హిందువుల్లో కులాలు లేవు అని చెప్పి రిజర్వేషన్‌ని రద్దు చెయ్యాలనుకునే బిజెపిలో దళితులు చేరుతారు కానీ హిందు మతం ఉన్నంత వరకు కులం ఉంటుంది అని తెలిసిన మావోయిస్టుల్ని మాత్రం కులం పేరుతో తిట్టే కంచ ఐలయ్య లాంటి మేతావులు బయలుదేరుతారు. కుల నిర్మూలన పెట్టుబడిదారుల ఆబ్జెక్టివ్ కాదు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ పెట్టమంటే తాము అలా పెట్టలేము అని పెట్టుబడిదారులు ముఖం మీద చెప్పేస్తారు. కంచ ఐలయ్య లాంటి బి.సి. మేతావులకి పెట్టుబడిదారుల మీద లేని కోపం శ్రామిక వర్గ విప్లవకారుల మీద ఎందుకు ఉంది? ఇటీవల మహారాష్ట్రలోని ఎంకౌంటర్లో చనిపోయినవాళ్ళ శవాలకి కూడా కులం ఎంచడానికి కొంత మంది సోషల్ మీడియా దళితవాదులు సిగ్గుపడలేదు. అందుకే ఇది చెపుతున్నాను. 

‌- Praveen Rayagada

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

 

 

Post a Comment

  1. బి.జె.పి.వాళ్ళు నిజంగానే రిజర్వేషన్‌ని రద్దు చేసే ప్లాన్‌లో ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం చివరిసారి కుల జనాభా లెక్కలు సేకరించింది 1932లో. ఆ పాత లెక్కల ఆధారంగా ఇప్పుడు బి.సి. రిజర్వేషన్ కొనసాగుతోంది. కొత్త జనాభా లెక్కల్లో బి.సి.లని గణించాలి అని బి.సి.లు డిమాండ్ చేస్తోంటే అది సాధ్యం కాదు అని బి.జె.పి. అంటోంది. 90 ఏళ్ళ క్రితం నాటి పాత లెక్కల ఆధారంగా బి.సి. రిజర్వేషన్ కొనసాగించడం కూడా కష్టమే. చివరికి ఇది కూడా సాధ్యం కాదని చెప్పి బి.సి. రిజర్వేషన్‌ని ఎత్తేసినా ఎత్తివెయ్యగలరు. రిజర్వేషన్ అవసరం లేని ఉన్నత సమాజాన్ని స్థాపించాలనుకోవడం వేరు, తమ మతంలో కులాలు లేవు అని బొంకడం వేరు. 90 ఏళ్ళ క్రితం నాటి పాత లెక్కలతో ఇప్పుడు ఏ కులంలో అక్షరాస్యత ఎంత ఉంది, ఏ కులంలో ఎంత మందికి సొంత వ్యవసాయ భూమి ఉంది అనేవి ఎవరూ ప్రిసైజ్‌గా చెప్పలేరు. అలా చెప్పగలిగే అవకాశం లేకుండా చెయ్యాలని బి.జె.పి. అనుకుంటోంది. ఇలాంటి పార్టీలో దళిత మోర్చా అనేది ఒకటి ఉంది, నామ్‌కే వాస్తే లాగ.

    ReplyDelete
    Replies
    1. రిజర్వేషన్లు లేని ఉన్నత సమాజం సాధించాలంటే ఈ రిజర్వేషన్లను యథాతధంగా కొనసాగించాలా ప్రవీణ్ గారూ?

      Delete
    2. రిజర్వేషన్‌ని రద్దు చేసినా అది ఒక ప్లాన్ ప్రకారం చెయ్యాలి, అంతే తప్ప లెక్కలు చూపించకుండా కాదు. రైల్వేవాళ్ళు ఒక రైల్వే లైన్‌ని మూసివేసేటప్పుడు నష్టాల లెక్కలు చూపించే ఆ పని చేస్తారు. రిజర్వేషన్ వల్ల ఎంత మంది లాభం పొందారు, ఎంత మంది అది పొందలేదు అనేవి చెప్పకుండా రిజర్వేషన్‌ని కొనసాగించడమో, రద్దు చెయ్యడమో చేస్తారా?

      Delete
    3. మీ చేతిలో అధికారం ఉంటే.... రిజర్వేషన్లపై మీరు తీసుకునే చర్యల క్రమం ఏమిటి?

      Delete
    4. ప్లానింగ్ లేని రిజర్వేషన్ ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే అది మారుతుందా? రాయగడ జిల్లాలో బి.సి. కోటాలో టీచర్ పోస్టులు ఖాళీగా మిగిలిపోతున్నాయి. బి.సి.లలో చదువుకున్నవాళ్ళు తక్కువగా ఉండడం ఇందుకు కారణం. అక్షరాస్యత పెరగాలంటే ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ చెయ్యాలి. ఖాలీ బి.సి. పోస్టుల్లో ఒ.సి.లని నింపడానికి అవ్వదు. మంత్రి వర్గం అనుమతి లేకుండా ముఖ్యమంత్రి బి.సి. ఖాళీలని ఒ.సి.లతో భర్తీ చెయ్యలేడు. చట్టాలే ఇలా ఉన్నప్పుడు ఎవడు అధికారంలోకి వచ్చి ఏమి చెయ్యగలడు?

      Delete
    5. ఈ రోజుల్లో కులం ఉండే అవకాశం లేదని వాదించినవాళ్ళని ఫేస్‌బుక్‌లో చూసాను. బిసి జనాభా లెక్కలు తీస్తే కులం ఉందో, లేదో ఋజువవుతుంది కదా.

      Delete
  2. బీబీసీ తో అంబేత్కర్ ఇంటర్వ్యూ: "ఐదేల్లపాటు అస్ప్రుశ్యులకి సెపరేట్ నియోజకవర్గాలు కల్పించి మాత్రమే రిజర్వేషన్ ఇవ్వాలి. అప్పుడే ఎన్నికలు జరపాలి. వారు హిందూసమాజంలో కలిసి వుంటూ.. రిజర్వేషన్ ఫలాలు అందించినా.. వారు మిగితావారికి బానిసలుగానే బతుకుతారు. అట్టి రిజర్వేషన్ అర్ధం లేనిది."

    ReplyDelete
  3. 1932 నాటి జనాభా 25 కోట్లు, అప్పట్లో 4,147 కులాలు. ఆ పాత లెక్కల ఆధారంగా ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఇస్తున్నారు. కొత్త లెక్కలు తియ్యడం తప్పు కాదు. పాత లెక్కల ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం మాత్రం తప్పే.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top