సామాజిక న్యాయం అంటే ఏమిటి? 

తక్కువ కులం వాళ్ళు అధికారం చేపడితే సామాజిక న్యాయం జరిగినట్లేనా!?

Palla Kondala Rao,
24-2-2014

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. ఎప్పటికీ ఆది పెద్ద ప్రశ్నే ఎందుకంటే వెనకపాడిన వాళ్ళు వస్తే రాష్ట్రం అభివ్రుధ్ది చూస్తుంది అంటే కొంచం నమ్మలేము, కేవలం నా అన్న పదం తన వంటిలోంచి తొలగించుకున్నా లేకపోతే నా అన్న పదానికి అర్ధం నా తోటి వారు అనుకున్న వారు ఉంటే తప్ప రాష్ట్రంలో అభివ్రుధ్ధి జరగదు

    ReplyDelete
  2. కొన్ని ప్రశ్నలకు సమాధానం కష్టం
    ఒకడి మేధస్సు యొక్క ధర ఎంత అంటే - చెప్పగలమా?
    మేధస్సు ధర ఒక్కోసారి నూరు అంతస్థుల భవనం అనిపించవచ్చు, ఇంకొకరికి 3 లక్షల జనాల జీవనాధారం నాశనం చెయ్యడం అని అనిపించవచ్చు.

    ReplyDelete
  3. నాకు అర్థం అయినంత వరకు 'సామాజిక న్యాయం' అంటే అన్ని వర్గాల వారికి న్యాయం. 'వర్గం' అంటే కులాలు కావచ్చు, మతాలూ కావొచ్చు, ప్రాంతాలు కావొచ్చు, ఆడ/మగ లాంటివి కూడా కావొచ్చు. ఇలా అందరికి అన్నిటిలో భాగస్వామ్యం ఉంటె అదే సామాజిక న్యాయం.

    'తక్కువ కులం' అని చెప్పబడే వారికి అధికారం అని ఎందుకు అంటారంటే, వారికి అధికారంలో ఇంత వరకు సరి అయిన భాగస్వామ్యం దొరకలేదు కాబట్టి.

    చిన్న సూచన:
    'తక్కువ కులం వాళ్ళు' అని మీరు హెడ్డింగ్ లు పెడితే 'ఎవరు తక్కువ కులం వాళ్ళు?' అని కొందరు అనుకోని అది అపార్థాలకు దారి తియూచ్చు, హరిజనులనో, సేడ్యుల్ కాస్ట్ అని రాస్తే ఇబ్బంది ఉండదు అనుకుంటాను.

    ReplyDelete
    Replies
    1. సామాజికన్యాయం అంటే సమాజంలోని అందరు ప్రజలు అంటే పిల్లలు-వృద్ధులు-యువకులు-పెద్దలు అందరూ అన్ని రకాలుగా భద్రతతో-స్వేచ్చగా బ్రతకడం కావాలి. కానీ ఈ అర్ధంతో సామాజికన్యాయం అనే పదాన్ని వాడడం లేదు దాదాపుగా. ఇంకా చెప్పాలంటే సామాజికన్యాయం అంటే అణగారినవర్గాలు అధికారంలోకి రావడం అనే సంకుచిత అర్ధాన్నే వాడుతున్నారనిపిస్తోంది. తక్కువ కులాలు అనేది తప్పు కాదు అగ్రవర్ణాలు ఉన్నాయి అంటే అణగారిన వర్ణాలున్నాయనే. అయినా మీ సూచనమేరకు హెడింగ్ మార్చాను.

      Delete
    2. >>అణగారినవర్గాలు అధికారంలోకి రావడం అనే సంకుచిత అర్ధాన్నే వాడుతున్నారనిపిస్తోంది.

      మీరు చెప్పింది నిజమే

      Delete
  4. కొండలరావు గారూ, సామాజిక న్యాయమంటే భద్రతా స్వేచ్చ కావండీ. సమాజంలో అణగారిన అట్టడుగు వర్గాలు పైకి రావడమే సామాజిక న్యాయం.

    రాజ్యాధికారం సామాజికన్యాయసాధనలో ఒక ఆయుధం కావొచ్చు కానీ అదే సామాజిక న్యాయం కాలేదు.

    బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక వ్యక్తి ఉన్నతపదవులు ఎక్కడం వల్ల సామాజిక న్యాయం సరికదా రాజ్యాధికారం కూడా వచ్చినట్టు చెప్పలేము.

    ReplyDelete
    Replies
    1. గొట్టిముక్కల గారూ, సామాజిక న్యాయం అర్ధం ఇప్పుడెలా ఉంటున్నదీ అనేది కాదండీ. సామాజికన్యాయం అంటే సమాజంలోని అందరు ప్రజలు అంటే పిల్లలు-వృద్ధులు-యువకులు-పెద్దలు అందరూ అన్ని రకాలుగా భద్రతతో-స్వేచ్చగా బ్రతకడం కావాలి అని నేను అభిప్రాయపడుతున్నాను.

      Delete
    2. కొండలరావు గారూ, మీలాగే నేను కూడా సామాజిక న్యాయం అనే పదం యొక్క నిజమయిన అర్ధం గురించే మాట్లాడుతున్నాను.

