జ్యోతిషులకి కంటికి కనిపించే ఐదు గ్రహాలే తెలుసు. అవి బుధుడు, శుక్రుడు, అంగాకరకుడు (మంగళుడు), బృహస్పతి (గురువు) & శని. సీరెస్, నెప్ట్యూన్, ప్లూటో గ్రహాల గురించి వాళ్ళకి తెలియదు. రాహుకేతువులు అనే గ్రహాలు లేవు. దాని గురించి మనం పెద్దలని అడిగితే అవి ఛాయాగ్రహాలని వాళ్ళు బుకాయిస్తారు. గ్రహణం సమయంలో సూర్యచంద్రుల మీద పడే నీడలనే రాహుకేతువులంటారని వాళ్ళ బుకాయింపు. నీడలు వేరు, గ్రహాలు వేరు. జ్యోతిషులు ఇప్పుడు కూడా సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని రాహువు మింగుతాడనీ, చంద్రగ్రహణం సమయంలో చంద్రుణ్ణి కేతువు మింగుతాడనీ చెపుతారు. ఆ నీడల గురించి జ్యోతిషులకి ఏమీ తెలియదు. ఖగోళ శాస్త్రం కొద్దికొద్దిగా తెలిసినవాళ్ళు జ్యోతిష్యం మీద నమ్మకం వదులుకోలేక, ఖగోళ శాస్త్రం తప్పని చెప్పుకోలేక రాహుకేతువులకి ఛాయాగ్రహాలని కొత్త పేరు పెడుతుంటారు. 

సీరెస్‌ని సైంటిస్టులు ఒకప్పుడు ఒక ఏస్టరాయిడ్ (గ్రహ శకలం) అనుకున్నారు. అందుకే సీరెస్ గురించి చాలా మందికి తెలియదు, జ్యోతిషులకి కూడా. నెప్ట్యూన్ గ్రహం హై రిజల్యూషన్ టెలీస్కోప్‌తోనే స్పష్టంగా కనిపిస్తుంది. గెలీలియో కాలం నాటి టెలీస్కోప్‌తో చూస్తే అది నక్షత్రంలాగ కనిపిస్తుంది. జ్యోతిషుల దగ్గర ఏ టెలీస్కోప్‌లూ ఉండవు. వాళ్ళకి నెప్ట్యూన్ గ్రహం గురించి తెలియకపోవడంలో వింతేమీ లేదు. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ టెలీస్కోప్‌లు కూడా ఉన్నాయి. వాటితో చూస్తే కంప్యూటర్ స్క్రీన్ మీద సీరెస్ కంటే చాలా చిన్నవైన ఏస్టరాయిడ్స్ కూడా కనిపిస్తాయి. ఖగోళ శాస్త్రం ఇంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో రాహుకేతువులని నమ్మడం, అవి ఛాయాగ్రహాలని చెప్పి మన నమ్మకాన్ని సంతృప్తిపరుచుకోవడం అవసరమా?

- Praveen the freethinker


*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. https://youtu.be/1abKgsKVOZA

    మనం బ్లాగులు మాత్రమే చదివితే బ్లాగుల్లో జరిగే విషయాలే తెలుసుకోగలుగుతాం. ఫేస్ బుక్ లోనో ట్విట్టర్ లో ఏం జరుగుతుందో తెలుసుకోలేం కదా ?

    అలాగే భూమికి దగ్గరగా ఉన్న గ్రహాలగురించి మాత్రమే జ్యోతిష్యులు చెప్పగలుగుతారు.వాళ్ళు చెప్పింది నిజమా కాదా అనది తెలుసుకోవాలంటే మన జాతకంలో కూడా శుభగ్రహాల అనుగ్రహం ఉండాలి.

    మనమీద కుజ గ్రహ ప్రభావం ఉంటే అన్నిటినీ అనుమానించడం, అందరినీ దూషించడం జరుగుతుంది.

    ReplyDelete
    Replies
    1. Hindu puranas mention only five planets. Some people argue that Uranus was mention as Prajapati but their argument is not proven. It is hard to see Uranus with naked eye.

      Delete
  2. @నీహారిక : How could you believe such nonsense? Astrologists are the worst lost right next to robbers and politicians. You should seriously study some science and unlearn this nonsense about the good-planets (auspicious planets) and rhe bad-ones.

    ReplyDelete
  3. Astrologists are the worst lost right next to robbers and politicians.

    I agree with this statement.

    ReplyDelete
  4. >>You should seriously study some science and unlearn this nonsense about the good-planets (auspicious planets) and rhe bad-ones.>>

    Astrology is also science which I believe. Astronomy is classification of stars and Astrology means study of stars.

    ReplyDelete
    Replies
    1. Astrology is not science but pseudoscience. Science calls for some rationale, repeatability and universality. Astrology doesn't involve the study of stars. It's just about the hubris that claims that the stars are purposed for determining the fates of humans. నక్షత్రాలు, గ్రహాలు మనుహుల గతిని నిర్ణయించడనికేననుకొనే అజ్ఞానం, అహంకారం జ్యోతిష్యానికి మూలం. On the contrary, astronomy is about the study of stars, universe in general (sort of cosmology).

      Delete
    2. ఆ నక్షత్రాలు & గ్రహాల కాంతి కూడా భూమి మీద సరిగా పడదు. వాటి ప్రభావం మన అదృష్టం మీద పడుతుందా? భూమి మీద ఉల్కల (meteors) ప్రభావమే ఎక్కువ ఉంటుంది. కానీ మనిషిని ఉల్క శకలం (meteorite) గుద్దినట్టు recorded evidences లేవు. 71% of the earth area is covered by water and meteorites mostly fall in sea.

