అంశం : మహిళలపై వేధింపులు,అత్యాచారాలు
------------------------------------------------
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------------

అత్యాచారాలకు నాస్తికత్వం పెరగడం, పాపభీతి లేకపోవడం కారణమా!? 


  • అత్యాచారాలకు నాస్తికత్వం పెరగడం, పాపభీతి లేకపోవడం కారణమా!?
  • నిన్న జెమినీ టీ.వీ లో మహిళలపై అత్యాచారాల పెరుగుదలపై ఓ ఆర్టికల్ ప్రసారమయింది. అత్యాచారాల పెరుగుదలకు నాస్తికత్వం పెరగడం - పాపభీతి లేకపోవడం కారణమని ఆ కథనం లో భాగంగా చెప్పారు.
  • అత్యాచారాలు పెరగడానికి నాస్తికత్వం పెరగడం కారణమన్న వాదనపై మీ అభిప్రాయం?

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. అత్యాచారం = బోడిగుండు
    నాస్తికత్వం = మోకాలు

    ఏమోలెండి నిజమే అయ్యుండొచ్చు. నిత్యానంద, ఆశ్రం, పిరమిడ్ గురువులు వీళ్ళందరూ నాస్తికులేనెమో!

    ReplyDelete
  2. పాపభీతి లేకపోవడం. This must be true.

    ReplyDelete
  3. పాపభీతి ఉన్న ఆశ్రమ గురువులు , సన్నాసులు కూడా అత్యాచారాలు చేస్తున్నారు కదా? వారికి పాపభీతి లేనట్లా? పాపభీతి నటిస్తున్నట్లా?

    ReplyDelete
  4. సన్నాసులైన ఎర్రోళ్ళు పాపభీతి లేకుండా ప్రవర్తించటం, వాళ్ళకి సన్యాసులు, గురువులు, పీఠాధిపతులు ఆ పాప భీతిని కలిగించలేకపోవటం,కొన్ని చోట్ల వాళ్ళకే ఈ పాప భీతి లేకపోవటం సమాజంలో ఈరోజున పడిపోతున్న ప్రమాణాలకి గుర్తు అనేదే నా అభిప్రాయం.

    ReplyDelete
  5. అత్యాచారాలు అనేవి ఓకప్పుడు ఉన్నవి. కాకపొతే ఇప్పుడు ప్రజలకు త్వరగా తెలుస్తుంది.

    ReplyDelete
    Replies
    1. ఇంండియాలో 99శాతంం అస్థికులే ఉన్నారు .సరిైైన విలువలైైన విధ్య లేకపోవటంం .అంందుభాటులోఉన్న టేక్నాలజీ మోబైై, నెట్ ప్రధానమైైన కారణంం

      Delete
  6. Rajesh Nalajala గారూ! అత్యాచారాలు ఎప్పుడూ ఉన్నా, ఇలా విచ్చలవిడిగా, నిర్భయంగా, దారుణంగా జరుగలేదు. ఇకపోతే దారుణాలు బయటకు తెలియడమే మంచిది.

    ReplyDelete
  7. అత్యాచారాలుచేస్తున్నాది ఎర్రోళ్ళుకాదు బాబుగారూ! సన్నాసులు చేస్తున్నారు. అంటే నీతులు చెప్పించుకోవాల్సినస్థితిలో ఉన్నది ఎర్రోళ్ళుకాదు. కాషాయాంబరధారులు. :)