      నాకు తెలిసి సామాజికన్యాయానికి నిర్వచనం సమాజంలో ఉన్న వివిధ వర్గాలు అన్నిటికీ సమన్యాయం జరగడమే. గణాంక శాస్త్ర భాషలో చెప్పాలంటే ఏ ముఖ్యమయిన సాంఘిక ఆర్ధిక పారామీటరు తీసుకున్నా, అన్ని వర్గాలలో బెల్లు కర్వు ఒకటే ఉండాలి.

      ఉ. అత్యల్ప శాతం ఉన్న ఒకానొక వర్గం ధనికుల్లో సింహభాగం ఉండడం సామాజిక న్యాయానికి విరుద్దం. అలాగే అత్యాచారాలలో హెచ్చు శాతం ఒకే వర్గం ప్రజలపై జరగడం.

      ఇది ఎలా సాధించాలి? అభివృద్ధి ఫలాలలో సరయిన ప్రాతినిధ్యం లేని వర్గాలను పైకి తీసుకురావడం ద్వారానే ఇది సాధ్యం.

      స్వేచ్చ భద్రత (లేదా ఉద్యోగాలలో వాటా) అనే విషయాలు సామాజికన్యాయం సాధించడంలో అంశాలు కానీ అవి అంశాలు మాత్రమె.

      లింగ & వయోజన వర్గాలు ఈ నిర్వచనంలో భాగమా అనే చర్చ ప్రస్తుతానికి వదిలేద్దాం.

      Delete
    3. మీ వివరణ బాగుంది. మీకు నా సూటి ప్రశ్న ఏమిటంటే ( నేను తేల్చుకునేందుకు అడుగుతున్నాను. ఎవరినీ తప్పు పట్టడానికి కాదు):

      " అభివృద్ధి ఫలాలలో సరయిన ప్రాతినిధ్యం లేని వర్గాలను పైకి తీసుకురావడం " - ఇందులో అభివృద్ధి ఫలాలలో సరయిన ప్రాతినిధ్యం లేనివారిని నిజాయితీగా ( అంటే ప్రజలను ఓటర్లుగా కాకుండా) గుర్తించే ప్రాతిపదిక ఏమిటి?

      Delete
    4. నేను గణాంక శాస్త్రపరంగా జవాబిస్తే ఫరవా లేదనుకుంటా.

      ఉ. మూడు ప్రాతిపదికలు తీసుకుందాం. ఎంచుకున్న ప్రాతిపదికలు & వాటికి ఇచ్చే బలం (weight) చాలా కసరత్తు చేసాకే నిర్ణయించాలి. ఇవే ప్రాతిపదకలు ఉండాలని నేను అనడం లేదు (just for example).

      1. అత్యంత (పైనుంచి 10 శాతం) ధనవంతులలో వర్గం యొక్క ప్రాతినిధ్యం. దీనికి 50% బలం ఇద్దాం
      2. అత్యంత (కిందినుండి 10 శాతం) బీదవారిలో ప్రాతినిధ్యం. బలం: 20%
      3. ఇంజనీరింగ్/డాక్టరు లాంటి పెద్ద చదువులలో ప్రాతినిధ్యం, బలం= 30%

      జనాభాలో 40% శాతం ఉన్న ఒక వర్గాన్ని ఈ మూడు కోణాలలో పరిశీలిద్దాం. వీరు ధనికుల్లో కేవలం 10% అయితే, వెనుకుబాటుతనం= 40%/10%= 4 X 50% (బలం)= 2

      నిరుపెదలలొ వీరు 80% ఉంటె ఈ ప్రాతిపదిక మీద 80/40 X 20%= 0.4. చివరిగా పెద్దచదువులలొ 2% మాత్రమె ఈ వర్గానికి చెందితే 40/2 X 30% = 0.6. వెరసి ఈ వర్గం వెనుకుబాటుతనం (backward index)= 2 (1+ 0.4 + 0.6).

      అన్నీ "సక్రమంగా" ఉన్న వర్గాలకు ఈ ఇండెక్సు 1 గా ఉంటుంది (ఉ. 40/40 X 50% + 40/40 X 20% + 40/40 X 20% = 1). 0.1 దరిదాపుల్లో ఉన్న వర్గాలను "దొరలు" అనుకోవచ్చు.

      ఈ పద్దతి రిక్టర్ స్కేలు లాంటిది. అంటే ఇండెక్సు 3 ఉన్న వర్గం 1 శక్రు కలిగిన వారికంటే 100 (3 కాదు) రెట్లు వెనకబడ్డట్టు పరిగణించాలి. 10 to the power of 2 (3-1) = 100.

      బీసీల వర్గీకరణ ఇంత నిక్కచ్చిగా కాకపోయినా కొద్దో గొప్పో "శాస్త్రీయంగా" జరిగిందనే చెప్పొచ్చు. అయితే ఒకసారి బీసీ "హోదా" లభించిన వర్గాన్ని మధ్యమధ్యలో సమీక్షిస్తూ బాగు పడ్డాక రద్దు చేసే పద్దతులు లేవు, ఉన్నా ఎవరికీ ధైర్యం చాలడం లేదు.

      Delete
    5. మీరిచ్చిన ఉదాహరణకు నేను వీలు చూసుకుని స్పందిస్తాను.

      Delete
  5. ఇప్పుడు సామాజిక న్యాయం కంటే సామాజిక దూరం ముఖ్యం.

