కేవలం పుస్తకాలు చదివితేనే మనకు విషయాలు తెలియాలనిలేదు. నేర్చుకోవడానికి నామోషీ ఫీల్ కాకుండా ఉంటే ప్రతీ చోటనుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. సమాజంలో ప్రతీ చోట మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మంచి నుండి - చెడు నుండి రెండు చోట్లా మనం నేర్చుకోవచ్చు. పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు, అపరిచితులతో మాట్లాడేటప్పుడు నేర్చుకోవచ్చు. ఇతరుల సంభాషణలు లేదా చర్చలను వీక్షిస్తూ నేర్చుకోవచ్చు. రైల్వేస్టేషన్లు - బస్స్టాండ్ లలో వెయిటింగ్ చెసే సందర్భంలో, గ్రామాలలో రచ్చ బండల దగ్గర చాలా చాలా గొప్ప విషయాలు మనం అబ్సర్వ్ చేసి నేర్చుకోవచ్చు. టీ.వీ వీక్షించేటప్పుడు మనకు తెలియని, తెలుసుకోవలసిన విషయాలు నేర్చుకోవచ్చు. చర్చలో పాల్గొనే వారు కష్టపడి చదవడం ద్వారా నేర్చుకున్నవి, ఉదాహరణలకోసమో లేదా చర్చల్లో అవసరం కోసమో వాల్లు చెప్పినప్పుడు ఆ కష్టమంతా పడకుండా వారి అనుభవం నుండి మనం నేర్చుకోవచ్చు. ప్రయాణాలలో బోర్ కొట్టకుండా ఏదో మేగజైన్ లేదా బుక్ చదువుకునే అలవాటు చేసుకుంటే ప్రతి పుస్తకంలో ఏదొ ఒక ఉపయోగపడే అంశం తెలిసే అవకాశం ఉంటుంది.

ఒక సినిమా చూసేటప్పుడు కొన్ని డైలాగులు అద్భుతమైన జీవిత సారాన్ని అందజేస్తాయి. అవి ఒక్కసారే వచ్చినవి కావు. ఆ రచయిత ఎంతో అనుభవం తో ఆలోచించి వ్రాసినవి అవి. అలాగే ఎక్కడైనా వ్యవహారం సాగుతున్నప్పుడు-ఏదైనా చదివేటప్పుడు ఆ వ్యక్తుల అనుభవం మనకు ఉపయోగపడుతుంది. ఆ విషయాలు నేర్చుకోవడానికి మనకు సమయం కలసివచ్చినట్లే. ఉదాహరణకు ఈ మధ్య నేను హైదరాబాద్ వెళ్లాను అక్కడ పని మధ్యలో అనుకున్నదానికి కొంత సమయం గేప్ వచ్చింది. ఖాళీగా ఉండకుండా 'అధినాయకుడు' సినిమాకి వెళ్లాను. అందులో ఇంగ్లాండ్ గురించి ఓ సన్నివేశంలో క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయితే ఇంతవరకూ వరల్డ్ కప్ గెలవలేదు అనే విషయం తెలిసింది. ఈ విషయం చాలామందికి చాలా ఈజీగా తెలియవచ్చు. కానీ క్రికెట్ పట్ల అంతగా ఆసక్తి లేని నాలాంటివాల్లకు ఏదైనా సందర్భంలో చెప్పేందుకు ఇది ఉపయోగపడుతుంది కదా? ఒక్కో సినిమా ఒక్క డైలాగ్ తోనే ఆ సినిమా లైన్ అర్ధమవుతుంది. ఉదాహరణకు "పదిమందిని బ్రతికించడం కోసం చేసేదేదీ తప్పు కాదు" - కమల్ నాయకుడు. "వందమందికి మేలు చేయడం కోసం ఒక్కడిని చంపడానికైనా, చావడానికైనా సిద్దం" - జూనియర్ ఎన్.టీ.ఆర్ సిమ్హాద్రి.

