాబట్టి ఇంటిలో ఉన్న వ్యక్తుల ఆదాయం ప్రకారం ప్రభుత్వం పన్ను విధించే వీలు లేదు. బాగా తెలివికలవాడు కోటి రూపాయలు సంపాదిస్తే తెలివిలేని వారు 10వేలు మాత్రమే సంపాదించవచ్చు. ఒక మనిషి ఎంత సంపదిస్తే అంత ఆదాయపన్ను కట్టాలి. తెలివికలవాడు బాగా సంపాదిస్తే బాగా పన్ను చెల్లించాలి. సంపాదించలేని వ్యక్తికి ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. ఉచిత పధకాలను ప్రవేశపెడుతుంది. వడ్డీ మాఫీ చేస్తుంది.  తెలివితక్కువగా పుట్టడం వల్ల ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నపుడు తెలివికలవారికి మరిన్ని రాయితీలు కల్పించాలి. తెలివితక్కువవారికి రుణ మాఫీలు చేస్తున్నపుడు తెలివికలవారికి కూడా రుణమాఫీ చేయాలి అనేది మాల్యా వాదన. ప్రభుత్వాలే ప్రపంచ బ్యాంక్ కు ఋణపడుతున్నాయి. మీరు ఎందుకు ఋణాలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసే వీలులేదు. ఎపుడు ఏ ప్రభుత్వం ఎందుకు అప్పు చేస్తుందో ఎవరికీ తెలియదు. కొన్ని సార్లు కాగ్ అక్షింతలు వేసింది అని వార్తలు వస్తాయి. కాగ్ పని కేవలం అక్షింతలు వేయడమేనా? అప్పు చేసినందుకు ప్రభుత్వానికి కానీ వ్యక్తులకు గానీ శిక్షలు పడిన దాఖలాలు లేవు. ఎంత ఆదాయానికి ఎంత పన్ను ఉండాలి? మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా ఉన్నపుడు పన్నులు కూడా అందరికీ సమానంగా ఉండవచ్చా? కుటుంబ అస్థులు ఎంతవరకూ ఉండవచ్చు? కుటుంబ ఆదాయమూ వ్యక్తుల ఆదాయమూ వేరు వేరుగా చూడవచ్చా? ఒక మనిషికి ఎంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు? ఒక మనిషికి ఎంత ఆదాయం ఉంటే పన్ను కట్టాలి? ప్రభుత్వం ఎంత వరకూ ఋణం తీసుకోవచ్చు? ఆదాయాన్ని మించి అప్పులు చేస్తే పడే భారాన్ని ఎవరు భరిస్తారు? అప్పుల భారాన్ని తీర్చుకునేందుకు ఆస్థులు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఉందా? అసలు ఆదాయ వ్యయాలు ఎలా ఉండాలి? అందరూ సక్రమంగా పన్నులు చెల్లించాలంటే తీసుకోవలిసిన జాగ్రత్తలు ఏమిటి? దేశంలో వాహనం,ఇల్లు,టీవీ,ఏసీ,సెల్ ఫోన్ ఉన్న ప్రతివ్యక్తీ పన్ను చెల్లించాలి. ఆర్ధిక అవగాహన లేకపోవడం కారణంగా పన్నులు కట్టకపోవడం నేరమా కాదా? ఆర్ధిక నేరాలకు శిక్షలు లేవా?
-నీహారిక

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. ఒకే టపాలో పదమూడు పిడకలా ? సారీ. ప్రశ్నలా? JEE Advanced questions may be better.
    Filing IT returns has been simplified now and fairly easy. Maybe Nageshwar Garu can answer your questions.

    ReplyDelete
  2. Most of the questions have answers already.

    కాగ్ అక్షింతలు వేసింది అని వార్తలు వస్తాయి. కాగ్ పని కేవలం అక్షింతలు వేయడమేనా?
    Yes,It is more weak now under new BJP . It lost it's indenpendence even to condemn. We are in very sad state

    అప్పు చేసినందుకు ప్రభుత్వానికి కానీ వ్యక్తులకు గానీ శిక్షలు పడిన దాఖలాలు లేవు.
    People are penalized for burrowing and not repaying. Willful defaulters photos and names are being published in news papers.

    ఎంత ఆదాయానికి ఎంత పన్ను ఉండాలి?
    Tax slabs in india.

    మౌలిక సదుపాయాలు అందరికీ సమానంగా ఉన్నపుడు పన్నులు కూడా అందరికీ సమానంగా ఉండవచ్చా?
    No, rich enjoys more pleasures

    కుటుంబ అస్థులు ఎంతవరకూ ఉండవచ్చు?
    Unlimited

    కుటుంబ ఆదాయమూ వ్యక్తుల ఆదాయమూ వేరు వేరుగా చూడవచ్చా?
    Yes

    ఒక మనిషికి ఎంత ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు?
    unlimited.