    ReplyDelete
  6. మహమ్మద్ అలీ గారు, కోవింద్ గారు,కడియం శ్రీహరిగారు పదవీ విరమణ తర్వాత పెన్షన్ తీసుకోడానికి తప్ప దేనికీ పనికివచ్చినట్లు కనపడడం లేదు. ఇలాటివాళ్ళు సామాజిక న్యాయం కోసం ఏం చేసారో తెలియదు.

    ReplyDelete
    Replies
    1. వీరే కాదు చాలామంది పదవిలో ఉన్నపుడు అగ్రవర్ణాలకు ఊడిగం చేయడం చేస్తారు. పదవి కాపాడుకోవడం కోసం. పదవిలో లేనపుడు పదవికోసం ఊడిగం చేస్తారు. అంతకు మించి పెద్దగా ఉపయోగం లేదనే నా అభిప్రాయం.

      Delete
    2. Well said కొండలరావు గారు. ఏతావాతా ఏమిటంటే స్వప్రయోజనానికే పెద్దపీట.

      Delete
    3. నాకెందుకో ఇది నిరాశావాదం అనిపిస్తుంది. ఇందులో 10% మంది 10% సార్లు అణగారిన జాతుల కోసం పని చేసినా పురోగమనం ఉంటుంది.

      బూజు పట్టిన వ్యవస్థను తిరగతోడడమే లక్ష్యం అనుకున్నప్పుడు నిన్నటి పెత్తరికాలు ఎంత మేరకు తగ్గినా మంచిదే. ఈ కాసిన్ని పదవులు కూడా అగ్రవర్ణాలకే వదిలేస్తే ఎటుతిరిగీ ప్రయోజనం జరగదు.

      Delete
    4. అగ్రవర్ణాలకి ఊడిగం చేసేవారికంటే అగ్రవర్ణాలలో మంచి వారికి ఇవ్వడం మంచిదే కదా? నేనూ ఈ విషయంలో మొదట్లో చాలా భ్రమలలో ఉండేవాడిని. రిజర్వేషన్లు కులం సమస్యని మరింత పెంచడానికి, అణగారిన వర్గాలకీ, అగ్రవర్ణాలలోని పేదలకూ అన్యాయం చేయడానికే పాలకులు చాలా తెలివిగా వాడుతున్నారు.

      Delete
    5. అగ్రవర్ణాలలో మంచి వారికి ఇవ్వడం మంచిదే కదా?

      అగ్రవర్ణాలలో పుట్టినంత మాత్రాన పదవులు రావండీ. మీరు చెప్పినట్లు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటేనే పదవులు వస్తాయి. చంద్రబాబుగారికి చిన్నప్పటినుండీ లీడర్ కావాలని ఉండేది. మన పవన్ బాబుకి కూడా పదవులు కావాలని ఉంటుంది కానీ లీడర్షిప్ క్వాలిటీస్ ఉండవు.

      Delete
    6. అందరూ మంచివాళ్ళే కదండీ. ఫలానా పెద్ద రాయడు వ్యక్తిగతంగా ఎంత మంచోడయినా బహుజనులకు ఒరిగేది ఏముంటుంది?

      పాలక వ్యవస్థ పాల"కుల" కోసమే డిజైన్ చేయబడుతుంది. దాన్ని కొంత లోపల నుంచి, కొంచం బయట నుండి లొంగదీయాలి.

      ఇంకోపక్క తిష్ట వేసిన ముఠా పన్నాగాలు పన్నుతూనే ఉంటాయి. వాటినీ ఎదురుకోవాలి, తప్పదు.

      PS: poverty is a different subject, let us not mix it here please.

      Delete
    7. కులంతో ఒరిగేదేమిటో తెలిస్తే..... ముందు. కులం ఆధారిత పాలన గురించి మాట్లాడుకోవచ్చు.

      Delete
    8. < Well said కొండలరావు గారు. ఏతావాతా ఏమిటంటే స్వప్రయోజనానికే పెద్దపీట. >

      అంతా నేనే సర్. మనం లేదు.

      కులం కార్డు అన్నింటా తీసేసి.... గ్రామం యూనిట్ గా ప్రతి కుటుంబానికీ ఆర్ధికపరమైన రిజర్వేషన్ - కనీసం విద్య, వైద్యం, మార్కెటింగ్ రంగాలు ప్రభుత్వ ఆధీనంలో ఉంచితే తప్ప ఈ దేశం బాగుపడదు. రిజర్వేషన్లు కేవలం ఓటుబ్యాంకి రాజకీయాలకు మాత్రమే పనికి వస్తున్నాయి.

      Delete
    9. ( లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటేనే పదవులు వస్తాయి )

      ఆ క్వాలిటీస్ ఏ క్వాలిటీస్ ?

      ఇపుడున్న నాయకులలో 90% మందికి ఉన్న క్వాలిటీస్ దేశాన్ని భ్రష్టు పట్టించడానికే ఉపయోగపడతాయి. వాళ్ళని సమర్ధించడానికి మళ్ళీ బ్యాచీలుగా విడిపోడాలు..... భయంకరంగా ఉంది పరిస్థితి నీహారిక గారూ.

      Delete
    10. "అంతా నాకే" అనడంలో నిజాయితీ ఉంది. పైకి "అంతా మనందరికీ" అని చెప్తూ లోలోపల "అంతా మాకే" అంటూ మాయలు చేసే "పెద్దోళ్ళ"తోటే ఇబ్బంది.

      ఆర్థికపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకం. బీదా గొప్ప తేడాలు మనిషన్న వాడున్నంత కాలం ఎన్నటికీ పోవు.

