ఒక సినిమా చూడకుండానే దాన్ని నిషేధించాలని కోరడం సబబా?


ఆ మధ్య ఆరక్షణ్ అనే హిందీ సినిమాని నిషేధించాలని దళితులు గొడవ చేసారు. ఆ సినిమా దళిత వ్యతిరేకం అనుకుని అప్పట్లో నేను కూడా అది చూడలేదు. కానీ ఆ సినిమాలో ఏముందో తెలుసుకోవడానికి దాన్ని youtube నుంచి download చేసుకుని చూసాను. చూస్తే అది రిజర్వేషన్లకి అనుకూలంగా తీసిన సినిమా. దాన్ని నిషేధించమని దళితులు ఎలా గొడవ చేసారు?

ఆ సినిమాలో ఒక దళితుడు ఒక పేరున్న కాలేజ్‌లో ఉద్యోగం కోసం వెళ్తాడు. అతను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాడని తెలుసుకున్న ఆ కాలేజ్ యజమానులు అతన్ని వెనక్కి పంపించేస్తారు. "ఇక్కడ డబ్బున్నవాళ్ళ పిల్లలు చదువుతారు. లో క్లాస్ కుటుంబం నుంచి వచ్చినవాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వము" అని ఆ కాలేజ్ యజమానులు చెపితే అతను STM అనే ఇంకో పేరున్న కాలేజ్‌కి వెళ్తాడు. అక్కడ ప్రిన్సిపల్‌గా పని చేసే హీరో (అమితాబ్ బచ్చన్) అతనికి ఉద్యోగం ఇస్తాడు.

ఓ రోజు సుప్రీం కోర్త్ రిజర్వేషన్లకి అనుకూలంగా తీర్పు ఇవ్వడం వల్ల దళితులందరూ పండగ జరుపుకుంటారు. ఆ పండగని అడ్డుకోవడానికి అగ్రకులాలవాళ్ళు ప్రయత్నిస్తారు. STM కాలేజ్ గోడ మీద ఎవరో "ఆరక్షన్ హమారా జన్మసిద్ధ్ అధికార్ హై" (రిజర్వేషన్ మా జన్మ హక్కు) అని వ్రాస్తారు. అలా వ్రాయడంపై ఆ కాలేజ్‌లోని అగ్రకులస్తులు అభ్యంతరం చెపుతారు కానీ అక్కడ పని చేసే దళిత లెక్చరర్ దాన్ని సమర్థిస్తారు. ఆ కాలేజ్‌లో ఒక అగ్రకులస్తుడు ఆ దళిత లెక్చరర్‌తో గొడవకి దిగుతాడు. హీరో ఆ అగ్రకులస్తుణ్ణి తన ఆఫీస్‌కి పిలిచి తన కాలేజ్‌లో కుల పోరాటాలని అనుమతించను అని చెపుతాడు. కుల పోరాటాలని అనుమతించకపోతే ఆ దళిత లెక్చరర్‌పై కూడా చర్య తీసుకోవాలని ఆ అగ్రకులస్తుడు కోరుతాడు. హీరో ఆ దళిత లెక్చరర్‌కి కూడా కాలేజ్‌లో కుల పోరాటాలు చెయ్యొద్దని చెప్పడంతో ఆ లెక్చరర్ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు.

పాత్రికేయులు హీరోని రిజర్వేషన్‌ల గురించి అడిగినప్పుడు అతను రిజర్వేషన్‌లకి అనుకూలంగా మాట్లాడుతాడు. పేరున్న కాలేజ్‌లో ఎక్కువగా డబ్బున్నవాళ్ళ పిల్లలు చదువుతారు. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రిజర్వేషన్‌లకి అనుకూలంగా మాట్లాడితే ఆ కాలేజ్‌కి చెడ్డ పేరు వస్తుంది. దీనికి సమాధానం చెప్పుకోలేక హీరో అక్కడ ఉద్యోగం మానేసి వెళ్ళిపోతాడు.

హీరో తన సొంత ఇంటికి వెళ్ళాలనుకుంటాడు కానీ ఆ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ అప్పటికే దాన్ని కబ్జా చేసి అందులో coaching center నడుపుతుంటాడు. స్థానిక పోలీస్ ఆఫీసర్ కొడుకులు ఆ coaching centerలోనే చదువుతుండడం వల్ల ఆ పోలీస్ ఆఫీసర్ ఆ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడడు. హీరో కోర్త్‌కి వెళ్తాడు కానీ ఆ ఇల్లు బ్యాంక్ తాకట్టులో ఉండడం వల్ల హీరో వేసిన కేస్ చెల్లదని బ్యాంక్ అధికారులు అభ్యంతరం చెపుతారు. ఇల్లు కూడా పోగొట్టుకున్న హీరో పశువుల పాకల్లో పేద పిల్లల కోసం coaching center పెడతాడు. హీరో పెట్టిన coaching center వల్ల తన coaching centerకి వచ్చే పిల్లల సంఖ్య తగ్గిపోయిందని విలన్ హీరోకి శతృవైన ఒక రాజకీయ నాయకుని సహాయంతో ఆ పాకలని పీకించాలనుకుంటాడు.

