- Palla Kondala Rao
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. సమాజంలో అంతరువులు ఉండడం అన్ని చోట్లా ఉంది - అది కేవలం మీరు హిందూధర్మం అంటున్న హిందూమతానికి సంబంధించిన విషయం కాదు.ప్రిన్స్ చార్లెస్ పెళ్ళి చేసుకున్న డయానా స్పెన్సర్ కూడా రాజవంశానికి చెందిన కులీనస్త్రీయే,కాకపోతే వాళ్ళ కుటుంబం భేషజాలు వదిలి మామూలు మనుషులతో కలిసిపోవాలని అనుకున్నది,అంతే!అక్కడ కూడ కులీనత ఉన్నది కదా,అక్కడే కాదు ప్రపంచంలోని ప్రతి మానవసమాజంలోనూ రాజకీయ,ఆర్ధిక,సామాజిక అంతరువులు ఉన్నాయి.అన్నిచోట్లా ఉన్న వాటిని కేవలం హిందూమతంలో భాగం అని ఎలా అంటారు?

    కులాలు సామాజికపరమైనవి,మతం ఆధ్యాత్మికమైనది.

    ReplyDelete
    Replies
    1. < సమాజంలో అంతరువులు ఉండడం అన్ని చోట్లా ఉంది >

      ఉన్నది. లేదని ఈ ప్రశ్నలో కానీ, ఎపుడూ కానీ నేను చెప్పలేదు.

      < అది కేవలం మీరు హిందూధర్మం అంటున్న హిందూమతానికి సంబంధించిన విషయం కాదు >

      హిందూధర్మం , హిందూ మతం ఒకటేనా? నాకు తెలిసిన వరకూ కులం హిందూ మతానికి సంబంధించినదే.

      ఈ ప్రశ్నకు మాత్రమే పరిమితమై చర్చ్ ఉంటే అర్ధవంతమైన సమాధానం దొరుకుతుంది. ఇతర మతాలు బాగున్నాయనీ, హిందూ మతమే బాగోలేదనేది ఈ ప్రశ్నలో అడగలేదు. నా ఉద్దేశం కూడా కాదు.

      Delete
    2. @Kondala Rao Palla
      నాకు తెలిసిన వరకూ కులం హిందూ మతానికి సంబంధించినదే.

      hari.S.babu
      పూర్తిగా తప్పుడు అభిప్రాయం ఇది!ఎందుకంటే ప్రతి కులమూ ఒక లౌకికవృత్తికి సంబంధించిన గుంపు.దీనికి సాక్ష్యం ప్రాచీన కాలం నుంచి గ్రామం,నగరం అంటూ ఏర్పడి అవి రాజ్యం అనే వ్యవస్థకి రూపాంతరం చెందిన సమాజంలో "చాకలి వీధి","మంగలి వీధి","కంసాలి వీధి" అని ఒక వృత్తికి సంబంధించినవాళ్ళు ఒకచోట చేరేవాళ్లు.ఇందులో ఉన్న మతానికి సంబంధిన అంశం ఏమిటి?ఆయా వృత్తుల మీద పట్టు సాధించడానికీ ఆదాయాన్ని పంచుకోవడానికీ వాళ్ళు చేసుకున్న ఏర్పాటులో బ్రాహ్మణులు పైనుంచి రుద్దడం ఎట్లా జరుగుతుంది?శాతవాహనుల కాలంలో ప్రతి గ్రామంలోని ఈ కులపెద్దలు శ్రేణులు అనే సమూహాలు ఉందేవి.అంటే,ప్రతి గ్రామంలోనూ ఒకో కులానికి ఒక కులపెద్ద వారికి రాజ్యం నుంచి రావలసిన సౌకర్యాలకి బాధ్యత తీసుకునేవాడు.అలాంటివాళ్లు ఏ కులానికి ఆ కులశేణిలో సభ్యులుగా ఉండేవాళ్ళు.ఇందులో మతానికి సంబంధం ఉన్న అంశం ఏమిటి?

      ఇలా అన్ని వృత్తుల వాళ్ళూ స్థిరమైన ఆదాయాలు తెచ్చే వృత్తులకి అంకితం అయ్యాక అన్ని వృత్తుల వారికీ అవసరమయిన ఆధ్యాత్మిక/మత కర్మకాండల్ని జరిపించడం కోసం బ్రాహ్మణులు ఒక కులంగా వేరుపడ్డారు.

      హిందూమతం అనేది ఎప్పుడూ ఉనికిలో లేదు - ఇవ్వాళ హిందువులు అని పిలువబడుతున్న సమూహం ఇతరులు వాళ్ళకి హిందువులు అని పేరు పెట్టకముందు తమ గురించి సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు అనే అర్ధంలో సనాతన ధార్మికులు అని చెప్పుకునేవాళ్ళు.అది మీకూ ఇతరులకీ అర్ధం కాదు గాబట్టి హిందూమతం అని వాడాను.

      దేవుడు,భక్తి,ఆరాధన,క్రతువులు - ఇవి ఆధ్యాత్మికపరమైనవి కాగా కులవృత్తులు సామాజికపరమైనవి.వాస్తవం ఇలా ఉంటే ఆర్ధికానికి సంబంధించిన కులాలని తీసుకెళ్ళి హార్ధికానికి సంబంధించిన మతానికి కట్టేస్తే ఎలా?