      గ్రామం యూనిట్ చేస్తే వనరుల పంపిణీ అవకతవకలు ఎప్పుడు తీరేను? దేశసంపద ఇప్పటికే కొన్ని ప్రాంతాల కబంధ హస్తాలలో బందీ అవడం విదితమే.

      దళితవాడలు, తండాలు, గోండు కోయ గూడాలు మా గ్రామంలో భాగం కాదని, వాళ్ళ చావేదో వాళ్ళు చావాలని "గౌరవపెద్దలు" తీర్పు చెప్పడం ఖాయం. పాలేర్ల పిల్లలకు ఇంగిలీషు చదువులు అనగానే పిల్లకాయలని అమెరికా పంపినోళ్లకు ఎక్కడలేని భాషాభిమానం తన్నుకొని రావడం చూడలా, ఇదీ అట్లనే.

      Delete
    11. అంతా నాకే అనడం నిజాయితీయా? నిజాయితీ కులాన్ని బట్టి ఉంటుందా?

      బీదా గొప్పా తేడాలు మనిషి సృష్టించుకున్నవే. పోవంటున్నారా? పోకూడదనుకుంటున్నారా?

      గ్రామం యూనిట్ చేసేది వనరులు ఆ గ్రామం పరిధిలో ఉండడం కాదు. వనరులెపుడూ సమాజం/ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. పంపిణీ అనేది గ్రామం యూనిట్ గా ఉంటుంది. పథకాలు అనేవి గ్రామం యూనిట్ గా ఉండాలి. ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉండడానికి, సమాచారం రాబట్టడానికీ ఇపుడున్న డిజిటల్ యుగంలో గ్రామం యూనిట్ తప్పనిసరి. అలా చేస్తే వచ్చే ఫలితాలే వేరు. అవినీతి నిర్మూలనకు కూడా ఇది బ్రహ్మాండంగా ఉపయోగపడకలదు.

      దళితవాడలు, తండాలు, గోండు కోయగూడాలు..... ఈ ఆలోచనే తప్పు. ఇపుడు కొత్త కాలనీలలో అందరూ కలిసే ఉంటున్నారు. నగరాలలో గేటెడ్ కమ్యూనిటీలలో కులం పట్టింపు లేకుండా ఆర్ధికంగా బలిసినోళ్లంతా బాగానే ఉంటున్నారు. కులంతో పని లేకుండా కొత్త గ్రామాలను నిర్మించవచ్చు. వారికే పంపిణీలో ప్రాధాన్యతనిస్తే చచ్చినట్లు కులం పిచ్చిని వదిలించుకుంటారు. లేకుంటే చస్తారు. చావనీ ...

      తీర్సులు చెప్వే పెద్దలు ఉండే అవకాశమే లేకుండా చేయడానికే ప్రతి గ్రామం యూనిట్ గా పాలన, పంపిణీ అంటున్నాను.

      ( పాలేర్ల పిల్లలకు ఇంగిలీషు చదువులు అనగానే పిల్లకాయలని అమెరికా పంపినోళ్లకు ఎక్కడలేని భాషాభిమానం తన్నుకొని రావడం చూడలా, ఇదీ అట్లనే. )

      ఏ.పీలో కేవలం వేళ్లమీద లెక్కబెట్టే వారిమీద మీకుండే కోపంతో ఆలోచించడం వల్ల విశాలత్వం తగ్గుతుంది.

      Delete
    12. గ్రామ యూనిట్ అంటే మీ థియరీ ఏమిటో అర్ధం కావడం లేదు. గాంధీ గ్రామ స్వరాజ్యమా లేక ఇంకోటా. ఎప్పుడయినా వివరించండి తీరిగ్గా చర్చించవచ్చు. మరీ ఆదర్శంగా ఉందేమో అని అనుమానం...

      అంతా నాకే అనడం స్వార్ధం. స్వప్రయోజనాలు కోరుకోవడమే మనిషి సహజ స్వభావం.

      ఇతరులను ముంచి తాము బాగుండాలనుకోవడం స్వార్ధం కాదు, దురాశ. అందు కోసమే మతాలు, వ్యవస్థలు ఏర్పాటు చేయడం వ్యవస్తీకృత దోపిడి.

      బీదా గొప్ప తేడాలు ఎప్పుడూ ఉండేవే. ఆదాయ పంపిణీ 80:20 ఫార్ములా బట్టే ఉంటుంది. We can't bring everyone to average, only possible to reduce standard deviation.

      ఊరి బయట దళితవాడల పూరి గుడిసెలు దళితులు కోరి తెచ్చుకోలేదు. గేటెడ్ కమ్యూనిటీలలో కులాలు లేవన్న అంచనా వాస్తవం కాదు.

      నాకెవరి మీదా కోపం లేదు. పాతుకుపోయిన ఆధిపత్య వర్గాలు (entrenched vested interests) తమ పెత్తనం కొనసాగించడం కోసం ఎన్నయినా ఎత్తులు వేస్తారన్నదానికి ఇంగిలీషు మాధ్యమం ఉదాహరణ చెప్పానంతే.

      "ఏ సామజిక ఆర్ధిక పారామీటర్ తీసుకున్నా ఏ వర్గాలు దామాషా కంటే చాల నయంగా ఉన్నాయో, ఎవరు సగటు కంటే హీనంగా ఉన్నారో మీకూ అవగతమే": This is my main point.