      Delete
    3. గ్రహాలకి కాంతి లేదు... వాటీ కాంతి మనమీద ప్రసరించడమనే సమస్యే లేదు. ఇక నక్షత్రాలంటారా... కొన్ని వందల వేల కాంతిసంవత్సరాల దూరంలో ఉన్నాయి అవి. మన ముత్తాతలు బతికున్నప్పుడు ఇప్పుడూ మనకు కనిపిస్తున్న ప్లేసులో ఉన్నాయి ఆ నక్షత్రాలు. అంతేగాని ఇప్పుడు మనం చూస్తున్న ప్లేసులో లేవు. ఆవిషయం తెలియని మన మోసగాల్లు.. వాటినాధారం చేసుకోని, వ్యాపరస్తులతో కుమ్మక్కై.. రంగు రాల్లు, లోహాలు అంటూ సామాన్యుల్ని ఇంకా పిచ్చివాల్లని చేస్తున్నారు.

      Delete
    4. అన్నిటి కంటే పెద్ద ఫార్స్ ఏమిటంటే జ్యోతిషులు గడియారంలోని టైమ్ ఆధారంగా ముహూర్తం పెట్టడం. జ్యోతిషం వ్రాసిన కాలంలో గడియారాలు లేవు. అప్పట్లో ఇండియా, చైనాలలో పగటి పూట సూర్యుని దిక్కు, రాత్రి పూట నక్షత్రాల దిక్కు చూసి టైమ్ నిర్ణయించేవాళ్ళు. కాకినాడ కంటే శ్రీకాకుళంలో సూర్యోదయం తొందరగా అవుతుంది. జ్యోతిషుడు కాకినాడలో సూర్యోదయం అయ్యే టైమ్‌ని తెలుగు కాలెండర్‌లో వ్రాసినా కాకినాడలో కంటే దానికి తూర్పున ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం తొందరగా అవుతుంది, పశ్చిమాన ఉన్న ప్రాంతాల్లో సూర్యోదయం ఆలస్యంగా అవుతుంది.

      Delete
  5. @ unknown,
    Tell me your date of birth, time of birth and place of birth (with out ur name.) I will tell you some thing about you. Believe or not up to you. I have some knowledge but not a scholar.

    ReplyDelete
    Replies
    1. I'm afraid, I don't participate in these sort of gamblings/wagers.

      Delete
  6. >>It's just about the hubris that claims that the stars are purposed for determining the fates of humans. >>

    Astrology consists of number of belief systems that has been rejected by scientific community as having no explanatory power for describing the universe.

    ఒక జ్యోతిష్యుడిని భవిష్యత్తు గురించి అడుగుతారు కానీ డాక్టరుని పేషెంట్ బ్రతుకుతాడో లేదో చెప్పమని అడగరు. అదీ సైన్సే కదా ?
    ఆపరేషన్ చేసిన తరువాత చస్తే ఎందుకు చచ్చాడో చెప్పగలరు కానీ చేయకముందే చావబోతున్నాడని చెప్పలేరు.
    ఇదే పని మన శర్మ గారు చేస్తున్నారు. అమావాస్య ముందు ఫలానా ఘోరం జరుగుతుంది అని చెపుతారు. అమావాస్య తరువాత ఇదిగో నేను చెప్పింది జరిగింది చూడండి అంటున్నారు.
    కొన్నిసార్లు డాక్టర్ చెప్పింది జరగవచ్చు కొన్నిసార్లు శర్మ గారు చెప్పింది జరగవచ్చు కానీ వీటన్నిటికంటే మనిషి మేధస్సు తెలివితేటలు కీలకమైనవి. ఎలాగూ చావబోతున్నాను కదా అని ఏడుస్తూ కూర్చోకుండా సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో పరీక్షిత్తు మహారాజు గారిని చూసి నేర్చుకోమనీ వాళ్ళే చెప్పారు.

    సైన్స్ కంటే జ్యోతిష్యం కంటే మనిషి మేధస్సే కీలకం. చంద్రబాబు గారు గెలుస్తారని నేను చెపుతున్నాను గెలవడని ప్రశాంత్ కిషోర్ చెపుతున్నారు. నాది జ్యోతిష్యం ఆయనిది సైంటిఫిక్ అప్రోచ్.

    మానవ ప్రయత్నం ఎక్కడ బాగా పనిచేస్తుందో అదే గెలుస్తుంది.

    ReplyDelete
  7. "ఒక జ్యోతిష్యుడిని భవిష్యత్తు గురించి అడుగుతారు కానీ డాక్టరుని పేషెంట్ బ్రతుకుతాడో లేదో చెప్పమని అడగరు. అదీ సైన్సే కదా ?
    ఆపరేషన్ చేసిన తరువాత చస్తే ఎందుకు చచ్చాడో చెప్పగలరు కానీ చేయకముందే చావబోతున్నాడని చెప్పలేరు. "

    Wrong. డాక్టర్ అంచనా వెయ్యగలడు ఏమాత్రం అవకాశాలున్నాయి పేషెంటు బ్రతకడానికి అని. ఒక విద్యార్ధికూడా తాను పాసయ్యేది లేనిది చెప్పగలడు (సంభావ్యత అనేది ఒకటుంటుంది). ఆమాత్రం దానికి జ్యోతిష్యం అఖర్లేదు.

