చర్చాంశం - భాష ప్రయోజనం
చర్చాంశాన్ని పంపిన వారు - పల్లా కొండల రావు.

భాష అనేది భావ ప్రకటనకు ఓ టూల్ మాత్రమే అనడం సబబేనా!?

భాష మనిషికీ జంతువుకూ తేడా తెలిపే అంశాలలో ఒకటి.  ప్రతి జాతికీ మాతృభాషపై మమకారం ఉంటుంది. అయితే భాష పై విపరీతంగా మోజు పెంచుకోకూడదని కొందరంటే , భాష అమ్మ లాంటిదని అమ్మపై ప్రేమ ఉన్నవాడు ఇతరులను ద్వేషించాలని లేదని ఇంకొందరటారు. భాష అనేది కేవలం ఒక టూల్ మాత్రమే అని కొందరంటే, లేదు భాషకి మనిషికీ ఉండే అనుబంధాన్ని కేవలం ఒక టూల్ తో పోల్చడం తప్పని కొందరి వాదన. భాషను అవమానించడమంటే అమ్మను అవమానించడమేనన్న బాధ కొందరిలో వ్యక్తమవుతుంది. భాషకూ - మనిషికీ ఉండే అనుబంధాన్ని ఎలా చెపితే సరయినదవుతుందో మీరు చెప్పగలరా?


*Re-published

Post a Comment

  1. టూల్ అంటే తెలుగులో పనిముట్టు అని అర్థం. పనిముట్టు అంటే ఏమిటి? ఏదైనా ఒక పనిని చేయడాన్ని సులభతరం చేసేది అని అర్థం. భాష లేకపోయినా భావ వ్యక్తీకరణ సైగల ద్వారా చేయవచ్చును. కాని భాష వల్ల అది సులభతరం అవుతుంది. భావాలను నిక్షిప్తం చేయడానికి వీలు కలుగుతుంది.

    తల్లిదండ్రుల నుండి (లేక పెంచిన వారినుండి) సంక్రమిస్తుంది కాబట్టి ఒక భాషను మాతృభాష అనడం జరుగుతుంది. అతి చిన్న వయస్సునుండి మాట్లాడుతాం కాబట్టి దానిలో ధారశుద్ధి (పాండిత్యం కాదు) ఎక్కువగా వుంటుంది. పాండిత్యాన్ని సంపాదించాలంటే మాతృభాహలోనూ, ఇంకో భాషలోనూ అంతే కృషి తప్పనిసరి.

    ఒక భాష మాతృభాష అయినంట మాత్రాన మిగతా వాటికంటే ఎక్కువ గొప్పతనాన్ని ఆపాదించలేం. ఒక ఊరిలో పుట్టినంత మాత్రాన అది వేరే ఊళ్ళకన్న గొప్పది (లేదా తక్కువది) ఎలా కాదో, భాష కూడా అంతే.

    ఇక మాతృభాషను టూల్ అన్నందుకు అభ్యంతరం చెప్తున్న వారు చెప్తున్న కారణాలు ఇవి:

    "భాష ఒక జ్ఞానవాహిని. మాతృస్వరూపిణి. పుట్టాక కొన్నాళ్ళు పాలిచ్చే టూల్ అమ్మ అనుకోవటం నా ఊహకు అందదు. అలాగే పరస్పర భావవినిమయానికే కాక జ్ఞాననిక్షేపణకూ భాష అనేది ఒక అనంతనిధి."

    అన్ని భాషలూ ఙ్ఞాన వాహినులే, మాతృభాష గొప్పదనం ఎక్కడుంది?
    అన్ని భాషలూ అనంత నిధులే, ఉహుః, ఇది కూడా నప్పడం లేదు.
    జన్మనిచ్చిన తల్లిని టూల్ అనుకుంటామా? అనుకోం. ఎందుకంటే మన తల్లి ఒక మనిషి, పైగా మనకు జన్మనిచ్చింది. మరి భాష మనకు జన్మ నివ్వలేదు. పైగా భాషకే మనం జన్మ నిచ్చాం. ఇక్కడ మనం అంటే మానవజాతి అన్నమాట.

