అహంకారం ఓ మానసిక అవలక్షణం !

ఆత్మన్యూనతలోనుండి వచ్చే అహంకారం , ఆధిపత్యం లోనుండి - ఆభిజాత్యం లోనుండి వచ్చే అహంకారము రెండూ ప్రమాదమే !

ఈ రెండింటినీ సమైఖ్యం గా ఎదుర్కోవాల్సిందే !

ఎదుర్కోకుండా వదిలేయడమంత మంచిది కాదు.

అప్పుడప్పుడు ...................

మనకు కులపరమైన అహంకార భావం ,ఆత్మన్యూనతా భావం, కులపరమైన పిచ్చవాదన చేసే అలవాటు కనిపిస్తోంది.

నేనమైనా అపార్ధం చేసుకున్నానేమో తెలియదు. కానీ పదే పదే ఇదేరకం పిచ్చవాదన చూస్తే జాలిపడుతూ వదిలేయడం తప్ప ఏం చేస్తాం ?

అంతకు మించి సున్నితమైన ఇలాంటి విషయాలలో చేయగలిగేదేమీ లేదు.

అహంకారంతో తలకెక్కే పైత్యమెంత ప్రమాదమో, ఆత్మ న్యూనతతో తలకెక్కే పైత్యమూ అంతే ప్రమాదకరం.

మెజారిటీ అయినా , మైనారిటీ అయినా ఉన్మాదం ఉన్మాదమే. ఉన్మాదాన్ని తుంచివేయాల్సిందే.

శాస్త్రీయంగా చెప్పాలంటే ఇదొక మానసిక ధోరణి. తప్పనిసరిగా సరిచేసుకోవలసిన జాడ్యం. బిహెవియర్ థెరఫీతో సరిచేసుకోవలసిన అంశమిది.

కేవలం ఆ వ్యక్తులను తప్పు పట్టాల్సిన పనిలేదు. సామాజిక అసమానతలకు ప్రతిస్పందనలో తేడాగా స్పందించే పరాయీకరణ ఇది. సమాజంలో ఇది ఓ ధోరణిలా ఉంటుంది.

ఇదే రకం వ్యక్తులు కలసికట్టుగా ఉండేందుకు, సమైఖ్యత చాటేందుకు సిద్ధంగా ఉంటారు.ఈ రకమైన వాదన లేదా చేష్టలతో సాధించేదేమీ ఉండదు. చరిత్రలో సాధించినదీ లేదు.

వీళ్లు తమ పైత్యపు వాదన నెగ్గించుకోవడానికి ఉన్మాదులుగా వాదిస్తారు. ఎదుటివారికి లేని తప్పులన్నీ అంటగడతారు. వీళ్ల కులపైత్యానికి తమకు నచ్చనివారిపై ఎంతకైనా దిగజారి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తారు. వాళ్ల వాదన వినడం తప్ప ఏమి వాదించినా బుస్సున లేస్తారు. ఎగిరెగిరి పడతారు. అందులో ఓపికగా అర్ధం చేసుకుందామన్నా అణువంత కూడా హేతుబద్ధత కనపడదు.

కానీ ఆ వ్యక్తులు మారకుంటే అదొక జబ్బుగా మారి వాళ్లను నష్టపరుస్తుంది. జనానికి దూరం చేస్తుంది. సమాజంలో అనవసర ఘర్షణలకు దారి తీస్తుంటుంది. సున్నితమైన ఈ సమస్యకు ఒక్కోసారి అమాయకులు బలవుతుంటారు.

వ్యక్తిగత విశ్లేషణ దీనికి ఉపయోగపడుతుంది. అయితే ముందు మనమేమైనా తప్పుగా వాదిస్తున్నామా? తప్పుడు ధోరణితో ఉన్నామా? అనే కనీసపు సంశయాన్ని మనసులోనైనా రానివ్వగలిగే విచక్షణ - సంస్కారముండాలిక్కడ.

అది లేకుంటే ఇపుడు నేను చెప్పేదీ వెటకారం గానూ, కారం గానూ ఉంటుంది. కానీ, చెప్పక తప్పని విషయమిది. ఊరకే వదిలేసే అంశమూ కాదిది. తప్పనిసరిగా ఇటువంటి ఉన్మాదం పై భావజాల పోరాటం చేయకుంటే మరింత ముదురుతుందీ ధోరణి.
- Palla Kondala Rao,
14-08-2012.

Post a Comment

  1. తాను గొప్ప అనుకునేదే రోగమైతే -
    ఎదుటి వారిని తక్కవగా చూడ్డం దాని అనుబంధ రోగం .
    ఈ జంట రోగాల అవలక్షణాలతో పండితులు తెగ మురిసి పోతుంటారు .
    ----- సుజన-సృజన


    ReplyDelete
  2. @వెంకట రాజారావు . లక్కాకుల
    కామెంట్ కు ధన్యవాదములు రాజారావు గారు. మీ పద్యాలు బాగుంటాయి. సుజన - సృజన అనేది దేనికి చిహ్నం సర్ !

    ReplyDelete
  3. మంచి విశ్లేషణ సర్.చివరగా మీరన్న మాట బాగుంది సర్.ఇటువంటి భావజాలాన్ని వ్యతిరేకించటం చాలా అవసరం.లేకపోతే అదే సరిఅయినదని భావిస్తుంటారు.

    ReplyDelete
  4. సుజన-సృజన అంటే మంచి సమాజాన్ని తయారు చెయ్యటం . సదరు ఉద్దేశ్యంతో నాబ్లాగుకు ఆపేరు పెట్టు కున్నాను సర్.

    ReplyDelete
  5. @వెంకట రాజారావు . లక్కాకుల
    మంచి ఉద్దేశ్యం సర్ . అభినందనలు రాజారావు గారు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top