----------------------------------------------
అంశం : ఆర్ధికం, నమ్మకాలు-నిజాలు, రాజకీయం
ప్రశ్న పంపినవారు : Srikanth Chari .
------------------------------------------------

Name:Srikanth Chari 
E-Mail:deleted 
Subject:ఒకవైపు రాజధాని నిర్మాణానికి ప్రజలను విరాళాలు అడుగుతున్న చంద్రబాబు, మరోవైపు ఇటు సెక్రెటేరియట్‌లో అటు లేక్‌వ్యూ అతిధిగృహంలో గత నాలుగు నెలలుగా వాస్తు మార్పులకై కోట్లకు కోట్లు వెచ్చిస్తూ ప్రజలకు ఎలాంటి సంకేతం ఇవ్వదలుచుకున్నారు? 
Message:ఒకవైపు రాజధాని నిర్మాణానికి ప్రజలను విరాళాలు అడుగుతున్న చంద్రబాబు, మరోవైపు ఇటు సెక్రెటేరియట్‌లో అటు లేక్‌వ్యూ అతిధిగృహంలో గత నాలుగు నెలలుగా వాస్తు మార్పులకై కోట్లకు కోట్లు వెచ్చిస్తూ ప్రజలకు ఎలాంటి సంకేతం ఇవ్వదలుచుకున్నారు? 
--------------------------------------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. ఎవడి పిచ్చి వాడికానందం అంటారు కదా! కాని ఎవడి పిచ్చి వాడి స్వంతంగా నష్టపెడితే అదో లెక్క. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అదీ వాస్తు పిచ్చితో అనేది తప్పు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే హక్కు పాలకులకు లేదు. ఇక రాజధానికోసం ప్రజలను విరాళాలు అడగడం వెనుక ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే కుట్ర ఉన్నది.

    ReplyDelete
  2. దీనికో చిన్న కథ చెబుతాను వినండి !!
    అనగనగా ఒక ఊరు. దాని పేరు సీతారామాపురం. కానీ, నాయకుల గొడవల కారణంగా సీతాపురం, రామాపురంగా విడిపోయాయి. రెండు ఊర్ల మధ్య కంచె కూడా వేశారు. కంచె అవసరమా అని రామాపురం వారు ప్రశ్నిస్తే, మేము కాదు, మనిద్దరమూ గౌరవించాల్సిన --- "గౌర"వర్నర్ --- గారు వేయించారని సీతాపురం వారు తేల్చి చెప్పేశారు. ఏదైతేనేం, మొత్తానికి రెండూర్ల మధ్య మానసికంగా ఉన్న కంచెతో పాటు, భౌతికంగా కూడా కంచె పడింది. విడిపోయిన తరువాత, రామా పురం బాగా పేదదైపోయింది. కష్టపడి సంపాదించిన సంపదంతా సీతాపురములో ఉండిపోయింది. ఏరేంజు పేదదంటే, రామాపురములో పనిచేస్తున్న వారికి జీతాలు కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడేటంత పేదదైపోయింది.

    ఆ రామాపురములో పులిగాడని ఓ పేద్ద పోటుగాడున్నాడు. ఆపోటుగాడు ఊరిని బాగు చేయాలని సంకల్పించాడు. దానికి ఊరంతా సంతోషపడింది. అబ్బాయిని చదివించి ప్రయోజకుడ్ని చేస్తే ఊరిని ఉద్దరిస్తాడని భావించింది. అనుకున్నదే తడవుగా, ఊరంతా చందాలేసుకుని చదివించడానికి నిశ్చయించుకుంది. ఇప్పుడు పులిగాడు ఊరంతా ఇచ్చిన చందాలతో చదువుకుంటున్నాడు. ఊరికి సాయమూ చేస్తున్నాడు. ఊర్లో కొత్త పరిశ్రమలు తీసుకొస్తున్నాడు. ఆల్రెడీ "హీరో" లాంటి కంపెనీ ఒకటొచ్చింది. ఊర్లో ఉన్న కరెంటు కష్టాలు తీర్చి 24గంటలూ కరెంటు ఇస్తున్నాడు. అక్కడక్కడా కాస్తా తగ్గినా, భవిశ్యత్తులో అక్కడకూడా 24 గంటలూ కరెంటు వస్తుందని నమ్మదగ్గ భరోసా ఇచ్చాడు. ఊరికి వరదొస్తే తన పరిఙ్ఞానికి, సాంకేతిక ఙ్ఞానం జోడించి తనకు తోచిన విధంగా సేవ చేస్తూనే ఉన్నాడు. జనాలు కూడా సంతోషిస్తున్నారు. కొంత మంది... అబ్బే వీడు వేస్టు అనే వారున్నా, ఫర్వాలేదు బాగానే చేస్తున్నాడు అనే నమ్మకముతో ఉన్నవారు అధికంగానే ఉన్నారు.