    ReplyDelete
  8. మీ ఇష్టం వచ్చినట్టుగా సన్యాసులను భ్రష్ట పదాలతో ఉచ్చరించవచ్చు, "ఎర్రోళ్ళు" అంటే అంత పొడుచుకు వచ్చిందా నాయనా! దేశాన్ని గత కొన్ని దశాబ్దాలుగా తమ అరువు కొట్టుడు ఇజాలతో సర్వ భ్రష్టు పట్టించింది "ఎర్రోళ్ళు" కాదూ. ఎర్రోళ్ళు అంటే, వెర్రి వాళ్ళు అని కూడా అనుకోవచ్చుకదా. మనకి ఎంత పడని వాళ్ళైనా పద భ్రష్టత్వంతో ఉచ్చరించటం భావ్యం కాదు అందుకనె "ఎర్రోళ్ళు" అని వ్రాయవలసి వచ్చింది. అది సరిగ్గా కుట్టినట్టుంది. సన్యాసుల్లో అపమార్గాల్లో వెళ్ళిన వాళ్ళు ఉండచ్చు, లేరని ఎవరూ అనటంలేదు. ఈ "ఎర్రోళ్ళు" అప్పుడప్పుడూ తప్పులు చేసేసి చారిత్రిక తప్పిదం, పొరబాటయ్యిపోయింది అంటూ ఉంటారే అలాగే మరి!

    ReplyDelete
  9. No man! My opposition was to your misdirecting the topic. Looks like communism seems to be only thing you are good at. Like the Marthanda guy you bring almost relate almost everything to this :) The question was not about communism but about theism and depleting morals in the society.

    I am not a fan of communism. When I bash that ism, I will do so royally. Let the time come. And in the mean time get your mind and thinking fixed. Learn a new topic for a day.

    The merit of an ism has nothing to do with where is has originated my buddy. You cannot play that foreign ism card for almost everything.

    Sorry for calling them sannaasulu. I should have called them names instead :)

    ReplyDelete
    Replies
    1. Nag: You were spot on. We have a bunch of seniles in the blogs who lack the relevancy-bone.

      Delete
  10. శిక్షలు కటినతరంగా లేకపోవటం కూడా ఒక కారణమే.

    ReplyDelete
  11. శివరామప్రసాదు గారు విషయాన్ని ప్రక్కదారి పట్టిస్తున్నారహో!


    కొంచెం తెలివి తెచ్చుకు ఆలోచిస్తే... అత్యాచారాల్ని దాదాపు అన్ని మతాలూ సమర్ధిస్తున్నాయి. కొకలెత్తుకెళ్ళిన కృష్ణుడు, ప్రతి ముస్లింకూ తన స్త్రీబానిసలను బలాత్కరించే హక్కుందని చెప్పిన మహమ్మద్, ఫలానా ప్రాంతంలో స్త్రీలను బానిసలుగా చేసుకొనమని చెప్పిన బైబిల్ ఇవటండీ ఆదర్శగ్రంధాలు, ఆదర్శ వ్యక్తిత్వాలూ? మతానికీ అనైతికతకూ చాలా దగ్గరి సంబంధం ఉంది. ఎక్కడైతే మత్తం తిరస్కరణకు గురౌతుందో, అక్కడి సమాజపు నైతికతా ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి ఉదా:- ఉత్తర యూరప్. నేరాలు తగ్గడానికి కావలసింది "పాపభీతి" కాదు. సహానుభూతి (empathy అంటారనుకుంటాను) కావాలి. ఈ సహానుభూతి పీకలు మతం నొక్కేస్తుంది. "ధర్మంకోసం ఎలాంటి నీచమైన పనైనా చెయ్యి. ఫర్లేదు." అని మతం చెబుతుంది. నాస్తికత్వం పెరిగితే (కనీసం మతం తన హద్దుల్లో తానుంటే) నేరాల రేటు తక్కువగా ఉంటుంది.

    జరుగుతున్నవాటికి పాశ్చాత్య సంస్కృతి కారణం అనడం పలాయనవాదం తప్ప మరొకటి కాజాలదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వ్యవహారాలు మరీ ఇంత దుర్మార్గంగా ఉండవు.