    ఒక మనిషికి ఎంత ఆదాయం ఉంటే పన్ను కట్టాలి?
    Answers availble everywhere. Tax slabs in india

    ప్రభుత్వం ఎంత వరకూ ఋణం తీసుకోవచ్చు?
    Too big to answer,

    ఆదాయాన్ని మించి అప్పులు చేస్తే పడే భారాన్ని ఎవరు భరిస్తారు?
    People,banks


    అప్పుల భారాన్ని తీర్చుకునేందుకు ఆస్థులు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఉందా?
    Yes,DRT auctions,court acutions, IP

    అసలు ఆదాయ వ్యయాలు ఎలా ఉండాలి?
    too generic , ideal solution is Earnings>expenses

    అందరూ సక్రమంగా పన్నులు చెల్లించాలంటే తీసుకోవలిసిన జాగ్రత్తలు ఏమిటి?
    Honesty in people

    దేశంలో వాహనం,ఇల్లు,టీవీ,ఏసీ,సెల్ ఫోన్ ఉన్న ప్రతివ్యక్తీ పన్ను చెల్లించాలి.
    They are already paying various taxes

    ఆర్ధిక అవగాహన లేకపోవడం కారణంగా పన్నులు కట్టకపోవడం నేరమా కాదా?
    Ignorance is not an excuse. If one earns taxable money then they are not considered ignorant people

    ఆర్ధిక నేరాలకు శిక్షలు లేవా?
    Yes,SEBI and ED courts

    ReplyDelete
    Replies
    1. @Unknown:

      "ప్రభుత్వం ఎంత వరకూ ఋణం తీసుకోవచ్చు?
      Too big to answer"

      FRBM for states:

      Fiscal deficit < 3% of SGDP
      Total debt < 20% of SGDP

      Delete
    2. కుటుంబ ఆదాయం, వ్యక్తుల ఆదాయం రెండూ unlimited కాకూడదు. ఆదాయ పరిమితి ఉంటే కమ్యూనిజం సాధించినట్లు అవుతుంది కదా ?
      పెదరికం అంటే రోజుకి 500 రూ సంపాదించడం అయితే 100 కోట్లు కలిగి ఉండడం మధ్యతరగతి కావాలి. అంతకుమించితే ధనికులు అనాలి. ప్రతి వ్యక్తి 1000 కోట్లు దాటితే ప్రభుత్వానికి అప్పగించేయాలి.

      Delete
  3. // "అప్పుల భారాన్ని తీర్చుకునేందుకు ఆస్థులు అమ్మే అధికారం ప్రభుత్వానికి ఉందా?
    Yes,DRT auctions,court acutions, IP" //

    ప్రభుత్వమే చేసిన అప్పులను తీర్చు..కునేం..దుకు ప్రభుత్వ ఆస్తులను అమ్మే అధికారం ప్రభుత్వానికి ఉందా ... అన్నది నీహారిక గారి ప్రశ్నలోని భావం అని తోస్తోంది. కాబట్టి DRT auctions కాదు. Public Debt (including External Debt) గురించిన అంశం ఇది.

    ReplyDelete
    Replies
    1. VNR garoo, you are correct. The concepts of limited liability & insolvency do not apply to sovereign nations (and organs thereof).

      Only RoC incorporated PSU's are treated as "normal legal entities"

      Delete
  4. >>>rich enjoys more pleasures<<<<

    భారతదేశంలో టాక్స్ పేయర్స్ 1% పేదవారు 29% మిగతా 69% టాక్స్ కట్టనివాళ్ళు.
    మీరు చెపుతున్న pleasures అన్న పదానికి అర్ధం ఇదేనా ?

    మౌలిక సదుపాయాలకోసమే పన్నులు కడుతున్నపుడు రహదారులు వేయడానికి అప్పులు చేసాము కాబట్టి జీవితాంతం టోల్ టాక్స్ కట్టవలసిందే అనడం సరి అయినదేనా ? పన్నులు సక్రమంగా చెల్లిస్తే ఇలా జీవితాంతం టోల్ టాక్సులు కట్టుకోనవసరం లేదేమో ?

    ReplyDelete
    Replies
    1. నీహారిక గారూ, మీరు చెప్పిన 69% లెక్క ఏ పన్ను గురించి? ఇకపోతే పరోక్ష పన్నులు అందరూ కడతారు.

      Delete
    2. పన్నులు కట్టే వాళ్ళు ఒక్క శాతం, పేదలు 29 శాతం అని గూగులమ్మ చెప్పింది. మిగిలిన 69 శాతం పన్నుకట్టని వాళ్ళని నేను అనుకున్నాను. పన్నులు అందరూ కడతారని నాకు తెలవద్...

      Delete
    3. 100 లో మిగిలిన ఒక్క శాతం పేదలు కాకపోయినా పేదలు అని చెప్పేవాళ్ళన్నమాట !

