Post a Comment

  1. ఇంతకీ దాచిదాచి దయ్యాల పాల్జేసినారా లేదా?ఏం దెలవట్లే.

    ReplyDelete
    Replies
    1. దొరలపాలబడ్డం శ్రీనివాస్ గారు.

      Delete
  2. How is this song?? ;)

    https://www.youtube.com/watch?v=kwbXWSRuDds

    ReplyDelete
  3. పాపం ప్రొఫెసర్ కోదండరాం. బీజీపీతో పొత్తు పెట్టుకుని ఉండుంటే కనీసం గౌరవం దక్కుండేది. అనవసరంగా దిలీప్ లాంటి కోవర్టుల చెప్పుడు మాటలు విని మాయా కూటమిలో చేరడం మూలాన అవమానాలతో కూడిన పరాభవం మిగిలింది. ఇంత బతుకు బతికి ఇంటెన్క చచ్చినట్టు అయింది సార్ పరిస్థితి.

    ReplyDelete
  4. -ఇంత బతుకు బతికి ఇంటెన్క చచ్చినట్టు అయింది సార్ పరిస్థితి.-
    బీజేపితోటైతే మరీ దారుణంగా ఉండేది. ఒంటరిగా అయితే బాగుండేది. ఆయన పరిస్థితికీ, పరువుకీ వచ్చిన ఇబ్బందేమీ లేదు.

    ReplyDelete
    Replies
    1. వారల తరబడి నాంచినాంచి తెజసకు బిచ్చమేసినట్టు నాలుగు సీట్లు, అందుట్లో మూడు (సిద్దిపేట, అంబరుపేట & వర్ధన్నపేట) ఎటుతిరిగీ గెలువలేనివి. ఈ సీట్లలో ఎక్కడ ఎవరిని నిలబెట్టాలో కూడా బయటి వాళ్ళే నిర్ణయించారు. సారుకు కనీసం పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. కూటమి ప్రచారసభలలో కోదండరాం గారిని జూనియర్ ఆర్టిస్టు లెవెల్లో చూసారు. ఇంతకన్నా అవమానం ఇంకేమి ఉంటుంది?

      బీజేపీతో జత కట్టి ఉంటే 20-25 సీట్లు ఇచ్చేవారు. మూడు నాలుగు జిల్లాలలో కూటమి ప్రచారం మొత్తం బాధ్యత దొరికేది. రచనా రెడ్డి లాంటి నాయకులు పార్టీ వదిలేసే ఆగత్యం తప్పేది.

      Delete
    2. కాంగ్రెస్ వ్యవహరించిన తీరు గర్హనీయం. వారేదో గెలవబోతున్నట్లు తె.జ.సకు ఇస్తే గెలవదన్నట్లు ఫీలయ్యారు. వాస్తవానికి కే.సీ.యార్ పోకడల పట్ల తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ప్రత్యామ్నయంగా నేటికీ ఎవరిని చూడాలో అర్ధంగాని స్థితి ప్రజలది.

      కాంగ్రెస్ తీరు వల్ల కోదండరామ్ వ్యక్తిత్వంకు నష్టం లేదు. మరోసారి మా తీరే అంత అని కాంగీయులు నిరూపించుకున్నరంతే.

      Delete
  5. అసలు తెలంగాణ ఉద్యమమే ఒక పెద్ద దుర్మార్గపు కుట్ర.అది ఇప్పుడు బట్టబయలు అయ్యింది, అంతే!నువ్వేది తింటావో అదే నువ్వు - పోటీదారుణ్ణి మించిపోలేని తమ అసహాయతను అవతలివాడి అణచివేత కింద రంగు పులిమేసి ఒక ప్రాంతం మీద ఒక కులం మీద ఒక వ్యక్తి మీద ఈర్ష్యతో అసూయతో రగిలిపోయి విషం కక్కుతూ తెచ్చుకున్న తెలంగాణలో అమృతం ఎలా పుడుతుంది?

    ReplyDelete
    Replies
    1. --- అసలు తెలంగాణ ఉద్యమమే ఒక పెద్ద దుర్మార్గపు కుట్ర -----

      ఇది తప్పు. కేసీయార్ అనేవాడు కుట్రపూరితమైన ఆలోచనతో తెలంగాణ ఉద్యమాన్ని వాడుకున్నడు. ఉద్యమకారులను ప్రస్తుతం బలి చేస్తున్నాడు. కేసీయార్ ని గద్దె దింపి తెలంగాణను చక్కబరచుకునే సత్తా తెలంగాణ ప్రజలకు ఉంది.

