నేర్చుకున్నది నేర్పితే మరింత నేర్పరితనం పెరుగుతుంది. మనం నేర్చుకున్న విషయాలు మనకు గుర్తుండాలన్నా, అవి మరింత లోతుగా అర్ధం కావాలన్నా ఆ విషయాలను ఇతరులకు నేర్పాలి. నేర్పుతుంటేనే నేర్పడం తెలుస్తుంది. మెరుగుపడుతుంది.  ఈ లోకంలో దొంగతనానికి గురికానిది పంచేకొద్దీ వన్నె పెరిగేదీ 'జ్ఞానం' మాత్రమే.

ఒక విషయం మనకు అర్ధమయినట్లే ఉంటుంది. కానీ ఇతరులకు చెప్పాలన్నా, పేపర్ పై పెట్టాలన్నా, ఇతరులతో చర్చ సందర్భంగా సమాధానం చెప్పాలన్నా మనం తడబడుతున్నామంటే దానర్ధం ఆ విషయం పై మనం పూర్తి పట్టు సాధించలేదని అర్ధం. తినగ తినగ వేము తీయనవుతుంది. అనగననగ రాగమతిశయిల్లుతుందనే వేమన చెప్పిన అనుభవపూర్వక నీతి జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. పైగా రాగం మనలో టేలెంట్ ఉన్నంత వరకే రాణించగలం . జ్ఞానం నేర్చుకున్న కొద్దీ విస్తరిస్తూ ఉంటుంది.

ఒక విషయంను మనం ఎదుటివారికి అర్ధమయ్యేలా చెప్పలేకపోతున్నామంటే ఆ విషయం మనకు పూర్తిగా అవగాహన కాలేదని గమనించాలని ఐనిస్టీన్ అంటాడు . 


మనకు తెలిసిన విషయం మనకు ఎంత తెలుసు అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది ?మొదటిది ఇతరులకు మనకు తెలిసిన విషయాలు చెప్పేటప్పుడు, రెండవది మనకు తెలిసిన విషయాన్ని ఒక ఐటెం రూపం లో వ్రాసేటప్పుడు, మూడోది ఇతరులతో చర్చలో పాల్గొన్నప్పుడు .

అయితే ఇలా చేసేటప్పుడు మన లోపం తెలుసుకోవడమంటే మనం ఆ విషయాన్ని మరింత మెరుగు పరచుకోవడమే తప్ప ఓడిపోయినట్లో, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్ష్ కు గురికావడమో, ఇతరుల ముందు తక్కువ కావడమో అనే భావానికి  గురి కాకూడదు. ఈ ప్రపంచం లో అందరికీ అన్ని విషయాలు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదనేది గుర్తు పెట్టుకోవాలి. 

మనకు తెలిసిందే సరయినదని మొండివాదన చేయకూడదు. శాస్త్రీయంగా ఒక విషయం మనకు నిర్ధారణగా తెలిసినప్పుడు ఎంతైనా వాదించేందుకు జంక కూడదు. అదే సందర్భం లో ఎదుటివారు మనకంటే మెరుగైన వాదనను ఆధారాలతో శాస్త్రీయంగా చెప్పగలిగినప్పుడు నేర్చుకునేందుకు సంశయించకూడదు. ఎవరికీ అన్ని విషయాలు తెలియవు. ఎవరికి ఏ విషయం తెలిసినా అది సమాజం నుండే అనేది నిర్వివాదాంశం. ఎప్పటికప్పుడు సమాచారం ను అప్డేట్ చేసుకోవాలి. అది సమాజానికి ఉపయోగకరమే అవుతుంది. విషయాలను మంచిగా నేర్పగలిగే ఓ ఉపాధ్యాయుడుని సమాజం పొందినట్లవుతుంది. ప్రతీదీ ఎప్పటికప్పుడు మారుతూ మెరుగవుతూ ఉంటుంది. వాటిని అప్డేట్ చేసుకోవాలన్నా ఇతరులతో చర్చించాల్సిందే. అసలు మనకు తెలిసిన విషయం ఇతరులతో చర్చించకుంటే మనం మరచిపోయే ప్రమాదమూ ఉంటుంది.

కొందరు మొండివాదన చేసేవారు - తమకు మాత్రమే విషయాలు బాగా అర్ధమవుతాయనుకునే వారూ - ఎదుటివారు చెప్పేది వినని వారు - ఇతరులపైనా , కొన్ని విషయాలపైనా మూర్ఖంగా గుడ్డి వ్యతిరేకత పెంచుకున్న వాళ్లు ఉంటారు. వారితో చర్చించడం వల్ల ఉపయోగముండదు. కావాలని అలా ప్రవర్తించే వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వారితో చర్చ సమయాన్ని వృధా + మనం డిస్టర్బ్ కావడం జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నించినా వీళ్లు మారరు అనే నిర్ధారణకు వచ్చిన వారికి దూరంగా ఉండడం వల్ల ఆ సమయంతో మరికొన్ని ప్రయొజనకరమైన పనులు చేపట్టవచ్చు.

చర్చ సందర్భంగా లేదా ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు గుడ్డిగా అనుసరించకూడదు. దానికో శాస్త్రీయ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. తెలుసుకున్నది నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్నది నిరంతర చర్చల ద్వారా మరింత అవగాహన చేసుకుంటే ఇతరులకు మరింత తేలికగా చెప్పేందుకు వీలవుతుంది.

మొత్తం మీద మనం నిరంతరం నేర్చుకోవాలి. నిరంతరం విద్యార్ధిగానే ఉండాలి. అప్పుడే మంచి ఉపాధ్యాయుడిగా - వక్తగా  - రచయితగా మారే అవకాశం ఉంది. అలా చేయడమంటే సమాజానికి మేలు చేయడమే అవుతుంది. ఎందుకంటే మంచి భావాలు ఎంతగా వ్యాపిస్తే  సమాజంలో పౌరులు అంత మంచిగా తయారవుతారు. మరింత మెరుగ్గా మానవత్వపు విలువలు పరిఢవిల్లుతాయి.
- Palla Kondala Rao,
20-11-2013. 

Post a Comment

  1. అక్షర లక్షలు విలువ జేసే వ్యాసం కొండల రావు గారు.

    ReplyDelete
  2. "మనం నిరంతరం నేర్చుకోవాలి. నిరంతరం విద్యార్ధిగానే ఉండాలి. అప్పుడే మంచి ఉపాధ్యాయుడిగా - వక్తగా - రచయితగా మారే అవకాశం ఉంది"

    Excellent observation.

    పునర్ముద్రించిన ఈ పాత టపాలోని వాక్యం మొన్ననే వేరే టపాలో మనిద్దరి మధ్య సంభాషణకు దాదాపు అద్దం పట్టడం కాకతాళీయం, సంతోషకరం!

