ప్రకృతి జీవన విధానం ద్వారా గ్రామీణాభివృద్ధి సాధన : జాగ్రత్తగా గమనిస్తే మనిషికి రెండే రెండు సంబంధాలున్నట్లు తెలుస్తాయి. 1) ప్రకృతితో సంబంధం 2) సాటి మనుషులతోటి సంబంధం. మనిషి ప్రక్రుతికి దగ్గరగా, ప్రక్రుతిని సంరక్షించేలా తన జీవన విధానంను అలవాట్లను మార్చుకునేలా పల్లెప్రపంచం కృషి చేస్తుంది. ప్రపంచ వ్యాపితంగా గ్రామాల కూడలి ద్వారా భారతీయ నినాదం వసుధైక కుటుంబం లా పల్లెప్రపంచం ఏర్పాటుకు కృషి చేద్దాం. వేయి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ఆరంభం అవుతుంది కదా. ప్రకృతి జీవన విధానం, ప్రకృతి వ్యవసాయం కొరకు మావంతు ప్రయత్నాలు చేస్తూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడతాం.

ముద్రణ అంతర్జాల పత్రికల ద్వారా వ్యక్తిగత చైతన్యం : మనిషికి తెలుసుకోవాలన్న ఆసక్తి అత్యంత సహజమైనది. మనిషి చైతన్యాన్ని పెంచుకోవడానికి క్యూరియాసిటీ ఓ కారణం. మనిషి మెదడుపై మంచి భావాల ప్రభావం పడితే మరింత మెరుగైన మానవవనరులు ఏర్పడతాయి. ఆ దిశగా సమాజంలో మంచి భావాలను పెంపొందించేందుకు ఆన్లైన్ మేగజైన నిర్వహించాలనేది మా సంకల్పం. ఈ బ్లాగు కూడా దానిలో భాగంగానే వాడుతున్నాము.
 
శిక్షణలు, అధ్యయనం, స్టడీ సర్కిల్స్ ద్వారా వ్యక్తి చైతన్యం : మనిషిలోని మనీషిని వెలికి తీయడానికి ఈ మూడు కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ప్రతి ఆదివారం చొప్పకట్లపాలెంలో స్టడీసర్కిల్ కార్యక్రమం నడుపుతున్నాము. దీనిని బ్లాగు ద్వార కూడా విస్తృత పరచాలని భావిస్తున్నాము. ఇప్పటిదాక నడుస్తున్న ఈ కార్యక్రమం స్థాయిని పెంచేందుకు ఒక ‘అధ్యయన కేంద్రం’ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. మనిషికి, ప్రకృతికి ఉపయోగపడే వివిధ అంశాలపై ప్రొజెక్టర్ ద్వార శిక్షణా కార్యక్రమాలను ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. యూట్యూబ్ చానల్ ని కూడా ఇందుకు ఉపయోగించాలని భావిస్తున్నాము.

సాంప్రదాయ వైద్య విధానాలపై అవగాహన, చికిత్సా కార్యక్రమాలు : తరతరాలుగా అనేక విధాలుగా ఉపయోగ పడుతున్న ప్రకృతి జీవన విధానం, యోగా, ధ్యానం, మూలికా వైద్యం, ఆక్యుపంచర్, ఆయుర్వేదం, నాడీ చికిత్స వంటి సాంప్రదాయ వైద్య విధానాలలోని అద్భుత విషయాలపై ఆయా రంగాలలో అనుభవజ్ఞుల చేత అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా మనిషి శరీరానికి ఉన్న సహజమైన రోగనిరోధక శక్తిని పెంచడానికి కృషి చేయాలనేది ఓ లక్ష్యం. పెట్టుబడిదారీ విధానంలో వైద్యం ఖరీదైన సరుకుగా మారిన నేపధ్యంలో నేటి అల్లోపతి డామినేటెడ్ సొసైటీలో ఈ రంగాలు కనుమరుగు కాకుండా కాపాడుకోవలసిన అవసరం మనందరిపైనా ఉన్నది. అల్లోపతి విదానాన్ని అత్యవసరాలకు వాడుకుంటూ ప్రతి దానికి మందులపైననే ఆధారపడకుండా అన్ని వైద్య విధానాలలోని మంచిని కాపాడుకుందాం.

మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణకు క‌ృషి : వృక్షో రక్షతి రక్షిత: అన్నది మన భారతీయ ధర్మంగా చెప్పబడుతోంది. భారతీయులకే కాదు ప్రతి మనిషికీ ప్రకృతి, పర్యావరణం మిత్రులే. వాటిని కాపాడుకోవలసిన ధర్మం మనపై ఉన్నది. చెట్లవలన అనేక ప్రయోజనాలు ఉన్న సంగతి విదితమే. మనిషి అజ్ఞానంతో చెట్లను సంరక్షించుకోవడంలో వెనుకబడుతుండడం క్షమించరాని విషయం. ప్రతి ఒక్కరి చేత చెట్లను నాటించడం ఒక సంస్కృతిగా నేర్పిద్దాం. ఎక్కడ ఖాళీ చోటు ఉన్నా ప్రయోజనకరమైన మొక్కలు నాటుదాం. ప్రతి ఫంక్షన్ కు గుర్తుగా చెట్లను నాటే మంచి సంప్రదాయాలను పెంపొందింప జేద్దాం. పల్లెప్రపంచం ద్వారా నర్సరీలను పెంచడంతోపాటు మొక్కలను విరివిగా నాటింపజేయడం, ప్రచారం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం జరుగుతుంది.

పేదరికం, మహిళాభ్యుదయంపై అవగాహన, సహాయ కార్యక్రమాలు : వనరులను పాజిటివ్ గా వినియోగించుకుంటూ పేదరికాన్ని నిర్మూలించేందుకు కృషి చేయడం ఓ కర్తవ్యంగా పెట్టుకున్నాము. దీనికి సంబంధించిన వివిధ అవకాశాలను తెలియజేయడం, మహిళా శక్తిని సమాజ నిర్మాణంలో ఉపయోగపెట్టేందుకు కృషి చేయడం మరో కర్తవ్యం. టాలెంట్ ఉండి ఆర్దిక స్తోమత లేని వారికి శక్తిమేరకు ఆర్ధిక సహకారం అందిండం ద్వారా ప్రోత్సాహం అందించవచ్చు.
 
ఉత్పాదక, మార్కెటింగ్ రంగాల ద్వారా ఉపాధి కల్పన : చక్కని ఆలోచనలు ఉన్నా ఆర్ధికవనరులు లేక అనేక మంచి ఆలోచనలు ఆచరణలోకి రావడం లేదు. ఏ పని చేయాలన్నా వ్యక్తుల సమూహం, సహకారం ఉంటే ప్రగతి ఉంటుంది. ప్రార్ధించే పెదవుల కన్నా, నీతులు చెప్పే నోటి కన్నా, సహకరించే చేతులే ఎప్పుడూ మిన్నా. సహకారం అందించాలంటే మనం ఆర్ధికంగా నిలదొక్కుకుని ఉంటేనే సాధ్యం. అందుకే మార్కెటింగ్ రంగం ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ఓ లక్ష్యంగా పెట్టుకున్నాము. 
 
పల్లెప్రపంచం ఫౌండేషన్ కార్యక్రమాలు అన్నీ ఈ బ్లాగులో ఉంచేందుకు ప్రయత్నిస్తాము. మా కార్యక్రమాలకు ఆర్ధిక, హార్ధిక సహకారం అందించాలని విజ్ఞప్తి. ఆర్ధిక సహకారం అందించాలనుకునే వారు ఏడాదికి ఒక్క రూపాయికి పైన మీ శక్తి మేరకు డొనేట్ చేయగలరు. మరింతమంది చేత డొనేట్ చేయించగలరు. ప్రతి చిన్న సహాయం మాకు చాలా విలువైనది. డొనేషన్ వివరాల లిస్ట్ కోసం ఇక్కడ నొక్కండి.
- పల్లా కొండలరావు, అధ్యక్షులు
పల్లెప్రపచం ఫౌండేషన్
 
 *Republished post

Post a Comment

  1. bagundi mee vision ...nenu elanti project prepare chestunna...mee list lo vunna anni naa list lo vunanduku naku chala santosham ga vundi....updates regular ga post cheyagalaru....

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top