      Delete
    2. ఏది తప్పు?

      కేసీయార్ అనేవాడు ఉద్యమాంలోకి రావడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నిజమా కాదా?అది నిజమే అయితే కేసీయార్ వల్ల జరిగిన ఘోరమైన నేరం ఏంటి?మొదట "అట్లెట్ల వస్తది తెలంగాణ?" అన్న్వాళ్ళు కూడా దొర "ఇట్లిట్ల వస్తది తెలంగాణ!" అని ఒప్పించాక అందరూ కలిసి చేసిన ఉద్యమ శైలికి కేసీయార్ ఒక్కణ్ణే బాధ్యుణ్ణీ చెయ్యటం మీరు చేస్తున్న తప్పు.కేసీయార్ వాడుకోక ముందరి తెలంగాణ ఉద్యమం యొక్క స్వభావం కూడా దుర్మార్గమైనదే!

      అసలు ఆంధ్రా నాయకులు తెలంగాణ వాళ్ళని దోచుకోవడం ఎలా కుదురుతుంది?దేశం మొత్తం మీద ఎలా ఎన్నికలు జరుగుతాయో తెలంగాణలోనూ ఆంధ్రాలోనూ అలాగే జరుగుతాయి కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యుల్ని తెలంగాణ వోటర్లే ఎన్నుకుంటారు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యుల్ని ఆంధ్రా వోటర్లే ఎన్నుకుంటారు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధి కోసం పనిచెయ్యరు కదా!తెలంగాణ ప్రాంతపు శాసనసభ్యులు ఆంధ్ర ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!ఆంధ్రా ప్రాంతపు శాసనసభ్యులు తెలంగాణ ప్రాంతపు అభివృద్ధిని అడ్డుకోలేరు కదా!బుద్ధీ జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా నమ్ముతాడా పాస్ పోర్టులు అమ్ముకుని బాగుపడ్డ ఒక నోటిదూల తాగుబోతు వెధవ చెప్పిన గాలికబుర్లు?

      ఆంధ్రదేశం ఏర్పడిన కొత్తలో తెలంగాణా ప్రాంతంలో విద్యా సౌకర్యాలు ఇప్పుడున్నంత బాగా లేవు. ఉపాధ్యాయుల్ని తరిఫీదు చేసే సంస్థలు కూడా చాలా తక్కువ. ఒకవైపున పాఠశాలల సంఖ్య అభివృద్ధి అవుతోంటే ఉపాధ్యాయుల కొరత ఏర్పడినది.1956లో తెలంగాణా ఆసుపత్రులలో పడకల సంఖ్య 5000. 1966లో 10,000. పడకలు పెరిగిన కొద్దీ నర్సుల, మంత్రసానుల అవసరం కూడా కలుగుతుంది. తెలంగాణా అభివృద్ధికీ ఆరోగ్యానికీ అవసరమైన ఉపాధ్యాయుల్నీ, నర్సుల్నీ, మంత్రసానుల్నీ తీసేస్తే, మిగిలేవి 1100 మంది బంట్రోతు, డ్రైవర్లు ఉద్యోగాలలో వున్నవారు, ఒక లక్షా ఏడువేల ఉద్యోగాలలో 1100, పోనీ 4500 ఎన్నో వంతు? వీటి కోసం రాష్ట్ర విచ్ఛిన్న కార్యక్రమం తలపెట్టినారంటే విన్నవారు నవ్వరా?ఆచార్య దేవో భవ, వైద్యో నారాయణో హరి అంటూ అప్పుడు విద్యకోసం ఆరోగ్యం కోసం అవసర మయి ఆంధ్రా నుంచి టీచర్లనీ నర్సుల్నీ కోరి పని చేయించుకున్నారు.ఇవ్వాళ వాళ్ళు రిటయిర్మెంటుకు దగ్గరయ్యాక వారికి పెన్షన్ ఇవ్వటానికి కూడా బాధ పడిపోయి తన్ని తగిలేస్తున్నారు!

