Post a Comment

  1. "చిత్రం భళారే విచిత్రం" పాటని ఒకప్పుడు రోజూ వింటూ ఉండేవాడిని. ఈ చిత్రం లో ఉన్నదని  తెలిసినా చూడటం పడలేదు. ఇవ్వాళ మీ పోస్ట్ మూలాన 4 గంటలు కూర్చుని చూశాను. చివరిగా నేననుకునే దేమంటే, ఆ భారతం కధ ఇప్పటికీ వర్తిస్తుందని , కాకపోతే పేర్లు మార్చాలి అంతే. కొండలరావు గారూ పోస్ట్ పెట్టినందుకు థాంక్స్.

    ReplyDelete
  2. ఇలాంటి చిత్రాలు ఇప్పుడు కూడా వస్తే బాగుంటుంది

    ReplyDelete
  3. షుమారు నాలుగు ఘంటలు నిడివి చలనచిత్రము చూడమందురా? అందునా నూరు కిలోలపై చిలుకు భారీ ఆసామీ నాయకుడా? పైగా అతడు మూడు విభిన్న వేషములు ధరించునా? ఇంకా కథ, కథనం, దర్శక మార్గదర్శకత్వమును అతడేనా? అదియును కాక మిగిలిన ఒకటి ఆరా పాత్రలు కూడా అతడి ఇతర అతి బరువు గల కుటుంబీకులు వేయుచుందురా? ఇంకనూ స్టార్టు నుండి ఎండు వరకు చూడరుల కళ్ళు చెదిరే మేకప్పులు, విడ్డూరమయిన కాస్ట్యూములు, దద్దరిల్లించే సెట్టింగులు & తీరొక్క విన్యాసాలతో అలరారుచుండునా? మీదుమిక్కిలి నటీనటమణులందరూ మూతి ముఖం త్రిప్పుచూ చేయి పైకీ కిందికీ ఊపుతూ చిత్రవిచిత్ర హావభావాలతో ఓవరాక్షను సలుపుచుందురా? ఇవన్నీ చాలవన్నట్టు నరులకు అర్ధం కాని భాషలో డయలాగులు, అయోమయం పాటలు, చెవులు చిల్లు పడేటట్టు అంసుమోరు గుక్క తిప్పని పద్యాలు కూడా హోరెత్తిచునా?

    వలదు గురువర్యా వలదు. ఆదివారం సెలవు పూట ఇంతటి చిత్రహింస భరించజాలము. మీ చదువరులను ఈ తీరుగ సతాయించుట మీకు భావ్యమేనా? ఈ యాతన తట్టుకోలేక మీ బ్లాగాభిమానులు ఎర్రగడ్డ బాట పడితే తదుపరి టపాలు చదివేందుకు భక్తజనుల కొరత ఏర్పడునన్న యోచన కూడా తమరు చేయకపోవడం కడు చింతనీయం.

    ReplyDelete
    Replies
    1. మీరీ చిత్రమును ఆమూలాగ్రము వీక్షించితిరనడానికి మీ వ్యాఖ్యానమే సాక్ష్యము. కాదందురా? మీరు చెప్పిన ఇంతలన్నియూ ఎన్నెన్నో ఉన్ననూ ఎందుకో ఈ చిత్రం భళారే విచిత్రం అన్నట్లుంటుంది. ఎన్ని సార్లు చూసిననూ 'జై' ఎన్.టి.ఆర్ (నటనలో) అనిపిస్తుంది. అసలీ సినిమాకు రారాజు అని టైటిల్ పెడితే సముచితంగా యుండెడిదేమో. సుయోధనుని పాత్ర మలచిన తీరు, ఎన్.టి.ఆర్ హావభావాలు, నటన, వాచకము అద్భుతమే. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని చిత్రరాజం ఇది.


      మీబంటువారిని సతాయించినందుకు మన్నింపమని కోరెదను తప్ప ఈ సినిమాపై వ్యామోహమును మరువకుంటిని మిత్రమా!

      Delete
    2. జస్ట్ రిలాక్షేషన్ కోసమూ, నోస్టాలజికల్ గా వీక్షించెడి చిత్రములను, పాటలను, సన్నివేశములను కేవలం నాకోసమే ఇచ్చోట దించెదను. మీరు అన్యధా చింతించవలదని నా కొరకు ఓరిమి వహింపవలయునని ప్రార్ధించుచుంటిని.

      Delete
    3. కొండలరావు గారూ, మీ గ్రాంధికం ధాటికి మూర్చిల్లితిని కావున కనుక "తెలుగు"లో సమాధానం రాస్తాను!

      నాకు ఇంత గొప్ప సినిమా చూసే స్థాయి కాదు. ఎంత కళాఖండమయినా హీరో బరువు ఎక్కువుంటే అస్సలు తట్టుకోలేను. ముసలి భారీ హీరో సరసన సగం బరువు మూడో వంతు వయసు కుర్ర భామల గెంతులు (ముఖ్యంగా వెకిలి చేష్టలతో కూడిన ఏకార్ధక/ద్వందార్ధక బూతు రోత పాటలు ఉంటే) చచ్చేంత అలెర్జీ.