    శర్మగారి గురించి అప్పట్లోనే విన్నాను. పొరుగుదేశంలో వరదలొస్తే, దానికి నేలమీది కారణాలు వదిలి, గ్రహాలమీదకి దృష్టి సారించిన ఘనుడాతడు. రోజుకి లక్షమందికి పైగా చనిపోతుంటారు. ప్రమాదాలూ అంతే! ఈయనొక ముక్క అనేసి ఊరుకుంటాడు. ఏదో ఒకటి జరుగుతుంది, ఇది రాస్తున్నప్పుడుకూడా ఏక్కడొ ఒకచోట ఒక యాభైమంది గుంపగుత్తగా హరీ మంటుంటారు. కొన్నిసార్లు అవి పేపర్లలో పడి ఆయన "చూశారా!" అని విర్రవీగడానికి కారణమవుతుంటాయి. ఆయనకు చేతనైతే ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయో చెప్పమనండి, లేదా ఎప్పుడు జరుగుతాయో చెప్పమనండి, లేదా ఎంతమంది చనిపోతారో చెప్పమనండి. అదీ కాలజ్ఞానమంటే! అదీ prediction అంటే. మరి ఆయన ఏమీ చెప్పనప్పుడుకూడా ప్రమాదాలు జరుగుతునాయిగా వాటిల్నేమిచేద్దాం? ఏ లెక్కల్లో కలుపుదాం వాటిని?

    "మానవ ప్రయత్నం ఎక్కడ బాగా పనిచేస్తుందో అదే గెలుస్తుంది."
    This is true. But how does this human-effort factor in (your) predictions? If this is what that decides the end-game, why do we need all those useless calculation involving all those planets and stars?

    చంద్రబాబు లేదా జగన్ గెలుస్తాడని నేనూ అనగలను (మొన్నటి అమెరికా ఎన్నికల్లో ఒక ప్రబుధ్ధుడు హిల్లరీ గెలుస్తుందని జోస్యం చెప్పి, ఆనక చెంపలు వాయించుకున్నాడు). దాన్ని జోస్యం అనరు. చేతనైతే ఎన్ని సీట్లు అన్నది చెప్పండి. ప్రశంత్ కిషోర్ చేసేదాన్ని సెఫాలజీ పని. ఖచ్చితంగా మాట్లాడాల్సొస్తే అదికూడా సైన్సుకాదు. Hard science అసలేకాదు.

    ReplyDelete
    Replies
    1. how does this human-effort factor in (your) predictions? If this is what that decides the end-game, why do we need all those useless calculation involving all those planets and stars?

      మంచి ప్రశ్న ! జ్యోతిష్యులు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే కొన్ని కొన్ని లెక్కల ప్రకారం ఫలానాది జరగబోతుంది అని చెపుతున్నారు. ఎపుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది చెప్పలేకపోతున్నారు. ఒక మనిషికి కోడి కత్తి గండం ఉంది అని చెపుతారు కానీ ఎవరు చేస్తారు ఎపుడు చేస్తారు అని చెప్పలేరు. కత్తిపోటు మాత్రం గ్యారెంటీ అన్నమాట ! ఎవరున్నా లేకపోయినా సూర్య చంద్రులు ఉంటారు కదా ? సూర్యచంద్రులే అందరికీ సాక్షి. కనిపించని వాటిని నమ్మకపోయినా కనిపిస్తున్నవాటినైనా నమ్మాలి కదా ? ఎండాకాలంలో పుడతారు కాబట్టి ఏప్రిల్ మే నెలలో పుట్టినవాళ్ళు సాధారణంగా కోపంగా ఉంటారు. అమ్మా నాన్నలు ఏ సీ లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే మే నెలలో పుట్టినా సౌమ్యంగానే ఉంటారు. ఒక మనిషి కోపిష్టిగా మారడానికి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది అని అర్ధం అవుతుంది కదా ? ఏ ఒక్కడి జాతకమో చూసి ఒక అంచనా వేయకూడదు. అమ్మ, నాన్న, ఉంటున్న ప్రదేశం అన్నీ చూసి లెక్కలు వేయాలి. ఇవన్నీ ఎవరు చేయగలరు ? అన్ని జబ్బులకూ ఒకటే ఏంటిబయోటిక్ ఇస్తే పనిచేయనట్లే అందరికీ ఒకే జాతకాన్ని చెపితే పనిచేయదు. డాక్టర్ అయినా జ్యోతిష్యుడు అయినా ఆ మనిషి అయినా జరగబోయేదాన్ని జరుగకుండా ఆపలేరు. స్వీట్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళకే షుగర్ వ్యాధి ఎందుకొస్తుందో, వెల్లుల్లి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకే బీ పీ ఎందుకొస్తుందో చెప్పడానికి పెద్ద సైన్స్ అవసరం లేదు కానీ సూర్యుని నీడని చూసి సమయం చెప్పడం లాంటిదే జ్యోతిష్యం అని మాత్రం చెప్పగలను.

      Delete
    2. "మనిషికి కోడి కత్తి గండం ఉంది అని చెపుతారు కానీ ఎవరు చేస్తారు ఎపుడు చేస్తారు అని చెప్పలేరు. "
      No one actually did that so far and could never do that.


      "కనిపించని వాటిని నమ్మకపోయినా కనిపిస్తున్నవాటినైనా నమ్మాలి కదా ? "
      Nope. The astrological predictions made so far have been vague (and so apply to a wide range of happenings) or out right incorrect. When there is a higher correlation, I would start believing it. But the thing is... so far, none has achieved it.