    కానీ పులిగాడు, పోటుగాడే కాదు. పేద్ద గిలిగాడు కూడా. తన ఇంటిపక్కనే ఒక వీదిదీపాన్ని (దాన్నే తెలుగులో స్ట్రీట్ లైట్ అని అంటారు) కొత్తగా పెట్టించి, ఆ వీధిదీపం వెలుగులో చదవడం మొదలు పెట్టాడు. అదేం పనయ్యా, ఇంట్లో చక్కగా కరెంటుంది, రీడింగ్ టేబులుంది, నీకోసం ఒక కుర్చీ ఉంది కదా, అక్కడ చదువుకోవచ్చు కదా అంటే వినకుండా, నేను వీదిదీపం కిందే చదువుతానని భీష్మించుకూర్చున్నాడు. విషమేంటా అని ఆరా తీస్తే, అప్పుడెప్పుడో పురాతన కాలములో కరెంటు అనేది విలాస వస్తువుగా ఉన్నప్పుడు, చాలా మంది పెద్దలు వీధి దీపాల కింద కూర్చుని చదువుకున్నారట. అలా చదివే మంచి మార్కులు తెచ్చుకుని ప్యాసై, గొప్పవారయ్యారట. పులిగాడు పెద్ద గిలిగాడని చెప్పాను కదా..!! అబ్బాయికి అలా వీది దీపాల కింద కూర్చుని చదివితేనే చదువు బాగా వస్తుంది, మంచి మార్కులతో ప్యాసై, గొప్పవాన్ని అవుతాను అనే "గిలి" ఒకటి ఏర్పడిపోయింది. దానితో తన ఇంటిపక్కనే, ఒక స్ట్రీట్ లైట్ Extraగా వేయించి (ప్రజా ధనముతోనే) దానికింద చదువుతున్నాడు. నిజానికి అదో మూఢనమ్మకం. పాతకాలములో పెద్దలు అప్పటి అవసరాలకు/ అవకాశాలకు తగినట్లు ఏర్పాటుచేసుకున్న అలవాటు. కానీ ఏం చేస్తాం, పోటుగాడైన పులిగాడికి ఉన్న ఈ చిన్న "గిలి"ని చూసి, ఖర్మరా బాబూ అని కాస్త ఫీలైనా.. డబ్బులు అనవసరంగా ఖర్చు చేస్తున్నాడని భావించినా, కనీసం మనోడు మనశ్శాంతిగా చదువుకునే అవకాశం ఆ వీది దీపం ఇస్తోంది కదా..?? మనశ్శాంతిగా చదువుకుంటే మరింత బాగా ఊరికి సేవ చేస్తాడు కదా అనే ఫీలింగుతో కాంప్రమైజ్ అవుతున్నారు. అయినా పోయిందేముంది .. వెధవది ఒక వీధిదీపానికి చేసిన ఖర్చే కదా.. దానివలన ప్రజల హక్కులకు గానీ, వారి శ్రేయస్సుకుగానీ వచ్చే నష్టమేమీ లేదు కదా? అని తమకు కలిగిన కాస్త ఆర్థిక కష్టాన్ని దిగమింగుకున్నారు.

    అదన్న మాట విషయం.

    ఇక సీతాపురం, రామా పురం ప్రజల విషయానికి వస్తే .. అయిన దానికీ, కాని దానికీ గొడవలు పడుతూ, ఊర్లో నాయకులు తమ స్వార్థం కోసం చేసే పనులకు, తమ సొంత ఈగోను (అహాన్ని) జోడించి మరీ కొట్లాడుకుంటున్నారు. ఒక సారి రెండూర్ల మధ్యున్న "పోలవరమ్మ చెరువు" కోసం , మరో సారి సీతాపురములో ఉన్న రామాపురం పిల్లల కోసం, ఇలా గొడవలు పడుతూనే పోతున్నారు. మధ్యలో నాయకుల నోటి దూల, సీతాపురములో రామాపురం పులిగాడి బంధువుల గోల ... అబ్బబ్బా.. ఈ తెలుగు సినిమా బతుకు పాకిస్తానోడికి కూడా రాకూడదు అని ఫీలయ్యే పరిస్థితి. కానీ తప్పదు వచ్చేసింది.

    తెలుగు సినిమాలో అయితే .. హీరో (ఫారిన్ లో చదివి పల్లెటూరికి వస్తాడు) వచ్చి సీతాపురం, రామా పురంగా ఉన్న ఊర్లను కలిపి మళ్ళీ "సీతారామాపురం"గా మార్చేస్తాడు. కానీ, ఇది నిజ జీవితం కదా, అందుకే అలాంటి వాటిని బుద్దున్నోడేవడూ కోరుకోవడం లేదు. ఏదో రకంగా విడిపోయాం. చక్కగా "మీకు మీరే .. మాకు మేమే" అని పాడుకుంటూ ... ప్రశాంతంగా బతకే అవకాశం వస్తే బావుండు అని వేచి చూస్తున్నారు. ఆ ప్రషాంతత కల్పించే హీరో గారు ఎప్పుడు వచ్చునో మరి ..!!

    ReplyDelete
  3. దేని బడ్జెటు దానికే ఉంటుందనుకుంటా. ఈ పది ఇరవై కోట్ల ఖర్చు మానేస్తే రాజధానికి వచ్చే లాభమేమీ ఉండదు.