      Delete
    13. >>>బీదా గొప్పా తేడాలు మనిషి సృష్టించుకున్నవే. పోవంటున్నారా? పోకూడదనుకుంటున్నారా?>>>

      బీదా గొప్ప అన్నది తెలివితేటలమీద ఆధారపడినపుడు ఎలా పోతాయి సర్ ? (తెలివి వేరు జ్ఞానం వేరు.)

      బ్రాహ్మణులు తెలివిగలవారు అంటారు కానీ వారిలో ఎంతమంది ధనవంతులు అయ్యారు ? వైశ్యులు, మార్వాడీలు పెద్దగా చదువుకోకపోయినా అత్యంత ధనవంతులు అవుతున్నారు.బీద గొప్ప తారతమ్యాలు కులం మీద ఆధారపడి లేవన్నదే నా అభిప్రాయం.

      Delete
  7. రిజర్వేషన్ ఆర్ధికంగా నిలబెట్టడానికే అనుకుంటూ చర్చలు పెట్రుకుంటే, దానికి తగ్గట్టే ముందుకెలుతుంది. సమాజంలో అంటరాని వారుగా తొక్కబడిన వారిని, గౌరయనీయమైన వారిగా మార్చడమే ఉద్దేశ్యం.

    టీవీలో వచ్చే కొన్ని చర్చాకార్యాక్రమాల్లో.. దళితుల్ని నువ్వు..నువ్వూ.. అంటూ పెద్దపెద్దగా అరుస్తూ... పెద్దకులావార్ని మాత్రం మీరూ అంటూ.. గౌరవంగా సంభోదించే హిందూ/బీజేపీ మూర్ఖుల్ని చూశాను. హిందూ మతంలో తమకు గౌరవం లేదని, మైతమ మరిన వారిమీద కాట్లకుక్కల్లా విరుచుకుపడే ఉగ్రవాదుల్ని బ్లాగుల్లో చూస్తున్నాం. అదే మతం మారినోడు.. బ్రాహ్మణుడైతే మాత్రం...ఆ గౌరవమే వేరు.

    బ్రాహ్మణుడికి లాగానే.. ప్రతి కులం వాడికీ సమానమైన గౌరవం వచ్చేంతవరకు.. రిజర్వేషన్ కొనసాగాల్సిందే.

    ReplyDelete
    Replies
    1. అందరూ అలా లేరు. దళితుల కంటే దారుణంగా బతుకీడుస్తున్న బాపనోళ్ళు చాలామంది ఉన్నారీదేశంలో. కక్క లేక మింగ లేక అన్నట్లున్నవాళ్ళున్నారు. బ్రాహ్మణాధిక్యతకు బాపనోళ్ళందరకూ బలి కావలసిన అవసరం లేదు. కులం ఆధారంగా అసలే చర్చా, కార్యక్రమం ప్రభుత్వ పరంగా లేకుంటేనే కులాధిపత్య పైత్యం త్వరగా తగ్గుతుంది. అగ్రవర్ణం అనగానే అన్నిరకాల బలిసినోళ్లు, బలహీన వర్గాలు అయితే బుద్ధిమంతులు అవుతారా? తెగబలిసినోడికి మద్ధతుగా ఉండే ఎదవలెవరినైనా ఎదవలుగా చూస్తేనే కులం పైత్యం పోతుంది. లేకుంటే కులం మంటలు పెరుగుతాయి.

      Delete
    2. ఫలానా కొందరు అగ్రకులస్థుల కంటే కొద్ది మంది బహుజనులు కాస్త మెరుగ్గా ఉన్నారు కనుక అంతా సక్రమమే అన్న తర్కం సబబు కాదు కొండలరావు గారూ.

      ఏ సామజిక ఆర్ధిక పారామీటర్ తీసుకున్నా ఏ వర్గాలు దామాషా కంటే చాల నయంగా ఉన్నాయో, ఎవరు సగటు కంటే హీనంగా ఉన్నారో మీకూ అవగతమే.

      Delete
    3. మీరు ఇంకా ఆర్ధిక పరిస్థితులే పోలుస్తున్నారు. గౌరవమర్యాదలు చిన్న కులస్తులకు అవసరం లేదని చెప్పాలనుకుంటున్నారా?

      దళితుడైన ఒక యువకుడు కలెక్టరై మొదటిసారి వాల్ల తాతగారి ఊరెలితే.... చదువులేని ఒక కమ్మకులస్తుడు.. "వీడు పలానావాడి మనుమడు కదూ!" అన్నాడు. వాడి వయస్సు ఆ కలెక్టర్కంటే చాలా తక్కువ వయస్సు కూడా!

      Delete
    4. కేసీఆర్ ఇద్దరు రాష్ట్రపతుల్లో.. ఒకరికి పాదాభివందనం చేసి, దళితుడైన ఇంకొకరికి ఫార్మాలిటీగా ఓ దణ్ణం పడేసింది ఏం చూసంటారు?

      Delete
    5. కడియం శ్రీహరి గారు, రామనాధ్ కోవింద్ గార్లను సిఫార్స్ చేసింది కే సీ ఆర్ గారే అయినపుడు ఆయనెందుకు కాళ్ళకు నమస్కరిస్తారు ? వాళ్ళే కేసీఆర్ కి సాష్టాంగ నమస్కారాలు పెడుతున్నారు.