      Delete
  2. ఇప్పుడు ప్రశ్నని మార్చినట్టున్నారు.ఇదివరకు హిందూమతంలో భాగమేనా అని ఉండేది,అవునా?

    ReplyDelete
    Replies
    1. కులాలకీ మతానికీ సంబంధం లేదు అని తెలిస్తే ఇంక ఈ ప్రశ్నకి జవాబు సూటిగానే చెప్పొచ్చు.కులాలు లేక వృత్తిని బట్టి చేసిన విభజనలు అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి.ఎక్కడైనా సరే అవి మతానికి సంబంధించినవి కాదు,సామాజిక,ఆర్ధిక అవసరాల కోసం ఏర్పడినవి కాబట్టి వాటి అవసరం వున్నంతవరకు కులాలు ఉనికిలో ఉంటాయి,ఆ కులాల వాళ్ళకి తమ కులం యొక్క అవసరం లేనప్పుడే కులాలు పోతాయి.

      Delete
    2. దేవాలయల్లోకి దళితులు రాకూడదనేది మతపరమైన నిబంధన కాదా?

      Delete
  3. అన్ని మతాలలోనూ కులాలున్నాయి కానీ హిందూ ధర్మంలో కులాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రొటెస్టంట్లు - క్యాధలిక్ లూ సమానమే, సున్నీలూ - షియాలూ సమానమే ! కానీ హిందూ ధర్మంలో కొందరు క్రింది స్థాయి మనుష్యులు వర్ణసంకరం చేయడమే కాకుండా కొన్ని వర్ణాలను విభజించి, కొన్ని వర్ణాలకు గొప్పతనం ఆపాదించి కొంత వ్యూహ రచన చేసారు. ఆ వ్యూహానికి ప్రతివ్యూహం కూడా సిద్ధమయ్యే ఉంటుంది. కుల ఏర్పాటు, కుల అంతరాలు హిందూ ధర్మం ఏర్పడిన తర్వాతే ఏర్పడ్డాయి కానీ హిందూ ధర్మం లో భాగం కాదు. ఏ ఒక్క వ్యక్తి వల్లో, ఏ ఒక్క కులం వల్లో హిందూ ధర్మం నడవదు. హిందూ ధర్మం సమిష్టి తత్వాన్ని ప్రోత్సహిస్తుంది. నేను శాస్వతుడిని అని అంటే కృష్ణుడు భోదించిన దాన్ని కృష్ణుడే విభేధించినట్లు కాదా ? శాస్వతుడు మోక్షాన్ని ఎలా సాధిస్తాడు? క్రింది స్థాయి వ్యక్తులు వర్ణాలను విభజించి మళ్ళీ వారే వర్ణాలను ఎలా ప్రోత్సహించగలరు ? నైజ గుణానికీ లొట్టకంటికీ మందు లేదు. హిందూ ధర్మమే తనను తాను రక్షించుకోవాలి.

    ReplyDelete
    Replies
    1. @neehaarika
      నేను శాస్వతుడిని అని అంటే కృష్ణుడు భోదించిన దాన్ని కృష్ణుడే విభేధించినట్లు కాదా ? శాస్వతుడు మోక్షాన్ని ఎలా సాధిస్తాడు?

      hari.S.babu
      ఈ ప్రస్తావన ఇక్కడ ఎందుకు వచ్చింది?కొంత అసందర్భం అనిపిస్తున్నది!దానికి మీ వ్యాఖ్యానంలో కూడా స్పష్టత లేదు.కాబట్టి ఒంత విడమరిచి చెప్పగలరా?

      Delete
    2. భగవద్గీత వ్రాసింది వ్యాసుడే కదా ? ఆయన వ్రాసింది వర్ణ విభజన, మోక్ష సాధన గురించి కదా ? శాస్వతుడు మోక్షాన్ని ఎలా సాధిస్తాడు ? వర్ణాలను విభజించేదీ, వర్ణాలను ప్రోత్సహించేదీ వ్యాసుడే ఎలా అవుతాడు ? వ్యాసుడే భగవానుడు అని కూడా వ్రాసారు. హిందూ ధర్మం వేరు సనాతన ధర్మం వేరు అని ఎవరో చెప్పారు అటువంటపుడు భగవద్గీత సనాతన ధర్మం అవదు కదా ? మన సనాతన ధర్మాన్నే మనం పాటించాలి కానీ వ్యాసుడు వ్రాసిన దానిని మనం పాటించనక్కరలేదు అని మీరు అనగలరా ?
      కుల ఏర్పాటు కుల అంతరాలు హిందూ ధర్మంలో భాగమేనా అని ప్రశ్న వేసారు కాబట్టి హిందూ ధర్మంలో కుల ఏర్పాటు జరిగింది కానీ సనాతన ధర్మంలో కుల ఏర్పాటు లేదు అని నా భావన !

      Delete
    3. మొదట హిందూ ధర్మం, సనాతన ధర్మం వేరు వేరు కాదు అని అర్ధం చేసుకోవాలి.కంబోడియా ముస్లిం ప్రభుత్వం అక్కడి హిందూమతస్థులకి"మతం లేనివాళ్ళు" అని పేరు పెట్టి పౌరసత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టటానికి చూస్తే వాళ్లు భారతీయ మేధావుల సహాయం తీసుకుని వేదాల నుంచి సాక్ష్యం తీసుకుని "మాది కూడా ఏకేశ్వర సంప్రదాయమే" అని ఒప్పించి గౌరవప్రదమయిన స్థానాన్ని సంపాదించుకున్నారు.