ఈ సినిమాలో హీరోది రిజర్వేషన్‌లని వ్యతిరేకించే పాత్ర కాదు. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టెయ్యమన్నట్టు, ఈ సినిమాలో దళిత వ్యతిరేక సంభాషణలు ఉన్నాయని ఎవరో చెపితే కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాని నిషేధించారు.
- ప్రవీణ్ కుమార్
-----------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. గుడ్ రివ్యూ బై ప్రవీణ్ కుమార్

    ReplyDelete
  2. ఏవరో చెప్పారని ఏదీ నమ్మకూడదు ప్రవీణ్, ప్రజలమాటకి విలువ ఇస్తూపోతే విలువైన వాటిని కోల్పోవలసివస్తుంది.నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలి.బాగా వ్రాసావు.

    ReplyDelete
    Replies
    1. వినదగు నెవ్వరు చెప్పిన...... సుమతీ అన్నమాట ప్రవీణ్ గారు.

      Delete
    2. ఆ సినిమా trailer చూసి అది రిజర్వేషన్‌లకి వ్యతిరేకమనుకున్నారు. డబ్బున్నవాళ్ళ పిల్లలు చదివే కాలేజ్‌లో రిజర్వేషన్‌లకి అనుకూలంగా మాట్లాడి, ముఖం చూపించుకోలేక ఉద్యోగం మానేసిన ప్రిన్సిపల్‌కి నిజజీవితంలో అయితే ఉద్యోగం తిరిగి ఇవ్వరు. కానీ ఈ సినిమాలో అలా ఉద్యోగం తిరిగి ఇస్తారు. ఇది రిజర్వేషన్‌కి అనుకూలమైన సినిమాయే కానీ వ్యతిరేకం ఎక్కడా కాదు.

      Delete
  3. http://blog.marxistleninist.in/2015/06/blog-post_21.html?m=1

    ReplyDelete
    Replies
    1. రిజర్వేషన్లు ఉండాల్నా? వద్దా? ప్రశ్నలు మంచివి వేసి టేలెంట్ లేకున్నా రిజర్వేషన్ పేరుతో ఉద్యోగం ఇవ్వాల్నా? ఈ పోస్టుఓ ఈ లింక్ ఇవ్వడం వెనుక మీ ఉద్దేశ్యం అర్ధం కాలా ప్రవీణ్ గారు.

      Delete
  4. ఒక గిరిజన మాజీ ఎం.పి. ఒక కొప్పుల వెలమ (బి.సి.) స్త్రీని ఉంపుడుగత్తెగా ఉంచుకున్నాడు. ఆమె కొడుక్కి ST certificate ఇప్పించి ఆ quotaలో ఇంజనీరింగ్ చదివించాడు. ఇప్పుడు ఆమె కొడుకు ఎనభై వేలు జీతానికి ఒక బహుళజాతి కంపెనీలో పని చేస్తున్నాడు.

    ReplyDelete
    Replies
    1. @ pravin,

      ఉంపుడుగాడు/ఉంపుడుగత్తె అని వ్రాయకూడదు స్త్రీపురుషుల మనోభావాలు దెబ్బతింటాయి. సహజీవికులు అని వ్రాయాలి. మానవ హక్కుల సామాజిక కార్యకర్తగా ఇది నా డిమాండ్.

      Delete
    2. ఆ పురుషునికి ఇది వరకే పెళ్ళయ్యింది. భార్యకి విడాకులు ఇవ్వకుండా అతను మరో పెళ్ళి చేసుకున్నాడు. చట్టం దృష్టిలో ఆ రెండో భార్య ఉంపుడుగత్తెతో సమానం. ఆ కొప్పుల వెలమ స్త్రీ ఒక మాజీ మంత్రి మనవరాలు. ఆమెకి ఉద్యోగం లేదు. తాతగారిని పెళ్ళి చేసుకోవడానికి హిందూ సంప్రదాయం ఒప్పుకోదని ఆమె తన తాతకి తెలిసిన ఇంకో రాజకీయ నాయకుణ్ణి పట్టుకుంది. అతన్ని పెళ్ళి చేసుకోవడం వల్ల ఆమెకి రెండు లాభాలు వచ్చాయి. ఒకటి ఆమె కొడుక్కి ST quotaలో ఇంజనీరింగ్ చదువు, ఇంకొకటి ఆ నాయకుడు తన మొదటి భార్య పిల్లలకి ఏమీ ఇవ్వకుండా ఆస్తి అంతా రెండో భార్య పిల్లలకే ఇచ్చేసాడు. ఇక్కడ చర్చ రిజర్వేషన్ గురించే కాబట్టి నేను ST quotaలో ఆమె కొడుక్కి వచ్చిన అవకాశం గురించి వ్రాసాను.

      ఇలాంటివాళ్ళు చాలా మంది ఉన్నారు. శృంగవరపుకోట పూర్వ ఎమ్మెల్యే తల్లి గిరిజనురాలు కానీ తండ్రి కరణం కులస్తుడు. ఆమె తన తల్లి కులం పేరుతో ఎన్నికల్లో పోటీ చేసింది. అదేమని అడిగితే ఆమె తన తల్లికి తన తండ్రితో ఉన్నది అక్రమ సంబంధం అనీ, తాను కరణం కులస్తురాలిని కాదనీ చెప్పుకుంది. ఆస్తులు తీసుకునేటప్పుడు మాత్రం అక్రమ సంబంధాలు సక్రమమైపోతాయి.