    పొదుపు చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అసలు రాజధాని పేరుతొ ఆడంబరాలు అవసరమా అని ప్రశ్నిస్తే బాగుండేది.

    29 రాష్ట్రాలలో కేవలం 5ఇంటికి (మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణా) మాత్రమె మహానగరాలు ఉన్నాయి. అవీ కొన్ని చారిత్రిక నేపధ్యాల దృష్ట్యా ఏర్పడ్డాయి. ఈ వాస్తవాన్ని విస్మరించి మేమూ హైదరాబాదును తలదన్నే నగరం కట్టుకుంటామని అర్రులు చాచడం అవివేకం. అదే ధనాన్ని ఉపాధి కల్పన (ఉ. పోర్టులు, జాలర్లకు వసతులు, కోల్డు స్తోరేజీలు) లేదా విద్య పెంపుదల కోసం వెచ్చిస్తే హెచ్చు రెట్లు ఉపయోగం.

    వాస్తు పిచ్చి, హుండీ పెట్టి ప్రజలను విరాళాలు అడగడం లాంటి జిమ్మిక్కులను నేను సమర్తించను. అయితే ప్రస్తుత చర్చ వీటి గురించి కాదు.

    ReplyDelete
    Replies
    1. ఈ వాస్తవాన్ని విస్మరించి మేమూ హైదరాబాదును తలదన్నే నగరం కట్టుకుంటామని అర్రులు చాచడం అవివేకం.
      హైదరాబాదులాంటి మహానగరాన్ని నిర్మించుకుంటాం అనేదాన్ని వ్యతిరేకించడం కన్నా అవివేకమా? కానే కాదు. ప్రతీ ఒక్కరికీ బాగుండాలన్న కోరిక ఉంటుంది. తమకు అన్ని సౌకర్యాలూ ఉన్న ఒక రాజధాని ఉండాలన్న కోరికా ఉంటుంది. అలాంటి కాంక్ష ఉండడం, దానికోసం శ్రమించడం తప్పెలా అవుతుంది. ఒకప్పుడు చంద్ర బాబు ఇలానే అనుకుని ఉండుంటే, హైదరాబాదులో ఇంత డెవలప్‌మెంట్ ఉండేదా? ఎప్పుడో నిజాం తాతలు కట్టిన కొన్ని గోడలు, భవనాలూ తప్ప? పోనీ, నిజామే అలా అనుకుని ఉండుంటే, హైదరాబాద్ అనేది ఉండుండేదా? ఇలాంటి ఉచిత సలహాలు తమరిచ్చేవారా? నిజాము కాలములో హైదరాబాదు తప్ప, మిగిలిన సంస్థానమంతా దారుణంగా ఉండేది. అయినా నిజాం సంస్థానం దేశములోనే గొప్ప సంస్థానాల్లో ఒకటయ్యిందా లేదా? నిజాములు కూడా ఎందుకులే అనుకుని ఉండుంటే (అనుకున్నా బావుండేది, తెలుగువారు ఇలా కొట్లాడుకుంటూ బతికేవారు కాదు) హైదరాబాద్ అనేదానికి అంత సీన్ ఉండేది కాదు.

      ప్రస్తుతం అంధ్రావాల్లం నిర్మించుకుంటున్న (నిర్మించుకోవాలనుకుంటున్న) మహానగరం భవిశ్యత్తులో అభివృద్దికి కేంద్రముగా మారుతుంది. పనిలో పనిగా మీరు అలవోకగా ఇచ్చిన ఉచిత సలహా ప్రకారం పోర్టులు, కోల్డు స్టొరేజీలు గట్రా కట్టుకుంటాములెండి. రాజధాని మాత్రమే కట్టుకొని అవి చేయమని మేము ఎక్కడా చెప్పడం లేదు.అన్నీ చేయడం కుదరదు అని మీ అనుమానమా? ఆ సమస్యను మాకొదిలేయండి, దాన్ని ఎలా అధిగమించాలో మేము చూసుకుంటాం.

      Delete
    2. బొందలగడ్డకు ఎక్కువ కుగ్రామానికి తక్కువగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని మహామేధావి & విషనరీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసారన్న కాకమ్మకథపై ప్రస్తుతానికి స్పందించను. హైదరాబాద్ సీను గురించి చర్చ అప్రస్తుతం.

      ఇక్కడ ప్రశ్న ఏమిటి? రాజధాని కట్టుకోవడానికి నిధులు లేని ఆంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఇల్లు/కార్యాలయం కోసం 20-30 కోట్లు ఖర్చు పెట్టడం దండుగని ప్రశ్నదారుని అభిప్రాయం. ఇది ఫరవాలేదని, రెంటినీ కలిపి చూడకూడదని నేను అన్నాను.

      ఆంద్ర ఎంత పెద్ద ఊరు కట్టుకున్నా నాకేమిటి అన్నారు బాగుంది. వాళ్ళు కట్టాలని ఊరిల్లూరుతున్నది ప్రజాధనంతోటి అన్న విషయం మరిచిపోకండి. వాళ్ళు తమ డబ్బుతో ఏమి కట్టుకున్నా నాకు పట్టింపు లేదు కానీ నా డబ్బుతో చేస్తే అడిగే హక్కు నాకూ ఉంది. కోరికలు ఎవరకయినా ఉండొచ్చు కానీ మంది సొమ్ము ఫలహారం చేస్తుంటే అవతలోడు గమ్మునుండి చూడాలనడం విడ్డూరం. డబ్బు ఉట్టిగా రాదు అని తెలుసుకున్నాక ఏమయినా చెయ్యాలి.

