- Palla Kondala Rao

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. అసలు రిజర్వేషన్లు ఉండాలా? ఎక్కడ? ఎందుకు?

    ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు కానీ వీటికి సమాధానం దొరికితే మీ ప్రశ్నకు జవాబు చెప్పడం సులువు.

    ఉ.

    ఎందుకు? ఫలానా కారణం.
    ఇప్పటిదాకా: ఆ కారణం తొలిగే వరకు

    ReplyDelete
  2. ఒకసారి రిజర్వేషన్ పరంగా ఉద్యోగం పొందిన కుటుంబాన్ని , రిజర్వేషన్ పరిధి నుంచి ఎలిమినేట్
    చేసి , జనరల్ పరిధిలోకి మార్చాలి . ఇలా , ప్రభుత్వ , ప్రభుత్వేతర అన్నిరంగాలలో రిజర్వేషన్లద్వారా
    లబ్ధి పొందిన కుటుంబాలను మళ్లీ రజర్వేషన్ కోటాలోకి ప్రవేసించనీయరాదు . రిజర్వుడు స్థానాలలో
    పోటీ చేసి గెలుపొందిన ప్రజాప్రతినిధులకు కూడా ఈ పధ్ధతి అమలు చేయాలి .
         ఇలా చేస్తే , అందరికీ వాటంతట అవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి . అందరూ ఆర్ధికంగా నిల
    దొక్కుకుంటారు . ఆర్ధికంగా నిల దొక్కుకున్న కుటుంబాలు సామాజికంగా అభి వృధ్ది చెందుతాయనటంలో
    సందేహంలేదు .

    ReplyDelete
    Replies
    1. "ప్రభుత్వేతర అన్నిరంగాలలో రిజర్వేషన్ల"

      లక్కాకుల వారూ, ప్రభుత్వేతర సంస్థలలో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం.

      Delete
    2. రాజ్యాంగాన్ని కాలానుగుణంగా - అనగా రాజకీయావసరాలకు వీలుగా - మార్చుకోవచ్చును కదా?

      ఒకవేళ ఇటువంటి మార్పు చేస్తే ఐటీ వంటి రంగాలు కుప్పగూలుతాయి.

      Delete
    3. ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని ఓ వైపు, ప్రస్తుత రిజర్వేషన్లలో మార్పు చేయాలని మరో వైపు డిమాండ్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రైవేటులో రిజర్వేషన్లకు అవకాశం రాజ్యాంగపరంగా లేదు.

      Delete
    4. డిమాండ్లు చేయటానికేం. ఎవరైనా చేస్తారు. మందిబలం ఉంటే సరిపోతుంది. కాని సాధ్యాసాధ్యాలూ, లాభనష్టాలూ అనంతరపరిణామాలూ బేరీజు వేసుకోవద్దా? కులాలవారీగా వర్గాలవారీగా లెక్కలు కట్టి మేధోపరమైన ఉద్యోగావకాశాలు కల్పించటం దుస్సాధ్యం. మాట వరసకు ఐటీ రంగమే తీసుకోండి. ఒక ప్రాజెక్ట్ అంటే ఏమిటో అందులో పనిచేయటం అంటే ఏమిటో ఈ అరిచే వాళ్ళకు కించుత్తూ తెలియకపోయే అవకాశమే మెండు. ఫలాని కుల/వర్గ సమూహంలో వాడివి కాబట్టి ఈ పని చేయి - ఇది ఇన్నాళ్ళల్లో డెవలప్ చేయాలి అని చెప్పి ఎవరితోనైనా పని చేయించగలమా? అందుకు తగిన నైపుణ్యాలు మొదట ఆ వ్యక్తికి ఉండకతప్పదు కదా? తీసుకొని వచ్చి కూర్చోబఎట్టి నెలలతరబడీ తర్ఫీదు ఇచ్చి పనిచేయించుకోవటం రిస్క్ అన్నమాట ప్రక్కన పెట్టండి - అస్సలు కుదరదు. మీకోసం ప్రపంచం వేచిఉండదు. మీరు అలా ఎప్పటికో ఆ ప్రాజక్టు పూర్తిచేసి మీ కష్టమర్లకు ఇద్దామంటే ఈలోగా వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకోవటమే కాదు మీ కంపెనీని దివాళాకొట్టిస్తారు. మీరు పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తూ ఉండగానే టెక్నాలజీ మారిపోతుంది. ప్రపంచంలో అన్ని ఉద్యోగాలూ క్లెరికల్ కాదని ఎందుకు ఈ గోలచేసే వాళ్ళు గ్రహించరు?

      మీరు ఇల్లు కట్టించుకోవాలంటే మేస్త్రీనుండి కాంట్రాక్తరు వరకూ వాళ్ళకున్న అర్హతలూ అనుభవాలూ విచారించరా? అక్కడ మెరిట్ అవసరం అని మీరనుకుంటారు కాని అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలు మెరిట్ అనేదానితో సంబంధం లేకుండా కుల/మత/వర్గాది ప్రాతిపదికలమీద పంచాలా? మనవాళ్ళు ఇలాంటి అతితెలివి పనులకు దిగితే పారిశ్రామికరంగంలో పాతరాతియుగానికి పోతాం మరి.

      కాదూ ఇదంతా తప్పుడు ఆలోచనలూ అన్నీ రిజర్వేషన్ ప్రకారమే అంటే రేపు ఈదేశాన్ని భగవంతుడు తప్ప ఎవరూ కాపాడలేరు.

      Delete
    5. ప్రయివేట్ రంగంలో రిజర్వేషన్లు రాజ్యాంగానికే కాదు "రాజ్యాంగంలో మార్చలేని మూల స్తంభాలకు" (basic structure of constitution) విరుద్ధం. ఇందు విషయంలో ఎటువంటి అనుమానం/అపోహ అక్కరలేదు.

      Delete
  3. ఫేస్‌బుక్‌లో ఒక దళితుడు అడిగాడు "రిజర్వేషన్ వదులుకోవడానికి మేము సిద్ధమే, మేము రిజర్వేషన్ వదులుకుంటే మాతో కులాంతర వివాహాలు చేసుకోవడానికి మీరు సిద్ధమేనా?" అని. దానికి ఒక సవర్ణుడు ఇలా ఎదురు ప్రశ్న వేసాడు "కులాంతర వివాహాలు చేసుకున్నవాళ్ళే కుల నిర్మూలన గురించి మాట్లాడాలా? అని. కులాంతర వివాహాలు చేసుకోవడం సవర్ణులకి ఇష్టం లేదు, రిజర్వేషన్ వదులుకోవడం దళితులకి ఇష్టం లేదు. కర్ర విరగని, పాము చావని పోరాటం ఇది.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top