      Delete
    3. మీరు స్త్రీహక్కుల కోసం పోరాడుతుంటారు.మళ్ళీ ఉంపుడుగాడు గురించి వ్రాస్తారు.మీరు అటువంటి పదాలు వాడకండి. సహజీవనం అని వ్రాయండి.మీరు చెప్పిన సబ్జెక్ట్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు.ఇంగ్లీష్ లో పదాలు ఎలా పలకాలో మీరు వ్రాసారు.మేము నేర్చుకున్నాం. అలాగే తెలుగులో మీరు నేర్చుకోవాలి.ఇటువంటి పదాలు వాడినందువల్ల మిమ్మల్ని మీరే అవమానించుకున్నట్లు అవుతుంది.అలా మాట్లాడటం వల్ల చాకలోడిబుద్ధి బయటపడింది కానీ రాముడిబుద్ధి బయటపడదు కదా !

      Delete
    4. మొదటి భార్య పిల్లలకి ఆస్తి దక్కకుండా చేసినవాళ్ళకి స్త్రీల హక్కులు వర్తించడమా? ఇంత వరకు వచ్చింది కాబట్టి నిజం చెపుతున్నాను. ఆ గిరిజన మాజీ ఎం.పి. పేరు విశ్వాసరాయి నరసింహారావు దొర. అతని మొదటి భార్య కూతురే మా అమ్మ. మా అమ్మకి రావలసిన ఆస్తినే అతను తన రెండో భార్య కొడుక్కి వ్రాసేసాడు. పాతిక ఎకరాలు పోయిన బాధలో కూడా "ఉంపుడుగత్తె అనే పదం వాడకూడదు అనే virtue" గురించే ఆలోచించాలా? రిజర్వేషన్‌లని ఎలా దుర్వినియోగం చేస్తారో చెప్పడానికి మొదట్లో నేను అతని పేరు చెప్పకుండానే అతని ఉంపుడుగత్తె కొడుకు గురించి వ్రాసాను. రిజర్వేషన్‌లు ఉండాలా, వద్దా అనే చర్చ జరుగుతోంటే, అవసరం కోసం తల్లి పేరు గానీ తండ్రి పేరు గానీ ఉపయోగించుకునేవాళ్ళకి కూడా రిజర్వేషన్‌లు వర్తింపచెయ్యడం సబబు కాదు అని చెప్పడానికే పై విషయం ఉదహరించాల్సి వచ్చింది.

      Delete
    5. ప్రస్థుతానికి ఈ కధ చదవండి.ఈ కధలో రచయత చెప్పకుండా దాటేసిన పాయింట్ ఒకటుంది.మీలాంటివాళ్ళకి ఉపయోగపడుతుంది.మీరు ఈ కధ చదివి మీ అభిప్రాయం చెప్పండి,తర్వాత మీ సందేహాలకు నేను సమాధానం వ్రాస్తాను.

      http://magazine.saarangabooks.com/2015/06/11/%e0%b0%b8%e0%b1%8b%e0%b0%b2%e0%b1%8d-%e0%b0%b8%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%b8%e0%b1%8d/#comment-17001

      Delete
    6. బహుభార్యత్వం అనే సాంఘిక దురాచారం కంటే ఉంపుడుగత్తె అనే తిట్టు వాడడం పెద్ద నేరం కాదు.

      ఈ చర్చ విషయానికి వచ్చినా, అక్రమ సంబంధాల వల్ల పుట్టినవాళ్ళు తమ అవసరానికి అనుగుణంగా తల్లి కులం పేరో, తండ్రి కులం పేరో చెప్పుకోవడాన్ని కూడా తప్పు పట్టాల్సి వస్తుంది. వాళ్ళకి పుట్టుక అనేది విషయగతం, ఆర్థిక ప్రయోజనం అనేది వస్తుగతం. రిజర్వేషన్‌లు ఉన్నంత వరకు హిందూ ధర్మం మీద నమ్మకం లేని నాస్తికులు కూడా అదే ధర్మానికి చెందిన కులం పేరు చెప్పుకుంటారు.

      Delete
    7. ఆ కథ చదివాను. అందులో రచయిత దాటేసిన పాయింత్ ఏది?

      Delete
    8. మనం ఏదో ఒక టాపిక్ గురించి మాత్రమే చర్చిద్దాం. రిజర్వేషన్,అక్రమసంబంధం రెండూ వేర్వేరు అంశాలు.ఒకదానికొకటి లింక్ ఉన్నా ముందుగా రిజర్వేషన్ గురించి మాత్రమే మాట్లాడదాం. అసలు హీరో రిజర్వేషన్ ని సమర్ధించడం సరైనదేనా ? సోల్ సర్కస్ కధ మీకు నచ్చిందా ? నచ్చితే ఎందుకు నచ్చింది ? నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ? చిత్వాన్ కేరక్టర్ గురించి మీ అభిప్రాయం ఏమిటి ?

      Delete
    9. చిత్వాన్ పరిస్థితి వేరు, నాది వేరు. నాకు నా తండ్రి సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, మా నాన్న రెండో పెళ్ళి చేసుకోలేదు కాబట్టి. మా తాత మాత్రం మమ్మల్ని మోసం చేసాడు. మా ప్రాంతంలో రెండో పెళ్ళి చేసుకున్న మగవాళ్ళు రెండో భార్య పిల్లలకి ఆస్తి కట్టబెట్టడానికి మొదటి భార్య పిల్లల్ని చంపినా చంపగలరు.


