5-4-2015 న ప్రారంభమైన పల్లె ప్రపంచం కార్యక్రమాలను కొనసాగించే దిశగా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామంలో పల్లెప్రపంచం విజన్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం బుధవారం (12-5-2015) నాడు జరిగింది. 

చిన్న కార్యక్రమం ముందుగా బ్లాగులో వ్రాయాలనిపించలేదు. కానీ పల్లెను ప్రేమించే ప్రతి హృదయానికీ స్వాగతం అనే పోష్టులో 'పల్లె ప్రపంచం' కార్యక్రమాలను ఈ బ్లాగులో పోష్టులుగా వ్రాస్తానని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి ప్రతి కార్యక్రమాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వివరాలను మీ ముందుంచుతున్నాను. 

ఈ సమావేశంలో ఒక సంవత్సర కాలానికి (12-5-2015 నుండి 11-5-2016 వరకు) ఏక్షన్ ప్లాన్ ని రూపొందించుకోవడం జరిగింది. పల్లె ప్రపంచం విజన్ ని వివరించడం జరిగింది. 

పల్లె ప్రపంచం ఫౌండేషన్ ద్వారా చేయబోయే కార్యక్రమాల వివరాలను, వాటిని ఏ విధంగా ప్రజల వద్దకు తీసుకు పోవాలి అనేదానిపై ప్రణాళికను రూపొందించాము. 'పల్లెప్రపంచం ఫౌండేషన్' నడపడానికి ఆర్ధిక వనరులను రెండు రకాలుగా చేకూర్చుకోవాలని నిర్ణయించడం జరిగింది.

ఒకటి ప్రజల వద్ద విరాళాలు సేకరించడం. రెండవది పల్లె ప్రపంచం మార్కెటింగ్ సర్వీసెస్ సంస్థ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఫౌండేషన్ పనులకు ఉపయోగించడం.

చేపట్టాల్సిన కార్యక్రమాలలో మొదటిది రాయన్నపేట గ్రామంలో షుమారు ఒక ఎకరం స్థలంలో మందులు వాడని ఆకుకూరలను పెంచాలని, రెండవది 110 గ్రామాలలో ప్రకృతి జీవన విధానంపై అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించాము. మూడవది  ప్రతి నెలా మార్కెటింగ్ రంగం ద్వారా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని వారిలో ఆసక్తి ఉన్నవారిని పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యక్రమాల విస్తృతికి ఉపయోగించాలని నిర్ణయించాము. నాలుగవది తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకానికి మద్దతివ్వాలని, ఈ కార్యక్రమంపై ప్రచార కార్యక్రమాలకు సహకరించాలని నిర్ణయించాము.

ఈ ఏడాదిలో ప్రతి వారం కార్యక్రమాలను నిర్వహించుకుంటూ, సమీక్షించుకుంటూ 110 గ్రామాలలో 1022 మంది ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా నిర్ణయించాము. ప్రతి వారం తప్పనిసరిగా కార్యక్రమాలను నిర్వహించి సమీక్షించాలని అనుకోవడం జరిగింది. ముగ్గురితో ప్రారంభించిన మార్కెటింగ్ కార్యక్రమాలను ప్రతి వారం విస్తృతపరచాలని ప్లాన్ చేశాము.

నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోయనపల్లి అంజయ్య (చొప్పకట్లపాలెం), రామన అప్పారావు (నారాయణ పురం), నామేపల్లి శ్రీనివాసరావు (జానకీ పురం) లకు ధన్యవాదములు.
- పల్లా కొండల రావు

పల్లె ప్రపంచం మార్కెటింగ్ సర్వీసెస్ ఏక్షన్ ప్లాన్ సమావేశానికి హాజరైన వారు
పల్లె ప్రపంచం విజన్ ను  వివరిస్తున్న ఫౌండేషన్ చైర్మన్ పల్లా కొండల రావు

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top