    ReplyDelete
    Replies
    1. >>మనం నిరంతరం నేర్చుకోవాలి. నిరంతరం విద్యార్ధిగానే ఉండాలి. అప్పుడే మంచి ఉపాధ్యాయుడిగా - వక్తగా - రచయితగా మారే అవకాశం ఉంది.>>

      బ్రాహ్మణుడు అని అనకూడదు, బాపనోడు అని అనాలి అని నేర్పే ఉపాధ్యాయులను ఏం చేయాలి ?

      Delete
    2. >> బ్రాహ్మణుడు అని అనకూడదు, బాపనోడు అని అనాలి అని నేర్పే ఉపాధ్యాయులను ఏం చేయాలి ?
      ఆ ప్రశ్నకు జవాబు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అలా నేర్పేవారు 1.అధికారం కలవారి రాజకీయం అండగా కలవారైతే మిన్నకుండాలి(తప్పదు) 2. వారు ప్రతిపక్షం రాజకీయులు ఐతే చీల్చి చెండాడాలి (మీకు అధికారపార్టీవారు కొమ్ముకాస్తారు లెండి) 3. వారు మేధావివర్గం వారైతే చేతనైతే మీరు కూడా మీడియాలో మీ అభిప్రాయాలతో టపాలూ, కవిత్వాలూ, వ్యాసాలు, ఉపన్యాసాలూ దంచాలి (నోరున్న వారిదే గెలుపు - అది మీది కూడా కావచ్చును) 4. సామాన్యులైతే మీకు వారిని సమర్ధించటం లాభమా విమర్శించటం లాభమా అన్న దానిని బట్టి చేతనైతే మీరు కూడా ఒక ముక్క విసరొచ్చును. (ఆట్టే ఇబ్బందులుండవు. మహా ఐతే ఒక నాలుగు అని మరొక నాలుగు ముక్కలు పడవలసి రావచ్చు. అంతే).

      Delete
    3. మీరు రాసిన ఈ కామెంట్లో మీరు కమ్మవారిని అసమంజసమైన కారణాలతో ఏలియనేట్ చేస్తున్నట్టుంది కాని, వాళ్ళని సమంజసమైన కారణాలతో కలుపుకునే ప్రయత్నం కనబడలేదు.

      హిందువులైన చంద్రబాబు కానీ, లోకేష్ గానీ బ్రాహ్మణులని ఎలా అగౌరవ పరచారో చెప్తారా? మొదటిసారి బ్రాహ్మణ కార్పొరేషన్ పెట్టి ప్రభుత్వం ద్వారా ఎంతో మంది పేద బ్రాహ్మణులకి సాయం అందించారు కదా? ఎలెక్ష్న్లప్పుడు పండితుల చుట్టూ తిరిగి నదుల్లో మునిగి, అధికారంలోకి వచ్చాక ఏంచేసాడు జగన్? గౌరవంగా కార్పోరేషన్ని పక్కన పెట్టేసాడు అంతే కదా? అదే సమయంలో చర్చిల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకపోయనా పాస్టర్లకి జీతాలిచ్చి మొత్తం సమాజాన్నే పీడిస్తున్నవాడు బ్రాహ్మణులని ఎలా గౌరవిస్తున్నట్టు? ఇంటిలో ఎవాంజెలిస్ట్ని పెట్టుకుని క్రిస్టియన్ల జనాభా గత దశబ్ధంలో విపరీతంగా పెరగడానికి కారణమయి అర్చకుల కి హిందూ సమాజంలో కొంత భాగాన్ని శాశ్వతంగా దూరం చేస్తున్న కుటుంబం. ఇప్పుడు బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ఏమీ చేయకపోయినా వారి పట్ల గౌరవాన్ని ప్రకటించడం, నాలాంటి వాళ్ళకి తలగోక్కున్నా అర్ధం కాదు. కొన్ని ప్రభుత్వ బడుల్లో చంద్రబాబు ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టినప్పుడు గోల చేసిన సమాజం, ఇప్పుడు జగన్ అన్ని బడుల్లో సదుపాయాలు లేకుండా ప్రవేశపెడుతుంటే ఆ స్థాయిలో విమర్శేది? అసలు తెలుగు మీడియమే లేకపోతే మొదట నష్టపోయేది ఎవరు?


      సినెమాల్లో కామెడీని టోకుగా కులానికి పూసుకోవడం, దాన్ని ఆధారంగా ఇంకో కులాన్ని ద్వేషించడం చాలా ఎబ్బెట్టుగా ఉంది. తెలుగు సినెమా పుట్టినప్పటి నుండి రచయితలు, కవుల్లో 80 శాతం బ్రాహ్మణులే కదా? 50 శాతం సినెమాలు కమ్మవాళ్ళు నిర్మించి ఉంటారేమో. పనిగట్టుకుని బ్రాహ్మణుల మీద కామెడీ రాయమని ఆ నిర్మాతలు, హీరోలు కంకణంకట్టుకున్నట్టు చెప్తారేమి? మీఉద్దేశంలో ఆ రచయితలు నరం లేని, స్వాభిమానంలేని స్వామి భక్తి పరాయణులనా? ఈ తరంలో కోన వెంకట్, హరీష్ శంకర్ లాంటి వాళ్ళు ఎవరడిగితే కామెడీ చేస్తున్నారు? వాళ్ళు విపరీతంగా వాళ్ళ సినెమాలకి కామెడి చేసి మైకు ముందుకొచ్చి ప్రవర చెప్తే ఫరవాలేదా?

      ఇక ఆధిపత్యం చూపే వాళ్ళూ అభిజాత్యం చూపే వాళ్ళు అన్ని అగ్రకులాల్లో ఉంటారు కదా? బెజవాడలో జరిగే విషయాలకి చేసే హడావుడి కర్నూలు జరిగే విషయాలకి జరగదు. అలానే అమలాపురానికీ అంతే హడావుడి చెయ్యరు. రెండు వందలేళ్ళుగా బెజవాడ అనేక రంగాలకి మార్పులకి కేంద్రంగా ఉండటం వల్ల ఇప్పటికీ మీడియా అక్కడ ఫోకస్ చేసినట్టు కర్నూలు మీద తూగో మీద పెట్టదు.