      1500 సంవత్సరాల క్రితం ఇస్లాం లేదు,3000 సంవత్సరాల క్రితం క్రైస్తవం లేదు,5000 సంవత్సరాల క్రితం జుదాయిజం లేదు.ఈ మూడింటిలో మొదటిది పుట్తిన తర్వాతనే మతం అనే పదం కానీ అలాంతి ఏర్పాటు కానీ ఉనికిలోకి వచ్చింది!అంతక్ముందు ప్రపంచంలో ఎక్కడా మతం అనే నిర్మితి గల జనసమూహం లేదు.రోం,ఈజిప్ట్ వంటి ప్రాచీన నగరాలను గురించి చారిత్రకులు చెబుతున్నంది కూఒడా అవి దైవం,ఆచారాలు,నిషేదాజ్ఞలతో కూడిన సంస్కృతులను మాత్రమే కలిగి ఉండేవని.ఇంకా నిశితంగా పరిశీలిస్తే భారతదేశం నుండి వెళ్ళిన వర్తకశ్రేణుల ద్వారానూ పండితశ్రేష్ఠుల ద్వారానూ తెలుసుకున్న సనాతనధర్మం అనే సంస్కృతి వల్ల ప్రభావితమైనాయని తెలుస్తునది.దేవతామూర్తుల ఆకారవిశేషాలూ పౌరాణికకధలలోని వర్ణనలూ ప్రాచీన భారతీయ పౌరాణిక సాహిత్యంతో చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయి.ఇప్పటికీ అన్ని దేశాలలోనూ జరుగుతున్న త్రవ్వకాలలో హిందూ అలయాల శిధిలాలూ యజ్ఞశాలల ఆనవాళ్లూ అర్చామూర్తులూ బయటపడుతున్నాయి!అప్పుడు తమను తాము చెప్పుకోవడం ద్వారానూ ఇతరులు పిలవడం ద్వారానూ ఇక్కడీ జీవన విధానానికి సనాతనధర్మం అని పేరు తెచ్చుకున్నది.

      పై మూడు అబ్రహామిక్ మతాలూ ఆధ్యాత్మిక అవసరాల కోసం కోసం కాక రాజ్యస్థాపన కోసం పుట్టినవి.మొదట తాము ఎక్కద తమ మతాన్ని ఆసరా చేసుకుని రాజ్యం స్థాపించారో అక్కడ అంతకు పూర్వం ఉన్న సంప్రదాయాలను
      తుడిచిపెట్టేసి తమ మతం మాతరమె ఉండేలా చూసుకుంటారు.ఇది వారికి అత్యవసరం - నూటికి నూరు శాతం విధేయత కోసం!ఒకచోట సార్వభౌమాధికారం అవ్చ్చాక సామ్రాజ్యవాదులు చేసేది ఏమిటి?కొత్త ప్రాంతాలకు వ్యాపించడం!అలా వ్యాపిస్తూ సింధు నదిని దాటి ఇటువైపుకు వచ్చిన వారు సనాతనధర్మం కూడా తమలాగే ఒక మతం అనుకుని ఈ ధాటి గల భాషని పలకలేక సింధు నదికి చెందిన అతమ నే అర్ధంలో హిందు మతం అని పేరు పెట్టారు.

      కాబట్టి వ్యాసుడు హిందూమతానికి సంబంధించినవాడా సనాతన ధర్మానికి సంబంధించినవాడా అనే సందేహమే అర్ధం లేనిది!దానితో పాటే కులాల ఏర్పాటు హిందూమతానికి సంబంధించినదే తప్ప సనాతన ధర్మంలోనిది కాదు అనే ప్రతిపాదన కూదా అర్ధం లేనిదే అవుతుంది.

      వర్ణం వేరు,కులం వేరు అని ఈ రెండు మాటల్నీ ప్రచారంలోకి తీసుకొచ్చిన కమ్యూనిష్తు చరిత్రకారులే తలలు బాదుకుని చెప్తుంటే మళ్ళీఎ ఇక్కడికి వర్ణాన్ని తీసుకొచ్చి గనదరగోళం సృష్టించకండి.మిగిలిన మెలికప్రశ్నలకి Haribabu Suraneni December 11, 2017 at 6:16:00 PM GMT+5:30 time Stamp దగ్గరి జవాబు చదువుకోండి.


      ఇక " శాస్వతుడు మోక్షాన్ని ఎలా సాధిస్తాడు ?" అని మీరు పదే పదే అడుగుతున్నది నేను ఒకచోట "నేను శాశ్వతుణ్ణి" అని చెప్పుకోవడం వల్ల నాకు గురిపెట్తిన ప్రశ్న అని తెలుసు!మొదటిసారే చెప్పడం కుదరలేదు - ఈ వాదనకి సంబంధించిన ఫ్లోలో పడి డైవర్ట్ అయ్యాను.