    ఒక గోండుజాతి వాడు, కోయజాతి వాడు పుట్టాక కొన్ని రోజులు మాత్రం స్వంత భాషలో మాట్లాడుతాడు. ఆ తర్వాత అతని ఙ్ఞానవాహిని, అనంతనిధి మొత్తం కూడా ఇతరభాషలే. అప్పుడు అతనికి మాతృభాష ఏదనుకోవాలి?

    కాబట్టి భాషకు తల్లి, తండ్రి, అమ్మమ్మ అని పేర్లు పెట్టకుండా భాషలానే వుండనిద్దాం.

    ReplyDelete
    Replies
    1. చాలా బాగా చెప్పారు, 100% ఒప్పుకుంటాను.

      Delete
  2. భాష ఒక టూల్ అనడం సబబే.
    భాష ఒక టూల్ మాత్రమే అనడం సబబు కాదు.
    తెలుగైనా, ఇంగ్లీషు అయినా, హిందీ అయినా మరేదైనా గొప్పదే.
    వాస్తవం ఏంటి అంటే భాష అనేది గొప్పది.
    ఇక భాషను తల్లిగా భావించాలా వద్దా అనేది వ్యక్తిగత పరిధిలోది.అది ఒక భావన. అందులో తప్పు పట్టాల్సిందేమీ లేదు.
    నా వరకు నాకు అన్ని భాషలు నచ్చుతాయి. తెలుగు చిన్నప్పటి నుంచి తెలియడం వలన (మాతృ భాష) కొద్దిగా ఎక్కువ ఇష్టం.
    హిందీ, ఇంగ్లీషు కంటే తెలుగు అంటే కొద్దిగా ఎక్కువ ప్రేమ.
    పుట్టుకతో మనం నేర్చుకునే భాష వచ్చినంతగా ,మిగిలిన భాషలు రావు.మాతృ భాషను ఆస్వాదించినంతగా ఇతర భాషలను ఆస్వాదించలేమని నాకనిపిస్తుంది. అందుకే మాతృ భాష అంటే కొద్దిగా ఎక్కువ ప్రేమ.
    ఇవన్నీ నా అభిప్రాయాలు.

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయాన్ని బేలన్సుడుగాను, సరిగానూ చెప్పారు కిరణ్ గారు. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

      Delete
  3. మీ అభిప్రాయాన్ని బేలన్సుడుగాను, సరిగానూ చెప్పారు శ్రీకాంత్ చారి గారు. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.శ్రీకాంత్ చారి

    ReplyDelete
  4. పొనీ పనిముట్టు అనే అనుకుందాం.అంత మాత్రాన దాని గౌరవం తగ్గినట్టు అవుతుందా?దాన్ని గౌరవించ కూడదా!ఆయుధ పూజ సాంప్రదాయం యెందుకు వుంది?ఆ రోజు రైతు తన పారా,పలుగూ అన్నింటికీ పూజ చెయ్యడం లేదా?

    నేను ఇదివరకటి కామెంటులోనూ నా పోష్టులోనూ చెప్పాను,పనిలో లీనమవ్వాలంటే పనిని ప్రేమించాలి,తప్పదు!అలాగే తన పనిముట్టు పట్ల కూడా ఆప్యాయత వుండాలి,అది కూడా మన పనితీరునే చూపిస్తుంది.

    యోధుడు తన కత్తిని ప్రేమిస్తాడు!తిక్కన కవి గారి ప్రభువైన మనుమసిధ్ధికి ఆరాధ్య దైవం యేమిటో తెలుసా?నందికంత పోతరాజు అనే పేరు గల ఒక కత్తి!స్థావర జంగమా లన్నింతిలోనూ దైవాన్ని చూడమనే సాంప్రదాయం ప్రకారం చూసినా భాషని కేవలం పనిముట్టుగా తీసి పారెయ్యకూడదు.యే విధంగా నైనా సరే ఈ తొక్కలో తెలుగు నాకు మాతృబాష యేమిటి?నాకు అయిదు భాష లొచ్చు నేను అన్నిట్నీ సమానంగా చూడగలను కాబట్టి తెలుగును నేను యెట్టి పరిస్థితుల్లోనూ యెక్కువ చెయ్యను అనే మొండితనం కోసం అసలు సాంప్రదాయమే అక్కర్లేదని అనుకుంటే చెయ్యగలిగిందేమిటి? ఒక దణ్ణం పెట్టి వూరుకోవడం తప్ప?!

