టెక్నాలజీ బానిస కావాలి ! టెక్నాలజీకి బానిస కాకూడదు !!

నేడు మనిషి వాస్తవ ప్రపంచం లో కంటే వర్చ్యువల్ ప్రపంచం లోనే ఎక్కువ గడుపుతున్నాడు. కంప్యూటర్ మనిషిని మరో లోకంలో విహరింప జేస్తున్నది. ఒక రకంగా మానవ సంబంధాలను ఇది శాసిస్తోంది. టెక్నాలజీ మనిషికి సేవచేసే బానిస కావాలి తప్ప మనిషి తాను సృష్టించిన టెక్నాలజీకి బానిస కాకూడదు. ఎలాగూ మనిషి తాను సృష్టించిన రూపాయికి బానిసై మానవత్వం కోల్పోతున్నాడు. ఇక రెండోది ఈ టెక్నాలజీ కూడా మనిషిని తనకు బానిసగా మార్చుకుంటున్నది. మానవసంబంధాలు బాగలేనందున ఈ టెక్నాలజీ సంబంధాలు పెరుగుతున్నాయా? టెక్నాలజీ పెరగడంతో మానవ సంబంధాలు దెబతింటున్నాయా? ఏది ఏమైనా మానవ సంబంధాలను కాపాడుకోవడానికి మనమంతా ప్రయత్నించాలి. ముల్లును ముల్లుతోనే తీయాలని శ్రీకృష్ణుడు చెప్పినట్లు అందుకోసం టెక్నాలజీనీ ఉపయోగించుకుందాం ! 

మనిషి టెక్నాలజికి బానిస కాకుండా ఉండాలంటే!? 
మీ సూచనలు తెలియజేయగలరు.
- Palla Kondala Rao,
1-8-2012.
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. What about people obsessed with "isms" who not only make their own lives miserable, make their families to be alienated from them, but also try to influence the minds of normal people with these imported "isms" and prevent them from leading normal life.

    ReplyDelete
    Replies
    1. మితృలు శివరామ ప్రసాద్ గారికి ,
      కామెంట్ కు ధన్యవాదాలు.

      టెక్నాలజీని అవసరం మేరకు వాడుకోవాలి. అసలు టెక్నాలజీ పెరగ కుండా నిరోధించలేము.

      ఆబ్సెషన్ అంటే పదే పదే ఒకే విషయం పై అవసరం లేకున్నా , అనవసరం గా ఆలోచనలు రావడం .

      ఈ పోస్టుకు మీ కామెంట్ కు నాకు తెలిసి సంబంధం లేనిది. ఒక విధం గా మీరు కొన్ని ఆలోచనలకు గిరిగీసుకుని పదే పదే వ్యతిరేకించడం అనే అలవాటుకు లోనవుతున్నారు. దానిలో భాగమే ప్రస్తుత మీ కామెంట్ గా భావిస్తున్నాను.

      దిగుమతి తప్పు అనె ఆలోచన కుచించుకుపోయే సంకుచిత మనస్తత్వం తప్ప సరయినది కాదు.

      భూమి మీద మనిషి ఉన్నాడు అంటే మెదడు ఉంటుంది. అది ఆలోచిస్తుంది. ప్రకృతిలో ఉన్న శక్తులను గత అనుభవాల ఆధారం గా ఎప్పటికప్పుడు మనిషి మెరుగైనవి కనిపెడుతూ ఉంటాడు.

      వాటిలో మేలైనవి మనుషలంతా వారి వారి అవసరాల మేరకు వాడుకుంటారు. కొందరు మాత్రం మార్పు కు అనవసరం గా భయపడతారు. కలవరపడతారు. అది సరయినది కాదు.

      దిగుమతి అని వాదించేవారు కూడా చాలా విషయాలు దిగుమతి చేసుకునే వాడుకుంటారు. అది తప్పు కాదు. అవసరం.అనివార్యం.

      ఏది మేలయినదో అదే నిలబడుతుంది. బలవంతం గా వాదించే ఏ వాదమూ , ఇజమూ మనజాలదు.