      అక్రమ సంబంధాలూ, రిజర్వేషన్లూ వేరువేరు కావచ్చు. కానీ అవసరానికి అనుగుణంగా కులం పేరు చెప్పుకోవడం మాత్రం సమర్థనీయం కాదు కదా.

      Delete
    10. మిమ్మల్ని చిత్వాన్ తో పోల్చుకోకండి.చిత్వాన్ ఒక సహజీవిక కొడుకు.తండ్రి పట్ల ద్వేషం కలవాడు.మీరు చెప్పిన శృంగవరపుకోట పూర్వ ఎమ్మెల్యే కి తల్లి అంటే అభిమానమున్నది.ఈ రెండు సంఘటనలలోనూ ఇద్దరూ తల్లిని సమర్ధిస్తూ తండ్రిని ద్వేషిస్తున్నారు.సహజీవనం అనేది ఇద్దరికీ సంబంధించిన విషయమే అయినా తల్లిని సమర్ధిస్తూ తండ్రిని వ్యతిరేకించడం తప్పు కాదా ?

      రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టే కులంపేరు చెప్పుకుంటున్నారు,రిజర్వేషన్లుపోతే కులాలు కూడా పోతాయి.ఒబామాది ఏ కులమో ఎవరికి తెలుసు ? ఒబామా అమ్మమ్మ ఎక్కడ పుట్టిందో ఎవరికి తెలుసు ? అమెరికాలో పుట్టాడు కాబట్టి అధ్యక్షుడైనాడు.ఇండియాలో పుట్టినవాళ్ళకి అమెరికాలో అధ్యక్షుడయ్యే వీలు లేదు కదా ? ఇటలీలో పుడితే భారతదేశం లో ప్రధానిని చెయ్యనివ్వరు కదా?ఒకటిపోతే ఒకటి వస్తుంది.రిజర్వేషన్ పోతే మతాలు ప్రధానం కావచ్చు.కులాలూ మతాలూ పోవాలని రిజర్వేషన్లు వద్దని చెప్పే హీరో గానీ,దర్శకులు గానీ,రాజకీయ నాయకులు గానీ ఉన్నారా ? గాంధీ,అంబేద్కర్ లాంటివారు కూడా కులాలు పోవాలని చెప్పారు కానీ రిజర్వేషన్లు తీసివేస్తేనే కులమతాలు పోతాయని చెప్పలేదెందుకని ? చాయ్ వాలా ప్రధాని అయిన తరువాతయినా కులమతాలతో సంబంధం లేకుండా నేను ప్రధానిని ఐనాను కాబట్టి రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఎందుకు చెప్పడం లేదు ?

      Delete
    11. భార్య ఉన్న వ్యక్తికి రెండో భార్యగా వెళ్ళడమే స్త్రీవాదానికి వ్యతిరేకం. రెండో భార్య హక్కుల గురించి ఆలోచిస్తే మొదటి భార్య హక్కులు ఏమైపోవాలి? "రమణీయం" పుస్తకం ముద్రించిన ప్రెస్ యజమాని నన్ను వండువ దొర మనవడిగా గుర్తు పట్టాడు. "మీ ఊర్లో పెళ్ళి జరుగుతోంటే నువ్వు అక్కడ కాకుండా నా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నావేమిటి?" అని ఆ ప్రెస్ యజమాని అడిగాడు. "అది రెండో భార్య కుటుంబంలోని పెళ్ళి, మా కుటుంబంలో ఎవరూ అక్కడికి వెళ్ళరు" అని చెప్పాను. అతనికి విషయం అర్థమయ్యి నోరు మూసుకున్నాడు.

      వేశ్యకి "కమర్షియల్ సెక్స్ వర్కర్" అని అందమైన పేరు పెట్టినట్టు ఉంపుడుగత్తెకి "సహజీవిక" అనే పేరు పెట్టడం అనవసరం. చాకలివాళ్ళకి "రజకులు" అని సంస్కృత పేరు పెట్టే ఆర్యసమాజికులపై రంగనాయకమ్మ గారు చేసిన విమర్శలు మీరు చదవలేదా? శృంగవరపుకోట ఒకప్పుడు ST reserved నియోజకవర్గం కాబట్టి శోభాహైమవతి తన తల్లి కులం పేరు చెప్పుకుంది. ఆమె తన తండ్రి నుంచి ఆస్తిలో వాటా తీసుకుందో, లేదో ఎవరికి తెలుసు?

      Delete
    12. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం అవును లేదా కాదు అని మాత్రమే చెప్పాలి.చంద్రబాబు నాయుడు లాగా ఒకటి అడిగితే ఇంకొకటి చెప్పకూడదు.మీ జవాబు చదివిన తరువాత నాకు సవా లక్ష ప్రశ్నలు వస్తున్నాయి.

      1.రెండవ భార్య వేరు సహజీవిక వేరు.భార్య అంటే చట్టప్రకారం వివాహం అయిన స్త్రీ.సహజీవిక అంటే వివాహం చేసుకోకుండా ఇతరులతో శారీరిక సంబంధం కలిగి ఉన్న స్త్రీ. అవును/కాదు

      2.మొదటి భార్య అనుమతితో రెండవ వివాహం చేసుకున్న వారిని కూడా భార్య అని అంటారు. అవును/కాదు.