    ReplyDelete
    Replies
    1. పనిము"ట్ల"ను తప్పక గౌరవించాలి. అందునా జ్ఞానం బోదించే భాష(ల) ప్రాముఖ్యతను ఖచ్చితంగా గుర్తించి తీరాలి. ఇందుట్లో తరతమ బేధాలు అవసరమా? అమ్మ ద్వారా (మొదటి మాటలు మాత్రమె సుమా) పరిచయం అయిన భాషే కాదు అన్ని భాషలూ ఒకే రకంగా పనికి వస్తాయి వాటన్నిటికీ సమానంగానే ఉచిత స్థానం ఇవ్వాలని నేనడం తప్పెలా అవుతుంది?

      మీకు ఇంగ్లీషు వచ్చు కానీ అది మీ మాతృభాష కానంత మాత్రాన మీరు దాన్ని తొక్కలో భాష అంటున్నారా లేదే?

      నాకు వచ్చిన భాషలనే కాదు రాని వాటిని కూడా గౌరవిస్తాను అని మొత్తుకుంటున్నా ఈ ఆక్షేపణలు ఎందుకో?

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. నాకు వచ్చిన భాషలనే కాదు రాని వాటిని కూడా గౌరవిస్తాను అని మొత్తుకుంటున్నా ఈ ఆక్షేపణలు ఎందుకో?
      ?
      యెందుకంటే యెమి చెప్పను,యెలా చెప్పను? మిమ్మల్ని కెలకడం నాకు సరదా!

      కెలికినప్పుడు సరదాగానే కెలికాను గానీ ఇప్పుడు చాలా గంభీరమయిన జవాబు చెప్తాను,అవధారయ!

      గతంలో పనిలేక బ్లాగులో "తెలుగును బలవంతంగా రుద్దడం వల్ల ఒక ప్రాంతం వాళ్ళు పనికి రాకుందా చంకనాకి పోయారు" అనే విధమయిన అర్ధమొచ్చేలా ఒక కామెంటు వేశారు మీరు,నాకు వింతగా అనిపించింది.అదే ఫీలింగు మరో వ్యక్తికీ వచ్చి నిలదీసారు.ఆయన జవాబు గట్టిగానే వున్నా "మీ అభిప్రాయం కరెక్టే అయినా నేను నా అభిప్రాయానికే కట్టుబడి వుంటాను" అని కూడా ముక్తాయించారు.మక్కీకి మక్కెగా ఇలాగే జరగలేదు గాబట్టి అక్షర సాక్ష్యాలతో మళ్ళీ దాని గురించి ఇప్పుడు మనం పోట్లాడ నక్కర్లేదు గానీ మీ ధోరణిలో తెలుగు భాషకి ఇవ్వాల్సిన దానికన్నా అరి ప్రాధాన్యత ఇస్తున్నారు - మిగతా భాషల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు,అదీ అన్ని భాషల్లాంటిదే గదా దాని కంత సీను అవసరమా అనే రకపు పైకి కారణం చెప్పని తెలుగు పట్ల చిన్నచూపు వుందని నాకు అనుమానం.