      Delete
  2. టెక్నాలజీ పెరగడంతో మానవ సంబంధాలు దెబతింటున్నాయా?
    నిజమే... తింటున్నాయనే చెప్పాలి....

    ఎక్కడో చదివాను. US లోనో ఏమో .FaceBook updates రాస్తుంటే disturb చేస్తున్నదని తన చంటిపాపనే ఒక తల్లి కొట్టిందడ.. ఆ దెబ్బకు ఆపాప మరణించింది కూడా...

    మనం బానిసలు అవుతున్నామని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

    ReplyDelete
    Replies
    1. అవును సాయి గారు . మీరన్నది సరయినదే. మానవసంబంధాలను బలహీనపరచేలా టెక్నాలజీ ఉండకూడదు. మీరన్న విషయం ఆదివారం మేగజైన్ లో ( ఏ పత్రికో గుర్తు లేదు ) నేనూ చదివాను. కామెంట్ కు ధన్యవాదాలు.

      Delete
  3. Mr Kondal Rao,

    I do not know why you are becoming quite impatient when I made a comment which in my view is very much connected to what you wrote. See this sentence which you only wrote "టెక్నాలజీ పెరగడంతో మానవ సంబంధాలు దెబతింటున్నాయా". My view is that,May be the technology is affecting human relations. But more dangerously, the "ism" people like you are propagating is affecting not just human relations but the way they are thinking and thereby pushing themselves into a corner of their own, alienating themselves and hypnotizing themselves that they are a cut above others.

    Nobody says whatever is imported is bad. But import of "isms" is always bad. Show me one country which prospered with the "ism" imported into their country, which you are rooting for.

    The picture you uploaded for your "article" itself shows the dichotomy. The picture shows two very young children also. If there were no human relations in that family, where from they came.

    ReplyDelete
  4. మిత్రులు శివరామ ప్రసాద్ గారికి ,

    మనకు ఇష్టం లేకుండా ఎవరూ మనలను హిప్నటైజ్ చేయలేరు.'హిప్నాటిజం'లో ఇది ప్రధాన శాస్త్రీయ అంశం. ఇది మీకు తెలుసనే అనుకుంటున్నాను.

    'ఇజం'అంటే ఏమిటో మీకు సంపూర్ణం గా తెలిసి విమర్శించడం లేదనేది నిర్వివాదం. ఎందుకంటే గతం లోనూ మీరూ ఇదే విధం గా వ్యాఖ్యానించినందున నేను కొంత అసహనానికి గురవుతున్న మాట నిజం.

    మీకో దురభిప్రాయం గూడుకట్టుకొని ఉంది.దానిని అన్నింటా కలగాపులగం చేసి వ్యాఖ్యానించడాన్ని మాత్రం నేను నిర్ద్వంద్వం గా తప్పు పడుతున్నాను.

    ఏ ఇజాలతో పని లేకుండానే టెక్నాలజీ నిరంతరం అభివృధి చెందుతూ ఉంటుంది. అయితే అభివృద్ధి అనేది అసమానతలను పెంచేందుకు, మానవతా విలువలను తుంచేందుకు కాక లోకకళ్యానానికే ఉపయోగపడాలి.

    ఇజాలను దిగుమతి చేసుకోవడమంటూ ఉండదు. ఈ ఎగుమతులు, దిగుమతులు మీ భావన సంకుచితమైనది . అలా అనడం మీ అభిప్రాయం పైననే తప్ప మిమ్ములను కించపరచడం మాత్రం కాదు. మీ మీద గౌరవం ఉండడం కంటే ఓ సత్యం పై నమ్మకముంచడమే విలువైనది.

    మన భూమి మీద మానవులంత ఒకే విధం గా ప్రకృతిమీద ఆధారపడి శ్రమతో తమ అవసరాలు తీర్చుకుంటారు. ఒకరినొకరు స్వేచ్చగా భావ ప్రకటన చేసుకుంటారు.