    నాకు తెలిసిన ఒకమ్మాయితో ఒక ఫ్రెంచివాడు కొంచెం తింగరిగా ప్రవర్తించబోతే ఆ అమ్మాయి you are behaving like a rapist అందని ఆ ఫ్రెంచివాడు బాధపడి, ఆ బాధలో #రేలిజె# అయ్యి సారి చెప్పాడు. అదే భారతీయుడయ్యుంటే ఆమాటన్నందుకు మీసాలు దువ్వుకొనుండేవాడు. కొన్నేళ్ళక్రితం కత్తి మహేష్ తన బ్లాగులో India is a sex starved nation అన్నందుకు చాలామంది బాధపడ్డారు. ఆయన చెప్పింది కరెక్టేనని ఇప్పుడర్ధమవుతుంది.

    ReplyDelete
    Replies
    1. < జరుగుతున్నవాటికి పాశ్చాత్య సంస్కృతి కారణం అనడం పలాయనవాదం తప్ప మరొకటి కాజాలదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వ్యవహారాలు మరీ ఇంత దుర్మార్గంగా ఉండవు >

      ఆలోచించవలసిన అంశం.

      Delete
    2. >>>>జరుగుతున్నవాటికి పాశ్చాత్య సంస్కృతి కారణం అనడం పలాయనవాదం తప్ప మరొకటి కాజాలదు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో వ్యవహారాలు మరీ ఇంత దుర్మార్గంగా ఉండవు >>>>

      మొన్న ఒక చర్చలో భర్త అంగీకారముంటే వ్యభిచారం కాదు అన్నారు.ఈ సంస్కృతి ఎక్కడిది ?

      Delete
    3. కత్తి మహేష్ తన బ్లాగులో India is a sex starved nation అన్నందుకు చాలామంది బాధపడ్డారు.

      ఇది మాత్రం వాస్తవం.ఇండియాలో ఆడవాళ్ళు ఇంటిపనీ వంటపనీ చేసి ఎనర్జీ అంతా అరగదీసుకుంటారు. భర్తకు అన్నిపనులూ చేసిపెట్టడమే మహా పాతివ్రత్యమనుకుంటారు.ఆఫీసుల్లోనూ బయటి ప్రపంచంలో తిరిగే మొమైత్ ఖాన్ లను చూసి ప్రేరేపించబడి ఇంటికి వస్తే భార్య సహకరించదు.భార్యను బలవంతం చేస్తే అదొక గృహహింస కేసు.ఇంట్ల్లో ఇల్లాలు సహకరించదు.బయట ప్రియురాలు ఊరికే రాదు.

      Delete
    4. >>>>ధర్మంకోసం ఎలాంటి నీచమైన పనైనా చెయ్యి. ఫర్లేదు అని మతం చెబుతుంది >>>>

      ఇంతవరకూ ఎవరూ మీరు చెప్పినట్లు చెప్పలేదు.వ్యభిచారం చేసేవాళ్ళు కూడా చక్కగా చీరకట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని పాతివ్రత్య మహిమ గురించి చెపుతారు.ఎందుకంటే పోగొట్టుకున్నదాని విలువ వారికే బాగా తెలుసు.

      దేవుళ్ళందరికీ ఇద్దరు భార్యలున్నా కూడా ఇద్దరు భర్తలున్న వారిని దేవతలను చేయలేదు.

      వ్యవస్థలో ఒకరు చెడిపోతుంటే కాపాడడానికి ఇంకొకరు ఉండాలి కదా ? ఉభయ భ్రష్టత్వం జరిగితే దాని పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి.

      Delete
  12. శివరామ ప్రసాద్ గారు కమ్యూనిజమ్మీద ఆవు వ్యాసం రాయడంలో బాగా ఆరితేరారుమల్లే ఉంది. విషయమేదైనా అందులోకి కమ్యూనిజాన్ని లాగకుంటే ఆయనకు బండి స్టార్ట్ కాదనుకుంటాను. ఒకప్పుడు ప్రవీణ్ అని ఒకతను ఒకతను ఇలా రాసేవాడు. ఇప్పుడా దివిటీని ఈయన మోస్తున్నట్లుంది.