      2014 నాటి విభజన ఏర్పాట్ల కోసం కేంద్రం నుంచి ఉద్యోగుల విభజనకి వచ్చిన కమిటీ పరిశీలనకు ఉంచబడిన మొత్తం ఉద్యోగాలు 50, 000 రమారమి అంటున్నారు.మొదట 10,000 అని కనబడింది, వారికే సిగ్గేసి ఇంకా ఘట్టిగా ఫిల్టర్ చేశారేమో ఆఖరికి 50,000 దగ్గిర ఆగింది.వారి తీర్పు నచ్చలేదని గొడవలు రేగటంతో ప్రస్తుతానికి మమ్మల్ని ఇలా వొదిలెయ్యండి, పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు యేర్పడ్డాక మీరూ మీరూ చూసుకోండని వారు దణ్ణం పెట్టేశారు.మరి ఆంధ్రా వాళ్ళు దోచుకున్న లక్షల ఉద్యోగాలు యేమయిపోయినాయో, రేపటి రోజున వారే ప్రభుత్వంలో ఉండి లెక్కలు తీసినప్పుడు గానీ ఈ లెక్క నిక్కచ్చిగా తేలదు.అయినా ఈ బతక లేని బడి పంతుళ్ళూ సిరెంజిలు కడుక్కునే నర్సులూ యాభయ్యేళ్ళ పాటు మొత్తం పది జిల్లాల తెలంగాణా మేధావుల్నీ వెనుకబాటు తనానికి గురి చేశారంటే ఆశ్చర్యంగా లేదూ!

      ఇప్పుడు చెప్పండి!

      Delete
    3. ’ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చింది....’ ఇది ఓ అందమైన ఊహ. సోనియా తన ముద్దుల తనయుడిని ప్రధానిగా చూడాలనే ఉబలాటంలో చేసిన తప్పు వల్ల జరిగింది రాష్ట్ర విభజన. ఇది నేను గతంలో చెప్పినదే.

      తెలంగాణ కోసం ఉద్యమం నికరంగా జరిగింది. ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆంధ్ర ప్రాంత నాయకుల చేతిలో తెలంగాణ దోపిడీకి గురైంది. ఒక్క తెలంగాణలోనే కాదు. శ్రీకాకుళం, రాయలసీమ వంటి ప్రాంతాలూ అదే కోవలోకి వస్తాయి.

      రాష్ట్ర విభజన జరిగాక పాత విషయాలను ఇపుడు రచ్చరచ్చగా చర్చించినా ఉపయోగం లేదు కనుక నేను ఈ చర్చలో మీకు పరిమితంగా మాత్రమే సమాధానం చెప్పగలను. ఇతరుల వాదన గురించి నేను వారితోనే గతంలో వాదించినపుడు ఏం సమాధానం చెప్పానో దానికే కట్టుబడి ఉన్నాను కనుక మళ్ళీ కమెంట్ చేయడం అనవసరమని భావిస్తున్నాను హరిబాబు గారు.

      Delete
    4. తెలంగాణ ఉద్యమం న్యాయమైనదేననీ కేసీయార్ ఉద్యమంలోకి వచ్చాకనే తప్పుడు మార్గంలోకి వెళ్ళిందనీ మీరు ఒక రకమైన గందరగోళంలో ఉండి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు."ఆంధ్ర ప్రాంత నాయకుల చేతిలో తెలంగాణ దోపిడీకి గురైంది. ఒక్క తెలంగాణలోనే కాదు. శ్రీకాకుళం, రాయలసీమ వంటి ప్రాంతాలూ అదే కోవలోకి వస్తాయి." అని బల్ల గుద్ది చెప్పిన మీరే "ఆంధ్రావాళ్ళు దోపిడీ దారులు అని గానీ, ఆంధ్రా ప్రాంతపు వ్యక్తుల గురించి గానీ నేనెపుడూ కమెంట్ చేయలేదు. ఉద్యమం జరుగుతున్న రోజులలోనే నేను సమైక్యవాదిని." అని సమైక్యవాదాన్ని సమర్ధించడం అంటే ఏమిటి?తెలంగాణకూ శ్రీకాకుళానికీ రాయలసీమకూ ఆంధ్ర నాయకుల చేతిలో జరిగే ద్రోహాన్ని సమర్ధించడమే కదా!

      ఇదెక్కడి న్యాయం?

      Delete
    5. మీకు అర్ధం కాలేదు.