      "ఎండాకాలంలో పుడతారు కాబట్టి ఏప్రిల్ మే నెలలో పుట్టినవాళ్ళు సాధారణంగా కోపంగా ఉంటారు. అమ్మా నాన్నలు ఏ సీ లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే మే నెలలో పుట్టినా సౌమ్యంగానే ఉంటారు."
      Most risible argument/claim ever made with me.

      "స్వీట్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళకే షుగర్ వ్యాధి ఎందుకొస్తుందో, వెల్లుల్లి అంటే ఇష్టం ఉన్న వాళ్ళకే బీ పీ ఎందుకొస్తుందో చెప్పడానికి పెద్ద సైన్స్ అవసరం లేదు"
      Again... laughable. The cause of diabetes is a condition called Insulin Resistance. Though consuming sweets could not cause diabetes, the patients are proscribed sweets once they are affected. Same goes with BP. Please do yourself a favour, read and check your facts before you post and make .a laughing stock of yourself.


      The reason that Astrology fails to establish a cause-effect relation ship (and so fails to explain itself) should be enough reason to distrust it. The no. of matching predictions, correlation factors are just for an inductive proof (where Astrology fails time and again).

      If our cars, TVs, cable networks were to work with the equal accuracy of the best of the astrologers, we would be very much frustrated and world would be a hell. Thank god we depend on doctors for diagnosis but not on the astrologers. Thank god our cars, street lights, computers and satellites work way better than our astrologers and that Sastri guy does.


      Let me tell you this finally: gullibles, people with external centre of locus and fools alone depend on astrology or occult practises in general.

      Delete
  8. I appreciate Mr Unknown. People need his kind of scientific approach.

    ReplyDelete
  9. >>> When there is a higher correlation, I would start believing it. But the thing is... so far, none has achieved it.

    Let me tell you this finally: gullibles, people with external centre of locus and fools alone depend on astrology or occult practises in general.>>>

    Alas ! For God sake don't be foolish !

    ReplyDelete
  10. That is not foolish, that's called rational.

    ReplyDelete
  11. ఒక కారుందనుకోండి, అది నూటికి యాభైసార్లు మాత్రమే స్టార్ట్ అవుతుందనుకోండి, ఆ కారునెవరైనా కొంటారా? ఎవ్వరూ కొనరు. అలావుంటే పదురూపాయలుపెట్టి ఒక లైటునుకూడా కొనం. జ్యోతిష్యాన్ని మాత్రం నూటికి పదిసార్లే పనిచేసినా నమ్మమంటారు. దాన్నాధారంచేసుకొని నిర్ణయాలు తీసుకోమంటారు. అంతేనా?

    ReplyDelete
  12. నా కయితే జ్యోతిష్యం పని చేస్తుందో లేదో అని ఎవరయినా పరిశోధించారో లేదో తెలియదు కానీ మనము ఉపయోగించే మందులు పనిచేస్తాయో లేదో అని పరిశోధించారు. ఆ పరిశోధనల సారాంశం క్రింద Atlantic లో ప్రచురించారు. అన్ని మందులూ అందరికీ పని చేయ వని.

    ఇంతకీ చెప్పొచ్చే దేమంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు.లేని వాళ్ళు లేరు. ఇంకోళ్ళని ఎద్దేవా చెయ్య వలసిన అవుసరం లేదు.

    When Evidence Says No, but Doctors Say Yes

    Long after research contradicts common medical practices, patients continue to demand them and physicians continue to deliver. The result is an epidemic of unnecessary and unhelpful treatments.


    Even if a drug you take was studied in thousands of people and shown truly to save lives, chances are it won’t do that for you. The good news is, it probably won’t harm you, either. Some of the most widely prescribed medications do little of anything meaningful, good or bad, for most people who take them.

    https://www.theatlantic.com/health/archive/2017/02/when-evidence-says-no-but-doctors-say-yes/517368/

    ReplyDelete
    Replies
    1. ఇది too much మాస్టారూ! ఒక మందు మార్కెట్లోకి వచ్చేముందు ఎన్నో ప్రయోగాలు జరుగుతాయి. ఇలాంటి వైఫల్యాలని procedural failuresగా చూడాలని నా అభిప్రాయం. మీరసలు జ్యోతిష్యాన్నీ, మెడిసిన్నీ ఒకే గాటన కట్టడమే ఒక వింత విషయం!

      Delete
  13. దానికి కాంట్రాస్టుగా జ్యోతొష్యం అనేది చాలా vagueకొండుకచో self-contradictory అండీ. పురాణ ప్రలాపం అనబడే పుస్తకంలో జ్యోతిష్యాన్ని (పరాశర మహర్షి పుస్తకం ఆధారంగానే) తూర్పార పట్టాడు రచయిత. ఏవిధంగా విభిన్న జోతిష్యంలోని భిన్న సాంప్రదాయాలు ఒకదానితో ఒకటి విభేస్తాయో, ఒక సాంప్రదాయం తనను తాను absolveచేసుకోడానికి ఎలాంటి పధ్ధతులు ఆచరిస్తుందో వివరించారు.

    జ్యోతిష్యం ఒక మూలికా వైద్యం లాంటిదండీ. అది డాక్టరు(జ్యోతిష్యుడు) కి తప్ప ఇంకొకరికి లాభం చేకూర్చదు.