    ప్రసాద్‌గారు మీరు శాంతించాలండీ. మీరు ఎర్రోళ్ళు అన్న ఇంకోటన్నా ఇక్కడ మహా ఉంటే కొండలరావుగారు ఆవేశ పడతారేమో తప్ప మిగతావారు కాదు. ఈ ధూర్త సన్నాసులను వెనకేసుకురావడానికి ఫాదరీలను వెనకేసుకురావడానికిగానూ వాటికన్‌కూడా పడనన్ని పాట్లు పడుతున్నారుమల్లే ఉంది. మీరు ఒకమోస్తరు చదువుకున్నారని అనుకుంటాను. మరి ఈ సన్నాసి వెధవల గురించి నిజాలుచెబితే మీరెందుకండీ ఆవేశపడుతున్నారు?

    ReplyDelete
    Replies
    1. శివరామ కృష్ణగారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గారు.బ్లాగుల్లో బ్రాహ్మణుడైనట్లైతే ఖచ్చితంగా కాషాయ అభిమాని అయితీరతారు.దళితులైతే కమ్యూనిజం గురించి మాట్లాడతారు.ఎవరో ఒకరిని సమర్ధించకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడేది కొండల రావు గారు మరియు భండారు గారు మాత్రమే.

      Delete
  13. అత్యాచారాలకు నాస్తికత్వం పెరగడం, పాపభీతి లేకపోవడం కారణమా!?

    నాస్థికుడైతే పర్వాలేదు కానీ దైవ దూషణ చేస్తున్నారంటే వారి పతనం అక్కడే మొదలైనట్లు భావించాలి.

    శరత్ గారు లాంటివాళ్ళు నాస్థికులే కానీ ఆయన స్త్రీలను గౌరవిస్తారు.ఆయన వ్రాసే విషయాలను బట్టి ఆయన మనస్థత్వాన్ని అంచనా వేయడమే కాదు వ్యక్తిగా చాలా మంచివారు అని చెప్పగలను. నాస్థికులైనంత మాత్రాన అత్యాచారాలు చేస్తారనడం అవివేకం.

    ReplyDelete
  14. దేవుడు ఉన్నాడు అని భావించడం ఆస్థికత్వం.ఎవరో ఒకరు మనకు తోడుగా ఉంటారు సహాయం చేస్తారు అని భావించడం ఆస్థికత్వం.

    నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు,నేను చేసే పనులే నా భవిష్యత్తుని నిర్ణయిస్తాయి అని భావించి ప్రతి వ్యక్తినీ నువ్వెంత నీ బ్రతుకెంత అని అహంకారంతో ప్రవర్తించేవారే పాపభీతి లేని వారు.వీరు కూడా అత్యాచారాలు చేయరు.ధైర్యంగా మళ్ళీ మళ్ళీ పెళ్ళిచేసుకుంటారు.

    ReplyDelete
  15. అందరూ అనుకుంటున్నట్లు స్త్రీల వస్త్రధారణో ఆస్థికత్వం లేకపోవడమో అత్యాచారాలకు కారణం కాదు.

    గృహిణులను చిన్నచూపు చూడడం వల్ల స్త్రీలు ఆర్ధికంగా ఆధారపడకూడదని ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు.స్త్రీలు బయటికి వెళ్తే ఎన్నో ఆకర్షణలు ఎదురవుతున్నాయి.స్త్రీలను,పిల్లలను మభ్యపెట్టేవారు తమ స్వార్ధం కోసం అత్యాచారాలు చేస్తున్నారు.

    ReplyDelete
  16. మహిళలపై జరుగు హత్యాచారాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి.మరియు లైంగిక వేధింపులు కూడా విపరీతంగా జరుగుతున్నాయి.మనకున్న ప్రభుత్వ చట్టాలు ధనవంతులకు చుట్టాలుగా మరాయి.మహిళలు పోరాటాలకు ప్రజలు మద్దతు ఇచ్చి హత్యాచారాలు నిరోధించడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి.ముఖ్యంగా ప్రభుత్వం మహిళల జరుగు అన్యాయాలపై శ్రద్ధ వహించాలి.