      విచిత్రం ఏంటంటే సగటు తెలంగాణ వ్యక్తికి రాయలసీమ వ్యక్తికి ఉత్తారంధ్ర వ్యక్తికి దైనందిన జీవితంలో తారసపడని కోస్తా కమ్మ వారిని బూచిగా చూపి అక్కడ పారంపరిక ఆధిపత్య కులాలు అక్కడ ఇతర వర్గాలని రెచ్చగొట్టి అధికారం నిలుపుకునే క్రతవు నిరంతరం జరుగుతూనే ఉంది గత ౩ దశాబ్ధాలుగా.. తెలంగాణ విడిపోయింది, ఆ విషబీజాలు ఇంకా విజయవంతంగా సీమలోనూ ఇప్పుడు కొత్తగా ఉత్తరాంధ్రలోనూ నాటుతూనే ఉన్నారు. మీలాంటి వారు అగ్నికి ఆజ్యంపోస్తూ సమిధలవుతూనే ఉంటారు. జనాన్ని ఎంతగా రెచ్చగొడుతున్నారంటే వారి వెనకబాటుకు వారు ఎన్నుకున్న నాయకులు కారణం కాదు ఇంకెవరో అని నమ్మేంత. ఇక్కడ రెడ్లని ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను. కమ్మ వారు ఎక్కువగా ఉన్న తూగో నుండి ప్రకాశం వరకూ జిల్లాల్లో ఉన్న సామాజిక సమతుల్యత, అధికారంలో భాగస్వామ్యం రెడ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఎందుకు కనపడదు? ధర్మ ప్రభువులు అనకండి. కరడుగట్టిన (one-upmanship) ఆధిపత్యాన్ని చూపుతున్నది ఎవరు?

      Delete
    4. GKK గారూ, వ్యావహారిక బాష కాస్త ఎక్కువయిందంతే తప్ప నాకు ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశ్యం లేదు. Just being an "equal opportunity offender"!

      నిజానికి నూటికి తొంభయ్ తొమ్మిది శాతం ఆంధ్రులకు తమ కులంపై అభిమానం ఉందేమో కానీ ఇతరోళ్ల మీద ద్వేషం లేదు. ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. దురదృష్టమంతా ఏమిటంటే కులగజ్జి ఉన్న అత్యంత కొద్ది మంది సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో లేదా రంగాలలో ఉన్నారు. ఇటువంటి వారిలో పలువురు ఆంధ్రకు దూరంగా ఉంటూ క్షేత్రస్థాయి అవగాహన కోల్పోయి ఊహాజనిత లోకంలో విహరించడం ఇంకా బాధాకరం.

      Delete
    5. అలవాటులో పొరపాటు సహజం. సరిచేసుకోవడం నిరంతర ప్రాసెస్. కొద్దిమందిలోనే కులగజ్జి ఉన్నదన్నది నిజం.

      Delete
    6. కొండలరావు గారూ,

      అలవాటులో పొరపాటా ? విన్నకోటవారు అభ్యంతరం చెప్పాక నేను ఎదిరించి ఎపుడూ వ్రాయలేదు. ఆయన అభ్యంతరం చెప్పాక కూడా గొట్టిముక్కల ...బ్యాచ్ అని వ్రాస్తే మీరు డెలిట్ చేయకుండా సమర్ధించుకువస్తున్నారు.

      బ్రాహ్మణులను కించపరచినందుకుగాను అగ్రిగ్రేటర్ నుండి నన్ను బహిష్కరించారు. మీరు శిక్ష నుండి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను.

      Delete
    7. ప్రస్తుత వ్యాఖ్య కేవలం భరద్వాజ్ గారి కోసం.

      I respectfully submit the phrase "పిలక బాచీ" is tongue-in-cheek only even if considered politically incorrect. I do not have any intention of maligning any individual.

      As a responsible netizen, I will abide by any decision you make on this even if I disagree.

      Delete
    8. దారినపోయే దానయ్యలందరినీ పట్టించుకోవడం ఆగ్రిగ్రేటర్ల పనికాదు. సదరుబ్లాగులో వ్రాసే కంటెంట్ పైనేకాదు వ్యాఖ్యలపైనా బ్లాగరుదే బాధ్యత.

      Delete
    9. < కొండలరావు గారూ,

      అలవాటులో పొరపాటా ? విన్నకోటవారు అభ్యంతరం చెప్పాక నేను ఎదిరించి ఎపుడూ వ్రాయలేదు. ఆయన అభ్యంతరం చెప్పాక కూడా గొట్టిముక్కల ...బ్యాచ్ అని వ్రాస్తే మీరు డెలిట్ చేయకుండా సమర్ధించుకువస్తున్నారు.

      బ్రాహ్మణులను కించపరచినందుకుగాను అగ్రిగ్రేటర్ నుండి నన్ను బహిష్కరించారు. మీరు శిక్ష నుండి ఎలా తప్పించుకుంటారో నేను చూస్తాను. >

      నీహారిక గారు, మీరు నన్ను శపించకూడదండీ. ఎందుకంటే నేను కేవలం ఈ బ్లాగులో వ్యాఖ్యలకు పరిమితమై వ్యాఖ్యలు చేశాను. మిగతా ఎక్కడ ఏమి జరిగింది నేను చూడలేదు. సమయం కూడా లేదు.

      జై గారు వివరణ చూశాక నేను చేసిన కమెంట్ మరోసారి పరిశీలించాను. సరిపోతుందనే అనిపిస్టూంది.

      ఉద్దేశపూర్వకం, సవరించుకోననడం అయితే ఖచ్చితంగా నేరం. అలవాటులో పొరపాటు అయితే వేరుగా చూడాలి. ఉదాహరణకు ఇప్పటికీ కొన్ని చోట్ల చాకలి అనే పదం ప్రత్యామ్నయం తెలియని వారు సదుద్దేశంతో వాడాల్సి రావడం చూస్తున్నాను.

      నా అభిప్రాయంః ఎవరూ ఎవరిని అక్కసుతోనో, సమాధానం చెప్పలేని స్థితిలో ఆక్రోషంతోనో, ఈర్ష్యతోనో కావాలని ఏ రకంగా దూషించినా తప్పేనండీ. అలవాటులో పొరపాటుగా అయితే క్షమించాలి. నేనూ అలా పొరపాటు చేస్తుండడం నేను గమనించాను. దీనిని ఇంతటితో (ఈ బ్లాగులో) ముగిద్దాం అని మనవి. లేదా ఈ విషయాన్ని ఓ సబ్జెక్టుగా తీసుకుని చర్చించడం చేయడం బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను.

      Delete
    10. As a responsible netizen, I will abide by any decision you make on this even if I disagree.

      If you are responsible netizen then say sorry to entire Brahmin Community.

      Delete
    11. కొండలరావుగారు,
      మీరు తక్షణం ఆ వ్యాఖ్య డెలిట్ చేయగలరని ఆశిస్తాను.

      బ్లాగర్లలో పునరుత్సాహం తీసుకురావడానికి ఏమి చేయాలి? అని అడిగారు.