    ReplyDelete
  14. Could it be disprove? If so under what conditions? అన్నది నాకు కొలమానం. పైధాగరస్ సిధ్ధాంతాన్ని మనం disprove చెయ్యాలంటే మనకు కావాల్సిందలా కొలతలు. సాపేక్ష సిధ్ధాంతం ఎలా disproveచెయ్యాలో కూడా మనకు తెలుసు. మరి జ్యోతిష్యం బూటకం అని అంగీకరించడానికి మనకు కొలమానాలేమున్నాయ్?

    ReplyDelete
    Replies
    1. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి పాము మింగడమే పచ్చి కట్టు కథ. జ్యోతిషాన్ని నమ్మకపోవడానికి ఇంత కంటే పెద్ద కారణం కావాలా?

      Delete
  15. @ ప్రవీణ్ :
    ఆ నక్షత్రాలు & గ్రహాల కాంతి కూడా భూమి మీద సరిగా పడదు. వాటి ప్రభావం మన అదృష్టం మీద పడుతుందా?

    వాటి ప్రభావం చూపటానికి కాంతి పడక్కరలేదు. రేడియో తరంగాలు పడచ్చు. Radio Astronomy అని ఒకటుంది.
    Radio astronomy is a subfield of astronomy that studies celestial objects at radio frequencies. The first detection of radio waves from an astronomical object was in 1932, when Karl Jansky at Bell Telephone Laboratories observed radiation coming from the Milky Way.
    ఆ radio waves అప్పుడే పుట్టిన పిల్లల మెత్తటి బ్రెయిన్ మీద ఎల్లా పనిచేస్తయ్యో నాకు తెలిసినంతవరకూ ఎవ్వరూ పరిశోధన చెయ్యలేదు. కానీ కడుపుతో ఉన్నవాళ్ళకి చేదు చేస్తాయని తెలుసుకుని స్కానింగ్ కి సౌండ్ వేవ్స్ వాడు తయారు(ultra sound ).
    అందుకని పుట్టిన పసిపిల్లల మెదడు మీద ప్రభావం ఎంతుంటుందో చెప్పలేము(పుట్టిన పసిపిల్లల తలకాయ కొంతకాలం మెత్తగా ఉంటుంది.)

    @ప్రవీణ్ :
    అన్నిటి కంటే పెద్ద ఫార్స్ ఏమిటంటే జ్యోతిషులు గడియారంలోని టైమ్ ఆధారంగా ముహూర్తం పెట్టడం. జ్యోతిషం వ్రాసిన కాలంలో గడియారాలు లేవు.

    వాళ్ళు పంచాంగం లో వ్రాసి నట్లు పౌర్ణమి అమావాస్యలు వస్తున్నాయి. గ్రహణాలు వస్తున్నాయి. వాళ్ళు పెట్టిన ముహూర్తాలకు జరిగిన పెళ్లిళ్లలో విడాకుల ప్రభావం అమెరికా తో పోలిస్తే సున్నా.
    నమ్మే వాళ్ళు నమ్ము తయారు. లేని వారు లేరు. మంచి డాక్టర్ ని వెతుక్కుని వెళ్లినట్లు మంచి జ్యోతిష్కుడి దగ్గరకి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయేమో.

    ReplyDelete
    Replies
    1. గ్రహణాలు ప్రతి ఏటా వస్తాయి. అవి కొన్ని చోట్ల పూర్తిగా, కొన్ని చోట్ల పాక్షికంగా కనిపిస్తాయి. అవి ఎప్పుడొస్తాయో చెప్పడం కష్టం కాదు. సూర్య గ్రహణం నాడు సూర్యుడు కనిపించకుండా చంద్రుడు అడ్డుతాడు కానీ రాహువు సూర్యుణ్ణి మింగడు. చంద్ర గ్రహణం నాడు భూమి నీడ చంద్రుని మీద పడుతుంది తప్ప చంద్రుణ్ణి కేతువు మింగడు. ఈ విషయాలు జ్యోతిషులకి తెలియవు. తెలిసినవాళ్ళేమో రాహుకేతువులు ఛాయాగ్రహాలని చెప్పి జ్యోతిషులని రక్షించడానికి ప్రయత్నిస్తుంటారు.

      Delete
  16. >>వాటి ప్రభావం చూపటానికి కాంతి పడక్కరలేదు. రేడియో తరంగాలు పడచ్చు.

    అన్నిటికన్నా మనకు దగ్గరగా ఉన్న గ్రహం సూర్యుడు. దాని రేడియేషన్ భూమికి చేరకుండా భూవాతావరణం ఆపుతోంది. ఆలాంటిది, కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రం ప్రభావం... మనమీద ఎలాపడుతుంది?

    >>వాళ్ళు పంచాంగం లో వ్రాసి నట్లు పౌర్ణమి అమావాస్యలు వస్తున్నాయి. గ్రహణాలు వస్తున్నాయి.

    పంచాంగం మన ఖగోళశాస్త్రంలో ఒక భాగంగా తీసుకొని చూస్తే... మనగొప్పదనం తెలుసుకోవచ్చు. కానీ మనం దానికి మతం రంగు పులిమి, హిందూమతం వల్లే పంచాంగం వొచ్చింది అని చెప్పుకుని, మన పూర్వీకుల జ్ఞానాన్నతా గంగలో కలిపేశాంకదా...

    >>వాళ్ళు పెట్టిన ముహూర్తాలకు జరిగిన పెళ్లిళ్లలో విడాకుల ప్రభావం అమెరికా తో పోలిస్తే సున్నా.