      ఆరేసుకోబోయి సిగ్గు శరము పారేసుకోవడం చూసి వాంతులు చేసుకునే "సున్నిత మనస్తత్వం" మన సొంతం. ఏదో చిన్న నిడివి ఫాస్ట్ & లైట్ కామెడీ (ఉ. జంబ లకిడి పంబ) మాత్రమే, అది కూడా చెత్త సీక్వెన్సులు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి, జీర్ణించుకోగలిగే టైపు ఇక్కడ!

      మీరు మీ ఫెవరిట్ సినిమాలు వేస్తూ ఉండండి, నేనొక్కడినే చూడకపోతే నష్టం లేదు. చంద్రమోహన్/నూతనప్రసాద్/రాజేంద్రప్రసాద్ వగైరాలు వస్తే నేనూ చూస్తా.

      Delete
    4. అలాగే అందరివీ ఉంచుదాం బ్రదర్.....:)

      Delete
    5. మంచి నటుడైన ఎన్టీఆర్ ను ముతక వెకిలి పాత్రలలో చూడటం బాధాకరం. వేటగాడు అడవి రాముడు .. పడుచు హీరోయిన్లతో జుగుప్స కరంగా చేశాడు. తగిన పాత్ర దొరికినప్పుడు అతి చేయకుండా నటించిన చిత్రాలు కూడా ఉన్నాయి.

      జై గారు ఎప్పుడైనా కుదిరితే మాయా మశ్చేంద్ర చితం చూడండి. అందులో ఎంతో హుందాగా అందంగా కనిపించి నటించాడు ఎన్టీఆర్.

      Delete
    6. మీలో ఉన్న ఆంధ్ర ద్వేషం యొక్క తీవ్రత నీచత్వం స్థాయికి చేరుకోవడం జరిగి చాలా కాలం అయ్యింది.అందుకే, మీతో నేనెక్కడా సానుకూల సంభాషణ చెయ్యడం లేదు.

      మీ వ్యాఖ్యలలో రామారావు, చంద్రబాబు పటల్ ఉన్న దేషానికి వాళ్ళలోని మంచిచెడుని చూసి చెడును మాత్రమే విమర్శించే నిష్పాక్షికత లేక కేవలం కమ్మకులం పట్ల ఉన్న వ్యతిరేకతయే కనిపిస్తున్నది.

      మీకు స్వతహాగానే రామారావూ చంద్రబాబూ ఆ కులంలో పుట్టడం వల్లే వాళ్ళకంత పేరొచ్చింది తప్ప ప్రతిభ లేదు అని తీర్మానాలు చేసేసుకుని చిరు డ్రీంస్ లాంటి ట్రోలర్ల మాదిరి స్వయంతృప్తి పొందే మనస్తత్వం ఉంటే ఎంతమంది ఎన్నిసార్లు చెప్పినా మారరు గానీ, మీలో సదసద్వివేచన ఆనెది మిగిలి ఉండి స్మస్యకు మూలం తెలితే విచక్షణను ఉపయోగించి లోపాన్ని సరి చేసుకునే అవకాసం ఉనదనిపించి చరిత్ర పట్ల నాకున్న ఆసక్తితో పరిసోధించీంప్పుడు తెలిస్దిన ఒక నిజాన్ని చెప్తున్నాను.

      ఆంధ్ర అనే అస్తిత్వం ఏర్పడిన నాటినుంచి ఇరవై ముగ్గురు ముఖ్యంత్రులు పరిపాలిస్తే అందులో నీలం సంజీవరెడ్డి గారు(1),నీలం సంజీవరెడ్డి గారు(3),కాసు బ్రహ్మానంద రెడ్డి గారు(4),మర్రి చెన్నారెడ్డి గారు(7),భవనం వెంకట్రామి రెడ్డి గారు(9),కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు(10),మర్రి చెన్నారెడ్డి గారు(14),నేదురుమల్లి జనార్ధన రెడ్డి గారు(15),కోట్ల విజయ భాస్కర రెడ్డి గారు(16),యెడుగూరి సందింటి రాజశేఖర రెడ్డి గారు(19),నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు(21),యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి గారు(23) అనే పదకొండుమంది రెడ్లు!పదకొండవ ముఖ్యమంత్రి స్థనంలో నందమూరి తారక రామారావు అనే ప్రజాకర్షణ గల రెడ్డేతరుడు రావడంతో అప్పటివరకు సంజీవయ్య, అంజయ్య లాంటి రెడ్డేతరుల్ని అతి తక్కువ కాలంలోనే లాగి పారసి వాళ్ళలో వాళ్ళే అనుభవించిన అవిఛ్చిన్నతకి గండి పడింది.దానితో రామారావు, చంద్రబాబు అనే ఈ ఇద్దరు బలమైన రెడ్డేతర కులానికి చెందిన నాయకులకీ కులపిచ్చి అంటగట్టేసి దుమారం లేవదీస్తున్నారు.చరిత్రని లెక్క ప్రకారం చూసే అలవాటు లేని పిచ్చి జనం నమ్మేశారు.కానీ, ఉండవల్లి వంటి బ్రాహ్మణోత్థములూ సోమూ శీలా వంటి శూద్రసార్వభౌములూ అది నమ్మిన అమాయకత్వంతో గాక తమ సామాజిక ఆర్ధిక రాజకీయ ఎదుగుదల ఆ రెడ్ల పరిపాలనా కాలంలో జరిగింది గనక లాభదృష్టీ కృతజ్ఞతా వంటివి బలీయమై తమ ముందు రెడ్డి,కమ్మ అనే రెండు ఆప్షన్లు ఉన్నప్పుడు రెడ్ల వైపుకే మొగ్గుతున్నారు.