      విశ్వసృష్టిరహస్యం పోష్టులో చెప్పాను కదా, భగవాన్ శ్రీకృష్ణుడు నా నుండి ప్రభవించిన వారు కాబట్తి మీరు కూడా నావలెనే శాశ్వతులు అని చెప్పాడని.దాని ప్రకారం నా గురించి నేను అలా చెప్పుకున్నాను.మోక్షం అంటే ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళడం కాదు - మనస్సులోని రాగద్వేషాల నుంచి విడిపోవడం.అది చచ్చిపోయాకనే అందుకోగలమనేది తప్పుడు భావన!మనస్సులో "ఎరుక" స్థిరపడడమే మోక్షం.పురాన కధల్లో ఫలానా వారు మోక్షాన్ని సాధించారు అని చెప్పే చోట కూడా వారు ఆ "ఎరుక" సాధించిన తర్వాత మరణించదం వల్ల వారికి జన్మ లేని స్థితి వచ్చిందని ఉంటుంది,చదివి చూడండి.అంటే,మోక్షం అనేది బ్రతికి ఉన్నపుదే సాధించుకోవాల్సిన మానసిక స్థితి అన్నమాట!

      నేను మోక్షాన్ని కోరుకోవడం లేదు,శాశ్వతత్వాన్ని సాధన చేస్తున్నాను.అది ఫలిస్తే శాశ్వతుణ్ణే అవుతాను కదా!మోక్షం కన్న ఒక మెట్టు పైదానినే కోరుకుంటున్నప్పుదు నాకు మోక్షంతో పనేమిటి?అది మీలాంటి చిన్నపిల్లల కోసం - మీరు ప్రయత్నించి సాధించుకోండి!

      Delete
  4. దీని గురించి Gurucharan Das అనే ఆయన ఒకానొక పుస్తకంలో ఈ విధంగా అభిప్రాయ పడ్డారు. జపాన్‌లోకూడా కులవ్యవస్థ ఉందికానీ అది మరీ ఇండియాలో ఉన్నంత rigid గా లేదు. అక్కడివారికి కులపరంగా పదోన్నతులుకూడా ఉండేవి. ఒకప్పుడు (60ల్లో) ఉత్తరాదిన కొన్ని గ్రామాల్లో కొందరు తమను తాము promote చేసుకోవడం ఉండేదికానీ, ఇప్పుడది పూర్తిగా నశించింది.

    కులానికీ, మతానికీ సంబంధం లేదనడం సత్యదూరమైన వాదన. మనుస్మృతి జన్మ ఆధారంగా మనుషులను కులాలుగా విభజించి వారికి అర్హతలు నిర్ణయించిందని మనం చదివాం. కొన్ని గుళ్ళలో దళితులకి గతంలో ప్రవేశం కల్పించకపోవడం మనం చూశాం. ఈనాటికీ పల్లెల్లో పండగనాడు దళితులను దూరంగా ఉంచడం మనం చూస్తున్నాం. హిందూమత సాహిత్యంలో (రామాయణం సహా) బ్రాహ్మణులకు చేయాల్సిన దానధర్మాలను పొగుడుతూ, ఇతరుల ఏయే స్థానాల్లో ఉంచాలో చెప్పడంచూశాం. రామాయణం మతగ్రంధంకాదా? కులానికీ మతానికీ సంబంధంలేకపోతే మొత్తం హిందూమతం కులాంతో ఇంత obsessionకు గురై ఎందుకు ఉంది?

    అసలు హిందూ మతం అంటూ ఏమీలేదు. ఉన్నదల్ల బ్రాహ్మణ మతమ్మాత్రమే! ఆ మతంలో బ్రాహ్మణులకు దక్కాల్సిన previleges చెప్పుకుంటూ వారు గ్రంధాలు రాసుకున్నారు. వారి కులస్తులను, వారు చెప్పిన విధంగా పాలించినవారినీ దేవతలుగా, గొప్పవారిగా కీర్తించుకున్నారు. ఈ మతం వారిని ఉధ్ధరించినంతగా, ఇంకెవరికీ దోచిపెట్టిందేమీలేదు. ఈమతంలో బ్రాహ్మణుణ్ణె సేవించినందువల్ల జరిగే పుణ్యలోకాలు అంటూ ప్రతి గ్రంధంలోనూ రాసుకున్నారు, బ్రాహ్మణుడు చెడ్డవాడైనా దండించకూడదనీ రాసుకున్నారు. దాన్నీ మన బ్రహ్మశ్రీ ప్రవచనకారులు చెబుతున్నారు.

    ReplyDelete
    Replies
    1. ఆ కెప్టెన్లు ఎవరు?వారు అంబేద్కరుని మోసం చెయ్యటానికి కూడా బ్రాహ్మణులే కారణమా?మాటిమాటికీ అంబేద్కరు నామం జపిస్తూ కొన్ని వేలయేళ్ళనాటి బ్రాహ్మణుల దుర్మార్గాల్ని కూడా కనిపెట్టి వెలికి తియ్య్యగలిగినవాళ్ళు నిన్న గాక మొన్న అంబెద్కర్ ఎవరి గురించి ఆ మాటలు అన్నాడో కనిపెట్టలేరా?ఎవడి స్వార్ధం వాడు చూసుకోవటానికి అణిచివేయబడిన కులాల నుంచి వచ్చిన దళిత మేధావులే అతీతులు కానప్పుడు బ్రాహ్మణుల్ని తప్పుపట్టి ప్రయోజనం ఏమిటి?



