Maharshi movie, a great tribute to farmers.

మహర్షి సినిమా చాలా బాగుంది. వంశీ పైడిపల్లికి అభినందనలు. ఇప్పటి దర్శకులలో కొరటాల శివ మీద మాత్రమే ప్రత్యేక అభిమానం ఉన్న నాకు మహర్షి సినిమా చూశాక వంశీపైన గౌరవం పెరిగింది. నేటి తరానికి బోర్ కొట్టకుండా తమ బాధ్యతని, తాము మరచిపోతున్న మూలాలని గుర్తించడానికి పనికొచ్చేలా అనుక్షణం తీర్చిదిద్దిన మూవీ మహర్షి.

పల్లె మూలాలను ప్రేమించే ప్రతీ వ్యక్తి ఇది నిజమైతే బాగుండు.... ఇలా జరిగితే బాగుండు.... అనిపించేలా ఉంది మహర్షి సినిమా.... ఈ సినిమాలోని ముసలి రైతు పాత్ర వ్యవసాయం గురించి ‘ఏ నా కొడుకయ్యా నా భూమిని లాక్కునేది....’ అని కార్పోరేటులకు హెచ్చరికగా డైలాగులు చెప్పేటపుడు థియేటర్ లో అన్ని క్లాసుల ప్రేక్షకుల నుండీ ఈలల మోత మోగింది. బహుశా మహేష్ అభిమానులు అతనికి కొట్టే ఈలల కంటే కూడా సగటు ప్రేక్షకుడిగా ఒరిజినల్ గా వచ్చిన ఈలలవి. పల్లెప్రపంచంపై మనలోపల దాగి ఉన్న నిజమైన ప్రేమకి ఆనవాలుగా ఈ ఈలలని గుర్తించాలి.

శ్రీమణి పాటల సాహిత్యం, దేవిశ్రీ మ్యూజిక్, డైలాగ్స్ .... అన్నీ బాగున్నాయి. పాత్రలకి తగిన నటులను ఎన్నుకున్నారు. ముఖ్యంగా అల్లరి నరేష్ కు ఈ సినిమాతో కొత్త కెరీర్ ప్రారంభం కావడం ఖాయం. జయసుధ పాత్ర కూడా బాగుంది.

హీరో కృష్ణ పోలికలు అడుగడుగునా కనిపించే మహేష్ నటనలో మాత్రం కృష్ణతో పోల్చలేము. కానీ ఈ సినిమా మాత్రం కృష్ణని గుర్తు చేస్తుంది. కృష్ణ అభిమానులకు మహేష్ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. మహేష్ ఈ సినిమాతో నిజమైన సూపర్ స్టార్ గా ఎదిగాడు. కానీ, ఈ సినిమా ప్రారంభానికి ముందు మహేష్ నటించిన థమ్సప్ యాడ్ ధియేటర్లలో వేస్తుండడం సినిమాకి, నిజానికి ఉన్న తేడాని గుర్తు చేస్తుంది. మహేష్ ఇకనైనా ఆలోచించి ఇలాంటి ఇలాంటి చెత్త యాడ్స్  చేయకుండా ఉండే డేరింగ్, డేషింగ్ నేచర్ అలవరచుకుంటాడని, సినిమాలలో మాత్రమే గాక బయటకూడా సామాజిక బాధ్యతని గుర్తిస్తడాని ఆశిద్దాం.

ఇప్పటి యూత్ చూడాల్సిన, చూపించాల్సిన సినిమా మహర్షి. నిడివి ఎక్కువ ఉన్నా ఆఖరి సన్నివేశం వరకూ ధియేటర్లో కూర్చుండబెట్టేలా ఈ సినిమాని అద్భుతంగా మలచిన వంశీ పైడిపల్లికి మరోసారి అభినందనలు.


Post a Comment

  1. కృష్ణ అని వ్రాయాలి కదా ?

    ReplyDelete
    Replies
    1. ‘లేఖిని’ని ఉపయోగించి మార్చేశాను.

      Delete
  2. అవును. కానీ నా లాప్ టాప్ లో రావడం లేదు. సాఫ్ట్వేర్ మార్చాలి.

    ReplyDelete
  3. రైతు సమస్యలను దైన్యాన్ని కూడా తెలివిగా సినిమా బిజినెస్ కు వాడుతున్నారు. వందల కోట్ల బడ్జట్ తో సినిమాలు తీస్తూ పదుల కోట్లు పారితోషికం తీసుకుంటున్న వారు నిజంగా రైతులకు సహాయమ చేస్తే బాగుంటుంది. ఒకవైపేమో అమెరికాలో కార్పొరేట్ అధిపతి చాలా సులభంగా అయిపోతాడు హీరో. మన దేశంలో మాత్రం కార్పొరేట్ బూచితో పోరాడతాడు. ఇదే సినీ మాయ.

    ReplyDelete
    Replies
    1. This is common Sir.. Same thing was shown in Circar.. I'm sure even Satya Nadella or Sundar P can't get things done here in India as they could make possible in USA.
      I received my Family Visa extension Documents with a name change very comfortably in a Day but took me a couple of months to get the same amendment for the certificate here after using high influence and 2 Big bucks :)

      I have watched it yesterday.. If we ignore glitches here and there, overall movie was good!!

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top