      మీరొక్కరే కాదు ఉండవల్లి లాంటి మేధావులు కూడా అలాగె ఉన్నారు గానీ వాళ్ళకంటే అలా రేడ్ల వైపుకి మొగ్గు చూపి కమ్మవాళ్ళకి దూరం జరగదం వల్ల లాబహ్మ్ ఉంటుంది గాబట్టి అలా ప్రావ్ర్తించహ్డం సహజం.మరి, కమ్మవాళ్ళని ద్వేర్షించి రెడ్లని అభిమానించడం వల్ల మీఅకేమి లాభం ఉంది?

      Delete
    7. బురదగుంటలో తిరిగే కప్ప. అదితప్పితే వేరే ప్రపంచం దానికి ఎలా తెలుస్తుందిలే. నువ్వు ఎన్నైనా అను, ఎన్ని ౠజువులైనా తీసుకురా... దాని బురదే దానికి కమ్మదనం.

      Delete
    8. ఆంధ్ర-తెలంగాణ మరియు కమ్మ-రెడ్డి విషయాల వరకే జై గొట్టిముక్కల గారు హేతువును వదిలేస్తారు.అంత మాత్రాన ఆయన్ని "బురదగుంటలో తిరిగే కప్ప" అని అనాల్సిన అవసరం లేదు.మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు.

      Delete
    9. అలా తుత్తిపడుతూ ముందుకుపోదాం తమ్ముళ్ళూ!

      Delete
    10. తుత్తి లేనిది బతకడమెట్లా అన్నయ్యలుంగార్లూ!

      తుత్తి తుత్తి తుత్తీ,
      ఏ తుత్తీ లేదనుకుంటే
      అదే అసలైన తుత్తీ!

      సొంత గొప్ప లేనివారికి
      ఇతరుల గొప్పదనాన్ని
      తీసిపారేసే
      ఏడుపుగొట్టు తుత్తి!
      సరుకు లేని సవకవారు
      ట్రోలర్లకి వెక్కిరింత తుత్తి!

      సత్య సౌందర్యాన్ని
      చూడలేని
      దివాంధ సమూహాలకి
      అబద్ధాల్ని చెప్పడమూ
      వినడమూ నమ్మడమూ
      అంతు లేని తుత్తి!!!

      తుత్తి బాగుందా సుత్తి బాగుందా అనడక్కు - దేని గొప్ప దానిదే.

      ఎవరి తుత్తి వారికి ముద్దు, కదూ?

      జై శ్రీ రాం!

      Delete
    11. కర్రష్టే.. తుత్తి గురించి, మరీ ముఖ్యంగా విషయంలేకుండా మీరేసే సుత్తిలో వుండే తుత్తి గురించీ మీకు తప్ప ఎవడికీ అర్ధం కాదెందొందుకో తాతగారూ!

      Delete
    12. "కర్రష్టే.. తుత్తి గురించి, మరీ ముఖ్యంగా ఒక్క నిజం చెప్పకుండా మీరు చెప్పే అబద్ధాల్లో వుండే తుత్తి గురించీ మీకు తప్ప ఎవడికీ అర్ధం కాదెందొందుకో చిరుస్వైరకల్పనలుగారూ!"

      Delete
    13. మొత్తానికి మీ ఏదాలు, పిట్టకతలు, సోమర్ల శాపలూ, సొల్లు వరాలూ.. అన్ని అబద్దాలే అని ఒప్పేసుకున్నందుకు సంతోషం తాతగారు.

      Delete
    14. దానివలన తమకు గలుగు తుత్తి యేమి?
      తమరి బోకులు బోకుల వలెనే యుండును గద!
      కుక్క యొక్క వంకర తోక వంటి తమరి ట్రోలింగునకు మేలూ లేదూ కీడూ లేదు.
      మా ఏదాలు అబద్ధాలు అయితే మీ బొక్కలు పూడ్తాయని గ్యారెంటీ ఉందా మీకు?
      ఉంటే చెప్పండి!

      Delete
    15. బోకుల భాష దాక వొచ్చిన నీకు, ఇక మీ "ల.." భాష అందుకొనుటకు మీ నాలుక గుల పుడుతున్నట్టు గా తెలిసిపోవుచున్నది.

      భారతమొక్కటేనా? రామాయణం కూడా పిట్టకథేనా? ఒక వేళ నిజమైనచో.. దాని ఆధారాలిమ్ము. లేనిచో "జై శ్రీరాం" అనేది కూడా కామెడీ కోసం అని, ఇతరలుమీద దాడి చేసికోడానికి.. తద్వారా తమ సైకో మెంటాలిటీ ని తుత్తి పరుచుకోడానికి వాడుకొనుచున్నామని ఒప్పుకొనుము.