      3.మొదటి భార్య అనారోగ్య పరిస్థితిలో ఉంటే రెండవ వివాహం చేసుకోవడం నేరమా ? అవును/కాదు

      4.1955కి పూర్వం బహుభార్యాత్వం ఉంది కాబట్టి ఇద్దరూ భార్యలకూ,వారి పిల్లలకూ సమానమైన హక్కులుంటాయి. అవును/కాదు

      5.ముస్లిం సంప్రదాయం ప్రకారం బాబాయి/పెదనాన్న కూతురిని పెళ్ళి చేసుకుంటున్నపుడు హిందువులు కూడా చేసుకోవచ్చు అని మీరు చెప్పారు అవును/కాదు

      6.ముస్లిం లలో బహుభార్యాత్వం ఉంది హిందువులలో కూడా బహుభారాత్వం ఉంటే స్త్రీవాదానికి వ్యతిరేకమా ? అవును/కాదు

      7.రెండవ వివాహం వల్ల ఆర్ధికపరమైన సమస్యలు వస్తున్నాయి. అవును/కాదు

      8.ఆర్ధిక పరమైన సమస్యలు లేకపోతే మొదటి భార్య/భర్త అనుమతితో రెండవ వివాహం చేసుకోవచ్చా ? అవును/లేదు

      9.ఆర్ధిక పరమైన సమస్యలు లేకపోతే మొదటి భార్య/భర్త అనుమతితో సహజీవనం చేయవచ్చా ? అవును/లేదు

      10.భాగస్వామికి మతిస్థిమితం తప్పడం వంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైతే స్త్రీపురుషులెవరయినా పునర్వివాహం చేసుకోవచ్చును. అవును/కాదు

      Delete
    13. భార్య ఉన్న పురుషునికి రెండో పెళ్ళి చేసుకునే అధికారం ఉంటే భర్త ఉన్న స్త్రీకి కూడా రెండో పెళ్ళి చేసుకునే అధికారం ఉండాలి. ఈ విషయంలో నేను ఎప్పుడూ ఒకే మాటపై ఉంటాను.

      కానీ సమాజానివే రెండు నాలుకలు. మగవాడు భార్య ఉండగా రెండో పెళ్ళి చేసుకుంటే అభ్యంతరం చెప్పరు కానీ భర్త చనిపోయిన స్త్రీకి మాత్రం రెండో పెళ్ళి చెయ్యకుండా ఏ teacher ఉద్యోగమో చేసుకుంటూ బతకమని చెపుతారు. రంగనాయకమ్మ గారు కూడా మొదట్లో రెండో పెళ్ళి చేసుకోవాలనుకోలేదు. ఆమె పిల్లలకి tutions చెపుతూ ఆ డబ్బుతో తన పిల్లల్ని పోషించుకోవాలనుకున్నారు. కానీ బి.ఆర్.బాపూజీ పరిచయమైన తరువాత ఆమె జీవితం మారిపోయింది. బి.ఆర్.బాపూజీ విప్లవకారులతో తిరిగేవాడు. ఇది వరకే పెళ్ళైన స్త్రీతో కలిసి ఉండడం తప్పు కాదనే ఆయన అనుకున్నాడు. రంగనాయకమ్మ గారు ఆయన కంటే పదిహేనేళ్ళు పెద్ద. విప్లవ భావాలు ఉన్నవానికి వయసు, ఎత్తు లాంటి పట్టింపులు ఉండకూడదు. కనుక రంగనాయకమ్మ గారితో కలిసి ఉండడానికి ఆయనకి సంకోచం కలగలేదు. రంగనాయకమ్మ గారు బి.ఆర్.బాపూజీ గారితో కలిసి ఉండడం చాలా మంది హర్షించలేకపోయారని రంగనాయకమ్మ గారే వ్రాసారు.

      మగవాడు రెండో పెళ్ళి చేసుకుంటే అతను రెండో భార్య పిల్లలకి ఆస్తి కట్టబెట్టడానికి మొదటి భార్య పిల్లల్ని హత్య చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆడది తన రెండో భర్త పిల్లలకి ఆస్తి కట్టబెట్టడానికి మొదటి భర్త పిల్లల్ని హత్య చేసిన సందర్భాలు ఉన్నాయా? అయినా భర్త చనిపోయిన స్త్రీకి రెండో పెళ్ళి చెయ్యకుండా ఆమెకి ఏ teacher ఉద్యోగమో చేసుకుని బతకమని ఎందుకు చెపుతారు?

      కజిన్ మేరిజెస్ విషయానికి వస్తే, చార్లెస్ దార్విన్ కూడా తన కజిన్‌ని పెళ్ళి చేసుకున్నాడు కానీ బహుభార్యత్వాన్ని పాటించలేదు కదా. కజిన్ మేరిజెస్‌ని సమర్థించినంతమాత్రాన బహుభార్యత్వాన్ని సమర్థించాలని రూల్ లేదు.