    Big LOL

    >>మంచి డాక్టర్ ని వెతుక్కుని వెళ్లినట్లు మంచి జ్యోతిష్కుడి దగ్గరకి వెళ్తే మంచి ఫలితాలు వస్తాయేమో

    దొంగల్లో... బందిపోట్లు, గజదొంగలు ఉంటారుగానీ.. మంచివాళ్ళు ఉండరు మాష్టారు!

    ReplyDelete
    Replies
    1. ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లాంగిట్యూడ్ 82.5 డిగ్రీ (తూర్పు). కాకినాడ 82.23 డిగ్రీ తూర్పు లాంగిట్యూడ్ దగ్గర ఉంది. భారతీయ జ్యోతిషులందరూ మీర్జాపుర్, కాకినాడల్లో సూర్యోదయం అయ్యే టైమ్‌నే పంచాంగం (కాలెండర్)లో వ్రాస్తారు. వీళ్ళు ఖగోళ శాస్త్రాన్ని ఎంత కాపీ కొట్టినా కాకినాడలో కంటే భుబనేశ్వర్, కలకత్తాలలోనే సూర్యోదయం తొందరగానే అవుతుంది.

      Delete
    2. సూర్యుడి నుంచి వచ్చేది గామా రేడియేషన్. ఒక వ్యక్తి స్పేస్ సూట్ లేకుండా కేవలం ఆక్సీజెన్ సిలిండర్ పెట్టుకుని అంతరిక్షంలోకి వెళ్తే అతను గామా కిరణాలు తగిలి చస్తాడు. భూమి మీద వాతావరణం ఉంటుంది కనుక గామా కిరణాల వల్ల భూమి అంతగా వీడెక్కదు, ఇక్కడి జీవులు చావవు. ఇక బృహస్పతి గ్రహం నుంచి వచ్చే రేడియో కిరణాల గురించి మనం భయపడక్కరలేదు.

      Delete
  17. @ UnknownMay 4, 2019 at 9:43:00 AM GMT+5:30

    ఇది too much మాస్టారూ! ఒక మందు మార్కెట్లోకి వచ్చేముందు ఎన్నో ప్రయోగాలు జరుగుతాయి. ఇలాంటి వైఫల్యాలని procedural failuresగా చూడాలని నా అభిప్రాయం. మీరసలు జ్యోతిష్యాన్నీ, మెడిసిన్నీ ఒకే గాటన కట్టడమే ఒక వింత విషయం!

    మనందరి DNA లు వేరు. అన్నీ ఒకటి కావు. మందు ప్రయోగాలకి డబ్బులిచ్చి ఒక వెయ్యి మందిని తీసుకున్నారనుకోండి, వాళ్ళ DNA లు వేరు వేరు. శరీర తత్వాన్ని నిర్ధారించేది DNA అని మనం చదువుకున్నాము. ప్రపంచెంలో బిలియన్స్ మంది మీద, వెయ్యిమందితో ప్రయోగం చేసి నిర్ధారించిన మందు పనిచేస్తుందంటారా. Fda వాళ్ళ regulations లో మందు 100% పని చెయ్యాలని లేదు. దీనికి మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి research చెయ్యవలసిన అవుసరం లేదు. కానీ ఖర్చు పెట్టి research చేసిన ప్రయోగ ఫలితాలు నేను చెప్పిన Atlantic report లో ఉన్నాయి. చదవండి.

    ఏ డాక్టర్ అయినా మందు 100% పనిచేస్తుందని చెప్పాడా? మంచి డాక్టర్ల కోసం ఎతుక్కోవటం ఎందుకు. డాక్టర్ దగ్గిరకు వెళ్లినా జ్యోతిష్కుడి దగ్గరకి వెళ్లినా ఫలితం కోసమే వెళ్తాము. జ్యోతిష్కుడు నయం ఫలితం రాకపోత వెళ్లి ఊర్కేనే మాట్లాడచ్చు , మంచి వాళ్లయితే డబ్బులు తిరిగిస్తారు కూడా. మరి డాక్టర్ కి మందు పని చెయ్యలేదు అని చెప్పటానికి కూడా డబ్బులివ్వాలి. మంచి ఫలితం మనకి రావాలంటే మంచి డాక్టర్ ని వెతికి నట్లే మంచి జ్యోతిష్కుడి ని కూడా వెతకాలి.

    ReplyDelete
    Replies
    1. ఒక మందులో ఏముందో తెలియకుండా డాక్టర్ అది ఇవ్వడు. మెడికల్ రిప్రెజెంటేటివ్‌తో కుమ్ముక్కై ఓవర్ ప్రిస్క్రిప్షన్ వ్రాసేవాడు కూడా ఆ మందులో ఏముందో తెలియకుండా ఇవ్వడు. మందు అనేది కెమికల్ తప్ప ఆహారం కాదు. ఒక మందు వల్లే ఏ సైడ్ అఫెక్ట్‌లూ ఉండవని కూడా ఏ డాక్టరూ చెప్పడు. నేను వెళ్ళేది గవర్నమెంట్ పి.హెచ్.సి.కి. ఇక్కడ డాక్టర్ మంచివాడైనా, చెడ్డవాడైనా తన పి.హెచ్.సి. స్టాక్‌లో ఉన్న మందులు ఇస్తాడు తప్ప మెడికల్ రిప్రెజెంటేటివ్‌తో కుమ్ముక్కై అవసరం లేని మందులు ఇవ్వడు. జ్యోతిషులకి ఖగోళ శాస్త్రం తెలియదు. ఉల్కలు కారు చీకట్లో సాధారణ కంటికి కనిపిస్తాయి కానీ ఆ ఉల్కలు ఎలా ఏర్పడతాయో కూడా జ్యోతిషులకి తెలియదు. ఇక రేడియో ఏస్ట్రోనమీ జ్యోతిషులకి తెలుసని భ్రమపడక్కరలేదు.