      Delete
    16. ఇంతకీ నీ అరడుగుల మగాడు.. నడుపుకొనుచున్న బోకు జ్యోతిలో వొచ్చింది అతుకుల భారతం కాదు. సరల భాషలో(తెలుగు లో) ఇచ్చిన భారత అనువాదం. ఎప్పట్లాగే.. మేమనువాదాలు చదివితే నమ్మం అంటావా? సరే.. సంస్కృతంలో చదువుదాంలే. మళ్ళి అప్పుడోచ్చి "వెదవ్యాసుడు ఓన్ గా రాసిన, తాటాకులు చదివితేనే ఒప్పుకుంటా.. అదినూ కార్బండేటింగుతో నువ్వు ప్రూవ్ చెయ్యడంకాదు.. వేదల్లో భూమి పుట్టక పూర్వమే అదేదో టెక్కునిక్కు మా బాచ్చి కనిపెట్టేసి, రాసి పడేసి వుంటారు. అదెత్తుకోనొచ్చి ప్రూవ్ చెయ్యాలి" అంటావా. మీ బాచ్చి ఏదంటే అది కర్రష్టే తాతా.

      Delete
    17. >>ఏదాలు అబద్ధాలు అయితే మీ బొక్కలు పూడ్తాయని గ్యారెంటీ ఉందా మీకు?

      ఏదాలు అబద్దాలని అందరికీ తెలుసులే గానీ, వాటి పేరుచెప్పుకోని, ముడ్డి కదలకుండా, జనాల్ని భయపెట్టి సపాదించే.. మీ సోమరిపోతుల వ్యాపారాలు అవే.. జ్యోతిష్యం, వాస్తు లాంటి వ్యాపారాలు మూతపడతాయిగా!ఎందుకులెబ్బా! వాటికి సీలేసుకోని అలానే ముందుకుపోదాం.

      Delete
  4. దాన వీర శూర కర్ణ సినిమాను నేను చూడలేదు. చూసే ఉద్దేశం కూడా లేదు. వీర అన్నా శూర అన్నా పెద్ద తేడా యేమీ లేదు. ఇక కర్ణుడి విషయానికి వస్తే ఆమహానుభావుడు చెప్పుకోదగ్గ వీరుడూ కాదు దాత అంతకన్నా కాదు. భారతం గురించీఅట్టే తెలియని వాళ్ళే కర్ణిడిని శూరుడనీ దాత అనీ బోల్తా పడుతూ ఉంటారు. వీరత్వం విషయానికి వస్తే, కర్ణుడు అర్జునుడి చేతిలో ఎన్నో సార్లు ఓడిపోయాడే కాని ఒక్కసారీ గెలవలేదు. ఈకర్ణుడు చిత్రసేనుడి చేతిలో తన్నులు తిని యుధ్ధరంగం వదిలి మూడున్నర రోజులపాటు అజాపజా లేకుండా పారిపోయాడు. అదే చిత్రసేనుడిని అర్జునుడు అవలీలగా ఓడించాడు. ఇకపోతే అతడి దానగుణం ఉత్తిది. అర్జుడిని జయించాలంటే బ్రాహ్మణాశీర్వాదం కావాలని పెద్దలు చెబుతే అర్జునుణ్ణి చంపేదాకా బ్రాహ్మణులకు అడిగినది ఇస్తానని నియమం చేసుకున్నాడు. వీడిని నమ్ముకుని దుర్యోధనుడు చెడ్డాడు తప్ప మరేమీ లేదు.ఇంకా నయం వీడిని ధర్మాత్ముడు అని కూడా అన్నారేమో తెలీదు. మీకు తెలుసా? దౌపదిని నగ్నంగా సభకు ఈడ్చి తెచ్చినా తప్పులేదని దర్మనిర్ణయం చేసినది వీడే. వనాల్లో ఉన్న పాండవులను ఉడికించటానికి పోదాం శత్రువులు మన వైభవం చూసీ కుళ్ళుకోవటం కన్నా ఆనందం ఏముంటుందీ అన్న వెకిలి సలహా ఇచ్చిన పుణాత్ముడూ వీడే. ఎంటీఆర్ పైత్యం కారణంగా వచ్చిన చెత్త సిన్మా గురించి ఎందుకంత భజన?

    ReplyDelete
    Replies


    1. ఏమండోయ్ కష్టేఫలి తాతవారూ

      కొంత ఇక్కడికి వచ్చి శ్యామలీయం‌వారికి కూసింత లెల్చరిద్దురూ ? హన్నా మీ ప్రియతమ కర్ణున్ని ఇన్నేసి మాటలంటారేమిటి ఈ పెద్దాయన ?


      రండి బిరీన!



      జిలేబి

      Delete
    2. కర్ణుని దెబ్బకు, యుద్దరంగం నుంచీ పారిపోయిన అర్జున, ధర్మరాజుల గురించి మరిచారా ఏమిటీ?

      Delete
    3. // “ ఏమండోయ్ కష్టేఫలి తాతవారూ ” //

      “కష్టేఫలి” వారకి కర్ణుడు “ప్రియతమ” భారతపాత్ర అనే అభిప్రాయం నాకెప్పుడూ కలగలేదే 🤔? పైపెచ్చు వారు కర్ణుడిని విమర్శిస్తుంటారే?

      Delete
    4. భీముడు, ధృష్టద్యుమ్నుడు, ద్రౌపదీతనూజులు, శిఖండి ఒక్కుమ్మడిగా తిరిగి తిరిగి ఎదుర్కొన్నా కర్ణుడు వెనుకడుగు వేయలేదు. పైగా వారందరి రథాలు నేల కూల్చి పగలబడి నవ్వాడు.