      Delete
    3. IT అంటే ఏమిటో తెలీనట్టు, అది వచ్చిన తరువాత హైదరాబాద్ రూపు రేకలు ఎలా మారిపోయాయో తెలీనట్లు మీరు మాట్లాడితే నేనూ ఏమనను. ప్రస్తుతం నాక్కూడా ఒకప్పటి కూలడానికి సిద్దంగా ఉన్న భవనాలూ, కంపు కొట్టే నదులూ ఏరకంగా అభివృద్దికి చిహ్నాలు కావో తెలియజెప్పే ఓపిక లేదు. (IT ఒక్కటే కాదు, మిగిలిన కంపెనీలు కూడా. చంద్రబాబొక్కడే కాదు, వై.ఎస్.ఆర్, అంతకు ముందున్న సీమాంధ్ర ముఖ్యమంత్రులు, సీమాంధ్రను కాదని చేసిన అభివృద్ది కూడా చూడాలి).

      ప్రశ్నకు మీరిచ్చిన సమాధానముతో నేనూ ఏకీభవిస్తాను. ఓ 20-30 కోట్లు కర్చు పెట్టడం పెద్ద లెక్కలోకి తీసుకోదగ్గది కాదు. కానీ వచ్చిన చిక్కు హైదరాబాదులాంటి మహానగరాన్ని నిర్మించుకోవాలన్న మా అకాంక్ష అవివేకమనడముతోనే అని తెలియజేసుకుంటున్నాను.

      ఆంధ్రావారు కట్టాలని ఉవ్విల్లూరుతున్నది ప్రజాధనముతోనే అయినా, అది చేస్తున్నది ఎవరి బొక్కసమో నింపడానికి కాదు. ప్రజల కోసం, అభివృద్ది కోసం, ఆ ప్రాంతములో కల్పించబడే ఉపాది కోసం. మహానగరం అనేది విలాస వస్తువు కాదు. అభివృద్దికి ఆయువుపట్టు

      >>>కోరికలు ఎవరకయినా ఉండొచ్చు కానీ మంది సొమ్ము ఫలహారం చేస్తుంటే అవతలోడు గమ్మునుండి చూడాలనడం విడ్డూరం. డబ్బు ఉట్టిగా రాదు అని తెలుసుకున్నాక ఏమయినా చెయ్యాలి.

      ఈకోరిక నా ఒక్కడిది కాదు. రాష్ట్రములోని అనేకమంది ప్రజలది. ప్రజలేకాదు, పార్టీలు కూడ అదే వాగ్ధానాలు చేశాయి ఎన్నికలప్పుడు. (ప్రస్తుతమున్న) అధికార పక్షం సింగపూర్ నిర్మిస్తాం అంటే (ప్రస్తుతమున్న) అపోజిషన్ దుబాయి నిర్మిస్తాం అని చెప్పినట్టు గుర్తు. మాకు సింగపూర్లూ, దుబాయిలూ వద్దు.. దేశములో మిగిలిన నగరాలతో పోటీ పడే నగరం చాలు.

      అయినా రాజధాని నిర్మానం అనేది మంది సొమ్ము ఫలహారం చేయడం అన్నారు చూడంది, హైలెట్ అసలు. అసలు సిసలు విడ్డూరమంటే అదీ. డబ్బు ఊరికే రాదు, అలానే అద్బుతమైన నగరం, తద్వారా వచ్చే అభివృద్ది, ఉపాధి కూడా ఊరికనే రాదు. అయినా.. ఒక రాష్ట్రానికి నిర్మించే రాజధాని, రాష్ట్ర సొమ్ముతో కాక, నా సొమ్ముతోనో లేక ముఖ్యమంత్రి సొమ్ముతోనో నిర్మించాలా? భలే చెప్పారండి బాబూ..!

      Delete
    4. "హైదరాబాద్ రూపు రేకలు ఎలా మారిపోయాయో"

      బెంగుళూరుతో అనేక నగరాల రూపు రేఖలూ మారాయి. నేనే అభివృద్ధి చేసానని ఎవరూ చంకలు గుద్దుకున్నట్టు కానీ వారంతటి వారే లేరని వంది మాగధుల బాకా కానీ గుర్తు లేదు. నాకేమిటో మతిమరుపు వచ్చినట్టుంది!

      "కూలడానికి సిద్దంగా ఉన్న భవనాలూ"

      1956 నాటికి 152 పూర్తిగా ఉపయోగకరంగా ఉన్న కట్టడాలు ఉన్నాయి. ప్రస్తుత ఆంద్ర ప్రభుత్వం తాత్కాలిక రాజధాని వీటినుండే నడుస్తుంది.

