కోపం తగ్గించుకోవాలనుకునేవారికి ఉపయోగపడే అంశమిది. కోపం , అపార్ధం.. ఇలాంటి భావోద్వేగాలను మనిషి అదుపులో ఉంచుకోవడానికి చాలా చిట్కాలు పని చేస్తాయి. ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. భండారు శ్రీనివాసరావు గారి బ్లాగులోని పోస్టు ఇది. 
కోపం !
చిన్నప్పటి నుంచే నాకు ముక్కు మీద కోపం. ‘కోపం వచ్చినప్పుడు వంద వొంట్లు చదవరా తగ్గిపోతుంది’ అని మా బామ్మ ఒకటే పోరుపెట్టేది. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు అది తీర్చుకోవాలని అనుకుంటారు కానీ వొంట్లు, ఎక్కాలు లెక్కబెడుతూ కూర్చుంటారా ఎవ్వరయినా. అందులో కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా బోటివారు. కోపంలో నన్ను మించిన వాడు లేడు అని ఇన్నాళ్ళుగా అనుకుంటూ వచ్చిన నేను రంగనాధం కధ వినగానే నేనెంత శాంత మూర్తినో అర్ధం అయింది.    
రంగనాధం నాకు బాగా తెలిసిన వాడే. కోపిష్టి వాడే. సందేహం లేదు. కానీ మరీ ఇంతా. ఛా ఛా!. అతడి  సంగతి విన్నప్పుడు  కోపం యెంత అనర్ధ కారణమో లక్షా ముప్పయ్ ఒకటో సారి తెలిసివచ్చింది. ఇంతకీ జరిగిన విషయం ఏమిటంటే-
అతడో ఆదివారం నాడు ఇంటి ముందు కారాపుకుని దాన్ని కడిగే పని పెట్టుకున్నాడు. పనిలో పనిగా కారుకు చిన్న చిన్న రిపేర్లు చేయడం కూడా అతడికో హాబీ. రెంచీలు గట్రా  దగ్గర పెట్టుకుని ఏదో పనిచేసుకుంటూ వుంటే అతగాడి ఏకైక ముద్దుల కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి పనిలో నిండా మునిగివున్నప్పుడు ఆ పిల్లవాడు ఓ స్క్రూ డ్రైవర్ తీసుకుని కారు డోరు మీద గీయడం మొదలు పెట్టాడు. 
అది చూసిన రంగానాధానికి చర్రున కోపం వచ్చింది. అదీ వొళ్ళూ పై తెలియని కోపం. చేతిలో వున్న రెంచ్ తీసుకుని పిల్లవాడి చేతిపైన గట్టిగా కొట్టాడు. యెంత గట్టిగా అంటే ఆ కోపంలో అతడికి తాను పిల్లవాడి చేతి వేళ్ళపై కొడుతున్నది ఇనుప రెంచీతో  అన్న సోయలేదు. 
ఫలితం పిల్లాడి వేళ్ళు చితికి పోయాయి. రక్తం బొటబొటా కారసాగింది. అతడి ఏడుపుకు ఇంటిల్లిపాదీ అక్కడికి చేరారు. జరిగిన ఘోరం చూసి నిర్ఘాంత పోయారు. అప్పుడు కానీ తాను చేసినదేమిటో రంగనాధానికి తెలిసిరాలేదు. కానీ ఏం లాభం. ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఒక వేలు పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పి తీసేసారు. 
ఆ సాయంత్రం అంతా ఇంటికి వచ్చారు. రంగానాధానికి తలకొట్టేసినట్టుగా వుంది. తన కోపం మీద తనకే పిచ్చి కోపం వచ్చింది. దీనికంతటికీ కారణమైన కారు  ఇంటి ముందు  అలాగే వుంది. కొడుకుని  కొట్టిన రెంచీ చేతిలోకి తీసుకుని దూరంగా విసిరివేయబోతుంటే  కారు డోరు మీద అడ్డదిడ్డంగా రాసిన  అక్షరాలు కనిపించాయి.
“ మా నాన్నంటే నాకిష్టం”
ఆ రోజు ఉదయం స్క్రూ డ్రైవరుతో రంగనాధం కొడుకు  గీసిన  అక్షరాలవి !
(పుస్తక ప్రియులు దేవినేని మధుసూదనరావు గారు పంపిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)

*Republished

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top