      Delete
    14. ఈ చర్చ విషయానికే వద్దాం. వైద్యశాస్త్రం ప్రకారం బిడ్డకి జన్యువులు 50% తల్లి నుంచి, 50% తండ్రి నుంచి సంక్రమిస్తాయి. కులాంతర వివాహం లేదా సంగమం వల్ల పుట్టినవాడు రెండు కులాలకీ చెందినవాడు అవుతాడు కానీ ఏ ఒక్క కులానికో చెందడు. ఈ లెక్క ప్రకారం చూసినా అవసరానికి అనుగుణంగా కులం పేరు చెప్పుకోవడం తప్పే. కానీ భారతీయ చట్టాల ప్రకారం తండ్రి కులమే పిల్లలకి వర్తిస్తుంది. ఇందియా పురుషాధిక్య సమాజమే. అంతమాత్రాన పురుషాధిక్య చట్టాలని సమర్థించలేము. చట్టాలు ఎలా ఉన్నా బిడ్డ రక్తం 50% తల్లిది, 50% తండ్రిది అనే నిజం మారదు. ఒక కమ్మ స్త్రీ ఒక మాదిగవాణ్ణి పెళ్ళి చేసుకుంటే ఆ పుట్టిన బిడ్డ 50% కమ్మ, 50% మాదిగ అవ్వాలి. ఆ బిడ్డ పెద్దైన తరువాత కేవలం మాదిగ పేరు చెప్పుకుని రిజర్వేషన్ పొందకూడదు.

      Delete
    15. ప్రవీణ్ కుమార్ గారూ,
      మీ వాదం ప్రకారం ఒక కులాంతర వివాహంలో పుట్టిన బిడ్డ 50% ఒక కులం, 50% మరొక కులం అవ్వాలి. బాగానే ఉంది. ఆ బిడ్డ పెద్దైన తరువాత కేవలం ఒక కులం పేరు చెప్పుకుని రిజర్వేషన్ పొందకూడదు. వినటానికి ఇదీ సబబుగానే ఉంది. ఈ ప్రకారం, మొదటితరం సంతానానికి 2 power 1 = 2 కులనామాలుంటాయన్నమాట. మరి నాలుగవతరం దాకా ప్రతితరంలోనూ ఆ సంతానం కులాంతరవివాహాలే చేసుకుంటూ పోతే, అప్పుడు ఒక బిడ్డకు 2 power 4= 16 కులనామాలుంటాయి ఒక పెద్ద లిష్టుగా. అలాగే పదితరాలవారు అదే సంప్రదాయంలో తరిస్తూ ఉంటే ఆ పదవతరం బిడ్డకు 2 power 10 = 1024 కులనామాలుంటాయి - ఒక పేజీ సరిపోకపోవచ్చును అన్నీ రాయటానికి. ఎంత కంగాళీగా ఉంటుంది. ఎంత గందరగోళంగా ఉంటుంది. పూర్వమే సనాతనధర్మంలో బీజప్రధానంగా నిర్ణయించి తండ్రి కులాన్ని బిడ్డకు ఆపాదించటం అతడి తల్లికి రక్షణకోసమే. ఆమె బిడ్డలకు రక్షణ కోసమే. ఒక బిడ్డకు తల్లి ఎవరు అన్నదానికి సాక్ష్యం సమాజంలో సూటిగానే ఉంటుంది. అది ప్రత్యక్షవిషయం కాబట్టి. కాని అదే బిడ్డకు తండ్రి యెవరు అన్నది తల్లి మాత్రమే చెప్పగలదు. పురుషుడు తరువాత కాలంలో పితృత్వపు బాధ్యతలనుండి తప్పించుకోవటానికి యత్నించటాన్ని నిరోధించటానికే బిడ్డలకు తండ్రికులం సిధ్ధిస్తుంది అన్న నిర్దేశన వచ్చి ఉండవచ్చు అనుకుంటున్నాను. తండ్రివైపు గుర్తింపు యేదీ ఇవ్వక కేవలం పిల్లలకు తల్లి తరపు గుర్తింపు మాత్రమే ఇస్తే కొన్నాళ్ళ తరువాత బాధ్యతలనుండి పారిపోయే తండ్రులను సమాజం ఎలా నిరోధించగలదు? కష్టం కదా. అందుకే తొలినుండే ఇద్దరి తరపు గుర్తింపు కూడా జోడించటం. అసందర్భం అనిపించినా మరొక విషయం. పెళ్ళిళ్ళకు పదిమందినీ (వీలుంటే ఊరందరనీ పిలవటం) ఎందుకు? ఆ పెళ్ళి చిక్కుల్లో పడితే ఆమె భర్త ఇతడే అన్న సాక్ష్యం బలంగ లభించటం కోసం. పెళ్ళిని చిక్కులో పెట్టి మగవాడు పారిపోకుండా ఉండేందుకు ఇది ఉపకరిస్తుంది. అందుకే పెళ్ళిని ఆడపెళ్ళివారి ఊరిలో చేయటం సంప్రదాయం. పెద్దలు ఏర్పరచిన కట్టుబాట్లకు సంప్రదాయాలకూ వెనుక ఉన్న ఆలోచనలు సాధారణంగా సమాజహితం కోరేవే అయ్యుంటాయి. మీరు పురుషాధిక్యసమాజం అన్న మాట ఒక ఫేషనబుల్ ప్రయోగం కావచ్చును కాని దాని వెనుక స్త్రీలకు వారి సంతానాలకు రక్షణ అన్న కోణం పెద్దలు ఆలోచించటం గ్రహించలేదేమో అనిపిస్తోంది.