      "ప్రజాధనముతోనే", "రాష్ట్ర సొమ్ముతో కాక"

      ఆంద్ర ప్రజాధనంతో అయి ఉంటె, నేను మాట్లాడను. కానీ దేశ (కేంద్ర) ప్రజాధనం అంచేత ప్రతి భారతీయుడికి స్టేక్ ఉంది.

      Delete
    5. బెంగలూరు రూపు రేకలు మారిన మాట నిజమే. కానీ కర్నాటక రాష్ట్రం రెండుగా విడిపోయినట్టూ, అందులో కొంతమంది, బెంగులూరును మీరు అభివృద్ది చేసిందేమిటి 1950ల్లోనే బెమ్మాండంగా మా మైసూర్రాజావారు అభివృద్ది చేసేశారు అంటూ వెటకారాలు చేసినట్టు, కొంత మంది భజనపరులు దాన్ని సమర్ధిస్తూ ప్రస్తుతం ఉన్న అభివృద్దిని (IT తదితర పరిశ్రమల వల్ల వచ్చిన, పేరూ, అభివృద్ది) తక్కువ చేసి, అంతా మా మైసూర్రాజా వారి చలవే అంటూ వక్ర చరిత్రలు చూపినట్టూ, నాకూ గుర్తులేదండీ. మతి మరుపు మీకే కాదు నాకు వచ్చినట్టుంది. ఒక్కసారి పైన చెప్పినవన్నీ జరిగి, అందరూ కలిసి చేసిన అభివృద్దిని తక్కువ చేసి ఎప్పుడో మైసూరు మారాజు గారు కట్టించిన కూలిపోవడానికి సిద్దంగా ఉన్న భవనాలే అభివృద్ది అని కొంత మంది చంకలు గుద్దుకున్నప్పుడు, తప్పకుండా .. బెంగలూరు అభివృద్దికి కారణం ఎవరో అనేది బయటకి వస్తుంది లెండి.

      ఆంధ్రా రాజధానిని కేంద్రం స్పాన్సర్ చేస్తుందని చెప్పడం తప్ప, ఇప్పటి వరకూ పైసా విదిల్చలేదు. మావాల్లే లక్ష ఎకరాలు సేకరించి అవి అమ్మి, మరికొన్న్ని విధానాల ద్వారా నిధులు సమకూర్చుకుని నిర్మించాలని నానా పాట్లూ పడుతోంది. అయినా, కేందరం నిధులు ఇస్తుందే అనుకుందాం. ఎందుకు ఇస్తోంది? విభజన భిల్లులోని అంశాలతోనే కదా? విభజన బిల్లుతో వచ్చిన హైదరాబాద్ మీది, అందులోని సంపదా మీదయినప్పుడు, అదే భిల్లు ప్రకారం మా రాజధాని నిర్మానానికి రావాల్సిన నిధుల్ని వ్యతిరేకించే హక్కు మీకెక్కడిది? కేంద్రం మాకొక్కరికే నిధులు ఇస్తోందా? IT-IR అని, అదనీ ఇదనీ తెలంగానాకూ కూడా బాగానే ఇస్తోంది. స్మార్ట్ సిటీలు నిర్మాస్తామని చెబుతోంది. ఎవరికి రావాల్సిన నిధులు వారికి ఈవిధంగా వస్తూ ఉంటే .. దేశం సొమ్మేదో మేము మొత్తం దోచేస్తున్నట్టు మామా మీద నిష్టూరాలు పోవడం దేనికి? ఒప్పందం ప్రకారం మాకు రావాల్సిందే మాకొస్తోంది. మీకొచ్చే నిధులు ఎలా వినియోగినుకోవాలో మీరు చూసుకోండి. మాకొచ్చే నిధులు మా అభివృద్దికి ఎలా వినియోగినుకోవాలో మేము నిర్ణయించుకుంటాం. ఆవిషయములో ఇతరుల ఉచిత సలహాలు అనవసరం. అభ్యంతరాలనైతే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అభ్యంతరం చెప్పే అధికారం కూడా ఎవ్వరికీ (ముఖ్యంగా విభజన బిల్లు ప్రకారం, తెలంగానా వారికి) అస్సలు లేదు. కాబట్టి మీ పని మీరు చూసుకోండి అనడం న్యాయమే.

      Delete
    6. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన మహానుభావుడు ఎవరని అడిగితె ఇంకా పాకుతున్న బుడ్డాడు కూడా చంద్రబాబు అని జవాబు చెబ్తాడు. ఇదే ప్రశ్న ఇతర నగరాల గురించి వస్తే ఒక్కరు కూడా ఒక్క పేరు కూడా చెప్పరు.

      తానె హైదరాబాదు పేరు ప్రపంచ పటంలో పెట్టాననే కాకమ్మ కథ చంద్రబాబు కనీసం వారానికి ఒకసారయినా అంటూ ఉంటారు. వారి అభిమానులు ఇందులో ఎంతమాత్రం తీసిపోరు. బెంగుళూరు (మరియు ఇతర నగరాల) విషయంలో దేవరాజ్ ఉర్స్ నుండి సిద్దరామయ్య వరకూ ఎవరూ ఇలాంటి మాట చెప్పలేదు.