      ఇక ఆలస్యం కూడదనుకున్నాడో ఏమో! ధర్మరాజు ఉన్న చోటుకి రథాన్ని పోనిమ్మన్నాడు కర్ణుడు. అడుగో ధర్మరాజు అంటే ఇడుగో కర్ణుడు అన్నంత దగ్గరగా వచ్చేసింది రథం. ధర్మరాజును ఎదుర్కొన్నాడు కర్ణుడు. నిరంతర శర ప్రయోగాలు ఆరంభించాడు. వాటిని గగన మార్గంలోనే ఎదుర్కొన్నాడు ధర్మరాజు. తర్వాత కర్ణుడికి బాణాన్ని గురిపెట్టాడో లేదో అప్పటికే దూసుకొచ్చిన బాణం అతని విల్లును విరిచింది. తొమ్మిది బాణాలు ప్రయోగించాడు కర్ణుడు. వాటితో నవరత్నాలంకృత మయిన ధర్మరాజు కవచం ఛిన్నాభిన్నమయింది. వెంటనే గుప్పెడు బాణాలు వదిలాడు కర్ణుడు. అంతే! ఆ శరాఘాతాలకు ధర్మరాజు శరీరం నెత్తురోడ సాగింది. మరి రెండు బాణాలకు అతని సారథి నేలకొరిగాడు. జెండా పడిపోయింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ధర్మరాజు రథాన్ని నడుపుకుంటూ పలాయనం చిత్తగిస్తోంటే అతన్ని అడ్డుకున్నాడు కర్ణుడు.
      ........
      అయినా రథాన్ని ముందుకు పోనివ్వక వణకిపోతున్న ధర్మరాజును చూసి ఇలా అన్నాడు కర్ణుడు.‘‘నేను నిన్నేం చంపను. నిజం చెబుతున్నాను. వెళ్ళిరా’’రథాన్ని మెల్ల మెల్లగా ముందుకు పోనిచ్చాడు ధర్మరాజు. బాగా కర్ణుడికి దూరమయినానని తెలుసుకున్న తర్వాత ఒక్కసారిగా వేగాన్ని పుంజుకున్నాడు. పరుగుదీశాడు. అది చూసి నవ్వుకున్నాడు కర్ణుడు. అంతలోనే తల్లి కుంతీదేవికి ఇచ్చిన వాగ్దానం గుర్తొచ్చి జాలిపడ్డాడు.
      ........................
      .‘‘కర్ణుని పరాక్రమాటోపం పరికించావా కృష్ణా! ప్రళయకాల మర్తాండమూర్తిలా చెలరేగిపోతున్నాడు. ఈ సమయంలో అతన్ని ఎదిరించడం ఎవరి వల్లా కాదు. మనం ఎదిరించినా పరాజయం తప్పదు. మరణించినా మరణించవచ్చు. అందుకని అన్యథా భావించక నేను చెప్పింది విను. మన రథాన్ని కర్ణునికి కనిపించనీయక చాటుగా పోనీయ్‌’’ అన్నాడు అర్జునుడు.

      Delete
    5. శివునికి నమస్కరించి బ్రహ్మ ఇలా వేడుకున్నాడు.‘‘కర్ణార్జునులిద్దరూ అతిరథులు. సమాన శౌర్యశక్తి సంపన్నులు. మహాయోధాగ్రేసరులు. ఒకరినొకరు ఈ ఇద్దరూ ఎదుర్కొంటే ఇంకేమయినా ఉందా? సృష్టి సమస్తం నాశనం అయిపోతుంది. కాబట్టి ఆ వీరుల్ని శాంతింపజేసే బాధ్యత నీదే’’‘‘పంకజాసనా! కర్ణార్జునుల యుద్ధం అనివార్యం. ఈ యుద్ధం జరిగి తీరాలి. వేడుకోలుకు తావులేదు’’ అన్నాడు శివుడు.బ్రహ్మను సమీపించాడు ఇంద్రుడు. ఇలా అడిగాడు.‘‘లోకస్రష్టా! కర్ణుణ్ణి అర్జునుడు చంపగలిగేలా అనుగ్రహించు.కర్ణుడు మరణిస్తే ద్రోణాది వీరులంతా చేరుకున్న పుణ్యలోకాలు చేరుకుంటాడు. సుఖంగా ఉంటాడు. పాపం! అర్జునుని సంగతి నీకు తెలియంది కాదు, పడరాని పాట్లు పడ్డాడు. అరణ్య అజ్ఞాతవాసాలంటూ సుఖం లేకుండా పోయిందతనికి. నువ్వు అనుగ్రహిస్తే ఇక మీదయినా సామ్రాజ్య సౌఖ్యాలు అనుభవిస్తాడు. అందుకే వేడుకుంటున్నాను’’

      Delete
    6. ‘‘ఏంటిది అర్జునా? కర్ణుని చేతిలో...ఒక సూతుని చేతిలో నువ్వు ఓడిపోతున్నావు. నేను తట్టుకోలేకపోతున్నాను. ఆలస్యం అమృతం విషం అన్నారు. మరి ఆలసించక వెంటనే కర్ణుణ్ణి కడతేర్చు’’ అన్నాడు కృష్ణుడు.

      Delete
    7. శ్యామలీయంMarch 27, 2021 at 9:48:00 PM GMT+5:30
      కర్ణుడి విషయానికి వస్తే ఆమహానుభావుడు చెప్పుకోదగ్గ వీరుడూ కాదు దాత అంతకన్నా కాదు. భారతం గురించీఅట్టే తెలియని వాళ్ళే కర్ణిడిని శూరుడనీ దాత అనీ బోల్తా పడుతూ ఉంటారు.

