జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశం బలపడుతుందా?


ఇటీవలి కాలంలో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎన్ టి ఆర్  స్థాపించిన పార్టీని ఇప్పటిదాకా చంద్రబాబు సారధ్యంలో ముందుకు నడిపారు. ఆయన తన వారసుడిగా కుమారుడు లోకేష్ ని రాజకీయాలలో స్థిరపరచాలని చూస్తున్నారు. అయితే లోకేష్ లో  నాయకత్వ లక్షణాలు లేకపోవడం తో  తరువాత తెలుగుదేశం నాయకుడు ఎవరన్నది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్ టి ఆర్ తెలుగుదేశం బాధ్యతలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తారక్ రాజకీయాలలో రాణిస్తారా? ఆయనను చంద్రబాబు రానిస్తారా? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?
- Palla Kondala Rao
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. He has ten years of film career ahead of him. Why drag him into politics. What are his credentials to lead a party. Individual centric parties are a double edged sword.
    If he really wants to join politics let him work as full-time apprentice for five years to understand issues.

    ReplyDelete
  2. చంద్రబాబు కాబట్టి అందరినీ లిమిట్లో ఉంచి పార్టీని నడపగలుగుతున్నాడు. ఇప్పటికీ, ఎప్పటికీ తెదేపాకి చంద్రబాబే దిక్కు. చంద్రబాబు తర్వాత, పార్టీకి.. అన్న తెదేపా గతే..

    ReplyDelete
  3. టీడీపీ పార్టీ కనీవినీ ఎరగని దారుణ ఓటమికి కారణాలు &ప్రస్తుత అధోగతి దిద్దుబాటుకు చర్యలు లాంటి ప్రశ్నలను ఎదురుకోకుండా ఎవరు రావాలి చర్చించడం వలన లాభం లేదు.

    అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టు రామారావు 1989 పరాభవం తాలూకా చెత్త రికార్డును 2019 చంద్రబాబు అధిగమించాడు. జూనియరుడు వస్తే చాలని అందలం ఎక్కిస్తే ఆ రికార్డును కూడా బద్దలు కొట్టేసే అవకాశం ఉంది.

    ReplyDelete
  4. బాలయ్య తొడకోడితే రైలు నిజంగా కదులుతుందా? ఈ ప్రశ్నా అలాంటిదే☺️

    ReplyDelete
    Replies
    1. కదలడమేంటి? వెనక్కి పారిపోతేనూ...

      Delete
  5. నాయకత్వ లక్షణాలు అంటూ ప్రత్యేకం గా ఏవీ లేవని నేను అనుకుంటాను.
    లోకేష్ తనంత తాను చంద్ర బాబు లేకుండా అధికారం లోకి రాలేకపోవచ్చు, కానీ వెనక తండ్రి ఒక దఫా ఉంటె ఇక లాగించేస్తాడు, ఈ ముఠా లను అధికారం ఉన్నప్పుడు ఎవడైనా మేనేజ్ చేయగలడు, అతని కులం అతని వెంట ఉండటం అన్నిటికన్నా ముఖ్యం.
    నేను వినడం - లోకేష్ , చంద్ర బాబు కన్నా చాలా మంచివాడు అని.

    ReplyDelete
    Replies
    1. లోకేశం బాబు మంచితనం గురించి తెలువదు కానీ అతను ఊళ్లెమ్మట తిరిగి జనంతో మమేకం కాగలడా అన్నది పేద్ద డౌటే. ఏసీ గదులలో కూచొని కంప్యూటర్ లెక్కలు చూసి మనమే గెలుస్తున్నామని మురిస్తే ఏమవుతుందో మొన్నే చూసాం.

      మిగతావి బాగుంటే సొంత కులం మద్దతు *కూడా* ప్లస్ పాయింటు అవుతుంది కానీ మనోళ్ళొక్కళ్ళే చాలు అనుకుంటే కొంప కొల్లేరవడం ఖాయం. రామారావు చంద్రబాబులు ఖుర్చీ కోసం కొట్టుకున్నప్పుడు అసమదీయులు ఎందరో (ఉ. గోరంట్ల, ముద్దుకృష్ణ, నెహ్రు) రామారావు వెంబడి నిలిచినా గజపతి, యనమల, కోటగిరి లాంటి ఇతర కులస్థుల మద్దతుతో బాబే నెగ్గాడు.

      Delete
    2. తెలుగు దేశం యొక్క డొల్లతనం వాళ్ళు లోకేష్ కి మంగళగిరి ని ఎంచుకోవడం లోనే తేటతెల్లం అయింది. తాను దత్తత తీసుకున్న, వాళ్ళ తాత గారి గ్రామం, నిమ్మకూరు నియోజకవర్గం లో తాను నిలబడకపోవడం తోనే వాళ్లకు వాళ్ళ మీదే నమ్మకం లేదన్నది రుజువయ్యింది. అదీకాక కేవలం తాము నివాసం ఉంటున్నామన్న మరియు అమరావతిని అభివృద్ధిని చేసామన్న కారణాలతో మంగళగిరిని కంచుకోటగా భావించుకుని పోటీకి దిగడం ... ఇదీ 40 ఏళ్ళ రాజకీయానుభవం! టీడీపీ వాళ్ళు దత్తత తీసుకున్న ఏ గ్రామంలోనూ ఆ పార్టీకి మెజారిటీ దక్కకపోవడం వాళ్ళ నిజాయితీకి, చిత్తశుద్ధికి, పనితనానికి ప్రజలిచ్చిన తీర్పు కొలబద్ద. నిజానికి సమాజం కనీసం రెండేళ్ల ముందు నుంచే ఇండికేషన్స్ ఇస్తోంది 'ఈసారి టీడీపీ గెలవడం కష్టం' అని. పాట్టించుకున్నవాడెవడు? లోటుపాట్లు సరిదిద్దుకోవడానికి బదులు ఎత్తి చూపిన ప్రతివాడికి బురద పూయడం ఘనతగా భావించుకుని, బాకారాయుళ్లతో ఎదురు దాడులు చేయించి అమూల్యమైన కాలాన్ని చేతులారా వృధా చేసుకుంది టీడీపీ. బాధాకరమైన విషయం ఇప్పటికీ వాళ్ళు ఇంకా అదే దారిలో ముందుకెళ్లడం. ఆంధ్రా ప్రజల దురదృష్టం ఏ పార్టీలోనూ సరైన దృక్పధమున్న నాయకుడు లేకపోవడం. ఉన్నవాళ్లలో వారికి జగనే బెటర్ అనిపించి గెలిపించడంలో వాళ్ళ తప్పేముంది, ఉన్నవాళ్లు సరిగా చేయడం లేదు అన్న అభిప్రాయం కలిగించిన వాళ్లదే ఆ తప్పు. ఆ తప్పే జగన్ని గొప్పగా గెలిపించింది అంతే తప్ప తన విజయంలో జగన్ది చిన్న పాత్రే. వైరి పక్షాల పాత్రే ఎక్కువ.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top