      బ్లాగర్లు,ఆగ్రిగ్రేటర్లు బాధ్యతాయుతంగా ఉండాలి.

      Delete
    12. >>> కమ్మ వారు ఎంతో entrepreneurship leadership లక్షణాలు ఉండి ఇలా కులాధిపత్య చట్రం లో ఇరుక్కుపోయారు అర్థం కాదు.>>>

      ఈ మాట స్వయానా లోకేష్ ఒప్పుకుని మొత్తుకున్నారు. తనకులం గురించి అంత బోల్డ్ గా మాట్లాడిన (రాజకీయ నాయకుల)కొడుకులెవరైనా ఉన్నారా ?

      Delete
    13. @Jai GottimukkalaMarch 24, 2020 at 8:35:00 AM GMT+5:30
      దురదృష్టమంతా ఏమిటంటే కులగజ్జి ఉన్న అత్యంత కొద్ది మంది సమాజాన్ని ప్రభావితం చేసే స్థాయిలో లేదా రంగాలలో ఉన్నారు. ఇటువంటి వారిలో పలువురు ఆంధ్రకు దూరంగా ఉంటూ క్షేత్రస్థాయి అవగాహన కోల్పోయి ఊహాజనిత లోకంలో విహరించడం ఇంకా బాధాకరం.
      hari.S.babu
      నేను ఇతరులతో వాదించడానికి కొన్ని పద్ధతులు పెట్టుకున్నాను.నాకు నేను అసబ్య పదాలను వాదను.ఇతరులు వాడితే సహించను.నీహారిక లాంటి వాళ్ళు వాటికి అభ్యంతరం తెలిపడంలో పట్టుదల చూపిస్తారు. కానీ, నేను మాత్రం మూర్ఖులకి మూర్ఖ పద్ధతిలో చెప్తేనే ఎక్కుతుంది కాబట్టి ఒకసారి ఎదటివాడు అసభ్య పదాలు వాడినప్పుడు నేనూ రెచ్చిపోతాను.
      నీ పద్ధతి నాకు తెల్సుసు.నీ నీచత్వం కూడా తెలుసు.సభ్యతాయుతమైన భాషలో విషం కక్కడం వల్ల నీకు నువ్వు నేను గౌర్వప్రదమయిన వ్యక్తిని అనుకుంటూ ఉంటే దాన్ని బద్దలు కొట్టడం నాకు యమాహాహా సరదా!

      ఆఖరి వాక్యం నన్ను గురించే కదూ వాడింది.ముసుగులో గుద్దులాట దేనికి?నేను నీలా కాదు.ముఖం మీదనే అంటాను.బూతుమాట వాడినా సరే దానికి పక్కా రీజన్ ఉంటుంది.కయ్యానికి గానీ వియ్యానికి గానీ సమవుజ్జీ కావాలి.పాండిత్యంలో గానీ జ్ఞానంలో గానీ విశ్లేషణలో గానీ నువ్వు నా కాలిగోటికి కూడా తూగవు - సూటిగా నాతో ఎన్నడూ వాదనలో దిగకుండా సేఫ్ సైడ్ చూసుకుంటూ గడిపేస్తున్నావు, అట్లానే వుండిపో, అన్యాపదేశపు తెలివితక్కువ స్టేట్మెంట్లతో అనవసరమైన అతితెలివి చూపిస్తే బల్బు పగిలిపోద్ది!

      చెప్పేవి పచ్చి అబద్ధాలు, పైన నిజాలు చెప్తున్నట్టు దొంగవేషాలు.నాలాంటివాడు నిజాలు బయటపెట్టేవరకే నీలాంటివాళ్ళ విరగబాటు.అన్ని వేషాలూ చింపడానికే నేను పుట్టాను - ఖబడ్దార్!

      Delete
    14. నీహారిక గారు, హిందీలో బనియా (వైశ్య) అనేది కూడా తిట్టుతో సమానమే. అరవింద్ కేజ్రీవాల్‌ని కూడా ఎవరూ వైశ్య అనరు, బనియా అంటారు.

      Delete
    15. వైశ్య అనే పదానికి తెలుగులో కోమటి ఎలాగో, హిందీలో బనియా అలాగ. ఇందులో తిట్టు ఏమీ లేదు.

      Delete
    16. "యహ్ సర్కార్ హై, యా బనియా కా దుకాన్?" అనే వాక్యం ఉపయోగించినందుకు అన్నా హజారేపై అగర్వాల్ మహా సభవాళ్ళు పోలీస్ స్టేషన్‌లో ఎఫ్.ఐ.ఆర్. ఇచ్చారు.

      Delete
  3. >>>మనకు తెలిసిందే సరయినదని మొండివాదన చేయకూడదు. శాస్త్రీయంగా ఒక విషయం మనకు నిర్ధారణగా తెలిసినప్పుడు ఎంతైనా వాదించేందుకు జంక కూడదు. అదే సందర్భం లో ఎదుటివారు మనకంటే మెరుగైన వాదనను ఆధారాలతో శాస్త్రీయంగా చెప్పగలిగినప్పుడు నేర్చుకునేందుకు సంశయించకూడదు.>>>

    కొంతమంది బ్లాగర్లు, జైలులో ఉండి వచ్చిన వెధవలనే మంచివాడు అని మమ్మల్ని నమ్మమంటారు. ఎలా నమ్మేది ?

    ReplyDelete
    Replies
    1. జైలుకి వెళ్లి వస్తే వెధవ అవుతాడా? జైలుకు వెళ్లే వారంతా వెధవలా? ఈ విషయం లో మీరేమనుకుంటున్నారండీ.

      Delete
    2. శారీరిక నేరం చేసిన నిర్భయ నిందితులకు ఉరిశిక్ష వేస్తే ఆర్ధిక నేరం చేసిన వెధవలకీ, వారిని సమర్ధించిన వెధవలకీ ఉరిశిక్షే వేయాలి.

      Delete
    3. // “ జైలుకి వెళ్లి వస్తే వెధవ అవుతాడా? జైలుకు వెళ్లే వారంతా వెధవలా? ఈ విషయం లో మీరేమనుకుంటున్నారండీ.” //

      గాంధీ, నెహ్రూ తదితరులు జైలుకు వెళ్ళినప్పటి కాలం / కారణాలు ఇప్పుడు లేవండి. ఈ కాలంలో జైలుకు వెళ్ళేవారి (ముఖ్యంగా ఆర్థికనేరాలు చేసిన వారి) గురించి
      నీహారిక గారి అభిప్రాయంతో నేనూ ఏకీభవిస్తాను,

      Delete
    4. // “ దీనిని ఇంతటితో (ఈ బ్లాగులో) ముగిద్దాం అని మనవి.” // అని కొండలరావు గారు పైన చెప్పినది బాగానే ఉంది. అయితే ఈ అంశాన్ని మొదట లేవనెత్తింది నేను గాబట్టి నా మాట కూడా ఒక ముక్క చెప్పదలుచుకున్నాను.