నాకప్పుడే మన బ్లాగులలో ఎక్కడో చదివిన ఓ విషయం గుర్తుకువచ్చింది. భౌగోళికంగా మన రెండు గోదావరి జిల్లాలంత లేని బ్రిటీష్ వాడి ఇంగ్లీష్ ప్రపంచ భాషగా రాజ్యమేలడానికి తేనెలొలుకు మన తెలుగు భాష కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కావడానికి కారణం బ్రిటీష్ వాడు అప్పట్లో వ్యాపారం పేరుతో దేశాలను ఆక్రమించుకుని వలసపాలన కొనసాగించడమే  కారణం తప్ప ఇంగ్లీష్ గొప్పతనం ఎంతమాత్రం కాదు. ఈ విషయాలను కేవలం విషయాలు ఎలా ఎక్కడనుండైనా నేర్చుకోవచ్చనేదానికి ఉదాహరణగా మాత్రమే చెప్పాను.

మన బ్లాగులలో కొన్ని అంశాలపై కొందరు అద్భుతంగా వ్రాస్తున్నారు. వాటిని ఫాలో కావడం ద్వారా నేర్చుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు చెప్పోచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతిదాని నుండి నేర్చుకోవచ్చు. అయితే ఆ విషయాలను అరకొరగా కాకుండా అవసరాన్ని బట్టి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. పాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోని వాల్లు అలా చేసుకున్నవారి కంటే వెనుకబడడం ఖాయం. విషయాలను అప్డేట్ చేసుకోనివారు ఆయా రంగాలలో పోటీవల్ల అవుట్ డేట్ అయ్యే ప్రమాదం ఉంది. డాక్టర్లు - లాయర్లు ..... ఇలా ప్రతీ వృత్తిలో ఉన్నవారు ఆయా వృత్తులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ నేర్చుకోకపోతే చాలా వెనుకబడిపోవడం ఖాయం.

సమాజంను మించిన విశ్వవిద్యాలయం లేదు. ప్రస్తుత చదువులలో కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే చదువులు నేర్పుతున్నారు తప్ప మిగతా లోకజ్ఞానం నేర్పరు. అదంతా సమాజం నుండే మనం నేర్చుకోవాలి. ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా ఏ ఒక్కరికీ ఎప్పటికీ తెలియదు. మన జీవిత కాలం వెచ్చించినా జ్ఞానమంతా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ప్రతి జ్ఞానం ఎప్పటికప్పుడు మెరుగవుతుంది. కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. అయితే పాతది లేకుండా కొత్తది లేదు అనే సంస్కారం మరువకూడదు. నేర్చుకోవడానికి వయసుతో పని లేదు. అక్షర దీపం వంటి వయోజన విద్యా కార్యక్రమాల ద్వారా చదువు నేరుచుకుని విజయాలు సాధించిన వారున్న విషయం విదితమే. అరవైలు దాటిన తరువాత కొత్తగా ప్రారంభించి అధ్బుతాలు చేసినవారు ప్రపంచంలో అనేకులున్నారు. ప్రపంచం దాకా ఎందుకు..... ఏ మాత్రం రాజకీయ జ్ఞానం, రాజకీయ అనుభవం, రాజకీయ చతురత లేని ఎన్.టీ.ఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సృష్టించిన చరిత్ర అద్భుతం కదా! బహుశా రాజ్యసభ సీటు విషయంలో ఆఖరునిమిషంలో ఆయనకు జరిగిన అవమానం ఆయన చేత ఆ పని చేయించి ఉంటుంది. ఏమైనా అదో అద్భుత చరిత్ర.


చిన్న వాల్లనుండి, మనకంటే తక్కువ స్థాయి వారినుండి తెలుసుకునేందుకు ఇబ్బంది పడకూడదు. నామోషీ ఫీల్ కాకూడదు. ఒకరికి తెలిసిన విషయం మరొకరికి తెలియదు. అన్ని జ్ఞానాలు గొప్పవే. అన్నీ వాటి వాటి అవసరాల కోసం పనికి వస్తాయి. పీ.ఎం  (పనిమనిషి)  నుండి పీ.ఎం (ప్రైం మినిస్టర్) వరకూ ఎవరిపని వాల్లు చేస్తుంటారు. వారిపనిలో వాల్లు నిష్ణాతులవౌతారు. పాలుపితికే పని పాలేరు చేసినంత నేర్పుగా ప్రైం మినిస్టర్ చేయలేక పోవచ్చు. అందుకే ఎక్కడనుండి నేర్చుకోవడానికీ ఏ మాత్రం నామోషీ ఫీల్ కాకుండా సమాజం నుండి ప్రతి సందర్భం నుండి నేర్చుకునే ప్రయత్నాన్ని ఓ 'అలవాటు'గా మార్చుకుందాం.