      Delete
    2. మీరు ఏకంగా DNA ను చర్చలోకి తీసుకురావడం వింతగా ఉంది. మనందరి DNAలు unique. కానీ మనకు వ్యాధులు రావడానికి గల కారణాలు uniqueకాదు. మందులు addressచేసేది వాటినే. DNAలను కాదు. మీరన్నదే నిజమైతే, ఎంతమంది మనుషులున్నారో, అన్ని మెడిసిన్లూ కావాలి. మెడిసిన్నూ, జ్యోతిష్యమూ ఒకతేనంటారు. బావుంది! జ్యోతిష్యం లాజికల్ కూడా కాదే, self-contradictoryకూడానే! దానేం చేద్దాం?

      Delete
    3. Indian astrology still follows geocentric model. It is the clear evidence to prove that astrology does not follow any research.

      Delete
  18. ముహూర్తం చూసుకుని ఆపరేషన్ చేసి పిల్లలని కనే ఈ రోజుల్లో జాతకాలకి అర్థం ఏముంది?

    ReplyDelete
    Replies
    1. 82.5 డిగ్రీ తూర్పు లాంగిట్యూడ్ యొక్క టైమ్ ఆధారంగా ముహూర్తాలు నిర్ణయించడమే ఒక పెద్ద జోకు. అది పిల్లల్ని కనడానికైనా, పెళ్ళికైనా అంతే.

      Delete
    2. అమావాస్య నాడు పుట్టినవాడు దొంగ అవుతాడనీ, ఏకాదశి నాడు పుట్టినవాడు పోలీస్ ఆఫీసర్ అవుతాడనీ నిరూపించే వైజ్ఞానిక ఆధారం ఉందా? అవసరం లేని ముందస్తు కాన్పు వల్ల తల్లికి లేదా బిడ్డకి ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే ఆ తప్పుని ఎవరు అంగీకరిస్తారు?

      Delete
  19. @ ప్రవీణ్ & @ unknown

    "Long after research contradicts common medical practices, patients continue to demand them and physicians continue to deliver." ఇది Atlantic రిపోర్ట్ నుండి తీసిన వాక్యం.

    మీరంటారు
    జ్యోతిషులు చెప్పేది కూడా తప్పే కానీ జనం వాళ్ళ దగ్గరకి వెళ్తారని.

    నేనంటాను రెండూ రెండే అని దానికి ప్రూఫ్ Atlantic రిపోర్ట్ చూపెట్టాను. మీరు కూడా ప్రయోగం చేసి తయారు చేసిన రిపోర్ట్ చూపెట్టండి. ఎంతమంది వాళ్ళ దగ్గరకి వెళ్లారో ఎంతమంది మోసపోయారో.

    మీరు చెప్పినట్లు జ్యోతిషుల లెక్కలన్నీ తప్పయితే పంచాంగాలూ పంచాంగ శ్రవణాలు ఎందుకు?జనం నమ్ముతున్నారు కాబట్టి. ఆ నమ్మేవాళ్ళు చిన్న చితకా కాదె. జనం ఒకరిని నమ్మితే వాళ్ళని ముఖ్యమంత్రులు, ప్రెసిడెంట్ గ చేస్తారు.

    ప్రతీ మతంలోనూ కొన్ని ఆచారాలూ కధలూ ఉన్నాయి. వాటిని జనం నమ్ముతున్నారు పాటించేవాళ్ళు పాటిస్తున్నారు. ఒక మతంలో వాళ్లకి ఇంకో మతంలో కధలూ ఆచారాలు వింతగా కనపడుతాయి.

    మనం డాక్టర్ల దగ్గరకి వెళ్లకుండా ఉండలేము జ్యోతిషుల దగ్గరకి వెళ్లకుండా ఉండలేము.

    ReplyDelete
    Replies
    1. Drugs are after all chemicals and no one claims that they do not have adverse effects. However, no doctor prescribes a drug if the information about the content in it is not printed on it's packet.

      Delete
  20. సరే కానివ్వండి.

    ఉపపదే బుధకేతుభ్యాం యోగ సంబంధకే ద్విజ
    ష్తూలాంగీ గృహిణీ తస్య జాయతే నాత్ర సంశయ:


    స్థూలంగా చెప్పాలంటే... గృహస్తు జాతకం ద్వారా అతని భార్య అంగాల గురించి జ్యోతిష్యుడు తెలుసుకుంటాడు.

    జౌమిత్రే మందభౌమస్థే తదీశే మందభౌమజే
    వేశ్యా వా జారిణీ చాపి త్స్య భార్య న సంశయ:

    ఎవరి భార్యలు వేశ్యలై అనేకమంది ప్రియుల కామన్ని తీర్చుచుంటారో చెప్పే పారాశరహోరలోని శ్లోకం.

    ఒకప్పుడు ఆడవాళ్ళు ఏ రోజున రజస్వల ఐతే వారి స్వభావం ఎలా ఉంటుందో ఒక ప్రబుధ్ధుడు ఋతుప్రకరణం కోట్ చేస్తూ చెప్పాడు.