    గతం ఆధారం గా ఎప్పటికప్పుడు మెరుగైన జీవితాన్ని ఏర్పరచుకుంటారు. ఎక్కడ మెరుగైన విషయం ఉంటే దానిని దిగుమతి చేసుకుంటారు.

    భారతీయ సంస్కృతి , కుటుంబ వ్యవస్థ పట్ల ప్రపంచ వ్యాపితం గా ఎందుకు గుర్తింపు ఉంది. అది మంచిది కనుక. అలాగే ఎక్కడ ఏది మెరుగ్గ ఉంటే దానిని స్వీకరించాలి .

    గుడ్డి వ్యతిరేకతతో , ద్వేషం తో వ్యతిరేకించడం మాత్రం అజ్ఞానం మాత్రమే.

    మీరడిగిన మరో ప్రశ్న : ప్రపంచం లో ఏ దేశం లో .... అనే దానికి నా బ్లాగులో కమ్యూనిజం పై నేను వ్రాస్తున్న ఆర్టికల్స్ క్రమం లో వస్తుంది కనుక తప్పనిసరిగా అక్కడ చర్చిదాము. కామెంట్ కు ధన్యవాదములు.

    ReplyDelete
  5. నా పాయింట్ మీకు ఇప్పటికి అర్ధం అయ్యి ఉండాలి. మీరు చెప్పేది టెక్నాలజీ మానవ సంబంధాలను దెబ్బ తీస్తున్నది అని. నేను చెప్పేది టెక్నాలజీ కన్న ఈ ఇజాల గోల ఎక్కువగా మాన సంబంధాలను దెబ్బ తీస్తున్నాయని. ఇజాల మీద నా వ్యాఖ్యకు మీ స్పందనే దీనికి ఉదాహరణ. కొద్ది విమర్శను కూడ తట్టుకోలేక మీ ఇజాన్ని సమర్ధించుకోవటానికి ఆవతలి వ్యక్తి మీద వ్యక్తిగతమైన కామెంట్స్, ఆవతలి వ్యక్తి ఆలోచనా ధోరణి మీద మీ ఇష్టమైన ధోరణిలో వ్రాసెయ్యటానికి మీరు వెనుకాడటంలేదు. ఇంతకన్నా ఉదాహరణ ఏమి కావాలి "ఇజాల" వ్యామోహం మానవ సంబంధాలను ఎంతగా విడతీస్తున్నదో చెప్పటానికి. 1950ల నుండి ఇప్పటి దాకా కూడా ఈ ఇజాల వల్లనే అనేకానెకమైన వైషమ్యాలు వచ్చినాయి, వస్తున్నాయి కూడా.

    మనం ఇప్పుడు ఇలా మీరు వ్రాసినది నేను, నేను వ్రాసిన వ్యాఖ్యను మీరు చూడగలుగుతున్నాం అంటె టెక్నాలజీనే కదా కారణం. కాని మన్ని విడతీస్తున్నది మటుకు ఈ ఇజాలే అన్నది,మీ మాటల్లోనే చెప్పాలంటె నిర్ద్వందమైన విషయం. టెక్నాలజీ మనుష్యులను కలిపి ప్రపంచాన్ని ఒక గ్లోబల్ విలేజ్ చేస్తే ఈ ఇజాలు వాళ్ళను దాదాపు ఒక్కొక్కళ్ళను ఒక్క దీవిగా చేసి విడతీస్తున్నయి. ఇది నా పాయింట్ అర్ధంచేసుకోవటానికి ప్రయత్నించగలరు.

    సహజమైన మానవ జీవన విధానాన్ని అర్ధం చేసుకోకుండా, మొత్తం సమూలంగా కొద్ది మంది అలోచనా ధోరణితో మార్చెయ్యాలని పట్టుబట్టుకు కూచుని, అందుకు పధ్ధతి ఏమైన పరవాలేదు అనుకోవటం కంటె మూర్ఖత్వం మరొకటి లేదు అని నా అభిప్రాయం.