      ఫలానా రకంగా పలకడం హేళనగా అనిపిస్తుంది అని నేను అన్నదాని భావం ఆ పిలుపు / పలుకు యొక్క ధ్వని గురించి అని. వినడానికి చెవులకింపుగా ఉండదు అని. దాని మూలంగా హేళన లాగా ధ్వనిస్తుంది అని. వ్యాకరణ పరంగా అంతా కరక్టే అయ్యుండవచ్చు కాదనడం లేదు, కానీ వ్యావహారికంగా వాడినప్పుడు శ్రవణపేయంగా ఉందా లేదా అన్నది కూడా అంతే ముఖ్యం. మరి ఇదే వాదనతో ఇతర కులాల వారినుద్దేశించి అలాగే అంటారా? ఉదాహరణకు ... కాపోళ్ళు అంటారా, రాజులోళ్ళు అంటారా (నేనయితే వినలేదు)? నన్నడిగితే “ఓళ్ళు” అని అంతమయ్యే ఏ కులాల బహువచనం అయినా .. వ్యాకరణం ఒప్పుకోవచ్చునేమో గానీ .. వినసొంపుగా ఉండదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. జై గారన్న “దూదేకులోళ్ళు” కూడా అంతే (అసలా ఉదాహరణ నేను తీసుకురాలేదు). అసలలా పలికేవారి ఉద్దేశంలో (ఇక్కడి చర్చలో “బాపనోళ్ళు” అనే పదం) హేళన లేదని అలా పలికేవారు ఘంటాపథంగా చెప్పగలరా?

      ఈ ఉన్నది చాలదన్నట్లు జై గారు ఏదో ” ..... బాచ్” అంటూ వచ్చారు. దాన్ని హేళన కాక మరేమంటారో? అసలీ కాలంలో ఆ .......... ఎవరు పెట్టుకుంటున్నారండీ? కాబట్టి అలా పిలవడం పురాతనకాలం నాటి hsngover. ఇంకా దాన్నే పట్టుకుని వేళ్ళాడతామంటే హర్షణీయం అవదు.

      ఈ విషయం (“బాపనోళ్ళు”) మీద గతంలోనే నా అభ్యంతరం వెలిబుచ్చిన తరువాత నీహారిక గారు అలా అనడం మానేశారు. అది వారి సంస్కారం, నేను మెచ్చుకుంటాను.

      Delete
    5. Thank you Vinnakota sir & Palla sir.

      కొండలరావు గారు చెప్పిన విధంగా ప్రస్తుతానికి ఇంకేమీ రాయడం లేదు. ఇంకెప్పుడయినా చర్చకు వస్తే అప్పుడు నా అభిప్రాయాలు రాస్తాను.

      Delete
    6. ధన్యవాదములు జై గారు. మీ అభిప్రాయం అర్ధమయింది.

      Delete
  4. కొందరు మొండివాదన చేసేవారు - తమకు మాత్రమే విషయాలు బాగా అర్ధమవుతాయనుకునే వారూ - ఎదుటివారు చెప్పేది వినని వారు - ఇతరులపైనా , కొన్ని విషయాలపైనా మూర్ఖంగా గుడ్డి వ్యతిరేకత పెంచుకున్న వాళ్లు ఉంటారు. వారితో చర్చించడం వల్ల ఉపయోగముండదు. కావాలని అలా ప్రవర్తించే వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వారితో చర్చ సమయాన్ని వృధా + మనం డిస్టర్బ్ కావడం జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నించినా వీళ్లు మారరు అనే నిర్ధారణకు వచ్చిన వారికి దూరంగా ఉండడం వల్ల ఆ సమయంతో మరికొన్ని ప్రయొజనకరమైన పనులు చేపట్టవచ్చు.

    ----- ఇప్పుడు బ్లాగుల్లో జరిగే వాద వివాదాలనూ ,
    ఎలా అధిగమించాలో చక్కటి పరిష్కారాన్నీ సూచించారు . కృతఙ్ఞతలు .

    ReplyDelete
  5. @unknown- మీరు అభిప్రాయం మీ దృక్కోణం లో సరైనదే కావచ్చు. నేను గౌరవిస్తాను. జై గారు, కొండల రావు గారు agree with you. Your opinion is right.

    ReplyDelete
    Replies
    1. ఒకడు అవినీతిపరుడని తెలిసి కూడా అభిమానించడమే నీచత్వం అయితే ఆ అవినీతిపరుణ్ణి విమర్శించడమే పాపం అయినట్టు "ధూ..వాళ్ళ బతుకులు చెడ!" అని నోటికి వచ్చిన బూతులు పేలేవాడు తనకి మాత్రమే సభ్యతా సంస్కారాలు ఉన్నట్టు పోజులు కొడితే దేవుడు క్షమించడు GK(less)K! గారూ!

      పైన మీలాంటి అబద్ధాల కోర్లు నిజాలు మాట్లాడుతున్న నన్నూ నీహారికనూ క్వారంటైనులో ఉండమని ఉచితబోడిసలహాలు ఇస్తే వినటానికి బాగుండదు, అస్సలు బాగుండదు.

      వేదమంత్రాలతో ప్రారంభమైన అమరావతిని ద్వేషిస్తూ ఉంటే నలభయ్యేళ్ళు ఆగనక్కర లేదు - ఆంధ్ర ప్రజానీకం అందరూ మీలా ఉంటే అయిదేళ్ళ తర్వాత ఆంధ్రలో ఒక్క నికార్సైన హిందువు కూడా ఉండడు.అనుమానం ఉంటే స్టాంప్ పేపరు మీద రాసిస్తా - బస్తీ మే సవాల్.

      మీరు ఏ హిందూమతం గురించి కొంతకాలం తర్వాత ఎలా వుంతుందో అని బెంగపెట్టుకుంటున్నారో ఆ హిందూమతం ఆచంద్రతారార్కం నిలబడే ఉంటుంది. ఎందుకంటే, అది నిలబడిన పునాది ఇది:
      ప్రియం బ్రూయాత్ సత్యం బ్రూయాత్
      న బ్రూయాత్ సత్య మప్రియం
      ప్రియం చ నానృతం బ్రూయాత్
      ఏష ధర్మః సనాతనః
      ఆ పునాది మీద నిలబడ్డాను గనకనే నా మాటలో అంత ధాటి ఉంటుంది. మరి మీరు నిలబడిన పునాది ఏది?