      నా అనుమానం గురించి ఖందన మండనలని కూడా నేను కొనసాగించ లేను.మీ అభిప్రాయాల్ని మార్చుకోమని అంటే నాకు కూడా రుద్దుడు అంటగట్టేస్తారు కాబట్టి నేను ఆ మాట అనను. ఇప్పుడు నేను విస్తారంగా చెప్పబోయే విషయాన్న్ అర్ధం చేసుకోవాల్సిన పధ్ధతిలో అర్ధం చేసుకుంటే చాలు!ముందుగా ఒక సరదాగా వుండే పద్యాన్ని ఇక్కడ ఇస్తున్నాను:-)

      క్రమముగ "శ్రీమత్సకల గుణ సంపన్న"
      యని యున్న జదివెడు నఱవవాడు

      కడగి "చిరిమదు చగల కుణ చంపన్న"
      యని,కన్నడము వాడు మొనసి

      "సిరిమతు సగల గోణ" యని తోడనె
      "శంపణ్ణ" యని,మహారాష్ట్రుండు పని వడివడి

      జెలగుచు "శ్రీమతూ సెకల గుణానె
      సంపన్నాసె" యని,యోడ్ర భాషణుండు

      వెలయు "శ్రీమొతొ సొకొలో గుణ సొంపొన్నొ"
      యని, యికెన్ని యేల యన్యభాష

      లాంధ్రు డున్నయట్లె యలరు బఠించు
      నంచు హాస్యవేది యాడునాడు:-))

      ఈ సరదా పద్యం రాసింది శ్రీ కొక్కొండ వెంకత రత్నం పంతులు గారు.ఈయనా వీరేసలింగం పంతులు గారూ అప్పట్లో గజ కచ్చపాల్లాగా పోట్లాడుకునే వాళ్ళు - ప్రతిభ తోనే?!యీయన ఒక నాటకం రాసి అందులో పాలేరు పాత్రకి వీరిగాడు అని పెడితే ఆయనేమో ఒక నత్తిపాత్రతో తన పేరుని "కొక్కొక్కొండి గాడండి" అనీ చెప్పించాడు!

      సరదగా రాసినా ఈ పద్యంలో ఒక సాంకేతికాంశం వుంది.ప్రపంచంలో వున్న ప్రతి భాషా ఒకే ప్రాంతంలో యెందుకు కేంద్రీకరించబడి వుంది?యెందుకంటే యే భాషకైనా పదాలూ వాటి వుచ్చారణా ముఖ్యం,వాట్ని వేరు చేసేవి గూడా అవే!చలిగా వుందే ప్రాంతం వాళ్ళు కొన్ని ద్వనుల్ని పలకలేరు.వేడిగా వుందే ప్రాంతంలో వుండేవాళ్ళకీ అదే ఇబ్బంది?పై పద్యంలో జనరలైజ్ చెయ్యటమే తప్ప అన్నిచోట్లా పరాయి భాషల్ని కూడా చక్కగా మాట్లాడాలని పట్టుదలతో సాధించే వ్యక్తులు కొందరయినా వుంటారు గదా!మొత్తమ్మీద ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితులకీ బౌగోళిక పరిస్థితులకీ అక్కడి ప్రజలు మాట్లాదే భాషకీ దగ్గిర సంబంధం వుండి వుండాలి?!ఆ రకంగా చూస్తే మన ప్రాంతం సరిగ్గా భూమధ్య రేఖ మీద వుండటంతో చలీ, వేడీ రెండూ సమానంగా తగుల్తుండటం చేతనే మనం అన్ని రకాల ద్వనుల్నీ పలక గలుగుతున్నామేమో!

      మీరు మీ సొంత వుదాహరణ ఇచ్చి నాకేది మాతృభాష అడుగుతున్నారు గానీ సుబ్బారావు వాళ్ళ అమ్మ మాట్లాడేది సుబ్బారావుకి మాతృభాషా మరియూ పుల్లారావు వాళ్ళమ్మ మాట్లాడేది పుల్లారావుకి మాతృభాషా అవదు!భాష ప్రాంతానికి సంబంధించినది కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ ఆ భాషే మాతృభాష అవుతుంది.