      తెలంగాణ నైజాం పాలనలో ఉంది కనుక విద్య, ఇతర సౌకర్యాల కల్పనలో సహజంగానే వెనుకబడి ఉంది. తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా చేసుకున్న ఒప్పందాలను పాలకులు సమర్ధవంతంగా అమలు చేయని కారణంగానే మళ్ళీ జై ఆంద్రా, జై తెలంగాణ ఉద్యమాలు ఏర్పడినవి. ఉద్యమాలు చేపట్టడంలో న్యాయం వేరు, వాటినే పరిష్కారం అనుకోవడం వేరు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటూ అన్ని ప్రాంతాలను సమద్రుష్టితో పాలన చేస్తే ఈ సమస్యలు రావు. ఉదాహరణకు చంద్రబాబు హైదరాబాద్ లోనే అంతా అభివ్రుద్ధి అనే పిచ్చ ఆలోచన తప్పు కాదా? ఎక్కడ ఏ భూమి ఎందుకు అణువుగా ఉంటుందో.... ఆయా ప్రయారిటీల ప్రకారం వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన విజన్ అమలు చేయాలి. ప్రాంతీయ, రాజకీయ, ఎన్నికల అవసరాల రీత్యా ఎవడికి వాడు ( ఎన్.టీ.ఆర్ మినహా) తెలుగు ప్రజలతో ఆడుకున్నవాళ్లే కదా? కాదా?

      Delete
    6. పాత విషయాలు తరచడం దేనికి అంటూనే నాకు అర్ధం కాలేదని కొత్త గందరగోళాన్ని తీసుకొస్తున్నారు.

      అందరూ అనుకుంటున్నట్టు ఆంధ్రా నాయకుల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందనేది పచ్చి అబద్ధం,మొగుణీ కొట్టి మొగసాలకు ఎక్కినట్టు అనే సామెతకి నిలువ్త్తు రూపం అయిన తెలంగాణ ప్రాంతపు నాయకుల దుర్మార్గం వల్ల ఆంధ్ర ప్రాంతపు నాయకులు దోపిడీదారులు గానూ అణచివేత దారులు గానూ దొంగలు గానూ నీచులు గానూ ముద్ర వేయించుకుని నిలబడ్డారు.

      మీ కామెంటు మొదట్లో ఉన్న "మీకు అర్ధం కాలేదు." అనెది మీకే వర్తిస్తుంది.చరిత్ర, అదీ మీవైపు నాయకుల నిజమైన ప్రవర్తనయే నేను చెప్తున్న విషయాన్ని నిరూపిస్తుంది.పులుముడులూ కలుపుడులూ ఏవీ లేని వాస్తవాలనే ఇక్కడ చెప్తున్నాను నేను.

      "తెలంగాణ నైజాం పాలనలో ఉంది కనుక విద్య, ఇతర సౌకర్యాల కల్పనలో సహజంగానే వెనుకబడి ఉంది. తరువాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంగా చేసుకున్న ఒప్పందాలను పాలకులు సమర్ధవంతంగా అమలు చేయని కారణంగానే మళ్ళీ జై ఆంద్రా, జై తెలంగాణ ఉద్యమాలు ఏర్పడినవి." అనే రెండు వాక్యాలలో మొదటిది అంద్రైకీ తెలిస్దొందే.