    ReplyDelete
  17. నీహారిక: మీరు మళ్ళీ అన్నీ కలిపేస్తున్నారండీ.

    Consensual sexనీ rapeనీ ఒకేగాటన కట్టలేం. మన సంస్కృతి మాత్రమే నైతికతకు పోత, మిగిలినవన్నీ ధూర్తాల్జు అనుకొనే సాంస్కృతిక అభిజాత్యం మనకు కూడదు. మనది కానంతమాత్రాన అది దుష్టమో, ధూర్తమో కాదు. పలువురు భాగస్వాములను కలిగి ఉండటం కొన్ని కొన్ని సంస్కృతుల్లో నైతికమే (నేపాల్లో polyandry ఇండియాలో polygamy కొనియాడబడతాయ్). ఇక polyamory గురించి మనం తీరికగా చర్చిద్దాం సమయం వచ్చినప్పుడు. ఇక్కడ విషయం అదికాదుకదా.

    "నాస్థికుడైతే పర్వాలేదు కానీ దైవ దూషణ చేస్తున్నారంటే వారి పతనం అక్కడే మొదలైనట్లు భావించాలి."
    లేని దేవుడిమీద నోరు చేసుకొంటే అది ఏవిధంగా తప్పు?

    "గృహిణులను చిన్నచూపు చూడడం"
    ఈ ఒక్క ముక్క (ఇంతవరకు మాత్రమే) ఒప్పుకుంటాను. మనకున్న ఘన సంస్కృతిలో గౌరవించబడడానికి, కనీసం మనిషిలా treat చెయ్యబడడానికి కొన్ని అర్హతలుండాలి. కొన్ని కులాలవారికి, అందునా మహిళలకు అలాంటి అర్హతలు లేవు. సైకాలజీలో camouflage అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడైతే మనం తప్పు చేస్తున్నాం అని మనకు అర్ధం అవుతుందో, అప్పుడు దాన్ని divert చెయ్యడానికి ప్రయత్నిస్తాం (ఉదాహరణకు మనకున్న స్త్రీద్వేషాన్ని, మాతృప్రేమగా ప్రదర్శిస్తాం. అంటే మనం స్త్రీద్వేషులమే కానీ దాని కవర్ చేయడానికి మాతృప్రేమని వాడుకుంటాం. అలాగే మనుషుల మీద మనకున్న ద్వేషాన్ని దేశమ్మీద ప్రేమతో కవర్ చేస్తాం). మహిళలమీద మనకున్న చిన్నచూపుని దేవతలతోనూ, పతివ్రతలతోనూ కవర్ చేసేసి, ఆయా ఉదాహరణలతో, గౌరవించబడడానికి అర్హతలు నిర్ణయించేస్తాం. ఇది మన సమస్య. మనుషులకు by birth కొన్ని హక్కులుంటాయి అన్నమాటని మన సంస్కృతి ఒప్పుకోదు. మనకు మానవహక్కులమీద అవగాహన లేదు.

    ReplyDelete
    Replies
    1. @కేతన్,

      ఇదివరకు నిర్భయ కేసు టైం లో ఒక చర్చలో లాయర్ రమ్యగారితో(సంసారం ఒక చదరంగం ఫేం) జరిగిన చర్చలో ఉరిశిక్షకు వ్యతిరేకంగా మాట్లాడాను.ఆవిడ లాయర్ కాబట్టి వాక్చాతుర్యంతో నా నోరు మూయించేసారు.నేను వ్రాయగలను కానీ బాగా మాట్లాడలేను.చాలా నిదానంగా చెపుతాను.నా మాటలు షార్ప్ గా ఉంటాయి కాబట్టి ఆవిడ రియాక్ట్ అయ్యారు.టీ వీ షోల్లో అరుచుకోవడం నాకు ఇష్టం ఉండదు.అరిచి చెప్పినంత మాత్రాన వాదన నెగ్గినట్లు కాదు కదా ? నాకు కూడా క్లారిటీ రావాలి కదా ?
      మీరు కాస్త ఓపికతో ఈ చర్చని కొనసాగించాలని కోరుతున్నాను.మీ అభిప్రాయం ప్రకారం పైన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి.
      అత్యచారాలకు కారణం ఏమిటి ?