      Delete
    16. హత్యలూ,ఆస్థులూ ఇవి తప్ప వేరే పదాలే దొరకవా ? వేరే ఆలోచనే రాదా మీకు ? నెగటివ్ ఆలోచనలు మంచిది కాదు. అఖిల్ అక్కినేని,నాగ చైతన్య ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా ?

      Delete
    17. రిజర్వేషన్ ఉండాల్నా? వద్దా? ఉంటే ఏ బేస్ ఉండాలి? కులమా? జ్ఞానమా? ఆర్ధికమా? నాటి రిజర్వేషన్ పద్దతిలో ఉన్న లోపాలను సవరించాలా? మారిన నేటి పరిస్తితులకు ఏ విధంగా రిజర్వేషన్లను మార్చాలి? ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల పై మీ అభిప్రాయం ఏమిటి? గందరగోళం లేకుండా- ఇతరులను గందరగోళంలో పడేయకుండా ఓపికగా సమాధానం చెప్పండి ప్రవీణ్.

      Delete
    18. శ్యామలరావు గారు, బి.ఆర్.బాపూజీ గారు తన ఇంటి పేరుని పూర్తిగా తొలిగించుకున్నారు. ఆయన తల్లి పేరు భాస్కరమ్మ, తండ్రి పేరు రామమోహనరావు. ఇంటి పేరు తొలిగించుకుని కొత్తగా పెట్టుకున్న పేరు "భాస్కరమ్మ రామమోహన బాపూజీ". ఆ పేరుతోనే ఆయన తన certificates నమోదు చెయ్యించుకున్నారు. ఇంటి పేరునే వదులుకున్న ఆయనకి కులం పేరు వదులుకోవడం కష్టం కాదు. రంగనాయకమ్మ గారి తండ్రి నడిపిన పత్రిక వల్ల ఆవిడ వెలమ దొరల కుటుంబం నుంచి వచ్చిందని తెలుస్తోంది కానీ బి.ఆర్.బాపూజీ మాత్రం తన కులం పేరు ఎక్కడా చెప్పుకోలేదు. కులం పేరు చెప్పుకోకపోతే పెళ్ళి సంబంధం దొరకడం కష్టమవుతుందేమో కానీ వేరే సమస్యలు రావు.

      Delete
    19. బి.ఆర్.బాపూజీ బహిరంగంగా తన కులం పేరు చెప్పుకోలేదు కానీ ఆయన స్కాలర్షిప్ డబ్బులతో చదువుకున్నాడు అని రంగనాయకమ్మ గారు వ్రాసారు. స్కాలర్షిప్ డబ్బులతో చదువుకున్నాడంటే ఆయన రిజర్వేషన్ ఉన్న కులానికి చెందినవాడే అయ్యుంటాడు. ఆయన పేద కుటుంబం నుంచి వచ్చినవాడైతే స్కాలర్షిప్ తీసుకోవడం తప్పు కాదు. ఆరక్షణ్ సినిమా కూడా పేదవాళ్ళకి ఉచిత విద్య ఉండాలనే చెపుతోంది.

      Delete
    20. By the way, రంగనాయకమ్మ గారు కూడా రిజర్వేషన్‌లు ఎప్పటికైనా రద్దు కావాల్సినవే అని వ్రాసారు, ఆవిడ సహచరుడు బి.ఆర్.బాపూజీ రిజర్వేషన్ వల్లే నెలకి లక్ష రూపాయలు సంపాదించే ప్రొఫెసర్ అయ్యాడని తెలిసినా కూడా.

      Delete
  5. ఈ మధ్య ఇదో ఫాషన్ అయిపొయింది మనోభావాలు దెబ్బతిన్నాయని సినిమా రిలీజ్ అవ్వకుండా అడ్డుకోవటం. కొన్ని మరీ పేర్ల మీద అభ్యంతరం కొమరం పులి సినిమానే తీసుకోండి(నేను తెలంగాణా వ్యతిరేకిని కాను) అందులో కొమరం అని పెడ్తే తప్పేంటో ఇప్పటికి అర్థం కాలేదు. పోనీ హీరో ఏమన్నా ఎదవ వేషాలేసేవాడ కాదే ఒక ఉద్ధాత్తమైన పోలీస్. సమాజం బాగుండాలని కృషి చేసేవాడు. అటువంటి వాడికి పేరు పెడితే తప్పేంటి. అందులో తెలంగాణా సంస్కృతిని నాశనం చేయటం ఏంటో వాళ్ళే చెప్పాలి. అలా ఎన్నో. పైన చెప్పిన సినిమాలో పేరు మాత్రమే ఆరక్షణ్. కానీ అందులో రిజర్వేషన్స్ గురించి సహేతుకమైన చర్చే ఉండదు. అసలెందుకు రిజర్వేషన్ ఎవరికీ రిజర్వేషన్ ఉండాలి అనే పాయింట్స్ని అసలు టచ్ చేయరు.