      బూర్గుల రామకృష్ణా రావు గారికీ ఇతర తెలంగాణ మేధావులకూ ఉన్న సందేహాలను ఆంధ్ర ప్రాంతపు నాయకులు కూడా పట్టించుకున్నారు.అన్ని ప్రాంతాల కాంగ్రెసు నాయకులు కలిసి 1956 జూలై 19న ఒక ఒప్పందానికి వచ్చారు.దీనినే పెద్దమనుషుల ఒప్పందం అన్నారు.న్యూ ఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం మీద సంతకాలు చేసిన రోజు 1956 ఫిబ్రవరి 20 అని కె.వి.రంగారడ్డి గారు తన స్వీయచరిత్రలో రాశారు.తెలంగాణ తరపున బూర్గుల రామకృష్ణారావు, కె.వి.రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి. నరసింగరావు ఆంధ్ర తరపున నీలం సంజీవరెడ్డి, బెజవాడ గోపాలరెడ్డి, అల్లూరి సత్యనారాయణ రాజు, గౌతు లచ్చన్న సంతకాలు చేశారు.ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఇవి:01).కనీసం ఐదేళ్ళపాటు, ప్రాంతాల వారీ రెవిన్యూ వసూళ్ళకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు పెట్టాలి.తెలంగాణ ప్రాంతం నుండి వచ్చే మిగులు ఆదాయాన్ని ఆ ప్రాంతపు అభివృద్ధికే కేటాయించాలి.02).తెలంగాణాలో విద్యాసంస్థలను అభివృద్ధి చెయ్యాలి. స్థానిక విద్యార్థులకు ప్రత్యేక రిజర్వేషనులు ఇవ్వాలి.03).సివిలు సర్వీసులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు నియామకాలు జనాభా నిష్పత్తి ప్రకారం జరగాలి.04).ఐదేళ్ళ పాటు పాలనా వ్యవస్థలోను, న్యాయ విభాగం లోను ఉర్దూ వినియోగం కొనసాగాలి.05).రాష్ట్ర మంత్రివర్గంలో నిష్పత్తి ప్రకారం సభ్యులు ఉండాలి. ముఖ్యమంత్రి కోస్తా, రాయలసీమ నుండి ఉంటే ఉపముఖ్యమంత్రి తెలంగాణా నుండి, ముఖ్యమంత్రి తెలంగాణా వ్యక్తి అయితే ఉపముఖ్యమంత్రి ఇతర ప్రాంతాల నుండి ఉండాలి.06).ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణా అభివృద్ధి మండలికి ఉండాలి. మండలి సభ్యులు తెలంగాణా ప్రాంతం నుండి ఎన్నికైన శాసన సభ్యులు ఉండాలి.07).తెలంగాణాలో మధ్యపాన నిషేధాన్ని తెలంగాణా శాసనసభ్యులు కోరిన విధంగా అమలు చెయ్యాలి.08).తెలంగాణా ప్రాంతంలోని ఉద్యోగాల్లో చేరేందుకు ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్ళపాటు నివసించి ఉండాలని నిబంధన రూపొందించాలి.09).కాబినెట్ మంత్రులలో 40 శాతం తెలంగాణా ప్రాంతానికి చెందిన వారే ఉండాలి.ఈ ఒప్పందం తరువాత తెలంగాణా నాయకులలో ఉన్న సందేహాలు తొలగి, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

      "ఒప్పందాలను పాలకులు సమర్ధవంతంగా అమలు చేయని కారణంగానే"
      అని విహంగవీక్షణ చెయ్యకూడదు ఒక జతినీ ఒక సమూహాన్నీ ఒక కులాన్నీ ఒక ప్రాంతాన్నీ దోపిడీదారులు అనేముందు చరిత్రని చూసి పేరు, తీరు,నేరం అన్నింటినీ చెప్పాలి - ఏ ఆంధ్ర ప్రాంతపు నాయకుడు పెద్ద మనుషుల ఒప్పందానికి తూట్లు పొడిచాదో సాక్ష్యం ఉందా మీ దగ్గిర?పోనీ జై గొట్టిముక్కల గారిని సేకరించి చూపించమనండి!

      part 02 follows...

      Delete
    7. continueing from part 01
      నరసింహా రావు గారు వ్రాసిన Insider అనే పేర్లు మార్చిన ఆత్మకధలోని Mahendranath అనే పాత్ర నీలం సంజీవరెడ్డి గారిదీ అతని శత్రువైన Chaudhury అనే పాత్ర కాసు బ్రహ్మానంద రెడ్డి గారిదీ అని జరిగిన చరిత్రనీ కధలోని సంఘటనల్నీ పోల్చి చూసిన ప్రతి ఒక్కరికీ తెలిసిపోతూనే ఉంటుంది.నవలలో నరసింహా రావు గారు ప్రత్యేకించి ప్రస్తావించనప్పటికీ ఆయన్ని పదవినించి తప్పించడానికి ఉపయోగపడిన ఆనాటి జై ఆంధ్ర ఉద్యమానికి ఈ ఇద్దరు రెడ్ల ఆధిపత్య రాజకీయాలు కారణం అయి ఉంటాయని అనుకుంటున్నాను నేను.

      వెంగళ రావు గారి తర్వాత 1978 మార్చి 06 మొదలు 1980 అక్టోబర్ 11 వరకు మొదటి విడత ముఖ్యమంత్రిత్వం నిర్వహించిన (17)మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలోనే 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిచింది. మర్రి చెన్నారెడ్డి గారు 1956లో ఆంధ్రా తెలంగాణా కలయికని వ్యతిరేకించారు.బాగానే ఉంది, అతనికి కలయికపట్ల వ్యతిరేకత ఉన్నందువల్ల దోషం ఏమీ లేదు.కానీ, పెద్దమనుషుల ఒప్పందంలో తనూ భాగస్వామి అయ్యారు.తన డిమాండ్లు చెప్పారు.