    మీరు చెప్పిన ట్టుగా "...భూమి మీద మానవులంత ఒకే విధం గా ప్రకృతిమీద ఆధారపడి శ్రమతో తమ అవసరాలు తీర్చుకుంటారు. ఒకరినొకరు స్వేచ్చగా భావ ప్రకటన చేసుకుంటారు.గతం ఆధారం గా ఎప్పటికప్పుడు మెరుగైన జీవితాన్ని ఏర్పరచుకుంటారు....." ఇక ఆ పైన విషయాలు, అందరికీ ఆమోదయోగ్యం అవ్వాలి. అంతే కాని ఒక డజను మందో, రెండు డజన్లో ఒకచోట కూచుని, ప్రపంచం మొత్తం ఇలా అయిపోతే అని వాళ్ళ దృష్టిలో బాగున్నవి ఒక చోట వ్రాసుకుంటె అవ్వి చదువుకోవటానికి బాగుంటాయి కాని, అలా ఏమైఅనా సరే చేసెయ్యాలి అని తాపత్రయపడటమే మానవ సంబంధాలను దెబ్బతీస్తాయి, ఇప్పుడు జరుగుతున్నది అదే.

    ReplyDelete
  6. మిత్రులు శివరామ ప్రసాద్ గారికి ,

    టెక్నాలజీ వల్ల మానవసంబంధాలు చెడిపోవడం కాదు మానవసంబంధాలను దెబ్బతీసేలా టెక్నాలజీని ఉపయోగించకూడదు.

    ఇజాలు అంటే మీకున్న అవగాహన ఏమిటి ? ఈ పోస్టుకు ఇజాలకు సంబంధం లేదు. ఒక వేలు చూపేటప్పుడు నాలుగు వేళ్లు మనకు చూపుతాయంటారు. మీకున్నట్లే ఇతరులకూ ఆలోచనా ధోరణులుంటాయిగా ప్రసాద్ గారు ? వాటి మీదా పదే పదే కావాలని దాడి చేయడం సబబు కాదని మనవి.

    నేను ఇజాలపై మీ అభిప్రాయలను మాత్రమే వ్యతిరేకిస్తున్నాను. మిమ్ములను కాదు. మిమ్ములను వ్యతిరేకించాల్సిన అవసరం నాకు లేదని మీకూ తెలుసు. అభిప్రాయాలను ఖండిచడం లో వ్యక్తిగత రాగద్వేషాలతో పనిలేదు. వ్యక్తిగతం గా దాడి చేయడం మాత్రం తప్పు. నేను వ్యక్తిగతం గా మీ మీద దాడి చేయలేదు. చేయను కూడా. మీరు కమ్యూనిస్టు వ్యతిరేకులని తెలుసు. అయినా మీ బ్లాగు , అందులో ఆర్టికల్స్ నేను ఫాలో అవుతానని మీకు తెలుసు. చాలా పోస్టులలో మీ అభిప్రాయాలకు మద్దతిచ్చిన విషయమూ తెలుసు.

    మానవ సంబందాలను ఇజాలు దెబ్బ తీస్తాయా ? అయితే ఏ ఇజం దెబ్బ తీసుంది ? ఎలా దెబ్బ తీసుంది? మీరు సాహిత్య అభిమానులు. సంస్కారవంతులు కూడా. అయితే ఒక ఇజాన్ని విమర్శించేముందు ఆ ఇజం ఏమి చెపుతుందో తెలుసుకుని విమర్శించడంలో, వ్యతిరేకించడంలో తప్పు లేదు. కానీ ద్వేషం తో పదే పదే దాడి చేయడం మాత్రం ముమ్మాటికీ తప్పే అవుతుంది అనేది నా అభిప్రాయం.

    కమ్యూనిజాన్నో, మార్క్సిజాన్నో అనుసరించడమో, వ్యతిరేకించడమో రెండూ తప్పు కావు. కానీ అదేమిటో తెలిసి చేయాలి రెండూ కూడా. కానీ గుడ్డిగా కొందరు వ్యక్తుల మీదనో, వారి ఆచరణ ఆధారం గానో లేదా మనకున్న కొన్ని స్వీయ మానసిక విశ్వాస ధోరణుల ఆధారం గానో చేయకూడదు.