      దీనర్ధం ఏమిటి? అన్ని నగరాలు తమ సొంత బలం మీద ఎదిగాయి కానీ హైదరాబాద్ మాత్రం ఒక వ్యక్తి కృషి వల్ల మాత్రమె ఎదిగిందా? उल्लू बनानेको हमीच मिले!

      చంద్రబాబు గారు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసారన్న ప్రచారం మలి దశ తెలంగాణా ఉద్యమం కంటే ముందటి నుండే ఉంది. అంచేత ఈ రెంటినీ ముడిపెట్టడం అనవసరం.

      ఇక రెండో పాయింటుకొద్దాం. కేంద్రం ఎన్నో రాష్ట్రాలకు ఎంతో నిధులు ఇస్తుంది. అన్నిటికీ ఏదో ప్రాతిపదిక ఉంటుంది. తెలంగాణకు అప్పనంగా సొమ్ము కట్టపెడితే మీరూ అభ్యంతరం చెప్పండి నేను కాదనలేదు.

      రాజధాని గురించి ఆంద్ర లాబీల పుణ్యమా అంటూ మిగిలిన రాష్ట్రాల కంటే అదనంగా పునర్వ్యవస్తీకరణ చట్టంలో వెసులుబాటు కల్పించారు. హైదరాబాద్ తలదన్నే నగరమో, సింగపూర్ జేజెమ్మ లాంటిదో అని ఎక్కడా చట్టంలో లేదు. చట్టం పరిధిలో ఉన్నంతవరకు మేరకు కేంద్రం ఇచ్చి ఆపై రొక్కం ఆంద్ర ఖజానా నుండి పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. అంతకు మించి వెళితే నేనే కాదు ఎవరయినా నిలదీస్తారు.

      Delete
    7. సిద్దిరామయ్యలకు, దేవరాజ్ ఉర్సులకు ఆ అవసరం వచ్చుండక పోవచ్చు. చంద్ర బాబుకు వచ్చింది కాబట్టి చెప్పుకున్నాడు. అది నిజమే కాబట్టి సమర్ధిస్తున్నాం. అందరూ సిద్దిరామయ్యల్లానే ఉండాలని రూలుందా? తాను సాధించిన విజయాన్ని ఎఫెక్టివుగా ప్రజలకు చేరవేయగలగడం ప్రస్తుతం పోటీ ప్రపంచములో అవసరం. చంద్రబాబు మల్లీ సీ.యం అవడానికి అదీ ఒక కారణమే. చంద్రబాబు అభివృద్దికి కృషిచేశాడా లేదా? ఆ కృషి ఫలితంగా అభివృద్ది జరిగిందా లేదా? అదే ముఖ్యం. అంతే తప్ప, పక్కనున్న సిద్దిరామయ్యలూ, ఎదురుగా ఉన్న పుల్లయ్యలూ కాదు.

      అభివృద్ది ఒక వ్యక్తి కృషివల్ల కాదు, "ఒక నాయకుడి నాయకత్వం, కృషి" వల్ల జరుగుతుంది. దీన్లోని తేడా అర్థమయితే మీకు సగం చిక్కుముడి వీడినటే, మిగిలినది, మీకు నచ్చనివారి గొప్పదనాన్ని అంగీకరించడం ఎలా అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది అంతే. క్రికెట్ టీము విజయం, టీము విజయమే అయినా కెప్టెనుకు చాలా పేరొస్తుంది, విజయ తీరాలకు చేర్చాడన్న పేరొస్తుంది, దానికితోడు అతను, బౌలింగో, బ్యాటింగో అద్బుతంగా చేసి మరీ విజయ తీరానికి చేర్చి ఉంటే ఇంకా చాలా పేరొస్తుంది. ఆ కెప్టెన్ నేను విజయతీరాలకు టీమును చేర్చాను అనిచెప్పుకోవడం పక్కోల్లను ఉల్లూలను చేయడమా? అతనికి అలా చెప్పుకునే హక్కు లేదు అని చెప్పడం "ఉల్లూలను" చేయడమా? మీరే తేల్చుకోండి.

      లాబీల గురించి గు"లాభీ"లను అడగండి చెబుతారు. ఎన్ని "లాబీలు" జరిగాయో. ఏకంగా విలీనమవుతామన్న గు"లాబీ" మాటలతోనే కదా, సీమాంధ్రకు అన్యాయం చేసి, జీతాలుకూడా ఇచ్చుకోలేని సీమాంధ్రను అప్పజెప్పారు. అప్పుడు జరిగిన అన్యాయం గురించి గు"లాబీ"లు కూడా మాటవరసకు మొసలి కన్నీరు కార్చారు కదా? ఆ అన్యాయాన్ని కప్పిపుచ్చడానికి ఇచ్చిన "మొక్కుబడి" విదిలింపులే ఇప్పటి వరకూ సీమాంధ్రకు చేరలేదు. అప్పటి "ప్రధాన మంత్రి", ఇప్పటి "ప్రధాన మంత్రి" ఇచ్చిన వాగ్ధానాలకే దిక్కులేదు ఇంకా. అలాంటిది, ఏదో దేశం సొమ్ము మొత్తం మాకే ఇస్తున్నారని, దానికి లాభీ కారమని అనడం హెంత విచిత్రం? కడుపునిండి నోడు, "బ్రేవ్" మని త్రేంచుతూ, ఆకలిగా ఉన్నోడికి నీతులు చెప్పినట్టు, ఒడ్డునున్నోడు, మునిగిపోయేవాడికి సలహాలు ఇచ్చినట్టు వెటకారాలు ఎందుకు? మాకు రావాల్సినవి ముక్కు పిండి వసూలు చేసుకుంటాం, మేము చేసుకోవాల్సిన లాబీలు కూడా మేము చేసుకుంటాం, దానికి దేశములో ఎవరు అభ్యంతరం చెప్పినా ఓపిగ్గా సమాధాన మిస్తాం, కానీ అదే లాబీతో కడుపు నింపుకున్న గు"లాబీ" చెబితే మాత్రం అస్సలు లెక్కకూడా చేయం. మీకా హక్కులేదు.