      Delete
  6. జై గారు,

    // . Just being an "equal opportunity offender"! //

    అది మీకు ఇష్టమైన వ్యాపకంలాగా ఉందే?
    —————————-

    // “నిజానికి నూటికి తొంభయ్ తొమ్మిది శాతం ఆంధ్రులకు తమ కులంపై అభిమానం ఉందేమో కానీ ఇతరోళ్ల మీద ద్వేషం లేదు.” //

    ఆంధ్రుల మీద విసురు విసరడానికి ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరనుకుంటాను మీరు. కులాభిమానం ఉండడం ఒక ప్రాంతం వారి జన్మహక్కేమీ కాదండి. హిందీ సినిమా రంగమంతా ఒకప్పుడు కపూర్ల పంజాబీ సామ్రాజ్యం కాదా, ఈనాడు ఖాన్ ల ఏలుబడి కాదా ?

    ReplyDelete
    Replies
    1. విన్నకోట వారూ, నా అంచనా ప్రకారం ఆ 99% దేశంలో అనేక ఇతర రాష్ట్రాలకు కూడా వర్తిస్తుంది. బీహార్ లాంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే కుల జాడ్యం కాస్త విస్తృతం.

      టపా చర్చ ఆంధ్రుల గురించి కనుక ఇతరోళ్ల ప్రస్తావన తేలేదు. అదీ రాసుంటే బీహారీయులను కించపరిచానని ఎందరు నిందించేవారో ఏమో?

      నేను కులాభిమానం ఉండడం తప్పనలేదు పైగా "ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు" అన్నాను.

      నేను ఆంధ్రులను మెచ్చకున్నన్నాని స్పష్టంగానే ఉందేమో మళ్ళీ (కంటద్దాలు వేసుకొని ఉంటే వాటిని తీసేసి) చదవండి.

      PS: జాతీయ సినిమా హీరోల అభిమానులెవరూ కులాల వారీగా విడిపోయినట్టులేదు (ఉ. కాలేజీలో రాగింగ్ సమయంలో "ఏరా మనోడివి బైకుపై ఎగస్పార్టీ హీరో స్టికర్ పెట్టావేమిటి?")

      Delete
  7. జై గొట్టిముక్కల కేవల ఆంధ్ర ద్వేషి అని గానీ కమ్మకులద్వేషి అని గానీ అంటే నేను ఒప్పుకోను.ఆయన చంద్రబాబు ద్వేషి.చంద్రబాబు రెడ్డి కులంలో పుట్టి వుంటే రెడ్డి కులాన్ని ద్వేషించేవాడు. వెలమ కులంలో పుట్టి వుంటే వెలమ కులాన్ని దవెర్షించేఅవడు.

    నేను చూసినంతవరకు డార్క్ నైట్ సినిమాలో జోకర్ పాత్ర ఇతని నీచత్వాన్ని అచ్చు గుద్దినట్టు చూపిస్తుంది.ఇతను చంద్రబాబుని ద్వేషించడానికి సహేతుకమైన ఒక్క కారణం చూపించమనండి - నేను ఇంకెప్పుడూ ప్రజ దగ్గిరకి రాను, but I challenge he didn’t have a reason to hate CBN!

    చంద్రబాబు చొరవ తీసుకుని వేసిన ఆర్ధిక పునాదుల వల్లనే ఇప్పటికీ మొత్తం తెలంగాణ ఆదాయంలో 60% ఆదాయం ఒక్క హైదరాబాదు నగరం నుంచే వస్తున్నది.అది అందరికన్న ఎక్కువ రాజశేఖర రెడ్డికి తెలుసు.రాజశేఖర రెడ్డి జగనులా ఆలోచించి ఉంటే హైటెక్ సిటీని కూల్చేసి ఉండేవాడు.అప్పుడు తెలిసేది ఈ గొట్టాంగాళ్ళకి హైటెక్ సిటీ ఉండటానికీ లేకపోవటానికీ తేడా యేంటో!కానీ దాన్ని అలాగే ఉంచి తను దానిమీద అదనంగా ఏం చేస్తే మంచిపేరు వస్తుందో అది చేశాడు - ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాడు! కేసీయారుకి హైదరాబాదు కోసం కొత్తగా ఏమీ చెయ్యాల్సిన అవసరం లేకుండా హాయిగా గడిచిపోవటం ఆ ఇద్దరూ హైదరాబాదుని ఆ స్థాయికి పెంచడం వల్లనే జరిగింది.

    జై గొట్టిముక్కల ద్వేషానికి పాత్రుడు కావాలంటే ఉండాల్సిన ఆర్హత: పరిపాలనా దక్షత ఉండి అంతర్జాతీయ ద్రవ్యనిధికి రాష్ట్రప్రభుత్వం చేసే నిర్మాణాత్మకమైన పనులకి అప్పులివ్వొద్దని ఉత్తరాలు రాస్తూ గ్రీన్ ట్రిబ్యునలుకి కంప్లైంట్లు చేస్తూ అడుగడుగునా అడ్డుపడే ప్రతిపక్షం ఉన్నప్పటికీ రెండంకెల గ్రోత్ రేట్ చూపించి 30 రాష్ట్రాల అభివృద్ధి కలిసిన దేశపు గ్రోత్ రేటును 3 శాతం మేరకు పెంచగలిగి వుండటం.అట్లాగే జై అభిమానానికి పాత్రుడు కావాలంటే కేసీయార్ జగన్ తరహాలో అవినీతికి పెద్దపీట వేసి అతను పరిపాలించే రాష్ట్రాన్ని అప్పులకుప్ప కింద మార్చాలి!

    ఏనాడైనా కేసీయార్ గురించి ఒక్క విమర్శనాతమకమైన కామెంటును జై వెయ్యగా మీరు చూశారా?వెయ్యడు!ఎందుకంటే, డార్క్ నైట్ జోకరు మనస్తత్వం ఎవరిలో ఉన్నా సరే జగన్ని అభిమానించి చంద్రబాబుని ద్వేషిస్తారు - ఇది అక్షర సత్యం!

    తనది సభ్యతాయుతమైన భాష అని చెప్పుకుంటూనే "పిలక బ్యాచీ", "పచ్చ పార్టీ", "పచ్చ జ్యోతి","బాబోరు" అని విషం కక్కుతాడు - మళ్ళీ అదే నోటితో just being an "equal opportunity offender" అని డబ్బా కొట్టుకోనూ గలడు.Telling lies in a decent language is not called decency - just cunnuning ness!