      @me
      పైవన్నీ నా సొంత కల్పనలు కావు శ్యామలీయం గారూ! మీకు వేదాలతో సరి సమానమైన(కొండొకచో ఒక పాళు ఎక్కువే) ఆంధ్రజ్యోతి నుంచి తీసుకొచ్చిందే.

      Delete
    8. నిజానికి కర్ణుడు తలుచుకుంటే, (కుంతీదేవికిచ్చిన) మాట తప్పేవాడైతే, పాండవుల్లో ఒక్కరుకూడా మిగలకపోయేవారు. కుట్రలు, కుతంత్రాలతో.. దేవతలు, శాపాలివ్వగల బ్రాహ్మణులు, మహర్షులు అంతా కలిసి కర్ణుని చంపేశారు.

      రెండు జూదరిగుంపులు కలిసి వాల్ల ఇగోలతో లక్షలాదిమంది చావుకు కారణమయ్యారు. వాల్లలో ఓ గుంపుకు దేవతల సప్పోర్టు. "ధర్మ రక్షణ" అనే టాగ్ లైనుతో...

      Delete
    9. @Chiru DreamsMarch 28, 2021 at 1:16:00 PM GMT+5:30
      శ్యామలీయంMarch 27, 2021 at 9:48:00 PM GMT+5:30
      కర్ణుడి విషయానికి వస్తే ఆమహానుభావుడు చెప్పుకోదగ్గ వీరుడూ కాదు దాత అంతకన్నా కాదు. భారతం గురించీఅట్టే తెలియని వాళ్ళే కర్ణిడిని శూరుడనీ దాత అనీ బోల్తా పడుతూ ఉంటారు.

      ఁఎ
      పైవన్నీ నా సొంత కల్పనలు కావు శ్యామలీయం గారూ! మీకు వేదాలతో సరి సమానమైన(కొండొకచో ఒక పాళు ఎక్కువే) ఆంధ్రజ్యోతి నుంచి తీసుకొచ్చిందే.

      hari.S.babu
      "చంద్రజ్యోతి","అంధకోతి" - ఇత్యాదయః విశేషణాలతో ఇప్పటి వరకు తమరే అదొక అబద్ధాల పుట్ట అని నొక్కి వక్కాణిస్తున్న దాని ప్రకారం అవి కూడా అబద్ధాలే కావాలి గదా. మరి,నిన్నటి వార్కు బోకుజ్యోతి అన్న చెత్త బ్రాహ్మణాధముడైన శ్యామలీయానికి వేదం అయితే కావచ్చు గానీ సతాన్వేషులూ సత్యము తప్ప ఇంకేదీ మాట్లాడని మీరు వాటిని సత్యాలని ఎట్లా సెలవిస్తారు చిరు కల్పనల వారూ!

      Delete
    10. @Chiru DreamsMarch 29, 2021 at 10:30:00 AM GMT+5:30
      నిజానికి కర్ణుడు తలుచుకుంటే, (కుంతీదేవికిచ్చిన) మాట తప్పేవాడైతే, పాండవుల్లో ఒక్కరుకూడా మిగలకపోయేవారు. కుట్రలు, కుతంత్రాలతో.. దేవతలు, శాపాలివ్వగల బ్రాహ్మణులు, మహర్షులు అంతా కలిసి కర్ణుని చంపేశారు.

      hari.S.babu
      అవును, మీరుంటే తల్చుకోమని పురెక్కించేవారు.మీరు లేకపోవడం వల్లే కర్ణుడు నిష్కారణం చచ్చిపోయ్యాడు.అప్పుడు ఎందుకు పుట్టలేదు?ఇప్పుడు ఎందుకు పుట్టారు?

      అప్పుడు మీరు లేకపోవడం వల్లే అంత ఘోరం జరిగింది.అంత ఘోరం చేశాక నిద్రెలా పడుతుందండీ మీకు?

      Delete
  5. మన కంత సీను గలదా ?
    ఘనభారత పాత్ర లెంచు ఘనవైదుష్యాల్
    మనకును గలవా ? , ధర్మము
    పనివడి యాచరణసేయు పధ్ధతి వలయున్ .

    ReplyDelete
  6. వాడూ వీడని యనుటకు ,
    వాడినగడ్డిపరకంత వంతూ , మనలో
    జూడము , కర్ణుని బోలిన
    పోడుములను , నోటిదురద మోదము దప్పన్ .

    వాడని వీడని వలుకుట
    పాడియవదు త్యాగధనుని , పధ్ధతి యిదియా ?
    పోడిమిగలదా ? మనకా
    జాడలు గలవా ? మహా విశారదు లనియా ?