      Delete
    6. నీహారిక గారు, విశాఖపట్నంలో అర్చకులందరూ బ్రాహ్మణులు & స్కావెంజర్‌లు (వీధులు శుభ్రం చేసేవాళ్ళు) అందరూ రెల్లోళ్ళు. అర్చకుడి జీతం కేవలం ఐదు వేలు, స్కావెంజర్ జీతం పదిహేను వేలు. ఇక్కడ బ్రాహ్మణుల కంటే రెల్లోళ్ళే ఆర్థికంగా ముందున్నారు. బ్రాహ్మణులకి నిజంగా ఆర్థిక వెనుకబాటుతనం నుంచి బయటపడాలని ఉంటే వాళ్ళు కూడా స్కావెంజర్ పని చెయ్యొచ్చు. అర్చక వృత్తే పవిత్రమైనదని నమ్మితే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు.

      Delete
    7. @ చిరు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు తగ్గిపోతున్న ఈ రోజుల్లో రిజర్వేషన్ వల్ల ఏమి లాభం? దాని వల్ల చెప్పులు కుట్టే మాదిగోడు నగల వ్యాపారి అయ్యాడా, నగల వ్యాపారం చేసే కోమటోడు చెప్పులు దుకానంలోకి మారాడా?

      Delete
  8. రాంనాధ్ కోవింద్ గారు రిజర్వేషన్ వల్లనే రాష్ట్రపతి అయ్యారని తెలిసిన తర్వాత గౌరవం పెరుగుతుందా ?
    స్వయంకృషి సినిమాలో చిరంజీవిని చూస్తే చాలా గౌరవించాలనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. వెంకయ్య నాయుడు చేసి & కోవిందు చేయని స్వయంకృషి ఏముందండీ.

      Delete
    2. @ జై గారు,
      వెంకయ్య నాయుడుగారికి వాగ్ధాటి ఎక్కువ. కేవలం వాగ్ధాటి ఉండడం ములానే మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కనుక ఎప్పటికైనా వెంకయ్యనాయుడుగారు ప్రధాని పదవికి పోటీ వస్తారని భావించి ఆయన నోరు కట్టేయడానికే ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చారు. దక్షిణాది వారిని ప్రధానుల్ని చేయడడానికి బీజేపీ ఒప్పుకోదు.

      రాబోయే కాలంలో వెంకయ్య నాయుడుగారు రాష్ట్రపతి అయినా కోవింద్ గారితో ఎలా పోలుస్తారు? వెంకయ్యనాయుడుగారు కూడా స్వయంకృషితో ఎదిగినవారే !

      Delete
    3. వెంకయ్య నాయుడు గొప్పోడా కాదా, అతడి "అర్హతలు" ఏమిటన్నవి ప్రస్తుతానికి వదిలేయండి.

      గుజరాత్ ఉత్తరాది రాష్ట్రమా, నిర్వచనం భలే బాగుంది!

      కోవింద్ గారిని కొట్టి పారేయడం వెనుక గూడార్ధం ఏమిటి? ఆయన గురించి ఏమి తెలుసని తక్కువ చేసి మాట్లాడడం?

      మహమూద్ అలీ, కడియం శ్రీహరి లాంటి వారు వాగ్ధాటి, ప్రజాక్షేత్రంలో పని, లీడర్షిప్ లక్షణాలు గట్రా లేకుండానే పైకి వచ్చారనే ముందు సదరు అభిప్రాయానికి ఎలా వచ్చారో ఏమిటో కుతూహలంగా ఉంది.

      Delete
    4. కోవిందుడిని పక్కన పెట్టేసి నేను మహిళా రిజర్వేషన్ తో రాష్ట్రపతిని అయ్యాననుకోండి మీకు ఎలా అనిపిస్తుంది ?

      Delete
    5. >>>మహమూద్ అలీ, కడియం శ్రీహరి లాంటి వారు వాగ్ధాటి, ప్రజాక్షేత్రంలో పని, లీడర్షిప్ లక్షణాలు గట్రా లేకుండానే పైకి వచ్చారనే ముందు సదరు అభిప్రాయానికి ఎలా వచ్చారో ఏమిటో కుతూహలంగా ఉంది.>>>
      రిజర్వేషన్ వాడుకోకుండా పదవులు సంపాదించారని మీరు నిరూపిస్తే నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను.

      Delete
    6. నీహారిక గారూ, మీరు పదవిలోకి వస్తే సంతోషం.

      మహమూద్ అలీ ఏ రిజర్వేషన్ కింద వచ్చారు?

      రిజర్వేషన్ కాండిడేట్లు అందరూ పనికి రారంటే ఎట్లా?

      మొన్నీమధ్య వరకు అగ్ర వర్ణాలకు 100% రిజర్వేషన్లు లేవా?

      Delete
    7. మహమూద్ అలీ ఏ రిజర్వేషన్ కింద వచ్చారు?

      మైనారిటీ రిజర్వేషన్.

      Delete
    8. >>>>రిజర్వేషన్ కాండిడేట్లు అందరూ పనికి రారంటే ఎట్లా?>>>
      పనికిరారని అనడం లేదు.గౌరవం గురించి మాట్లాడుతున్నాం కదా ?

      Delete
    9. >>నీహారిక గారూ, మీరు పదవిలోకి వస్తే సంతోషం.>>>
      మీకు సంతోషం ఏమో గానీ నా కులం కారణంగా గౌరవించబడడం నాకు ఇష్టం ఉండదు.