      ఒకానొకప్పుడు కులదోపిడీ జరిగింది,నిజమే!అయితే, ఆ కులదోపిడీ నుంచి బయటపడటానికి డా.అంబేద్కర్ వజ్రాయుధం కన్న బలమయిన ఆయుధమే ఇచ్చాడు,దాని సక్తిని తెలుసుకుని ఉపయోగించుకోవాల్సినవాళ్ళు సరైన తీరున ఉపయోగించుకుంటే కేవలం పదేళ్లు చాలు కులదోపిడీ నుంచి ఆయా కులాలు బయటపడటానికి!మరి,డెబ్బయ్యేళ్ళ తర్వాత కూడా ఇంకా రిజర్వేషన్లు లేనిదే బతకలేని స్థితిలో ఎందుకు ఉన్నారు?అంబేద్కర్ ప్రతిపాదించిన రిజర్వేషన్లలో మొదటి భాగం అర్హతలు విద్యకైన ఔద్యోగానికైన అప్రాతినిధ్యానికైనా ఆవ్సరమైన అర్హతలకి పెట్తుకున్న కొలబద్దకి అతి దగ్గిరగా వచ్చినవాళ్ళకి కొంచెం ప్రోత్సాహం కల్పించదమే తప్ప అర్హత ఏమాత్రం లేనివాళ్లని వెనకబడినకులం పేరుతో ముందుకు తొయ్యమని కాదు,అవునా?



      అదీ గాక అంబేద్కర్ చెప్పిన రెండో భాగం ప్రత్యేకించి ఆయా వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లని అందుకుంటున్నవారికి - ఈ రిజర్వేషన్ సౌకర్యం మీకు వ్యక్తిగత దరిద్రాన్ని వదిలించుకోవదానికి కాదు,మీ కులానికి సరయిన ప్రాతినిధ్యం ఉండటం కోసం కాబట్టి ఈ సౌకర్యాన్ని మీ కులంలోని ఇతరులని కూడా మీలాగే ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించండి అని నొక్కి చెప్పాడు,అవునా?మరి,ఇన్నేళ్లు ఆనాడు అంబేద్కర్ స్వయంగా ఆరోపణ చేసినట్టు కుక్షింభరులై తమ సొంత కులాలనే పట్టించుకోనివాళ్ళకి బ్రాహ్మణుల్ని తమ కులాలకి అన్యాయం చేశారని విమర్శించే హక్కు ఉందా!మరి,ఇవ్వాళ ఏ విధమయిన అస్పృశ్యతనీ అనుభవించని కాపులు మీతో పోటీపడి మీ వాటాని తగ్గించడానికి వస్తుంటే వాళ్లతో పోట్లాడి మీ హక్కుల్ని రక్షించుకోవడానికి నోళ్ళు పెగలలేదు,కారణం ఏమిటి?నోరూ వాయీ లేని బ్రాహ్మణులే దొరికారు వీళ్ళకి - సిగ్గు లేకపోతే సరి.

      Delete
  5. క్షేత్రస్థాయిలో ఇవ్వాళ దళితులు ఆలయనిర్మాతలుగా కూడా ఉన్నారు,మీకు తెలుసా?నిన్నటివరకు బీదరికంలో అలమటించిన ఒక దళీత కుటుబం కొంత పరిస్థితి మెరుగు పడగానే దైవభక్తిని పెంచుకుంటున్నది,ఆలయ సందర్శన చేస్తున్నారు,కొందరు మరీ ఎక్కువ ధనవంతులై వెసులుబాటు గనక ఉంటే తమ ప్రాంతంలో ఆలయాలు తామే కట్టుకుంటున్నారు.వెయ్యేళ్ల కాలపు విషయాల్ని ఇవ్వాళ కూడా పాటలా పాడితే ఏమి చెప్పాలి?

    ఒకనాడు మమ్మల్ని చదువుకోనివ్వకుండా బ్రాహ్మణులు తొక్కేశారు,క్రీ.స 1947లో స్వతంత్రం వచ్చింది.అంబేద్కర్ మాకు రిజర్వేషన్లు అనే వజ్రాయుధాన్ని ఇచ్చాడు.అది లేకపోతే ఇంక ఆఘోరిస్తూనే ఉందేవాళ్ళం అని చిలకపలుకులు పలుకుతున్నవాళ్ళకి ఓరియెంటల్ ఎడ్యుకేషన్ సిస్టం గురించి ఎంత తెలుసు?ఆ స్కూళ్ళలో చదువుకుంటున్న వాళ్లో బ్రాహ్మణేతరులే ఎక్క్కువ,ఫీజులు తక్కువ,క్వాలిటీ ఎక్కూవ్ విద్య పూర్తయ్యాక ఖాళీగ ఔందే పరిస్థితి కూద అతక్కువే - అప్పటి అన్ని ప్రెసిడెన్సీలలోనూ అంతే!మీరు వరప్రసాదం అనుకుంటున్న్న మెకాలె ఎడ్యుకేషను ఖరీదు కావటం,మాతృభాషలో లేకపోవటం,బోధనలో క్వాలిటీ లేకపోవటం లాంటి రోగాలు వచ్చి చేరాయి.మెకాలే మనల్ని బాగుచెయ్యటానికి కాదు కొత్త విద్యావిధానం పెట్టింది,తమకి బానిసల్ని తయారు చేసుకోవటానికి.అది తెలియక పొలోమని పోటీలు పడి చదివి ఏమి ఉద్ధరించారు?వాళ్లకి చాలీనంతమందిని వడకట్టి తీసుకుంటే మిగతావాళ్ళు నిరుద్యోగం రుచి ఎలా ఉంటుందో రుచి చూసారు.అప్పటినుంచి అదే పరిస్థితి కొనసాగుతున్నది.చరిత్ర తెలియదు.తెలుసుకోవాలని కూడా అనుకోరు.ఒక ప్రశ్నకి వెయ్యిసార్లు జవాబు చెప్పినా వెయ్యిన్నొకటోసారి కూదా అదే ప్రశ్నని వేస్తుంటే దాన్ని కేవలం అజ్ఞానం అనాలా,లేక ఈ హరిబాబు చెబితే మేం వినేదేమిటి మారేదేమిటి అన్న అహంకారం అనుకోవాలా?