    ReplyDelete
  7. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణగారికి, పేద వాడ్పై.. అదిన్నూ ఆంధ్రాలో ఉన్న పేదవాడిపై ఎంత జాలీ, ఎంత కేరూ

    గతం కంటే రెట్టింపైన క్వార్టర్‌ ఖర్చు

    గత ప్రభుత్వంలో రోజుకు రూ.వంద.. ప్రస్తుతం రూ.200 నుంచి 250

    పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం.. సర్కారీ షాపుల్లో అన్నీ డబుల్‌ రేట్లు

    సగటున రోజువారీ కూలి రూ.400.. క్వార్టర్‌కు మించి తాగినరోజు పస్తే

    అంతపెట్టలేనివారంతా నాటు వైపు.. జోరుగా ఎన్‌డీపీఎల్‌ అమ్మకాలు

    ReplyDelete
  8. తిరుపతిలో దొంగ వోట్ల డిస్కవరీ. బీజేపీ సూపరుగా కనిపెట్టేసింది. మీరుకూడా సరదాగా ఎంజాయ్ చేసుకోండి.

    https://youtu.be/En6xuUsaEBs

    బ్రహ్మానందం.. ఎర్రకండువాల కాన్సెప్టు గుర్తొస్తే, అది మీ తప్పు కాదు.

    ReplyDelete
  9. part 01 here:
    సమరసింహారెడ్డి కధలో సమరసింహారెడ్డి చేసిన మర్డర్లకి బాలకృష్ణని తిట్టడం ఎంత తెలివైన పనో "రెండు జూదరిగుంపులు కలిసి వాల్ల ఇగోలతో లక్షలాదిమంది చావుకు కారణమయ్యారు. వాల్లలో ఓ గుంపుకు దేవతల సప్పోర్టు. "ధర్మ రక్షణ" అనే టాగ్ లైనుతో..." అనటం కూడా అంతే తెలివైన పని.

    రామాయణ భారతాల గురించీ భాగవతం గురించీ ఇతర పురాణ కధల గురించీ నేనెప్పుడూ ఒకే విషయం చెప్తున్నాను.అవి కేవలం కధలు మాత్రమే!ద్వారక శిధిలాలు గానీ మరొకటి గానీ వాళ్ళు యదార్ధ వ్యక్తులు అని తేల్చినప్పటికీ వాస్తవంలో జరిగినది వ్యాసుడు రాసినట్టే జరిగిందని ఎలా నమ్మాలి?నిన్న మొన్న జరిగిన స్వాతంత్య్ర పోరాటం గురించి చెప్తున్న సాహితీ రూపాల్లోనే ఎన్నో కల్పనలు ఉన్నాయి.సాహిత్యాన్ని పూర్తి చరిత్ర కింద ఏ చరిత్రకారుడు పరిగణిస్తున్నాడు?

    మాయా ద్యూతం తర్వాత మనకి దుర్మార్గుడిలా కనిపిస్తున్న శకుని మొదట దుర్యోధనుడికి పాండవుల్ని నువ్వు గెలవలేవు,వాళ్లతో సఖ్యతగా ఉండటమే నీకు క్షేమం అని చెప్తాడు. శకుని చెప్పిన మంచిమాటల్ని వింటున్న దుర్యోధనుడు ఇక్కడి ట్రోలర్ ద్వయం ద్వయంలానే ఆముదం తాగిన మొహం పెట్టుకుని కూర్చుంటే మేనల్లుడి ఏడుపుగొట్టుమొహం చూడలేక సరే, ఇంతవరకు నేను చెప్పిన రాజనీతి నీకు నచ్చ్గలేదు గాబట్టి నీకు సంతోషం కలిగించటానికి కూటనీతి గురించి చెప్తాను అన్నాడు.దాన్ని లటక్కన పట్టేసుకుని ఇదే కావాలి నాకు అన్నాడు దుర్యోధనుడు.ఆదినుంచీ కురు పాండవుల బలాలు అసమానమే - పాండవులే గెలిచి తీరుతారనేది దుర్యోధనుడికి తప్ప అందరికీ తెలుసు!మాయాద్యూతానికి ముందు మేనమామ శకుని చెప్పినదే రాయబారం అప్పుడు గాంధారి కూడా చెప్పింది - అదే మాట, పాండవుల్ని నువ్వు గెలవలేవు అని.

    కురుక్షేత్రం జరిగినది 18 రోజులు.మొదటి పది రోజులూ భీష్ముడు సైన్యాధిపతి.సైన్యాధిపతి అయ్యేటప్పుడు అర్జునుణ్ణి గెలవటం మాత్రం తన వల్ల కాదని చెప్పి పాండవ సైన్యం మొత్తాన్ని సంహరించడానికి నెల రోజులు పడుతుందని చెప్పాడు.అది అలాగే జరిగి ఉంటే ఉంటే కౌరవులే గెల్చేవాళ్ళు.ఇంకొక చిక్కు కూడా ఉంది.అర్జునుడి దగ్గిర భీష్మ ద్రోణులకు లేని దివ్యాస్త్రాలు ఉన్నాయి.అందువల్లనే విద్య నేర్పిన గురువు కూడా అర్జునుణ్ణీ నేను గెలవలేననై కుండబద్దలు కొట్టి చెప్పేశాడు. భీష్ముడి సైన్యాధిపత్యంలో జరిగిన యుద్ధం వివరాల్ని భీష్మపర్వం అన్నారు. భీష్ముడి తర్వాత ద్రోణుడు అయిదు రోజులు మాత్రమే సైన్యాధిపతియై యుద్ధం చేశాడు.తను కూడా పాండవ సైన్యం మొత్తాన్ని సంహరించడానికి నెల రోజులు పడుతుందని చెప్పాడు. ద్రోణుడి సైన్యాధిపత్యంలో జరిగిన యుద్ధం వివరాల్ని ద్రోణపర్వం అన్నారు. ద్రోణుడి తర్వాత కర్ణుడు సైన్యాధిపతియై యుద్ధం చేశాడు.కర్ణుడు రెండు రోజులే నిలబడగలిగాడు. కర్ణుడి సైన్యాధిపత్యంలో జరిగిన యుద్ధం వివరాల్ని కర్ణపర్వం అన్నారు. ఆఖరు రోజున శల్యుడు సైన్యాధిపతియై యుద్ధం చేశాడు. శల్యుడి సైన్యాధిపత్యంలో జరిగిన యుద్ధం వివరాల్ని శల్యపర్వం అన్నారు.