      Delete
    10. నా కులం కారణంగానో, మహిళననో తక్కువగా చూస్తే ఊరుకునేదీ లేదు.

      Delete
    11. స్వ. ఎంఎం హషీమ్ & మహమూద్ అలీ తెలంగాణకు చేసిన మేలు ముందు వారికి వచ్చిన పదవులు దిగదుడుపు.

      Delete
  9. రాజుల కాలంలో బ్రాహ్మణుల్నీ, గుడుల్నీ రాజులు, తీర అగ్రవర్ణాల వారే పోషించేవారు. అందుకే మిగితావారితో అవసరంలేదు కాబట్టి వారిని అంటరాని వారిగానే చూశారు.

    ReplyDelete
  10. పురాణాలపేరుతో జరుగుతున్న బ్రాహ్మణాదిపత్యాన్ని తట్టుకోలేక తమసొంత మతాన్ని స్థాపించుకున్నవారిని పట్టించుకోలేదు. ఎప్పుడైతే రాజులుపోయి గుడులు మందిమీద ఆధారపడవలసివచ్చిందో,అప్పుడు వీరికి మాన్వత్వం, హిందూధర్మం గుర్తుకొచ్చాయి. ఇక అందర్నీ గుడుల్లోకి పిలిచుకొచ్చి హుండీలు నింపుకుంటున్నారు. ఇక అంభేత్కర్ ఇచ్చిన ఓటుహక్కు బాంబుతో వీళ్ళకి కలు తిరిగిపోయాయి.

    ReplyDelete
  11. పారిశుద్ధ్య కార్మికులుగా కానీ మరో కూలి పని చేసే వాళ్ళలో కానీ అగ్రవర్ణాల వారిని చూపించగలరా?
    జీతం తక్కువైనా షాపులో సేల్స్ మాన్ గా పని చేస్తారు కానీ కూలి పని మాత్రం చెయ్యరు.

    ReplyDelete
    Replies
    1. Excellent observation బోనగిరి గారూ.

      డిగ్నిటీ అఫ్ లేబర్ లేకపోవడం భారత దేశానికి అడ్డంకిగా మారుతుంది.

      Delete

    2. బోనగిరి గారూ,

      (మొబైల్ పైన టైపుచేస్తే బోలెడు ముద్రారాక్షసాలు దొర్లాయి కాబట్టి ఆ వ్యాఖ్యను వెంటనే తొలగించాను. మరలా డెస్క్ టాప్ దగ్గర కూర్చుని వ్రాస్తున్నాను)

      నా బాల్యంలో, ఏదో బీరకాయపీచు చుట్టరికం ఉన్న ఒకాయన, కటికబీదరికం కారణంగా కూలీనాలీతోనే పొట్టపోసుకొనటం చూసాను. మాకు చుట్టాలు ఒక కుటుంబం, బీదవారు. మగదిక్కు లేని వారు. వారిని మానాన్నగారు వీలైనంతగా పోషించారు, స్వయంగా తానే బహుకుటుంబీకులు ఐనా సరే. ఆ కుటుంబానికి వారి ఊరిలోని వారు కూడా ఎంతో కొంత సహాయం చేస్తూ ఉండే వారు.

      మీది Excellent observation అని నేనైతే సంపూర్ణంగా అంగీకరించలేను. ఇలా అన్నందుకు ముఖ్యంగా జై గారు మన్నించాలి. వాదన కోసం కాదని చెప్పటం లేదండి. బీదవాళ్ళు అన్ని వర్ణాల్లోనూ ఉంటారు. ఉన్నారు. పాచిపనులకు వెళ్ళే బ్రాహ్మణుల అమ్మాయిలను కూడా నేను చూసాను. Any over generalization అన్నది సమంజసం కాదని నా అభిప్రాయం.

      Delete
    3. >>పారిశుద్ధ్య కార్మికులుగా కానీ మరో కూలి పని చేసే వాళ్ళలో కానీ అగ్రవర్ణాల వారిని చూపించగలరా?>>>

      చదువులేనివారు కూలిపని చేస్తారు. చదువుకున్నవాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేస్తారు.
      ఇపుడు కులం అవసరం లేదు. కులాలకతీతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నపుడు కులప్రశక్తి ఎందుకు ? ఆమధ్య B.tech చదివి అమెరికా వెళ్ళిన ఒకమ్మాయి వీడియోలో చెప్పింది.ఉద్యోగాలు లేక ఇళ్ళల్లో పనిచేస్తున్నాము అని. ఆ మాత్రం చదువులేనివాళ్ళు గల్ఫ్ దేశాలకు వెళతారు.
      అమెరికాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని పనివాళ్ళకు ఎక్కువ డబ్బు ఇస్తారేమో కానీ సోఫాలో ప్రక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెపుతారా ఏమిటీ ?

      Delete
    4. బ్రాహ్మణులు హౌస్ సర్వంట్ పని లేదా పాకీ పని చెయ్యడం తప్పు కాదు. అర్చకుడి జీతం నెలకి ఐదు వేలు, అతని ఇంటి అద్దె మూడు వేలు. పారిశుధ్య కార్మికుడి జీతం నెలకి పదిహేను వేలు, అతనికి సొంత ఇల్లు ఉంటుంది, ఉన్న ఊర్లోనే పని దొరుకుతుంది. అర్చన చేసే బ్రాహ్మణుల కంటే పాకీ పని చేసే రెల్లోళ్ళకే ఆదాయం ఎక్కువ, ఉపాధి అవకాశం ఎక్కువ. కనుక బ్రాహ్మణులు పాకీ పని లాంటివి చెయ్యడానికి ముందుకి రావలసిందే.