      Delete
    8. శుక్రాచార్య గారు,
      తెలంగాణా వాళ్లు ఆంధ్రోళ్లు అంత తెలివిగలోళ్లు కాదు, అందుకే "అస్సలు జైపాల్ రెడ్డి కాని, మిగతా కాంగీ M.P. లు కాని లాబీయింగే జెయ్యల, మీకు తెల్దేమో!!", ఇక క.చ.ర. గారు కేవలం దళితుడును ముఖ్యమంత్రి ని జెస్తా, లెకపోతే తల కోసుకొంటా అన్నట్లు, కాంగీ లో కలిపేస్తా అన్నది కేవలం అలవాటులో పొరబాటు అబద్దం మాత్రమే, అవి అబద్దాలే కాని లాబియింగ్ లో భాగం అసలే కాదు, అంతే కాదు, సోనియమ్మను తెలంగాణా దేవత అని పిల్చింది కూడా ఆమె దేవత కాబట్టే గాని, లాబియింగ్ లో భాగం కాదు, లాబ్బింగ్ అంటే మాకు అస్సలు తెల్దు, ఎందుకంటే మేము అమాయకులం, మీరు మాత్రం దోపిడీ దారులు, మీం చెస్తే అది పవిత్రకార్యం, మీరు చేస్తే మాత్రం వ్యభిచారం, లాబ్బియింగూ గాడిద గుడ్డూ నూ........

      (ఓ దొర గారి వీర పంఖా మరియు ఏడుపుగొట్టు వీరుడు మీద ఎటకారపు కామెంట్, అర్ధమయినోడుకు అర్ధమయినంత :) )

      Delete
    9. దేశంలోనూ ప్రపంచంలోనూ అధికారం చేపట్టిన మహామహులకు ఎవరికీ తామే ఫలానా నగరాన్ని అభివృద్ధి చేసామని చెప్పుకోవాల్సిన మరియు ప్రతి రోజూ పునరుద్ఘాటించాల్సిన గతి పట్టలేదు, ఈ మహద్భాగ్యం కేవల్ సుందరయ్య గారిదే అంటారా? సరే మీ ఇష్టం.

      మీకు చట్టప్రకారం రావాల్సింది నేను అడ్డు చెప్పలేదు. అంతకు మించి ఇస్తే మేము ఊరికే కూచోవాల్సిన అవసరం లేదు.

      మీకు తెలంగాణా మీద ఎంత గుర్రున్నా నడిమట్ల ఆయన ఎవర్నో ఎల్లయ్య పుల్లయ్య అని గేలి చేయడం అవసరమా? కలం మీది, మీ ఇష్టం లెండి.

      Delete
    10. ప్రపంచములో ఉన్న నాయకులందరూ చెప్పుకోలేదు అని చెప్పడానికి కావలసినంత "సమస్థ ప్రపంచ ఙ్ఞానం" మీకు లేదుకదండీ? కాబట్టి అది ఒదిలేయండి. మీ అభినవ విప్లవ నాయకుడు, తమ పార్టీ ఉధ్యమ పార్టీ అని, అదనీ ఇదనీ ఊదరగొట్టుకోవడం, తాను చేసిన "సెలైన్ బాటిలు" నిరాహార దీక్ష కేంద్రాన్ని కదిలించింది అని ఊదర గొట్టుకోవడం, మీకు కనిపించలేదు. సమస్థ ప్రపంచం దాకా పోవడం ఎందుకు దండగ.!!