      తర్వాత జరిగిన చరిత్ర ప్రకారం వికారాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై 1957–62 మధ్యన Public Accounts Committeeలో పనిచేశారు.రెండుసార్లు Estimates Committeeకి చైర్మనుగా పనిచేశారు.Andhra Pradesh Regional (Telangana) Development Committeeకి చైర్మనుగా పని చేశారు.1962లో తండూరు నుంచి శాసనసభకు ఎన్నికయ్యాక మొదట Planning, Panchayat Raj శాఖలతోనూ పిదప Finance, Commercial Taxes, Industries శాఖలతోనూ మంత్రి పదవిని అలంకరించారు.మళ్ళీ 1967ల నాడు కూడా శాసనసభకు ఎన్నికై Finance, Education, Commercial Taxes శాఖలతో మంత్రిత్వం అనుభవించారు.అప్పుడు రాష్ట్ర మంత్రిత్వం నుంచి తప్పుకుని కేంద్రంలో 1967–68 మధ్యన Steel, Mines, Metals శాఖలతో మంత్రిత్వం సంపాదించాడు. అన్నీ చేసి తీరా ఏప్రిల్ 1968న రాజీనామా చేసి వెంటనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు!
      మహా ఘనత వహించిన మర్రి చెన్నారెడ్డి గారి అధ్వర్యంలో నడిచిన తెలంగాణ ఉద్యమపు నీచత్వాన్ని తెలుసుకోవటానికి ఈ కొంచెం చరిత్ర చాలదూ!తను మంత్రిత్వం వెలగబెట్టిన కాలం నాడు జరిగిన అన్యాయం మీద తనే తిరగబడటం ఏమిటో అందులోని మోసం ఏమిటో ఇప్పటికీ తెలుసుకోలేని తెలంగాణ ప్రాంతపు మేధావుల అజ్ఞానం మీద నాకు జాలి వేస్తుంది.వాళ్ళ ఆజ్ఞానంతో ఇన్నేళ్ళూ వాళ్ళని వాళ్ళు సర్వనాశనం చేసుకున్నది చాలక వాళ్ళకన్న పదింతలు తెలివైనవాళ్ళైన ఆంధ్ర ప్రాంతపు ప్రజల్ని కూడా సర్వనాశనం చేశారు!

      చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకి జరిగిన ఘోరమైన అన్యాయాన్ని సరిదిద్దాలంటూ ఆ సమయంలో ప్రభుత్వంలోనే ఉండి అదీ అత్యంత కీలకమైన శాఖలను నిర్వహిస్తూ ఆ అన్యాయంలో భాగస్వామియైన చెన్నారెడ్డియే ఉద్యమించడం ఏమిటో, ఆనాటి డొంకతిరుగుడు బెదిరింపు తతంగాన్ని పట్టుకుని ఇవ్వాళ కొందరు తెలంగాణ ప్రజలూ మేధావులూ మాది 1968 నాటి నుంచి రగులుతున్న స్వాతంత్య్ర కాంక్ష అని బట్టలు చింపుకోవడం ఏమిటో - అస్సలు కామన్ సెన్సు కూడా ఉండదా!

      అయిదేళ్ళ ఆర్భాటం తర్వాత 1973 నాటికి అనవసరపు విభజన ఇష్టం లేని శ్రీమతి ఇందిరా గాంధీ కలగజేసుకుని ఆరు సూత్రాల ఫార్ములా ప్రకటించి రాజీ చేశాక జరిగిన లోపాయకారీ ఒప్పందం ప్రకారం మర్రి చెన్నారెడ్డి గారు మొదట ఉత్తర ప్రదేశ్ గవర్నర్ పదవినీ వెంగళ రావు గారి తర్వాత 1978 నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిత్వాన్నీ దక్కించుకున్నారు.

      1968 నాటి చెన్నారెడ్డి గారూ 2001 నాటి కేసీయార్ గారూ ఒకేలాంటి కబుర్లు చెప్పారు, రెండుసార్లూ తెలంగాణ ప్రజలూ మేధావులూ ఒకే రకం పిచ్చితనాన్ని ప్రదర్శించారు,పైన ఆంధ్ర ప్రాంతపు నాయకుల్ని దొంగలనీ దోపిడీదార్లనీ తిడుతున్నారు.

      part 03 follows...