      Delete
    4. *పరోక్ష* పన్నులు అందరూ కడతారు నీహారిక గారూ

      Delete
  5. జై గారు,
    ఈ చర్చలో పన్నులు అంటే ప్రత్రక్ష‌ పన్నులు (Income Tax) అనే అర్థంలోనే నీహారిక గారు మాట్లాడుతున్నట్లున్నారు ...‌ అని నా అభిప్రాయం

    ReplyDelete
    Replies
    1. ఆదాయపన్ను అనే అంటున్నాను. వారు పరోక్ష పన్నుల గురించి ప్రస్థావిస్తున్నారు. నేను ఆర్ధిక నేరాలు అని అన్నాను కదా పన్ను కట్టకపోవడం నేరమా కాదా అని అర్ధం...ప్రభుత్వాన్ని,ప్రజలను మోసం చేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడితే ఆదాయం వస్తుంది కదా దానికి పన్ను కడతారా లేదా అని ఆరా తీసా... విజయ్ సాయి రెడ్డిగారు కేంద్ర ప్రభుత్వం ఎవరినీ వదిలిపెట్టదు అని చెపుతున్నారు కదా ? కేంద్ర ప్రభుత్వం అంత చురుగ్గా ఎపుడు పనిచేస్తుందా అని వెయిటింగ్ ఇక్కడ...మోడీ గారు కూడా 40 ఇయర్స్ ఇండస్ట్రీయే కదా ?

      Delete
    2. ఆదాయ పన్ను ఎగవేత ఒక్కటే కాదు, ఆర్ధిక నేరాలలో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి
      వ్యవసాయ ఆదాయానికి పన్ను లేదు
      టోల్ పన్ను కాదు, వాడకపు రుసుము

      నీహారిక గారు రకరకాల విషయాలను కలగాపులగం చేసి మనలను కన్ఫ్యూస్ చేస్తున్నారు అధ్యక్షా!

      Delete
    3. ఎంతో కష్టపడి (కోడి) బుర్రవాడి సంపాదించిన ఆదాయంలో పన్ను కట్టాలా వద్దా అది చెప్పండి ముందు. పన్నుని రుసుము అని అంటారా ? అది కూడా నాకు తెలవద్...

      Delete
    4. UnknownJuly 17, 2019 at 1:54:00 AM GMT+5:30

      "ఒక మనిషికి ఎంత ఆదాయం ఉంటే పన్ను కట్టాలి?
      Answers availble everywhere. Tax slabs in india"

      పన్ను= tax, వాడకపు రుసుము= usage fee

      Delete
    5. what is the meaning of Toll tax ?

      1 : a tax or fee paid for some liberty or privilege (as of passing over a highway or bridge) 2 : compensation for services rendered: such as. a : a charge for transportation. b : a charge for a long-distance telephone call.

      Delete
    6. why do we give Toll Tax ?

      Toll roads allow new roads to be built and maintained without raising taxes on the general public. ... Sometimes tolls are removed on roads once the cost of construction has been recovered from the tolls collected.

      Delete
    7. నిన్న నితిన్ గడ్కరి గారు జీవితాంతం టోల్ టాక్స్ కట్టవలసిందే అని సెలవిచ్చారు.
      జీవితాంతం పన్నులూ కట్టి, టోల్ టాక్సూ కట్టాలా అని అడిగాను.

      Delete
    8. నీహారిక గారూ,

      Tax, duty, levy, license, tribute, tariff, tithe, customs, excise, impost అంటూ అనేకం ఉన్నాయి. వేర్వేరు పదాలకు కొంత ఓవర్లాప్ ఉన్నా అర్ధాలు స్థూలంగా వేరేగానే ఉంటాయి. The common point in these terms is imposition or extraction i.e. certain degree of force or compulsion.

      Toll, rivage, summage లాంటి ఇంకో పదకోశం గుంపు వేరే. These are mostly voluntary. వాడితే నిర్ణీత సొమ్ము/రుసుము చెల్లించాలి, వాడకపోతే దమ్మిడీ కట్టాల్సిన పని లేదు. There is also a free of charge alternative available that is usually informed: e.g. "last exit before tolls" road signs on a motorway.

      Halsbury's Laws of England ఉచిత అందుబాటులో లేదు కనుక toll నిర్వచనం/అర్ధం కోసం ఇంకో రెండు next best options చూసాను. Please note the *'s are added by me for the purpose of emphasis.

      Black's Law Dictionary:
      TOLL, n. A sum of money for the use of something, generally applied to the consideration which is *paid for the use of* a road, bridge, or the like, of a public nature.

      Bouvier's Law Dictionary:

      There are public roads, such as turnpikes and railroads, which are constructed by public authority, or by corporations. These are kept in good order by the respective companies to which they belong, and *persons travelling on them*, with animals and vehicles, are required to pay toll. In general these companies have only a *right of passage* over the land, which remains the property, subject to the easement, of the owner at the time the road was made or of his heirs or assigns.

      నితిన్ గడ్కరీ కూడా ఇదే విషయం చెప్పినట్టు అనిపిస్తుంది.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top