ఉద్యమంలో ప్రొఫెసర్‌ కోదండరాంను ఐకాస ఛైర్మన్‌గా నియమించి పెద్దపీట వేశాం. కూటమిలో ఆయనకు జనగామలో సీటు కూడా ఇవ్వలేదు. ఆయన్ను కూరలో కరివేపాకులా తీసిపారేశారు’ - ఇది కేటీఆర్‌ వ్యాఖ్య. 
మహాకూటమిలో కోదండరామ్ పాత్రపై కె.టి.ఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?
                                                                                              - పల్లా కొండలరావు.
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే ౩% ఓట్లు రావాలి లేదా ముగ్గురు గెలవాలి.

    2009 ఎన్నికలలో లోక్సత్తా వారికి షుమారు 2.6% ఓట్లు వచ్చాయి కనుక మొదటి రూల్ కుదరలేదు. ఒకటే సీట్ గెలవడం వలన రెండో నిబంధన ప్రకారం కూడా గుర్తింపు రాలేదు. ఇంకో అర శాతం ఓట్లు లేదా ఇంకో రెండు సీట్లు వచ్చి ఉండుంటే పార్టీకి గుర్తింపు వచ్చేది. వచ్చే ఎన్నికలకు పార్టీ దాదాపు తుడిచి పెట్టుకోవడానికి ఈ కొరత కూడా ఒక ముఖ్య కారణం.

    ఇప్పుడు తెజసకు కూడా ఇదే ప్రధాన సమస్య. గుర్తింపు రాకపోతే ఐదేళ్లు ఉనికి కాపాడడం దాదాపు అసాధ్యం. కూటమిలో భాగంగా కొన్నే సీట్లు పోటీ చేస్తున్నప్పుడు ఓటు శాతం కండిషన్ అసంభవం కనుక గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్న సీట్లు లభిస్తే రెండో నిబంధన ప్రకారం గుర్తింపు ట్రై చేయవచ్చు.

    మంచిర్యాల, జనగామ, రామగుండం, ఎల్లారెడ్డి, పెద్దపల్లి, హన్మకొండ ఇలా కొన్ని విజయావకాశాలు ఉన్న సీట్లు యూపీఏ ఇవ్వలేదు. మెదక్, పాలమూరు, మిర్యాలగూడ & ఘనపూర్ స్థానాలు ఇచ్చినట్టే ఆశ చూపించి పంగనామం పెట్టారు పైగా ఆసిఫాబాదు, ఖానాపూర్, దుబ్బాక, వరంగల్ సీట్లలో మిత్రధర్మం ఎగ్గొట్టారు.

    ఇక మిగిలిన నాలుగింట మూడు దాదాపు అసాధ్యం. మల్కాజ్గిరి ఒక్కటే కొంతలో కొంత మంచి సీటు కానీ దిలీప్ గెలిచినా ఎటు ఉంటాడో చెప్పలేము.

    ReplyDelete
  2. మీరు చెప్పేదానికోసం మాత్రమే అయితే అదేదో తె.రా.సతో కలసేవాడు కదా?

    ReplyDelete
  3. మహాకూటమిలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన ప్రాధాన్యత తె.జ.సకు, సి.పి.ఐకు ఇవ్వడం లేదు. తె.జ.స, సి.పి.ఐలు పోల్ మేనేజ్ మెంట్ లో వెనుకబడతారని, అనవసరంగా కొన్నిసీట్లు తె.రా.స ఖాతాకు జమ చేయడమెందుకని కాంగ్రెస్ భావిస్తున్నట్టనిపిస్తోంది.

    ReplyDelete
    Replies
    1. కోదండరాం గారు తెరాసతో కలవాలనుకుంటే 2014 ఎన్నికలప్పుడే కలిసేవారు, ఆయనకు అది ఇష్టం లేదు. వారి అనుచరులలో కొందరు బీజేపీతో కలవాలని అన్నారు కానీ స్వతహాగా లెఫ్ట్ భావాలు కలిగిన ప్రొఫెసర్ గారికి మనసు ఒప్పనట్టుంది. గత్యంతరం లేకే యూపీఏలో ఉన్నారు. I feel very sorry for such a great man.

      యూపీఏ సీట్ల కేటాయింపుల నుండి బుజ్జగింపుల వరకు "బడా బూర్జులా"కు ప్రాధాన్యత ఇచ్చిందని తెలుస్తూనే ఉంది. ఉ. భవ్య ఆనంద్, గాయత్రి రవి, రాజేంద్రనగర్ గుప్త లాంటి ధనిక అభ్యర్థుల కోసం "ఖజానా తాళాలు" చేతిలో ఉన్న డీకే శివకుమార్, అహ్మద్ పటేల్ లాంటి వారు రంగంలో దిగారు. దీనికి "పోల్ మేనేజిమెంట్" అనే ముద్దు పేరొకటి తగిలించారు.

      పోనీలెండి డా. శ్రవణ్ & అడ్డంకి దయాకర్ గార్లకు టికెట్ ఇచ్చారు కొంచంలో కొంత నయం.

      Delete
  4. < పోనీలెండి డా. శ్రవణ్ & అడ్డంకి దయాకర్ గార్లకు టికెట్ ఇచ్చారు కొంచంలో కొంత నయం. >

    ఆఖరు నిమిషంలో ఇచ్చారు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top