      Delete
    5. పాచిపని చేసిబతికే ఆ బ్రాహ్మణురాలు.. ఏకులంవాల్ల ఇల్లల్లో చేసిందో చెప్పగలరా?

      సరే శ్యామలీయంగారూ! గుడుల్లో బ్రాహ్మణులు రిజర్వేషన్ వదులుకోగలరా? దేశంలో ఏదో మూల 1000 కి 1 చూపించకండి.

      Delete
    6. శ్యామలీయం గారు,
      బీదవాళ్ళు అన్ని వర్ణాలలోను ఉన్నారు. కాని కూలి పని చెయ్యటానికి అగ్రవర్ణాల వారికి నామోషి. ఎవరో నూటికో కోటికో ఒక్కరు ఉండవచ్చు, కాని చాలా చాలా తక్కువ అని నా ఉద్దేశం. నాకు తెలిసినంతవరకు అగ్రవర్ణాల వాళ్ళు మహా అయితే మరో అగ్రవర్ణాల ఇంట్లో వంట పని చేస్తారు.

      నీహారిక గారు,
      "చదువులేనివారు కూలిపని చేస్తారు. చదువుకున్నవాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేస్తారు."
      - నేను చెప్పింది చదువులేనివాళ్ళ సంగతే. లేదా సమాన విద్యార్హత ఉన్న వాళ్ళ సంగతి.

      Delete
    7. శ్యామలీయం మాస్టారూ, మన్నించాలి but anecdotal evidence is no substitute for logical reasoning.

      కూలి పని చేసి కుటుంబాన్ని పోషించిన మీ చుట్టాల వారికి, అట్లాగే పాచి పని చేసి కడుపు నింపుకున్న బ్రాహ్మణ మహిళలకు నా సెల్యూట్. చిత్తశుద్ధితో చేసిన ప్రతి పని విలువయినదే, అందులో ఎప్పుడూ సందేహం లేదు.

      అగ్రవర్ణాలలో సైతం నిరుపేదలు ఉన్నారన్న విషయం వాస్తవమే కానీ దామాషాకు పోలిస్తే statistical significance ఉందా? దేశంలో 22% జనాభా దారిద్య్ర రేఖ (whatever be the definition & modalities) దిగువున ఉన్నారని ప్రభుత్వ గణాంకాలు: పెద్ద కులపోళ్ళలో కనీసం 22/2= 11% ఈ తరగతికి చెందుతారా?

      నీహారిక గారూ, ఆవిడెవరో ఏమిటో తెలీదు కానీ H1B చేయించిన కంపెనీ మీద INSకు ఫిర్యాదు చేయడం బెటర్. Bench status is no excuse for visa violation.

      Delete
    8. అగ్రకులాలవాళ్ళకి వందలు లేదా వేల సంవత్సరాల నుంచి శ్రమ చెయ్యకుండా బతకడం అలవాటు అయిపోవడం వల్ల వాళ్ళు కూలీ పనులు చెయ్యడానికి ఒప్పుకోరు. వందల సంవత్సరాల చరిత్ర సంగతి సరే, రెండు తరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దళిత కుటుంబంలో మూడవ తరం అబ్బాయికి ప్రైవేట్ ఉద్యోగం చెయ్యమన్నా అతను అది చెయ్యడు. మన ఇండియాలో లేబర్ డివిజన్ అలా పాతుకుపోయింది.

      Delete
    9. >>>కూలి పని చెయ్యటానికి అగ్రవర్ణాల వారికి నామోషి.>>>
      భలేవారండీ...నాట్లు వేయడం, కోత కోయడం, పలుగు పట్టుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. శారీరిక శ్రమ చేయడం కష్టం. మెదడుతో చేసే పనికి లక్షల జీతాలు ఇస్తారు కానీ శారీరిక శ్రమకి విలువ కట్టరు.కాళ్ళూ చేతులు పనిచేయనివారిని అడిగితే శారీరిక శ్రమ విలువ చెపుతారు. కూలి పనికి అడ్డువచ్చేది నామోషి కాదండి ఒళ్ళువంగక.కూలివాళ్ళకి అగ్రవర్ణాలవారే ఎక్కువ జీతాలు ఇస్తారు. ఎందుకంటే వారికి మేధో శ్రమ అలవాటు కానీ శారీరిక శ్రమ అలవాటు ఉండదు.

      Delete
    10. ( అగ్రకులాలవాళ్ళకి వందలు లేదా వేల సంవత్సరాల నుంచి శ్రమ చెయ్యకుండా బతకడం అలవాటు అయిపోవడం వల్ల వాళ్ళు కూలీ పనులు చెయ్యడానికి ఒప్పుకోరు. వందల సంవత్సరాల చరిత్ర సంగతి సరే, రెండు తరాలుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న దళిత కుటుంబంలో మూడవ తరం అబ్బాయికి ప్రైవేట్ ఉద్యోగం చెయ్యమన్నా అతను అది చెయ్యడు. మన ఇండియాలో లేబర్ డివిజన్ అలా పాతుకుపోయింది. )

      exactly mr praveen.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top