    విశ్వాసం వేరు - సైన్స్ వేరు. సైన్స్ ని ఎవరైనా నమ్మాల్సిందే. మార్క్సిజం ఫండమెంటల్స్ లో మానవసంబంధాలు అత్యంత సహజంగా, ఎవరూ ఎవరినీ బలవంత పెట్టకుండా మరింత మానవీకరణ చెందడమే లక్ష్యం. దానిని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియాలంటే మార్క్స్ ఏమి చెప్పాడో తెలుసుకోవాలి. తెలుసుకుని అందులో ఇదిగో ఈ విషయాన్ని ఇందుకు వ్యతిరేకిస్తున్నానని వాదించడంలో తప్పు లేదు.

    ఇజాలు మనుషులను విడదీయటం అనేదానిలో సమాజం వర్గాలుగా ఎందుకు చీలింది? ఎవరు చీల్చారు? కులం - మతం - ఉన్నవాడు - లేని వాడు - దోపిడీ చేసేవాడు - దోపిడీకి గురయ్యేవాడు - స్త్రీ - పురుషుల మధ్య అణచివేత ధొరణులు - వర్ణ వివక్షత - జాతుల మధ్య వైరాలు ఎవరు సృష్టించారు?

    మార్క్సిజమే వీటిని సృష్టించిందా? వాటిని రూపుమాపేందుకు ఏమి చేయాలో, ఎలా చేయాలో మార్క్స్ ఓ మార్గం చెప్పాడు. మార్క్స్ మాత్రమే చెప్పలేదు. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. వాటన్నింటి ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో మార్క్సిజం రూపొందింది. దానిలో తప్పులుంటే దానికంటే మెరుగైనది రూపొందించుకోవాల్సిందే తప్ప , జడపదార్ధాల్లా మనుషులు ఉండడం అసాధ్యం.

    టెక్నాలజీ వల్ల ఉపయోగాలు ఉంటాయి. అది నిరంతరం అభివృద్ధి చెందుతుంది. ఎవరాపినా ఆగదు. అయితే మానవ మేధస్సుతో సృష్టించబడినదేదైనా లోకకళ్యానానికి మాత్రమే ఉపయోగపడాలి. దోపిడీకి కానీ, మనుషులను వ్యామోహపరులుగా మార్చేందుకు కానీ ఉపయోగపడకూడదు. టెక్నాలజీ మనిషికి బానిస కావాలి తప్ప , మనిషి టెక్నాలజీకి కాదని మనవి.

    మార్క్సిజం అంతర్జాతీయ వాదం ప్రసాద్ గారు. పిడివాదమో , బ్రహ్మ పదార్ధమో కాదు. కలవరపడేదీ , భయపడేదీ , వ్యామోహపడేదీ మనుషులను చీల్చేదీ ఎంతమాత్రం కాదు. గమ్మత్తేమిటంటే సర్వమానవ హితం కోరే మార్క్సిజం మనుషుల మధ్య వైషమ్యాలు సృష్టించేదిగా చూడబడడం దురదృష్టకరం.

    ఒక్కటి మాత్రం మరోసారి చెప్పదలచుకున్నాను. మార్క్సిజాన్ని అనుసరించడం - వ్యతిరేకించడం ఇవి రెండూ తప్పు కాదు. అయితే ఇవి రెండూ దానిని తెలుస్కునే చేయాలి. తెలియక అరకొరగా ఆమోదిస్తే మార్క్సిస్టు అతివాదంతో చాలా ప్రమాదం ఉంది. అందుకే అంటారు. మార్క్సిజం అర్ధమయితే శాస్త్రం - లేకుంటే ఘోర తప్పిదం అని. అలాగే కొన్ని స్వీయ మానసిక ధోరణులతో, కొన్ని విశ్వాసాలతో గిరిగీసుకుని భయంతో, కలవరపాటుతో, ఆందోళనతో మారిసిజాన్ని చూడడమూ తప్పే. అంతగా కలవరపడే లేదా వ్యామోహింపజేసే అంశాలేవీ లేవు మార్క్సిజం లో .