    భీష్మద్రోణుల్ని అధర్మయుద్ధం చేసి చంపేశారనేవాళ్ళు లాక్షాగృహదహనం గురించి ఏమి చెప్పి సమర్ధిస్తారు?ధర్మరాజుకీ శకునికీ జరిగినది కూడా మాయాద్యూతమే కదా!అప్పటి ద్యూతక్రీడ ఇప్పుడు లేదు, నశించిపోయింది.సినిమాల్లో చూపించినట్టు రెండు పాచికల్ని టకటకలాడించటమే అయితే దాన్ని యుద్ధానికి సరిసమానం ఎందుకు చేస్తారు?రాజుల మధ్యన రాజ్యాలు చేతులు మారటానికి ఒక ఆటని కొన్ని వేలమంది సైనికులని సమకూర్చుకుని వ్యూహనైపుణ్యం ప్రదర్శించి నడిపే యుద్ధానికి ప్రత్యామ్నాయం చేశారంటే అది ఎంత కష్టమైన ఆటయో తెలుసుకోవాలి.

    చివరికి పాండవుల తరపున వాళ్ళు అయిదుగురు, శ్రీకృష్ణుడు, సాత్యకి మాత్రమే మిగిలారు. కౌరవుల తరపున దుర్యోధనుడు కాక అశ్వద్ధామ, కృపాచార్యుడు, యుయుత్సుడు,కృతవర్మ, విషకేతు మిగిలారు.కర్ణుడు అసలు వీరుడే కాదని ఎవరూ అనట్లేదు.సినిమాలు చూసి మాత్రమే భారతకధ మీద అధికారం తెచ్చుకున్నవాళ్ళకీ పత్రికల్లో ప్రచురితం అయిన ముక్కల్ని చూసి అంతకుమించి వాటిలో ఏమీ లేదనుకునేవాళ్ళకీ కొన్ని వింతల్ని చెప్తాను.పాండవుల తరపున మిగిలిన సాత్యకి బ్రహ్మాస్తం వంటివి లేకపోయినప్పటికీ విలువిద్యలో కర్ణార్జునులతో సమానమైనవాడు.పద్మవ్యూహం అప్పుడు అభిమన్యుడు ఒక్కదే లోపలికి వెళ్ళలేదు.భీముడూ సాత్యకీ కూడా లోపలికి వెళ్ళారు.కాకపోతే అభిమన్యుడి వేగాన్ని అందుకోలేక పోవడం వల్ల అతను ఒంటరియై ద్రోణుడు చేసిన అధర్మయుద్ధానికి అబ్లయ్యాడు, అంతే!
    part 02 next

    ReplyDelete
  10. part 02 here:
    అప్పుడు జరిగిన యుద్ధంలో సాత్యకీ భీముడూ కూడా కర్ణుణ్ణి యుద్ధరంగం నుంచి పారిపోయేలా యుద్ధం చేశారు - విలువిద్యతోనే! భీముడు అనగానే గదని పిసుక్కోవటం తప్ప ఇంకేమీ తెలియని అర్భకుడు అనుకుంతే ఎట్లా?అందరూ అన్నీ నేర్చుకుంటారు, కొందరు కొన్నింటిలో ఎక్కువ ప్రజ్ఞ చూపిస్తారు. అతను కర్ణుణ్ణి పారిపోయేలా చేసింది శరయుద్ధమే!

    ఒక రచయిత వ్రాసిన కధని మన సొంత పులుముడులతో మార్చీ ఏమార్చీ ఏమి సాధిస్తారో మార్చి చెప్తున్నవాళ్ళకే తెలియాలి.అక్కడ ఏముందో తెలుసుకోవాలని అసలు గ్రంధాలు చదివినప్పుడు వీళ్ళు చెప్తున్నవి అబద్ధాల్ని తెలిసిపోతుంది కదా!

    యుద్ధం మొదలయ్యే సమయానికి కర్ణుడి మనస్తత్వం మారినట్టు కూడా అనిపిస్తుంది కొన్ని సన్నివేశాలను చూస్తుంటే - దుర్యోధనుడితో మాట్లాడేటప్పుడు అదివరకటి ప్రవర్తనకు భిన్నమైన పరుషభాషని ప్రయోగించిన దాఖలాలు కూడా ఉన్నాయి.

    ఒక్కటి గుర్తుంచుకోండి, భారత కధ ప్రకారం అటు అర్జునుడు గానీ ఇటు కర్ణుడు గానీ శత్రువుల గొప్పదనాన్ని అసలు గుర్తించనే కూడదని భీష్మించుకున్న ఇప్పటి సవకబారు ట్రోలింగు పండితులు కాదు.

    జై శ్రీ రాం!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top