      Delete
    2. నీహారిక: మీరడిగినది చాలా పెద్ద ప్రశ్న.

      ఇండియాలో ఆడది ఒక ఆస్తి. ఒక వస్తువు. And rape is a akin to an act of vandalism. నాకు మీమీద కోపం ఉందనుకోండి, మీకారుపై గీతలు గీస్తాను. నాపొరుగింటివాడిపై కోపం ఉంటే, వాడి ఆడాళ్లపై అఘాయిత్యం చేస్తాను (ధైర్యం, బలగం ఉంటే), కుదరకపోతే వాళ్లపై రూమర్లు సృష్టించి ఆనందం పొందుతాను. ఒక్కోసారి నాకు రాయిచ్చుకొని వీదిదీపాన్ని పగలగొట్టాలనిపిస్తుంది. No reason. It's merely an act of vandalism. ఒక్కోసారి అఘాయిత్యం చెయ్యాలనిపిస్తుంది. I don't see a difference between the light (an object) and a girl. ఇది మన సమస్య.

      ఒకవేళ నాకు అంతటి ధైర్యం లేదనుకోండి. అప్పుడు అఘాయిత్యాల్ని పవిత్రత మాటున సమర్ధిస్తాను.

      Delete
    3. ఒకవేళ నాకు అంతటి ధైర్యం లేదనుకోండి. అప్పుడు అఘాయిత్యాల్ని పవిత్రత మాటున సమర్ధిస్తాను.

      నా ఫాంటసీ ఇంకెవడో realise చేసినందుగానూ vicarious ఆనందాన్ని పొందుతాను. ఇందులో మతంచేత ప్రేరేపించబడిన సంస్కృతి, నేను తప్ప ఇంకెవరూ ముఖ్యంకాదు అనే నా ఆలోచనాధోరణి (lack of empathy) కారణం అండీ.

      ఒక్క ఆడవాళ్ళపై అఘాయిత్యాలనే కాదండీ.. జేబుదొంగతనాల్నుంచీ, హత్యలవరకూ ఇదీ కారణం. దీనికి మరో కారణం. ఎవరికి నచ్చినట్లు వారు వంచగల మన న్యాయవ్యవస్థ. తప్పుచేసినవాడికి శిక్ష తధ్యం అన్నది మనదేశంలో సాధ్యమా అండీ? వీడియో సాక్ష్యాలున్నప్పటికీ, కసబ్ కేసులో మనకు సంవత్సరాలు పట్టింది చివరితీర్పు ఇవ్వడానికి. ఇక అత్యాచారాలు (నిజానికి ఇవి తీవ్రవాదంకన్నా సీరియస్ విషయం), ఆర్ధిక నేరాలూ ఎంతండీ?

      Delete
    4. ముందుగా మనం అనుకున్నట్లు ఆర్ధిక,మతం,ఉగ్రవాదాల జోలికిపోకుండా ఒక్క అత్యాచారాలపై మాత్రమే మాట్లాడుకుందాం.మీరు చెప్పింది అంగీకరిస్తూ మరింత విశ్లేషణ కోసం దాచేపల్లి ఘటనని ఉదాహరణగా తీసుకుందాం.దాచేపల్లి ఘటనపై మీ అభిప్రాయం ఏవిటీ ?

      Delete
    5. సరే కానివ్వండి. కానీ... నాకూ ప్రశ్నలే ఉన్నాయి ఆ సంఘటన విషయంలో.