      Delete
    8. continueing from part 02

      పాత విషయాలు తరచడం వల్ల ఉపయోగం లేని మాట కొంత వరకే నిజం.ఆంధ్రలో తెలంగాణ కలిస్తే తెలంగాణని దోచుకుని బతికేద్దామని పులకిరించిపోయినట్టు చరిత్రకి మకిలి పట్టించి వెకిలి కబుర్లు చెప్పింది ఎవరు?

      అప్పటి బూర్గుల రామకృష్నారావు గారు "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలిపేశారు కాబట్టి ఒప్పుకోవలసి వస్తుందని అనేశారు. "హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠీ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి బొంబాయి రాష్ట్రంలోనూ కన్నడ భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాల్ని అప్పటి మైసూరు రాష్ట్రంలోనూ" కలపడానికి లేని విముఖత "హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు భాష మాట్లాడే వారు ఎక్కువున్న ప్రాంతాలను అప్పటికే మద్రాసు నుంచి చీలి ఏర్పడి ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో" కలపడానికి ఎందుకు వచ్చింది?


      అప్పుడు తెలంగాణలో నిజాము పెట్టిన వ్యవస్థకీ కొత్త ప్రభుత్వ విధనలాకె పొంతన కుదరక ఒక సమస్య రగులుతింటే పరిష్కారం కోసం కేంద్రం ఏర్పార్చిన కమిటీ భాష ప్రయుక్త రాష్ట్రాల పేరుతో అహిదరాబాద్ రాష్ట్రాని రద్దు చేస్తూ భాస్గల వారీ పొరుగు రాష్ట్రాల్లో కలపటం అనే పరిష్కారాన్ని సూచించటం వల్ల తెలంగాణ వాళ్ళు ఆంధ్రా వాళ్లతో కలిశారు తప్ప ఆంధ్రావాళ్ళు తెలంగాణని కలుపుకోవడానికి కుట్రలు చెయ్యలేదు.బూర్గుల రామకృష్ణారావు గారు }There is no agitation of a strong character in Andhra on this subject while there is a strong agitation in Telangana not to merge with Andhra" అనటం అబద్ధమా?

      తెలంగాణ ఆంధ్రలో కలిసేటప్పుడుతెలంగాణ నాయకులు చేసిన హడావిడి మొత్తం అప్పటికే ఆంధ్ర రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయి చ్గాలా యేళ్ళు అయ్యింది.అంత పాతుకుపోయి ఉన్న రాష్ట్రంలో కలుస్తున్న కొత్త కాపులు అధికారంలో వాటా కోసం చేసిన బ్లాక్ మెయిలింగ్ మాత్రమే. కలిసిన తర్వాత రెండు సార్లు జరిగిన ఉద్యమాల లోనూ అదే బ్లాక్ మెయిలంగ్ తరహా నీచత్వాన్ని ప్రదర్శించారు.

      మీ వెనకాల ఇంత దుర్మార్గపు చరిత్రని పెట్టుకుని ఇప్పుడు "ఎవడేలుతున్నడురో!" అంటూ పిచ్చిపాటలు పాడుకోవటం వల్ల ప్రయోజనం లేదు.

      జై శ్రీ రాం!

      Delete
    9. < మీ కామెంటు మొదట్లో ఉన్న "మీకు అర్ధం కాలేదు." అనెది మీకే వర్తిస్తుంది. >

      no problem.

      Delete
  6. కేసీయార్ దగ్గిర్నుంచి గోరేటి వెనకన్న వరకు పాడిన పాట "ఆంధ్రా దోపిడీ" అనేది సర్వాబద్ధం - నిజానికి ఆంధ్రాతో కలిసింది మొదలు తెలంగాణ వాళ్ళు గయ్యాళితనంతో చేసిన దగాకోరు రాజకీయం వల్ల సర్వనాశనం అయ్యింది ఆంధ్రావాళ్ళే!

    ReplyDelete
    Replies
    1. ఇపుడు కూడా ఆంద్రా కాంట్రాక్టర్లకే కేసీయార్ దోచిపెడుతున్నడు. నో డౌట్.