    ఇతనే కాదు, GKK కూడా సుద్దపూస కాదు. తన పాటికి తను "పచ్చ భూతాలకు చెప్పుతో కొట్టినట్టు అయింది. ఇంకా ఎన్ని పచ్చ కోవర్తులు ఉన్నాయో తెలియదు. థూ మీ బతుకులు చెడ." అని తనకు నచ్చని వాళ్ళ పట్ల లఫంగా భాష వాడుతూ "భ్రమరావతి, ఆపిల్ వాచీలు, గ్రాఫిక్స్ ఇవన్నీ తిట్లు కాదా ఇవి తిట్లు కాదు వ్యంగ్యాత్మక విమర్శలు మాత్రమే." అని తమ ఏకపక్షపు ఏడుపు పదాలకి సర్టిఫికెట్ ఇచ్చేసుకోగల్డు.

    చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు.వీళ్ళలాంటివాళ్ళు బ్లాగుల్లో self quarantine చేసుకుంటే మంచిది.😷

    ReplyDelete
  8. కొండల రావు గారికి,
    ఇక్కడ నేను వరెసిన రెండు కామెంట్లలో కొందరు వ్యక్తుల పేర్లను ఉదహరించి కొన్ని వివాదాస్పదమైన అభిప్రాయాలను ప్రకటించాను.అవి వ్యక్తీగత ద్వేషంతో వేసినట్టు భావించే అవకాశం ఉంది గనక మీకు విడమరిచి చెప్తున్నాను. వాళ్ళిద్దరూ చేస్తున్న తప్పుల్ని మాత్రమే ఎత్తి చూపిస్తున్నాను.ఉదాహరణకి "ఇతను చంద్రబాబుని ద్వేషించడానికి సహేతుకమైన ఒక్క కారణం చూపించమనండి - నేను ఇంకెప్పుడూ ప్రజ దగ్గిరకి రాను, but I challenge he didn’t have a reason to hate CBN!" అనేది ఎందుకు వేసానో మీరు చెప్పగలరా!

    ఇక్కద మీరు నేర్చుకోవడం గురించి చాలా ఎక్కువే చెప్పారు.కానీ ఒకే ఒక్కటి మిస్సయ్యింది.ఇంగ్లీషులో de-education అనే ఒక పదం ఉంది.ఇది ఎక్కడ వస్తుందో తెలుసా!కొత్త విషయాల్ని నేర్చుకోవాలంటే పాత విషయాల్లో పనికిరానివాట్ని మర్చిపోవాలి!అంతే కాదు, ఇప్పటివరకు మనం నిజం అని నమ్ముతున్న విషయం కొత్త విషయం తెలిదినప్పుడు అబద్ధం అని తెలిస్తే మన అభిప్రాయాల్ని మార్చుకోవాలి.అలా మార్చుకోవడం అవకాశ వాదం కాదు, గిరీశం చెప్పిన ఒపీనియన్సు అప్పుడప్పుడూ చేంజి చేసే పాలిటిక్సూ కాదు. అది సత్యం పట్ల నిబద్ధత!మీ వ్యాసంలో ఈ ఒక్క ముక్క లేకపోవడం తప్ప మీరు చెప్ప్పిన మిగిలినవి అన్నీ అమంచి విషయాలే ఉన్నాయి.అది కూడా చేరిస్తే మీ వ్యాసం ఇంకా బాగుంటుంది!

    ఆ సత్యం పట్ల నిబద్ధతయే లేదు వీళ్ళిద్దరికీ.సత్యం పట్ల నిబద్ధతకి ఉదాహరణ మరోసారి చెప్తాను.
    భవదీయుడు
    హరి.S.బాబు

    ReplyDelete
    Replies
    1. హరిబాబు గారు, ఎక్కడ విషయం అక్కడే తేల్చుకోవడం పద్దతిగా ఉంటుంది. అలాగే చేయగలరు. దయచేసి నా బ్లాగులో నా టపాలకు సంబంధించిన విషయాలే కమెంట్ చేయగలరు. ఈ టపాకు సంబంధించి మీ సూచనలు నోట్ చేసుకున్నాను. ధన్యవాదములు.

      Delete
    2. మీరు తలకట్టు పెట్టి రాసిన విషయంలో ఉన్నదాని గురించే కదా నేను చెప్తున్నది.ఏది నేర్చుకోవాలన్నా మొదట ఉందాల్సిందే సత్యంపట్ల నిబద్ధత.అది మీకు లేకపోయినా మీరు నేర్చుకునేదీ ఉందదు, ఇతరుల్లో సత్యం పట్ల నిబద్ధత లేనప్పుడు మీరు వాడికి నేర్పతం కోసం చచ్చి ముతమారినా ఎదటివాడు మీనుంచి ఏదీ నేర్చుకోడు.

      కన్యాశుల్కంలో ఉన్న తమాషా ఏంటో తెలుసా!అది పూర్తి కల్పిత కధ, అయినా నిజంగా జరిగినట్టు భ్రమింపజేసే లక్షణం ఉంటుంది.కన్యాశుల్కం మీద ఎంతోమంది ఎన్నో పరిశోధనలు చేసి ఎన్నో వింత విషయాల్ని బయటపెట్టారు. నాతకంలో కనపడే ప్రతి పాత్రకీ నాటమలో ఆ పాత్ర మాట్లాడే మొదటి మాటకీ చివరి మాటకీ ఒక లెక్క ఉంటుంది.ఉదాహరణకి నాటకమే గిరీశం "సాయంకాలమైంది!" అనే మాటతో మొదలై మళ్ళీ గిరీశమే "డామిట్!కధ అడ్డం తిరిగింది." అనే మాటతో ముగుస్తుంది.రామప్పంతులు పాత్ర "పిల్లా!అగ్గిపుల్ల." అనే మాటతో వచ్చి "వెధవ ముండా పాట!" అనే మాటతో ముగుస్తుంది.ఆ మొదటి ఆఖరి మాటల్లో ఆయా పాత్రలు అప్పుడున్న మనస్థితీ పరిస్థితీ తెలుస్తుంది.గిరీశం సాయంకాల్మైంది అనేతప్పుడు వాడి బతుకూ అట్లాగే తగలడింది, అప్పులెక్కువై పోయి దుక్నం బందు జేసి వూరు మారాల్సీన స్థితిలో ఉన్నాడు.ఇక ఆఖర్న మధురవాణి సౌఅజ్ఞ్యారావుకి వీడి గురిచి చెప్పి ఆయ్నతో గెటౌట్ అనిపించుకున్నాక కూఒడా బుద్ధి మారలేదని సూచిస్తుంది.రామప్పంతులు పాత్ర కూడా అనతే వాళ్ళకీ వీళ్ళకీ జుట్లు ముడేసి కోఋతుల వార్కు తీసుకెళ్ళి కోర్టు ఖర్చుల పేరుతో డబ్బు సంపాదించేవాడికి అప్పటి కాలాన్ని బట్టి ఒక వేశ్యని వుంచుక్ని జమీందారీ సరాస్మ్ వెలగబెట్టాలనే బోడి దర్జా కనిపిస్తుంది.చివరాఖర్న "ఇల్లు ఇల్లనియేవు.." తత్వం విన్నాక్ కూడా పాతని తిట్టుకోవడం తప్ప తత్వం బుర్ర్రకెక్కించుకోలేదని తెలుస్తుంది.