      అసలు మాతృభాష కాన్సెప్టుని మీరెందుకు అంత గట్టిగా వ్యతిరేకిస్తున్నారో అర్ధం కాకపోవటం కూడా నా కెలుకుడుకి ఒక కారణం.మా మ్మలాగే మా అమ్మ వయసు వున్న అందర్నీ గౌరవిస్తున్నాను కదా అని మీరు లాగిన రీజనింగుకి పైన సుబ్బారావు - పుల్లారావు పోలిక కొట్టిపారేస్తుంది గనక మళ్ళీ అదే సుత్తి రిపీట్ చెయ్యను గానీ స్తన్యమిచ్చి పెంచే కన్నతల్లితో యెంత గౌరవనీయమయిన స్త్రీ నైనా సమానం చెయ్యగలమా! యవ్వనంలో అమెరికా వంటి దూరదేశాలకు పోయి ఇక చాలు అనేతంత సంపాదించిన వాళ్ళు వృధ్ధాప్యంలో మళ్ళీ ఇక్కడే సెటిలవ్వాలని యెందుకు తపించి పోతున్నారు?మాతృదేశం పట్ల వుండే "జననీ జన్మభూమిశ్చ" అనే భావనతోనే గదా!మాతృదేశం అనే భావనని ఒప్పుకున్నపూడు మాతృభాష అనేదాన్ని ఒప్పుకోవటానికి అభ్యంతర మేమిటి?

      Delete
  5. హరిబాబు గారూ, చంక నాకడం లాంటి పదాలు నాకు అలవాటు లేదు :) తెలుగు (తమిళం) మీద మాత్రమె ప్రాముఖ్యత ఇవ్వడం వల్ల హిందూపూర్ (హోసూర్) ప్రజలు ఎంతో కాలంగా తమకు అలవాటు అయిన కన్నడ భాష మీద పట్టు కోల్పోయారని తద్వారా దానితో గతంలో సంక్రమించిన జీవనాధారాలు కొద్దో గొప్పో తగ్గాయన్న నా అభిప్రాయంలో ఎటువంటి మార్పు లేదు. అయితే ఇది ప్రస్తుత చర్చాంశం కాదు కాబట్టి ఇక్కడితో వదిలేస్తాను. నాకు తెలుగు లేదా మరో భాషపై చిన్నచూపు లేదని, భాషను అడ్డు పెట్టుకొని కొందరు జరిపే విచిత్ర విన్యాసాలపై నేను చేసే ఆక్షేపణలను తప్పుగా అర్ధం చేసుకోవోద్దని మాత్రమె మీకు నా మనవి.

    మీరు వ్యాఖ్యలో ఉంచిన పద్యం నాకు అర్ధం కాలేదు. No comments.

    "భాష ప్రాంతానికి సంబంధించినది కాబట్టి ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళందరికీ ఆ భాషే మాతృభాష అవుతుంది"

    మాతృభాష అనే కాన్సెప్టు ప్రాంతానికి సంబందించింది అన్న వాదన మునుపెన్నడూ వినలేదు. మాస్టారు సూచించిన "తల్లి భాష" కాన్సేప్తుకు కూడా ఇది విరుద్దం అనుకుంటా.

    "మా మ్మలాగే మా అమ్మ వయసు వున్న అందర్నీ గౌరవిస్తున్నాను కదా అని మీరు లాగిన రీజనింగు"

    తల్లీ చెల్లీ యారాలో మరో చుట్టరికమో ఒద్దన్న తరువాత మళ్ళీ వాళ్ళ వయసు వాళ్ళు ఎందుకు లెండి!

    ReplyDelete
    Replies
    1. 1.హరిబాబు గారూ, చంక నాకడం లాంటి పదాలు నాకు అలవాటు లేదు
      ?
      అవే పదాలు మీరు వాడలేదని చెప్పాను.


      2.తల్లీ చెల్లీ యారాలో మరో చుట్టరికమో ఒద్దన్న తరువాత మళ్ళీ వాళ్ళ వయసు వాళ్ళు ఎందుకు లెండి!
      ?
      యెందుకు వొద్దన్నానో ఈ పార్టులో చెప్పాను:
      స్తన్యమిచ్చి పెంచే కన్నతల్లితో యెంత గౌరవనీయమయిన స్త్రీ నైనా సమానం చెయ్యగలమా!

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top