    ఒక సూటి ప్రశ్న వేస్తాను,బాగా ఆలోచించుకుని జవాబు చెబుతారా?నిజమే,ఒకనాడు అస్పృశ్యత ఉంది,మనుస్మ్ర్తిలో దాన్ని సమర్ధించహె శ్లోకాలు ఉన్నాయి.నా బ్లాగులోనూ వాటిని నేనూ సాక్ష్యాలు చూపించి చెప్పాను.కానీ ఉందని చెప్పి బ్రహ్మల్ని తిట్టటంతో సరిపెట్టుకోకుండా దానినుంచి బయటపడటానికి దళితులకి ఎన్నేళ్లు పడుతుంది?రిజర్వషన్ల మీద అంత ఆశపెట్టుకుని పోరాడి సాధించిన అంబేద్కర్ 1950లోనే "నా కెప్తెన్లు నన్ను మోసం చేశారు.రిజర్వేషన్లని నేను వూహించిన పద్ధతిలో ఉపయోగించుకోవతం లేదు,స్వార్ధపరులైపోయారు" అని కన్నీళ్ళు పెట్టుకున్న సన్నివేసం జరిగిందా లేదా?ఆ కెప్టెన్లు ఎవరు?వారు అంబేద్కరుని మోసం చెయ్యటానికి కూడా బ్రాహ్మణులే కారణమా?ఎవడి స్వర్ధం వాడు చూసుకోవటానికి దళిత మేధావులే అతీతులు కానప్పుడు బ్రాహ్మణుల్ని తప్పుపట్టి ప్రయోజనం ఏమిటి?

    ReplyDelete
  6. అడిగబడిన ప్రశ్నవేరు. అడగబడిన ప్రశ్న కులానికీ హిందూమతానికీ ఉన్న సంబంధం గురించి. మీరు నా సమాధానంతో అంగీకరించినట్లుగానే కులం హిందూమతంలోని అంతర్భాగం. మీరు జవాబిస్తున్నది మరొక ప్రశ్నకు.

    బ్రాహ్మణులు అంత నోరులేనివారేమీకాదు. బ్రాహ్మణుల్లో ఎక్కువమంది పేదవారుండుండవచ్చు. నైష్పత్తికంగా దళితుల్లో అంతకంటే ఎక్కువమంది పేదవారున్నారు. మనకు సాంస్కృతిక పరమైన కారణల దృష్ట్యా బ్రాహ్మణుల్లోని పేదరికమ్మాత్రమే అత్యంత తీవ్రమైనదిగా కనిపిస్తుంది. దళితులుకూడా ఆలయ నిర్మాతలే అంటూ anecdotal evidences ఇవ్వడం మానుకోవాలి. అదే దళితులు గుర్రపుస్వారీ చేసినందుకు ఊచకోతబడుతారు. అదే దళితులు అగ్రవర్ణపు అమ్మాయిని చేసుకున్నందుకు మొత్తం పల్లె తగలబడుతుంది. దొంగతనం చేశారన్న అనుమానంతో గుడ్డలూడదీసి, పేపర్లలో ఫోటోలు వేస్తారు. ఇవి మీకెందుకు గుర్తుకురాలేదు? బాగుపడ్డ కొందరి కధలను అందరి కధలుగా మీరు చెప్ప ప్రయత్నించడాన్ని ఇంగ్లీషులో positive thinking అంటారేమోకానీ, తెలుగులో మసుపూసి మారేడుకాయ చెయ్య ప్రయత్నించడం అంటారు.

    బాబూ హరిబాబూ... నేను దళితుణ్ణికాదు. దళితవాదానికి సమర్ధకుణ్ణి అంతే. ఒకవాదాన్ని స్వార్ధంతోమాత్రమే సమర్ధించగలమీకు అందరూ అలానే ఉంటారనుకోవడం కొత్తవిషయం కాదనుకుంటా.

    రిజర్వేషన్ల అసలు ఉపయోగం మీరన్నట్లు వ్యక్తిగత అభివృధ్ధికాదు. విద్యనేర్చిన దళితులు తమ అవగాహనను పంచి, బ్రాహ్మణాధిక్యతాదర్శంకోసమ్మాత్రమే నిర్మించబడిన హిందూమతపు పునాదులను సాయుధపోరాటంద్వారా పెకిలించి మరో renaissanceను ఇండియాలో సాధించడమ్మాత్రమే.

