• హిప్నాటిజం శాస్త్రీయమేనా? 
  • మనిషి యొక్క ప్రవర్తనపై సమాజం & కుటుంబ సభ్యుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. 
  • అటువంటప్పుడు మనిషిని నిద్రలోకి పంపించి చెప్పే మాటల ద్వారా అతని ప్రవర్తనని మార్చడం సాధ్యమా? 
  • అలా మార్చడం సాధ్యమైతే హత్యలూ, రేప్‌లూ చేసేవాళ్ళ ప్రవర్తనని కూడా మార్చొచ్చు కదా!
Praveen Mandangi 
*Republished

------------------------------------

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment



  1. సాయిన్సు

    జిలేబి

    ReplyDelete
  2. >>అటువంటప్పుడు మనిషిని నిద్రలోకి పంపించి చెప్పే మాటల ద్వారా అతని ప్రవర్తనని మార్చడం సాధ్యమా? అలా మార్చడం సాధ్యమైతే హత్యలూ, రేప్‌లూ చేసేవాళ్ళ ప్రవర్తనని కూడా మార్చొచ్చు కదా!

    మీ ఉద్దేశ్యంలో, సైన్సు అంటే, స్విచ్చా?? ఆన్ / ఆఫ్ చేసినట్టు ప్రవర్తించడానికి? హిప్నాటిజం గురించి బండవ్యతిరేకత ఉంది మీకు.

    ReplyDelete
    Replies
    1. ప్రశ్నలు బాగున్నాయి సమాధానం తెలిస్తే చెప్పండి. అతను కూడా తెలుసుకోవాలనే అడుగుతున్నాడు.

      నాకు తెలిసినంతవరకూ హిప్నాటిజం ద్వారా మనిషిని నిద్రలోకి పంపి అన్ని/కొన్ని విషయాలనూ తెలుసుకోవచ్చు. అంతవరకూ కరెక్టే ... కానీ అతనంతట అతనే/ఆమే మారాలని అనుకుంటే తప్ప ఒక మనిషి ప్రవర్తనని మార్చడం మాత్రం సాధ్యం కాదు. అందుకే శ్రీకృష్ణుడంతటివాడే మనుషులను మార్చడానికి ప్లాన్లు వేసాడు కానీ మారండి అని బోధలు చేయలేదు.

      మార్చడం కష్టం... మారడం సులభం ...
      ఉద్ధరేదాత్మ నాత్మానాం ...

      Delete
    2. మారడమూ కష్టసాధ్యమే. మారాలని లేనివారిని మార్చలేము. మారుపును కోరుకోని వారిని అంటే వ్యక్తికి (సబ్జెక్ట్) ఇష్టం లేకుండా హిప్నాటైజ్ చేసి నిజాలు రాబట్టడం అసాధ్యం. అలా అని హిప్నాటిజం చెప్పదు. హిప్నాటిజం వల్ల పరిమిత ప్రయోజనాలున్నాయి.

      Delete
    3. హిప్నాటిజానికి అవతలి వ్యక్తి మనస్పూర్తిగా స్పందించాలి అనేది చిన్న పిల్లలలకి కూడా తెలిసిన పాత విషయమే. Praveen Mandangiగారు మాట్లాడిన విధానం, తెలుసుకోవాలని మట్లాడినట్లైతే అస్సలు లేదు. తనకున్న హిప్నాటిజంపై పూర్తి వ్యతిరేకత భావాన్ని చదువరులమీద రుద్దడానికే ఈ పోష్టు పెట్టారనేది నిజం. దీని గురించి కొండలరావుగారే క్లారిటీ ఇవ్వగలరు.

      Delete
    4. "హిప్నాటిజం ఒక ప్రయత్నం మాత్రమే, అది ఫలితం ఇస్తుందని గ్యారంటీ లేదు" అంటారు, అంతే కదా. జ్యోతిష్యం అనేది ఒక ఊహ, హిప్నాటిజం అనేది ఒక ప్రయత్నం. ఊహ కంటే ప్రయత్నం ఎప్పుడూ బాగానే ఉంటుంది. కానీ ఫలితం లేకపోతే ఆ ప్రయత్నం వృథాయే కదా.

      Delete
  3. ఆర్యా,

    హిప్నాటిజం అనేది పూర్తి శాస్త్రీయమైనదే!అది యే విధంగానూ మూఢనమ్మకం అయ్యే ప్రసక్తి లేదు.సిగ్మండ్ ఫ్రాయిడ్ వల్ల ఎక్కువ తెలిసినా అతనికి ముందు ఉన్న సైకాలజిస్టులు కూదా వదేవాళ్ళు.మొదటి పేరు నాకు తెలియదు గానీ ఫ్రాయిద్ పెట్టిన పేరు free association (స్వేచ్చాసంసర్గం), అంటే మనిషి తన గురించి తనే చెప్పుకోవడం!శరీరానికి వైద్యం చేసే దాక్తర్లు కొన్ని మౌలిక ప్రశ్నల తర్వాత మీ జబ్బుని వాళ్లకి వాళ్లే దయాగ్నోజ్ చేసుకుంటారు,సైకియాట్రిస్టు మాత్రం అలా చెయలెడు రొగి తన జబ్బును గురించి తను చెప్పుకోకుండా డాక్టరు ఏ నిర్ధారణకీ రాడు,రాలేడు,రాకూడదు!తన పేషెంటుకి సంబంధించిన రహస్యాలు కూడా హిప్నాటిస్టు తెలుసుకోగలడు అనేదీ పేషెంటు చెప్పదానికి ఇష్తపడని వాటిని కూడా రాబట్టడమనేదీ హిప్నాటిక్ ట్రాన్స్ గురించి ఉన్న అపోహల వల్ల మనలో ఏర్పడిన తప్పుడు అభిప్రాయాలే!