      వీళ్ళిద్దరే కాదు అసిరిగాడూ బండివాడూ లాంటి చిన్న చిన్న పాత్రలు కూడా ఇలాగె వుంటాయి ఏ మార్పూ లేకుండా ఒక్క లుబ్ధావధాన్లు తప్ప!కధ మొదట్లో కొత్తగా దబ్బు కలిసొస్తుందని తెలిసి మళ్ళీ పెళ్ళికి వొప్పుకున్న వాడు చివర్లో సాక్షాత్తూ సౌజన్యారావుకి మీనాక్షిని ఏదోధార్మిక సంస్థలో చేర్పించి తను కాశీకి పోవాలనుకుంటున్నట్టు చెప్తాడు.నేను చెప్పిన de-education అతనిలో పనిచేసింది గనక మారాడు.అంతకాలమూ అతనికి తనచుట్టూ రామప్పంతులూ గిరీశమే కనబడ్డారు,కానీ తనకి అద్మ్మిడీ లాభం లేకుండా ఇతర్లకి సాయం చరెస్తున్న సౌఅజ్ఞ్యారావుని చూశాక అతనికి పుట్టిన మంచ్ఘి బుద్ధి గిరీశానికి ఎందుకు పుట్టలేదు?గిరీశంలో ఉన్న అహంకారం వల్ల!

      "ఎక్కడ విషయం అక్కడే తేల్చుకోవడం పద్దతిగా ఉంటుంది" అంటే మీరు ఈ వ్యాసం రాయాల్సిన అవసరం లేదు!ఈరోజున మనం ఉపయోగించుకుంటున్న జ్ఞనం సమస్తమూ ప్రత్యక్షానుభూతి మీద మాత్రమే ఆధారపడి ఎదగలేదు, అపరోక్షానుభవం వల్ల తెలుసుకునే సత్యం కూడా ముఖ్యమే!నిజానికి అపరోక్షానుభవం అంటే వేరేవాడు నిప్పును తాకి బాధను అనుభవించి మనకి చెప్పడం అనుకుంటే దాన్ని నమ్మకపోవడం వల్ల జరిగేది ఏమిటి?

      ఒకడు అబద్ధం చెప్తే ఇంకొకడు నమ్ముతున్న సన్నివేశంలో నమ్మేవాడికి అజ్ఞానం వల్ల తెలియదు గానీ చెప్పేవాడికి తను చెప్తున్నది నిజం కాదని తెలుసు.తను చెప్తున్నది అబద్ధం అని తెలిసీ చెప్తున్నవాడికి గౌరవమర్యాదలు కల్పించడం తప్పు - మీరూ ఆ తప్పునే చేస్తున్నారు!నమ్మేవాడిలో అజ్ఞానం ఉండటం కూడా తప్పు కాదు, నాతో సహా సర్వజ్ఞులు ఎవరూ లేరిక్కడ.ఇతరులు అజ్ఞానం వల్ల అబద్ధాల్ని నమ్ముతున్నప్పుడు సత్యం పట్ల నిబద్ధత గలవాడు చేతులు ముడుచుకుని కూర్చోలేడు.

      నేను చెప్పేది చెప్పకుండా ఉండలేను.ఎవరెవరు ఎలా స్వీకరిస్తారనేది వారి వారి సంస్కారాల్ని బట్టి ఉంటుంది.ఆంధ్ర ఎన్నికల కమిషనర్ తీసుకున్న సహేతుకమైన నిర్ణయాన్ని జీర్ణించుకోలేక అతనికి కులగజ్జిని ఆపాదించిన అధముణ్ణి నేను తప్పు పడితే "జగన్ పైన జరుగుతున్న పచ్చ విష దాడి చూస్తే - ఇర్ఫాన్ హబీబ్, రోమిల్ల థాపర్, రామచంద్ర గుహ.. ఈ నికృష్ట, leftist pseudo historians భారతీయ చరిత్రను వక్రీకరించ డం తలపిస్తుంది." అనటంలో GKK ఉద్దేశం ఏమిటి?కళ్ళముందు కనబడుతున్న అవినీతిని చూపించి జగన్ గురించి నిజాలు చెప్తే చరిత్రని వక్రీకరించిన దోషాన్ని నాకు అంటగట్టటం అంటే ఏమిటి?జగన్ చెప్తున్న అబద్ధాల్ని నమ్మే అమాయకులు కాదు వీళ్ళు,జగన్ వైభవానికి పునాదులు వీళ్ళే - వాడికన్న వీళ్ళవల్లే ఎక్కువ డంజర్!పీపీయేల రద్దు నుంచి మొదలుకొని మూడు రాజధానుల గత్తర వరకు జగన్ తీసుకున్న ప్రతి నిర్ణయమూ రాష్ట్ర ప్రజల్ని అందర్నీ అతలాకుతలం చేస్తుంటే "అంతిమంగా ఇది కుల ఆధిపత్య పోరాటమే తప్ప మరొకటి కాదు.ఇంకో నాలుగేళ్లు ఈ విషాలన్నింటినీ భరించక తప్పదు" అనే సమర్ధనతో రోం నగరం తగలబడుతింటే నీరో ఫిడేలు వాయిచినట్టు చూస్తూ చంకలెగరెయ్యమనటం అతని స్వంత విషయమూ కాదు,ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అనటం మంచి పద్ధతీ కాదు.

      తప్పుడు వెధవలు ఎక్కడ దొరికితే అక్కడే ఉతికిపారెయ్యటం నాకు తెలిసి నేను చేస్తున్న ధర్మచక్రప్రవర్తన.
      ఓం మణిపద్మోహం!

      Delete
    3. హరి బాబు గారు, చాలా కాలమైంది మిమ్మల్ని (మీ కామెంట్లను) చూసి, ఎలా ఉన్నారు. ఈమధ్య స్వీయ"శిక్ష", స్వీయ"నింద" ఎక్కువై మీకు మీరే క్వారంటైన్ అయ్యారని విన్నాను.

      Delete
    4. Dear srikanth M,
      I am fine and in fact more jubilant on FB!I could read between the lines. And I could see the negative Tobe in your comment. If you think you are cleverer than jai, you are mistaken - అన్యాపదేశపు తెలివితక్కువ స్టేట్మెంట్లతో అనవసరమైన అతితెలివి చూపిస్తే బల్బు పగిలిపోద్ది!

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top