    మోసగాళ్లు ప్రతిఉద్యమంలోనూ ఉంటారు. బ్రాహ్మణులుగా పుట్టినకొందరు బ్రాహ్మణధిక్యవాదానికి జెల్లకొట్టి సర్వమానవ సమానత్వాన్ని బొధించలేదా? అలాగే దళితుల్లోనూ సంస్కృతి వంటబట్టించిన అన్ని అవలక్షణాలున్నవారున్నారు. అంతమాత్రాన అంబేద్కరు చెప్పింది తప్పుకాదుగా!

    ReplyDelete
    Replies
    1. @విశేషజ్ఞ విశేషజ్ఞDecember 20, 2017 at 8:47:00 AM GMT+5:30
      అడిగబడిన ప్రశ్నవేరు. అడగబడిన ప్రశ్న కులానికీ హిందూమతానికీ ఉన్న సంబంధం గురించి. మీరు నా సమాధానంతో అంగీకరించినట్లుగానే కులం హిందూమతంలోని అంతర్భాగం. మీరు జవాబిస్తున్నది మరొక ప్రశ్నకు.

      hari.S.babu
      మీరు అంటున్నది - "కులానికీ, మతానికీ సంబంధం లేదనడం సత్యదూరమైన వాదన." అని!నేను అంటున్నది - "పూర్తిగా తప్పుడు అభిప్రాయం ఇది!ఎందుకంటే ప్రతి కులమూ ఒక లౌకికవృత్తికి సంబంధించిన గుంపు.దీనికి సాక్ష్యం ప్రాచీన కాలం నుంచి గ్రామం,నగరం అంటూ ఏర్పడి అవి రాజ్యం అనే వ్యవస్థకి రూపాంతరం చెందిన సమాజంలో "చాకలి వీధి","మంగలి వీధి","కంసాలి వీధి" అని ఒక వృత్తికి సంబంధించినవాళ్ళు ఒకచోట చేరేవాళ్లు.ఇందులో ఉన్న మతానికి సంబంధిన అంశం ఏమిటి?ఆయా వృత్తుల మీద పట్టు సాధించడానికీ ఆదాయాన్ని పంచుకోవడానికీ వాళ్ళు చేసుకున్న ఏర్పాటులో బ్రాహ్మణులు పైనుంచి రుద్దడం ఎట్లా జరుగుతుంది?" అని!ఇంక నేను మీ అభిప్రాయాన్న్ని సమర్ధించి వేరే ఏదో ప్రస్నకి జవాబు చెప్పదం ఏమిటి?నేను జవాబు చెబుతున్నదీ ఆ పర్శ్నకే,అదీ మీతో పూర్తిగా విభేదిస్తున్నాను.ముందు అది గమనించండి.

      @visaeshajna
      బాబూ హరిబాబూ... నేను దళితుణ్ణికాదు. దళితవాదానికి సమర్ధకుణ్ణి అంతే. ఒకవాదాన్ని స్వార్ధంతోమాత్రమే సమర్ధించగలమీకు అందరూ అలానే ఉంటారనుకోవడం కొత్తవిషయం కాదనుకుంటా.

      hari.S.babu
      నేను హిందూమతాన్ని సమర్ధిస్తే స్వార్ధంతో సమర్ధించినట్టూ మీరు దళితులు కాకపోయినా దళీతవాదాన్ని సమర్ధిస్తే ఔదార్యంతో సమర్ధించినట్టూ అవుతుందా?ఏ లెక్క ప్రకార్మ్ అవుతుంది?మీకు మీరే నేను మంచివాణ్ణి హరిబాబు హరిబాబు చెడ్దవాడు అని తీర్మానించదం కూదా మర్యాదయేనా?ఎవడిచ్చాడు మీకా అధికారం?ఇక్కడ మర్యాద్ లేకుందా ఇలా తీర్మానించిన మీరే మరొక చోట నేను మర్యాద పుస్తకాన్ని పోగొట్టుకున్నాను అంటున్నారు!ఇక్కడ మర్యాద పుస్తకాన్ని పోగొట్టుకున్నది ఎవరు -- మీరా నేనా?హిందూద్వేషిని అని బోర్డు పెట్తుకుని కాషాయం కనిపిస్తే చింపుతాననడం,తను ఇతరుల్ని ఎన్నయినా అనవచ్చు గానీ తనని గూన్స్ అన్నందుకే ఎపెండిక్సు బద్దలయ్యేలా కొట్టడం,రియల్ ఇండియన్ అని పేరు పెట్టుకుని వచ్చి అదిగిన దానికి జవాబు చెప్పమంటే నువ్వు మోదరేషన్ ఎత్తేస్తే బూతులు తిట్టి నాకసి తీచుకుంటాను తప్ప జవాబు మాత్రం చెప్పనని మొందికెత్తదం - ఇవన్నీ మర్యాదస్తులు చేసే పనులేనా?

      Delete
    2. @విశేషజ్ఞ విశేషజ్ఞDecember 20, 2017 at 8:47:00 AM GMT+5:30
      అదే దళితులు అగ్రవర్ణపు అమ్మాయిని చేసుకున్నందుకు మొత్తం పల్లె తగలబడుతుంది.

      hari.S.babu
      తనని తిరస్కరించినదన్న కారణంతో రాంకుమార్ అనే బ్రాహ్మణేతరుడు స్వాతీ అనే బ్రాహ్మలమ్మాయిని వేటకత్తితో నరికి చంపాడు.అయినా బ్రాహ్మలేవరూ వూళ్ళు తగలబెట్టలేదు,స్వాతి తండ్రి మీడియా మీ స్పందన ఏమిటి,మీ వాదన ఏమిటి,మీరేమైనా చెబుతారా అని వెంటపడినా ఎందుకు రచ్చకెక్కలేదు,ఎందుకని?