      Delete
    2. పంచ మహా పాతకాలు అనే లిస్టులో "తప్పు చెయ్యని వాణ్ణి శిక్షకు గురయ్యేలా చెయ్యటం" అనేది ఒకటి.ఫలానా ఆంధ్రా వాడు తెలంగాణకి ఫలానా ద్రోహం చేశాడు అని రుజువు చేసి ఆ వ్యక్తిని ఎని బూతులు తిట్టినా ఎవరూ తప్పు పట్టరు.అన్ని మానవ సమూహాల్లోనూ ఉన్నట్టే నిజాన్ని ఒప్పుకునే నిజాయితీ పరులు ఆంధ్ర ప్రాంతంలో కూడా ఉన్నారు.

      కానీ,2014లో ఆంధ్రా దోపిడీని తిట్టి ఏదో పరాయివాళ్ళైన ఇంగ్లీషువాళ్ళ మీద న్యాయపోరాటం చేసినంత బిల్డప్ ఇచ్చి స్వరాష్ట్రం తెచ్చుకున్నాక కూడా స్వయాన నవ తెలంగాణ భగీరధుడు అని పొగిడించుకుంటున్న ముఖ్యమంత్రి దొంగసారా మానిపించటానికి కల్తీకల్లును అలవాటు చెయ్యాలనుకున్నంత పచ్చి తాగుబోతుల్ని సంస్కరించడం కూడా పెద్దమనుషుల ఒప్పందం నాడు ఆంధ్రావాళ్ళ నెత్తిమీదే పెట్టారు.

      మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కినట్టు ఆ పెద్దమనుషుల ఒప్పందం నాటినుంచి వాళ్ళు తెలంగాణకు అన్యాయం పేరున బ్లాక్ మెయిలింగ్ రొచ్చు రాజకీయాలు నడిపి ఏది కావాలంటే అది అప్పనం పప్పనం దొబ్బేసి మళ్ళీ ఆంధ్రావాళ్ళే మాకు అన్యాయం చేశారనే చెత్త పాటని చెన్నారెడ్డి నుంచీ కేసీయారు నుంచీ అందుకుని జై గొట్టిముక్కల.శ్రీకాంత్ చారి, గుండు మధుసూదన్,ఆచార్య ఫణీంద్ర లాంటివాళ్ళు ఎంత ధీమాగా చేశారు, చేస్తున్నారు, చేస్తారు!

      ఆంధ్రా దోపిడీ పేరున పన్నెండేళ్ళు తెలంగాణ ఇవ్వకపోతే అంతర్యుద్ధం తెస్తాం అని బెదిరించి రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రావాళ్ళకే దోచి పెడుతుంటే జై గొట్టిముక్కల లాంటి వాళ్ళకి నెత్తురు మరగడం లేదా?బహుశః ఆ ఆంధ్రద్వేషికి చంద్రబాబు నీడ తెలంగాణ మీద పడకపోవటం అనే ఆనందంలో తెలంగాణ సంకనాకిపోతుందన్న బాధ తెలియడం లేదు కాబోలు!

      రాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడే తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఆంధ్రావాళ్ళకే దోచి పెడుతుంటే ఆంధ్రా దోపిడీ అనేది సర్వాబద్ధం అనేది మనసుకి ఎక్కాలి కద!

      Delete
    3. ఆంధ్రావాళ్ళు దోపిడీ దారులు అని గానీ, ఆంధ్రా ప్రాంతపు వ్యక్తుల గురించి గానీ నేనెపుడూ కమెంట్ చేయలేదు. ఉద్యమం జరుగుతున్న రోజులలోనే నేను సమైక్యవాదిని. ఇప్పటికీ నేను తెలుగు రాష్ట్రాలు విడిపోవడం వల్ల తెలుగు ప్రజలు నష్టపోయారనే భావంతోనే ఉన్నాను. కేంద్రంలో తెలుగువారిపుడు పలుచనై పోయారు. బెంగాల్ దీదీ లాగా ధైర్యంగా పోరాడే ధైర్యం కేసీయార్, జగన్ అనే దద్దమ్మలకు ఉంటుందా? ఎన్.టీ.యార్, రాజశేఖర రెడ్డి లాగా లేదా ఆఖరకు కిరణ్ కుమార్ రెడ్డిలాగా నైనా సమైక్యవాదిని అని చెప్పగలిగిన సత్తా పిరికిపంద చంద్రబాబుకు ఉందా? ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగానే ఉండి ఉండేది.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top