- పల్లా కొండలరావు,
10-06-2012

Post a Comment

  1. >>> రాజకీయ జ్ఞానం, రాజకీయ అనుభవం, రాజకీయ చతురత లేని ఎన్.టీ.ఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి సృష్టించిన చరిత్ర అద్భుతం కదా!బహుశా రాజ్యసభ సీటు విషయంలో ఆఖరునిమిషంలో ఆయనకు జరిగిన అవమానం ఆయన చేత ఆ పని చేయించి ఉంటుంది. ఏమైనా అదో అద్భుత చరిత్ర.>>

    ఈ విషయం నాకు ఇపుడే తెలిసింది.

    ReplyDelete
    Replies
    1. ఏ విషయమైనా నిర్ధారించుకోకుండా గుడ్డిగా ఫాలో అయిపోకూడదని ఇంతకుముందు అన్నారు. మరి రాజ్యసభ సీటు విషయం లో NTR కి అవమానం జరిగిందని ఎలా నిర్ధారించగలం? అప్పటి వార్తలు వ్యాసాలు అరువు తెచ్చుకున్నా కొంతమంది అవమానం జరిగిందని, కొంతమంది జరగలేదని అనొచ్చు. అటువంటప్పుడు నిర్ధారించుకోకుండానే ఇదీ విషయం అని ఎలా చెప్పగలం. కులాల మధ్య కుంపట్లు, ప్రాంతాలమధ్య ఫిట్టింగులు పెట్టేలా వ్యాఖ్యలు చేసే వెధవాయిలకంటే వివిధకులాల/ప్రాంతాల ప్రజలని ఆకర్షించి ముఖ్యమంత్రి కాగలిగిన వ్యక్తి గొప్పవాడే కదా అని నేను నిర్ధారించుకున్నాను!

      Delete
    2. surya గారు, అందుకే నేను బహుశా అని వ్రాశాను తప్ప నిర్ధారించలేదు. గమనించగలరు.

      Delete
    3. తిట్టారా? పొగిడారా? నీహారిక గారు.

      Delete
    4. baagundhi.
      http://www.teluguvision.com/best-telugu-horror-movies-till-date/
      Best Telugu horror movies till date

      Delete
  2. కొండలరావు గారు, విషయం ఎక్కడి నుండైనా సేకరించవచ్చును తప్పులేదు. కాని ఈ సందర్భంగా ఒక నీతిపద్యం గుర్తుకు వస్తున్నది.

    కం. వినదగు నెవ్వరు చెప్పిన
    వినినంతనె వేగపడక వివరింపదగున్
    కని కల్ల-నిజము తెలిసిన
    మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!

    (భావం. ఎవరు చెప్పినా భేషుగ్గా వినవచ్చు. కాని తొందరపడకుండా మంచి చెడ్డలు ఆలోచించాలి, ఆ విన్నదానిలో ఏమన్నా నిగూఢార్ధాలూ లొసుగులూ ఉన్నాయా అని విచారించాలి. అలా ప్రయత్నించి ఏది సత్యం ఏదసత్యం అని తెలుసుకొన్న వాడే ఈ ప్రపంచంలో నీతిని చక్కగా తెలుసుకుంటున్నవాడు)

    అందుచేత సినిమాల్లోంచో, బ్లాగుల్లోంచో మరొకచోటినుండో విషయం గ్రహించినా బాగా ఆలోచించి నిర్ధారించుకోవాలని నా అభిప్రాయం.

    ఈమాట మీకు నచ్చాలని లేదు. నచ్చని పక్షంలో నా ఉ.బో.స.ను మన్నించండి. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. ఉ.బో.స........ ఆచార్యదేవా! ఏమంటిరి..ఏమంటిరి..:)

      Delete
    2. వినదగునెవ్వరు చెప్పిన ...... నేను ప్రజ కు బదులుగా ఇపుడు ఎంచుకున్న పద్దతి అదే సర్. లేబుల్ పేరు అదే ఉంచాను గమనించగలరు. సూచనకు ధన్యవాదములు శ్యామలీయం గారు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top