చర్చకు ఉంచిన పదాలు : బృందము - గుంపు 
పదం పంపినవారు : శివరామప్రసాదు కప్పగంతు.



బృందం - గుంపు ఈ రెండు పదాలను ఒకే అర్ధానికి వాడవచ్చా?

Name:శివరామప్రసాదు కప్పగంతు  
E-Mail:deleted 
Subject:బృందము - గుంపు  
Message:ఆంగ్లలో ఉన్న "group" అన్న పదానికి తెలుగు సమానార్ధమిచ్చే పదం "బృందము" లేదా " బృందం". కాని మనం అనేకసార్లు "గుంపు" అనే పదం తెలుగులో గ్రూపు అనే ఆంగ్ల పదానికి బదులుగా వాడబడటం చూస్తుంటాము. "గుంపు" అంటే ఏదో (చిత్రం) జరుగుతోంది అని చూడటానికి ఒకళ్ళొకోకళ్ళకి సంబంధం లేనివారు పోగుపడినప్పుడు, అలా పోగుబడిన వాళ్లకు సామూహిక నామము గుంపు. వాళ్ళందరికీ ఒకే దృక్పథం ఉండాలని లేదు.

కాని, "బృందం" అంటే ఒక పని చెయ్యటానికి ఒకే ధ్యేయంమీద తమ దృష్టి కేంద్రీకరించి ఒకచోట కలిసి పనిచేసే వాళ్ళని నా దృష్టి.

ఆంగ్లంలో కూడా క్రౌడ్ (Crowd) గ్రూప్ (Group) వేరువేరు పదాలు ఒక పదానికి బదులుగా మరొక పదం వాడకూడనివి.  

*Re-published

Post a Comment

  1. బృందం అన్నప్పుడు దానిలో ఉన్న వారికి మధ్య ఏదో ఒక విషయమై సామాన్యమైన విషయం ఉంటుంది. ఇది mathematicsలో group వంటిది.

    గుంపు అన్నప్పుడు అది ఒక జనసమూహమే కాని దానిలో ఏదో ఒక విషయమై సామాన్యమైన విషయం ఉండాలన్న నియమం లేదు. mathematical గా చెప్పాలంటే ఒక random collection అన్న మాట.

    ReplyDelete
  2. Team nd group r different meanings.Team contains certain limited number of people nd where as group may exceed thislimitation..

    ReplyDelete
  3. గుంపు అన్నది నీచార్ధంలో వాడబడే మాట

    ReplyDelete
  4. బృందం అంటే ఎవరి చేతనైనా ఏర్పాటు చెయ్యబడ్డ సమూహం.
    గుంపు అంటే తనంత తానుగా ఏర్పడ్డ సమూహం.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top