    ReplyDelete
    Replies
    1. కొమరం పులి లో కొమరం వాడడం వల్ల తప్పేమీ లేదు. ఉద్యమం పేరుతో ప్రజలలో ఏ భావోద్వేగాలనైనా రెచ్చగొట్టే చిల్లర వేషాలు ఎల్ల కాలము నడవవు. సదరు హీరో గారు కూడా ప్రశ్నిస్తానని జనసేన పెట్టి ఏకసేనగానే దానిని నడుపుతున్నారు. ప్రశ్నించాల్సిన నేటి తరుణంలో పిల్లిలా ఉన్నాడు.

      Delete
    2. కొమరం పులి సినిమా నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు చూసాను. ఆ సినిమాకీ, పేరుకీ సంబంధమే లేదు. ఆ పేరు పెడితే తెలంగాణా జనం చూస్తారని నిర్మాత అనుకుని ఉంటాడు, ఆ నిర్మాత ఆంధ్రావాడు కావడం వల్ల తమ పేరు వాడుకోవద్దని తెలంగాణా జనం గొడవ చేసుంటారు.

      Delete
  6. అలా ఉంటుంది అని అనుకుని ఎంతో ఆశక్తిగా చుసిన నాకు నిరాశ కలిగించింది. ప్రకాష్ ఝా భయపడ్డాడు అనిపించింది. ఎన్నో contemporary సబ్జక్ట్స్ని ఎంతో చక్కగా డీల్ చేసిన ఝా ఈ సినిమా విషయంలో ఫెయిల్ అయ్యాడు

    ReplyDelete
    Replies
    1. నాకు మాత్రం ఆ సినిమా నచ్చింది. రిజర్వేషన్లని వ్యతిరేకించే వైస్ ప్రిన్సిపల్ రికమెందేషన్లని మాత్రం సమర్థిస్తాడు. ప్రతిభ అనేది ముఖ్యమైతే రికమెందేషన్లు కూడా ఉండకూడదు కదా.

      Delete
  7. ఆ సినిమాలో హీరోది రిజర్వేషన్‌లని వ్యతిరేకించే పాత్ర కాదు. అది రిజర్వేషన్‌లని సమర్థించి ఉద్యోగం పోగొట్టుకున్నవాని పాత్ర. ఆ సినిమా మీద దళితులకి కోపం ఎందుకు? విశాఖపట్నంలో లంకపల్లి బుల్లయ్య కాలేజ్ కట్టింది దళితుడే కానీ ఆ కాలేజ్‌లో దళితులకి రిజర్వేషన్‌లు పెట్టే ధైర్యం దాని యజమానులకి ఉంటుందా? ఆ సినిమాలోనే "ప్రైవేత్ కాలేజ్‌లలో రిజర్వేషన్‌లు పెట్టాలంటారా" అని అడిగితే హీరో సమాధానం చెప్పలేకపోతాడు.

    ReplyDelete
    Replies
    1. రిజర్వేషన్లు ఉంటే ప్రైవేటులోనూ ఉండాలి లేకుంటే అంతటా రద్దు చేయాలి.

      Delete
    2. ఉంటే ప్రభుత్వ రంగమే ఉండాలి లేకపోతే ప్రైవేత్ రంగమే ఉండాలి. ప్రైవేత్ స్కూల్ యజమానులకి నష్టం రాకుండా ఉండేందుకు ప్రభుత్వ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తోన్న పాలకుల్ని మనం చూస్తున్నాం కదా. నేను మార్క్సిస్త్‌ని కాబట్టి నా ప్రిఫరెన్స్ ప్రభుత్వ రంగానికే.

      Delete
  8. ఇప్పుడు నేను నా మొబైల్‌లో "కాలపానీ" (మోహన్‌లాల్ నటించిన) సినిమా చూస్తున్నాను

    ReplyDelete
  9. నేను ఆరక్షణ్ సినిమాని మళ్ళీ నా ఫోన్‌లో చూసాను. ఆ సినిమాలో హీరో ఎక్కడా రిజర్వేషన్‌లని వ్యతిరేకించడు. విద్యాశాఖ మంత్రి తన బంధువుకి హీరో పని చేసే కాలేజ్‌లో seatని recommend చెయ్యాలనుకుంటాడు. హీరో ఆ recommendationకి ఒప్పుకోడు. "డబ్బున్నవాళ్ళు మంచి గురువుల్ని పెట్టి తమ పిల్లలకి tutions చెప్పిస్తారు, అయినా మీ పిల్లలకి మార్కులు తక్కువ రావడం ఆశ్చర్యకరమే" అని హీరో అంటాడు. "డబ్బున్నవాళ్ళ పిల్లలు tutions చెప్పించుకోవడం వల్లే వాళ్ళకి మార్కులు ఎక్కువగా వస్తాయి తప్ప అది సహజమైన ప్రతిభ వల్ల కాదు" అనే నిజాన్ని డబ్బున్న దళితులు కూడా అంగీకరించలేకపోయి ఉంటారు. అందుకే డబ్బున్న దళితులు ఆ సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఉంటారు. "ప్రతిభ డబ్బున్నవాళ్ళ సొత్తు" అని అగ్రకులస్తులు నమ్మితే తప్పు కానీ అదే రకం భావజాలం డబ్బున్న దళితులకి ఉంటే అది తప్పు కాదా?

    ఆ సినిమాకి వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినా అది మొదటి నాలుగు వారాల్లో 50 కోట్లు వసూళ్ళు చేసింది. విమర్శకులు ఆ సినిమాకి ఒక రకంగా free publicity ఇచ్చారు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top