      నేను ఉదాహార్నలు చూపించి నిలదీస్తే అన్ని కులాల్లోనూ దుర్మార్గులు ఉన్నారంటూనే మళ్ళీ అన్ని దుర్మార్గాలకీ బ్రాహ్మణులే కారణం అంటున్నారు.మీరు చెప్పే ప్రాచీన కాలపు దుర్మార్గాలు జరిగిన కాలంలో బ్రాహ్మణులు ఉద్యోగులుగానే ఉందేవాళ్లు,రాజులు చాలామంది బ్రాహ్మణేతరులే - ఇంకా గట్టిగా లెక్కించి చెప్పాలంటే కోయలూ చెంచులూ కూడా తక్కువ కాలమే నిల్బడినా రాజ్యాలు స్థాపించినవాళ్ళే!చరిత్రని చూస్తే ముగల్ సామ్రాజ్యం కూడా పరిపాలనలో హిందూరాజుల పద్ధతినే అనుసరించింది,ఇంగ్లీషువాళ్ళు ప్రపంచం మొత్తంలో తమ వలస దేశాలలో కూడా ఇదే పద్ధతుల్ని పాటించారు.రాజ్యానికి విధేయత కావాలి.దానికోసం తమకి అనువైన ధర్మశాస్త్రాలని రాయించుకున్నారు.ఒకే రకమయిన ఏర్పాటు అన్ని సమాజాల్లోనూ ఉన్నప్పుదు ప్రత్యేకించి ఒక సమాజాన్నే దానికి బాధ్యుల్ని చెయ్యదం ఎంతవరకు సమంజసమ అని నేను అడుగుతుంటే "ఈ ప్రశ్నకు మాత్రమే పరిమితమై చర్చ్ ఉంటే" అనటంలో మీ ఉద్దేశం ఏమిటి?మీకు కావలసిన జవాబుని రాబట్టుకోవదానికి మీరు ప్రశ్న అడిగారా?

      మతం అనేది ఆధ్యాత్మీకతకి సంబంధించినది,కులం అనేది సమాజానికి సంబంధించినది.కులం వృత్తులకి అనుబంధమైనది - అది ఆదాయం కోసం ఏర్పడింది.దానిమీద పన్నులు వేసే అధికారం ఉన్నది కాబట్టీ కులం రాజ్యానికి అనుబంధంగా ఉంటుందే తప్ప మతానికి సంబంధించినది కాదు.

      ఆలయాలలోనికి ఇంట సూతకం వస్తే బ్రాహ్మణుణ్ని కూడా రానివ్వరు.వాటికి సంబంధించిన సంస్తమయిన విషయాలూ పందగలప్పుడు రానివ్వలేదని మీరు వకాల్తా పుచ్చుకుంటున్న కులాలవారికీ తెలుసు!మోప్లా హిందువుల వూచకోత సందర్భంలో ఇద్దరు దళితులు - అదీ ఇక్కడ మనం మాదిగలు అని పిలుచుకునే వారికి సమస్థాయి అనదగ్గ కులానికి చెందినవారు ఇస్లాములోకి వస్తారా చస్తారా అంటే మేము హిందువులుగానే చస్తాం ఇస్లాములోకి రాము అని తెగేసి చెప్పారు,వాళ్ల చేతుల్లో చచ్చిపోయారు.ఎవరి అనుభవాలు వారివి,ఎవరి అవమానాలు వారివి,

      నేను నిలదీస్తే దళితుల్లోనూ దుర్మార్గులు ఉందవచ్చును అని ఒప్పుకుంటూనే మళ్ళీ "విద్యనేర్చిన దళితులు తమ అవగాహనను పంచి, బ్రాహ్మణాధిక్యతాదర్శంకోసమ్మాత్రమే నిర్మించబడిన హిందూమతపు పునాదులను సాయుధపోరాటంద్వారా పెకిలించి మరో renaissanceను ఇండియాలో సాధించడమ్మాత్రమే." మీకు లక్ష్యం అంటుంటే ఇంక హిందువుల నుంచి వచ్చే వాదనలకి విలువ ఏముంటుంది?

      దళీతవాదాన్ని సమర్ధించిన విసేషజ్ఞ తనకి తనే ఔదార్యాన్ని దఖలు పర్చేసుకుని హిందూమతాన్ని సమర్ధించిన హరిబాబుకి స్వార్ధాన్నీ అంటగట్టేసి హరిబాబు మర్యాదల పుస్తకాన్ని పోగొట్టుకున్నాడని కూడా తీర్మానించేశారు.

      అన్నీ తీర్మానాలే - అభిప్రాయసేకరణలు మాత్రం లేవు!అన్నీ సూత్రీకరనలే - సాక్ష్యాలు మాత్రం లేవు!ఈపాటి వ్యవహారానికి ప్రశ్నలు వెయ్యడం దేనికి?హిందువుల్ని చర్చలకి పిలవదం దేనికి?మీలో మీరు తీర్మానాలు చేసుకుని మీ చంకలు మీరు గుద్దుకుంటే సరిపోతుంది కదా!

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top