    ఇక డజను కాదు ఒక సైన్స్ ని ఒక్కళ్లు చెప్పినా అనుదులో నిజం ఉంటే ప్రపంచమంతా అనుసరిస్తుంది. నిజం అనేది ఏదైతో ఉన్నదో అదే తప్ప ఒకరు చెపితే నిజం నిజం కాదు. నిజం చెప్పినవారి మీద ద్వేషం తో మనం వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. సత్యమేవ జయతే.

    ReplyDelete
  7. ఇది చదవండిసార్
    http://dharmasthalam.blogspot.in/2012/01/blog-post_20.html
    హిందూ "ఇజము"కూడా ఇంపోర్టెడేనట! ఒక సిధ్ధాంతం మనకవసరమా కాదా నేది నిర్ణయించాలంటే అది మంచిదా కాదా అని చర్చించాలేకానీ అది ఇంపోర్టెడాకాదా అనికాదు. అలా గనుక మిగతా వారు చర్చించుంటే ఇక్కడినుంచీ వెళ్ళి విదేశాల్లో గొప్పపేరు సంపాదించి అక్కడివారలను భారతదేశంలోకి సేవచేయడానికి ఆహ్వానించిన, ఇక్కడి సంస్కృతిని ఈతరదేశాలకు పరిచయంచేసిన వివేకానందస్వామి సంగతి ఏమిటి? దాన్నికూడా వారు తిరస్కరించి ఉండాల్సిందంటారా?

    But import of "isms" is always bad. ఇది ఒక generalization తప్ప మరేమీకాదు. అయినా టెక్నాలజీ గుఇరించి రాసిన పోస్టులో "ఇజా"ల గురించేంటి సార్. ఆ కామెంటు మీదేనా లేక సంబంధంలేకుండా వ్యాఖ్యలు రాసే మరొక ప్రముఖ వ్యక్తిదా?

    ReplyDelete
    Replies
    1. @ Anonymous గారికి ,

      ఒక్క వివేకానంద మాత్రమే కాదు సర్ , భారతీయ కుటుంబ విలువలు - సంస్కృతి చాలా ఆచార వ్యవహారాలు - మన ఆయుర్వేదం - యోగా ఇలా చాలా విషయాలు మన దేశానికి సంబంధించిన గొప్ప విషయాలున్నాయి.

      మీరన్నట్లు మన హిందూయిజం కూడా మనది కాదు. మన హిందూయిజం ఒక మాతం గా కాక ధర్మం గా ఉండడానికి కారణం మన జీవన విధానంలో ఎక్కడి మంచినైనా కలుపుకోగల గొప్పదనమే . ప్రపంచం లో ఎక్కడాలేని గొప్ప వైవిధ్యం మన భారతీయత లో ఉంది. కానీ నేడా విలువలు ఎందుకు కోల్పోతున్నామో ఆలోచించకుండా కొందరు మేధావులు అనవసర విషయాలపై వారి అభిప్రాయాలతో రాధాంతం చేయడం బాధాకరం.

      మీరు సూచించిన లింక్ చదివి నా అభిప్రాయం చెపుతాను సర్.

      Delete
    2. రావుగారూ ఆ వ్యాఖ్య ప్రసాదుగారినుద్దేశ్యించి రాసినదేగానీ మిమ్మల్నుద్దేసించిరాసినదికాదు.