      నాకు సుబ్బయ్య గురించి కనీసం పరిచయం కూడా లేదు. In the most optimistic light, నేనతణ్ణి ఇతరత్రా విషయాల్లో 'మంచివాడు' గానే పరిగణిస్తున్నాను (తన మితృడితో తను మాట్లాడిన చివరిమాటలుగా చెప్పబడుతున్న వాటి ఆధారంగా). మరి ఎందుకు అతను ఆ క్షణంలో ఎందుకు అతను అలా ప్రవర్తించాడు? Considering the fact that sexual excitement is common among humans irrespective of the gender, why did he feel that it's okay to rape a girl who is old enough to be his grand daughter? Or is that why he did that?. What had driven him to this point? Did he feel that he would go scot-free? Would he had not committed suicide had the incident had not been not turned into a big issue? I think it is more of a respect-loss-situation (pardon my English) that killed him rather than guilt. అతను దొరికుంటే బాగుండేది. దొరికాక అతనిని సైకో అనాలసిస్ చేసుంటే చాలా విలువైన సమాచారం మనకు లభించేది.

      Delete
    6. >>>నాకు సుబ్బయ్య గురించి కనీసం పరిచయం కూడా లేదు>>>
      Sence of humour creates empathy in social situations, ...సుందోపసుందులలో ఒకరనుకోండి.

      Delete
    7. >>>నేనతణ్ణి ఇతరత్రా విషయాల్లో 'మంచివాడు' గానే పరిగణిస్తున్నాను.>>>>

      మంచివాడు చెడ్డవాడిగా మారడానికి ఒక్క 23 నిమిషాలు చాలు.

      Delete
    8. why did he feel that it's okay to rape a girl who is old enough to be his grand daughter?
      నాకు తెలిసిన ఒక వ్యక్తి రిటైరైన తరువాత భార్య చనిపోయింది.అతను వెంటనే ఒక 30 స ల మహిళను పెళ్ళి చేసుకున్నాడు.పెళ్ళైన 18 సం లకు ఆయన చనిపోయారు. ఆయనకు కేన్సర్ రాకుండా ఉండి ఉంటే 90 ఏళ్ళకు పైగా బ్రతికి ఉండేవాడు.

      సుబ్బయ్య వయసు 60 స లు.పెద్దగా సంపాదన ఉండి ఉండకపోవచ్చు.పైన చెప్పిన వ్యక్తికి ఆస్థి లేకపోయినా పెన్షన్ రాకపోయినా ఆవిడ ఖచ్చితంగా పెళ్ళి చేసుకుని ఉండేది కాదు.పేదరికం ఉంది కదా అని కోరికలు ఉండవా ? ఇదొక అంశం.

      చిన్నపిల్లని ఎందుకు అత్యాచారం చేసాడు ?
      ఇంకొక కేసులో భార్యాభర్తలిద్దరికీ సరిపడదు. ఇద్దరూ వేర్వేరు గదులలో నిద్రిస్తారు.అతను కూతురిని దగ్గర పడుకోబెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు.ఫలితంగా ఆమె గర్భవతి అయింది.

      ఈ రెండు కేసులలోనూ మనం తప్పునే చూస్తాం.తప్పు జరగడానికి కల కారణాలను చూడం.

      65 స ల వయసులో స్త్రీలు విశ్రాంతి కోరుకుంటారు.
      పురుషులెప్పుడూ విలాసాన్నే కోరుకుంటారు.

      రెండు కేసుల్లోనూ ఆ వ్యక్తులనే తప్పుపడుతున్నాం. భర్తని దూరంగా పెట్టిన భార్యది తప్పు కాదా ?
      10 తరగతి చదువుతున్న ఆ పిల్లకి తండ్రి ఏం చేస్తున్నాడో తెలియలేదంటే నేను నమ్మలేను.

      అత్యాచారాలెపుడూ గర్భవతి అయ్యాక బయటపడతాయి.
      గర్భవతి కాకపోతే అత్యాచారం కాదా ?

      Delete
  18. సారథీ బాబా, నిత్యానంద, అశారాం బాపూ తదితరులు నాస్తికులా?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top