    సైకియాట్రిస్టు దగ్గిరకి వెళ్ళిన ప్రతి ఒక్కరికీ హిప్నాటిక్ ట్రాన్స్ ఉపయోగించనక్కరలేదు,మనిషి మనస్సు మూడు పొరలుగా ఉంటుంది.కాన్షస్,సబ్-కాన్షస్,ట్రాన్సిషన్ అనే పొరల్లో కాన్షస్ పైన ఉంటుంది.రోజువారీ అనుభవాల నుంచి మనం నేర్చుకున పాఠాలూ మనకి బాగా గుర్తుండిపోయిన చిన్నప్పటి జ్ఞాపకాలూ ఇందులో ఉంటాయి - వీటి ప్రభావం మనకి కూడా తెలుస్తూనే ంటుంది,మనం తీసుక్నే నిర్ణయాలలో చాలమటుకు వీటి మీదనే ఆధారపడతాం కదా!సబ్-కాన్షస్(unconsious కాదు,ఆ పదానికి అర్ధం స్పృహ తప్పి పడిపోవటం:-)) అనేది అన్నిటికన్న కింద ఉన్న పొర - ఇందులోకి వెళ్ళి దాక్కున్న విషయాలు అంత త్వరగా గుర్తుకు రావు - ఈ జ్ఞాపకాలు రెండు రకాలు,మొదటి రకంవి మామూలప్పుడు ఎంత తన్నుకున్నా గుర్తుకు రావు గానీ వాటిని పోలినవి గానీ వాటిని గుర్తు చేసే సంబంధం ఉన్నవి గానీ కనబడితే బయటకు వచ్చే రకం,ఇక రెండవ రకం ఇలా గుర్తుకు రాకపోయినా మిగతా అన్నింటికన్న ఎక్కువ ప్రభావితం చేసే మొండి జ్ఞాపకాలు.వీటి ప్రభావం ఎలా ఉంటుందంటే మీకెంతో ఇష్టమైన వ్యక్తి ఫలానా నల్ల చారల షర్తూ వేసినప్పుడల్లా అతనితో మీరు పోట్లాడ్డం కానీ చిరాకుపడి తప్పుకు తప్పుకు తిరగడం గానీ చేస్తూ ఉంటారు.మొదట్లో ఆ షర్టు వల్ల ఇబ్బంది పడుతున్నారని కూడా తెలియకపోవచ్చు,షర్టు వల ఇబబంది పడుతున్నారని తెలిసినా అది ఎందువల్ల జరుగుతున్నదో కూడా మీకు తెలియదు.

    ఇలాంటి పరిస్థితుల్లోనే సైకియాట్రిస్టు హిప్నాటొజం వాడతారు.సైకియాట్రిస్టు దగ్గిరకి వెళ్ళాల్సిన అవసరం వచ్చే జబ్బులనిటికీ కారణం అపరాధ భావన(guilt)!ఒక తప్పు చేశారు,మీరు ఆ తప్పు చేసినటు ఎవరికె తెలియదు.అయినా సరే,.మీరు ఆ తప్పు చెసినట్టు తెలిస్తే జనం మిమల్ని అసహ్యించుకుంటారని మీకు మీరే నిర్ణయించేసుకుంటారు.అది బయటపడకుండా ఉంచడానికి మీరు వాడే షీల్డింగ్ రోగం రూపంలో బయటపడుతుంది.సైకియాట్రిస్టు చేసేది కూడా మీ జబ్బుని మీరే నయం చహెసుకోవడానికి హెల్ప్ చెప్పడమే!అసలు పేషెంటుకే తన గురించి తనకు తెలియని రహస్యాలని డాక్టరు తెలుసుకోవడం అసాధ్యం!ఇది తెలిస్తే హిప్నాటిజం మూఢనమ్మకం కాదని తెలుస్తుంది.

    స్వస్తి!

    ReplyDelete


  4. హిప్నాటిజమనగా హిప్పును నాటీగా జమ్మని ఆడించుట. కావున యిది ఒక గొప్ప యోగ సాధన.


    ఇట్లు
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మీరలా చెప్తుంటే నాకిష్టమైన హీరోయిన్ గుర్తొచ్చింది. కొంపదీసి మీరు మమ్మల్ని హిప్నాటైజ్ చెయ్యట్లేదుగదా?

      Delete
  5. హిప్నాటిజంపై హిప్నాటిస్టుల ప్రకటన స్పష్టంగా ఉండాలి. హిప్నాటిజం ద్వారా బిహేవియర్ మార్చొచ్చనీ, కోర్టులో నిందితుల చేత నిజాలు చెప్పించొచ్చనీ సీరియస్‌గా నమ్మేవాళ్ళు కొంత మంది ఉంటారు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top