      గు"లాబీ" కారణంగా, "మేము మీరు కోరిన తెలంగాణా ఇస్తున్నాం" అని చెప్పుకోవడానికి, తద్వారా ఒంటికాలు మీద కుంటుతున్న పార్టీని కొద్దిగానైనా నిలబెట్టడానికి, "కొండ నాలికకు" మందేసిన చందంగా విభజించి, ఉన్న నాలుక ఊడగొట్టుకున్న "గాంక్రెస్", చట్టపరంగా, ప్రజాస్వామ్యం సాక్షిగా, సీమాంధ్రకు అన్యాయం చేసింది. అంటే చట్టం ప్రకారం, బిల్లు ప్రకారం పోయినా సీమాంధ్రకు అన్యాయమే తప్ప న్యాయం జరగదు. ఆ విషయాన్ని, మొసలి కన్నీరు కారుస్తూ అందరూ ఒప్పుకున్నారు, గు"లాబీ"లతో సహా. అలాంటప్పుడు "చట్ట ప్రకారమే" అన్న మాట, మాకు "అన్యాయం" చేయడమే కదా? మరి "చట్ట ప్రకారమే" వెలుతూ మాకు మేము అన్యాయం ఎలా చేసుకోగలం? మీరు అభ్యంతరాలు చెబితే పట్టిచుకోవాల్సిన పనిలేదు అని చెప్పింది అందుకే.

      మా రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూడ్చుకునేందుకు కావలసిన లాభీలు మేము తప్పకుండా చేసుకుంటాం. మాకు ఒకరి అభ్యంతరాలతో పనిలేదు.

      Delete
    11. పైన నేను సిద్ది రామయ్య, పుల్లయ్య అంటూ రాసిన మాట ఆయన్ను కించ పరడానికి అన్న మాట కాదు. ఆయన మీద నాకు ఏ తరహా ద్వేషం కానీ, కోపం కానీ లేవు. కాస్తో కూస్తో గౌరవం తప్ప. అలా అనడానికి కారణం ఏదైనా, అనడం తప్పే అని నాకూ అనిపిస్తోంది. వాద ప్రతి వాదనలో అనవసరంగా అన్న మాట అది. దానికి, సిద్దిరామయ్య గారికి నా క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను.

      Delete
  4. 29 రాష్ట్రాలలో కేవలం 5ఇంటికి (మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, కర్నాటక, తెలంగాణా) మాత్రమె మహానగరాలు ఉన్నాయి. అవీ కొన్ని చారిత్రిక నేపధ్యాల దృష్ట్యా ఏర్పడ్డాయి. ఈ వాస్తవాన్ని విస్మరించి మేమూ హైదరాబాదును తలదన్నే నగరం కట్టుకుంటామని అర్రులు చాచడం అవివేకం.
    // 'ఒక మంచి నగరం కట్టుకోవాలి అని ఆశపడడం కూడా అవివేకం' అని చాలా చక్కగా తీర్మానించేశారు.

    ReplyDelete
    Replies
    1. మంచి నగరం= మహానగరం? :)

      ఇంతకీ 23 రాష్ట్రాల రాజధానులు మంచివి కావా? ఆంధ్రలో ఇప్పుడున్న నగరాలు మంచివి కావా?

      విశాఖపట్నం & విజయవాడ ఇప్పటికే దేశంలో టాప్ 20 నగరాలలో చోటు చేసుకున్నాయి. 1956 నాటికి వాటికి ఈ స్థాయి లేదని విదశీకరించనక్కరలేదనుకుంటా.

      Delete
    2. మంచి నగరమో మహా నగరమో! ఏదో ఒకటి! 'మేం కట్టుకుంటాం అని కలలు కనడం, ఆశపడడం కూడా అవివేకం' అని మీరు తేల్చేయడం బహు బాగుంది.

      ఇంతకీ 23 రాష్ట్రాల రాజధానులు మంచివి కావా? ఆంధ్రలో ఇప్పుడున్న నగరాలు మంచివి కావా?
      >> కావు అని ఎవరన్నారు?

      విశాఖపట్నం & విజయవాడ ఇప్పటికే దేశంలో టాప్ 20 నగరాలలో చోటు చేసుకున్నాయి. 1956 నాటికి వాటికి ఈ స్థాయి లేదని విదశీకరించనక్కరలేదనుకుంటా.
      >> విదశీకరించనక్కరలేదు. వాటితో పాటు ఇంకొక నగరం! మన అభివృద్ధి చూసి ఉడుక్కునే వారు యెంత వుడుక్కుంటే అంతకు రెట్టింపు వేగంగా మనం వృద్దిలోకి రావచ్చు! ఏమంటారు?

      Delete
  5. మంచి నగరమో మహా నగరమో! ఏదో ఒకటి! 'మేం కట్టుకుంటాం అని కలలు కనడం, ఆశపడడం కూడా అవివేకం' అని మీరు తేల్చేయడం బహు బాగుంది.

    ఇంతకీ 23 రాష్ట్రాల రాజధానులు మంచివి కావా? ఆంధ్రలో ఇప్పుడున్న నగరాలు మంచివి కావా?
    >> కావు అని ఎవరన్నారు?

    విశాఖపట్నం & విజయవాడ ఇప్పటికే దేశంలో టాప్ 20 నగరాలలో చోటు చేసుకున్నాయి. 1956 నాటికి వాటికి ఈ స్థాయి లేదని విదశీకరించనక్కరలేదనుకుంటా.
    >> విదశీకరించనక్కరలేదు. వాటితో పాటు ఇంకొక నగరం! మన అభివృద్ధి చూసి ఉడుక్కునే వారు యెంత వుడుక్కుంటే అంతకు రెట్టింపు వేగంగా మనం వృద్దిలోకి రావచ్చు! ఏమంటారు?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top