    ముందేచ పుంశ్చ్యతీ నారి (శనివారం రజస్వల ఐన స్త్రీ వ్యభిచారిణి అఔతుంది)
    ఆదిత్యా విధవా నారీ (అదే ఆదివారం ఐతే విధవ అవుతుంది)

    ఇట్టాటి ఆణిముత్యాలున్న, భంగుతాగి నోటికొచ్చినట్లు వాగిన వాగుళ్ళు మీకు ప్రామాణికమా లక్కరాజుగారు? వీటికసలు ప్రూఫుందా? తరువాత మనం disproofగురించి మాట్లాడుదాం.

    Atlantaవాళ్ళవి Studies (లేదా rumours) . అవి మెడికల్ జర్నళ్ళలో రివ్యూ అయినట్లుగా నాకెక్కడా కనబడలేదు.

    ReplyDelete
    Replies
    1. In a 2013 study, a dozen doctors from around the country examined all 363 articles published in The New England Journal of Medicine over a decade — 2001 through 2010 — that tested a current clinical practice, from the use of antibiotics to treat people with persistent Lyme disease symptoms (didn’t help) to the use of specialized sponges for preventing infections in patients having colorectal surgery (caused more infections). Their results, published in the Mayo Clinic Proceedings, found 146 studies that proved or strongly suggested that a current standard practice either had no benefit at all or was inferior to the practice it replaced; 138 articles supported the efficacy of an existing practice, and the remaining 79 were deemed inconclusive. (There was, naturally, plenty of disagreement with the authors’ conclusions.) Some of the contradicted practices possibly affect millions of people daily: Intensive medication to keep blood pressure very low in diabetic patients caused more side effects and was no better at preventing heart attacks or death than more mild treatments that allowed for a somewhat higher blood pressure. Other practices challenged by the study are less common — like the use of a genetic test to determine if a popular blood thinner is right for a particular patient — but gaining in popularity despite mounting contrary evidence. Some examples defy intuition: CPR is no more effective with rescue breathing than if chest compressions are used alone; and breast-cancer survivors who are told not to lift weights with swollen limbs actually should lift weights, because it improves their symptoms.

      ప్రపంచెంలో మంచివీ చెడువీ ఎదురుకుండా కనపడతాయి. మంచివి తీసుకో చెడువి వదిలెయ్యి అని చిన్నప్పుడు మా పంతులుగారు చెప్పారు.
      ఈ వివాదం తేలేది కాదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. థాంక్స్ @unknown గారు.

      Delete
  21. లక్కరాజు గారి వాదన బాగున్నది.

    జనాలు బార్లకి కూడా వెళుతున్నారు. అంతమాత్రంచేత అవికూడా పనికొచ్చేవే అని మనం అనుకోవాలా?

    జ్యోతిష్యంతో సమస్యేంటంటే, అందులో ప్రాధమిక విషయాలకే (axioms) నిరూపణలేదు. ఇక దానిమీద పరిశోధన చెయ్యడమనేది గారివార్తలమీద CBI investigation లాంటింది.

    తద్భిన్నంగా వైద్యం అనేది. ఋజువులతో కూడిన ప్రక్రియ. మనం వాడే మందులు సరిపడనివారు నూటికొకరుండవచ్చు. అది వారి శరీర తత్వం. అదే జ్యోతిష్యం విషయంలో జోతిష్యుడు చెప్పింది గాలివాటుకి పడే వేపకాయల్లాగ్గా ఒకరిద్దరికి మాత్రమే ఋజువౌతుంది. ఇంతెందుకు సార్! మీకు తలనొప్పొస్తే మీరు టాబ్లెట్ వేసుకుంటారా? లేక పూజలూ, తాయెత్తులూ, బ్లులూ చేస్తారా? టాబ్లెట్ చేసుకుంటారు, లేదా డాక్టరు దగ్గరికెళతారు. అదే పని ప్రపంచమంతా చేస్తారు. జ్యోతిష్యులను నమ్మడమ్మాత్రం ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనూ, ఇండియా పిచ్చున్న పాశ్చాత్యుల్లోనూ మాత్రమే చూస్తాం.

    ReplyDelete
  22. ప్రభుత్వ ఆసుపత్రిలో ఇచ్చిన మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తే జిల్లా కేంద్ర ఆసుపత్రికి వెళ్ళమని ఆ డాక్టరే చెపుతాడు. ప్రైవేట్ డాక్టర్ తనకి దగ్గరలో ఉన్న దుకానంలో దొరికే మందులు మాత్రమే ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఎక్కడైనా సైడ్ ఎఫెక్ట్ లేని మందు ఉండదు. డాక్టర్ మందుల్ని ఓవర్ ప్రిస్క్రైబ్ చెయ్యకుండా ఉంటే చాలు. జ్యోతిషం విషయానికి వస్తే నక్షత్రాలు కదులుతుంటాయనే విషయం కూడా జ్యోతిషులకి తెలియదు. అరుంధతి, వశిష్ట నక్షత్రాలు భూమికి 83 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. వాటి కాంతి భూమికి చేరడానికి 83 సంవత్సరాలు పడుతుంది. అరుంధతి నక్షత్రం పేలిపోయి సూపర్‌నోవా ఏర్పడినా ఆ సూపర్‌నోవా మనకి దగ్గరదగ్గరగా 80 సంవత్సరాల తరువాత కనిపిస్తుంది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top