      ఇకపోతే నేనిచ్చిన లింకు కొందరు దారితప్పిన వృధ్ధులు, ఒకరమైన desperation లో పడి రాస్తున్నరాతలు. మీమీద మీరు దయతలచి వాటిని విస్మరించండి. వాళ్ళకి మతరాజ్యమూ, నిరంకుశత్వమూ ముద్దట. వాళ్ళ మతాన్ని అడ్డగోలుగా గ్రోరిఫై చేసుకొనేందుకు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ లాంటిదాన్నొకదాన్ని సమర్ధిస్తున్నారు. దాన్ని సమర్ధిస్తూ రాసిన రాతలవి. నిజంగా వీళ్ళేగనుక అధికారంలోకొస్తే వాళ్లకి బలయ్యేది ముందుగా హిందువులే! ఏలయనగా వాళ్ళ ప్రమాణాల ప్రకారం భారతదేశంలోని చాలామంది హిందువులేకాదు!

      కమ్యూనిజమైనా, హిందూయిజమైనా, మరింకోయిజమైనా లోపాలను సరిచేసి లేదా పరిహరించి వాడుకోవాలేతప్ప "పరాయిది పనికిరాదు" అనే మూర్ఖత్వాన్ని సమర్ధించను. నిజానికి నేనుకూడా కమ్యూనిజానికి వ్యతిరేకినేకానీ నాకారణలు వేరు. కొన్నాళ్లపాటు కమ్యూనిజాన్ని బలవంతంగా జనాలమీద రుద్దితేగానీ ఈ మతం మత్తు, కులం కుళ్ళు వదలవని నమ్ముతాను. మీ mail id ఇవ్వగలరా, మీతో ఒకసారి సంప్రదించాలి. నెనర్లు.

      టపాకు సంబంధంలేని సంబంధంలేని వ్యాఖ్య అనిపిస్తే క్షమించగలరు.

      Delete
    3. హిందూయిజం మనది కాదా ? చాల surprising గా ఉంది. కొంచెం వివరంగా చెప్పగాలరా.
      ఒక పోస్ట్ రాయడం ఇంకా మంచిది అని నా ఉద్దేశ్యం.

      Delete
    4. @ Anonymous గారికి ,
      భారతీయుల సంస్కృతి ద్రావిడులు నుండి ఆ తర్వాత వచ్చిన ఆర్యులు ... ఇలా ప్రతివారి రాకతో ఇక్కడున్న సంస్కృతితో పాటు కొత్తగా వచ్చిన వారి సంస్కృతిలో ఉన్న మెరుగైన అంశాల్ని ఇముడ్చుకుంటూ ఎప్పటికప్పుడు నూతనత్వం పొందుతూ వచ్చింది.

      అందుకే హిందూమతాన్ని మతం అని కూడా అనరు. హిందూ ధర్మం అంటారు. అన్ని మతాలకూ ఏదో ఒక ప్రామాణిక గ్రంధం , మతపెద్ద ఉంటారు. అలా హిందూ మతానికి లేరు. క్రిష్టియానిటీకి క్రీస్తు - బైబిలు , ముస్లిం లకు ఖురాన్ - మహ్మద్ ప్రవక్త , సిక్కు మతానికి గురునానక్ ... ఇలా ఉన్నారు . అలా హిందూ మతానికి లేరు.

      ఇది ఎప్పటికప్పుడు నూతనత్వాన్ని సంతరించుకుంటూ అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఇది భిన్నమైనది. ఈ విషయాలకు సంబంధించి నాకు పూర్తి అవగాహన లేదు. అలా తెలుసుకుని పోస్టు వ్రాసే ప్రయత్నం చేస్తాను.

      Delete
    5. Thank you very much for your explanation.
      Hope you would come up with a post.

      Delete
  8. అయినా ఏది ఇంపోర్టెడు సార్? మనందమూ ఏ సరిహద్దులు మనం గీసుకున్నవికావూ, కమ్యూనిజము పుట్టింది జర్మనీ, ఫ్రాన్సుల్లో. అప్పుడుకాకపోయినా ఒకప్పుడవి "మన"వే కదా! కాబట్టి ఇంపోర్టెడా కాదా అనే చర్చవదిలేసి పనికొస్తుందా రాదా అనే చర్చసాగించరాదుటండీ.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top