----------------------------------------------
అంశం : దేవుడు
ప్రశ్నిస్తున్నవారు : పల్లా కొండల రావు.
-----------------------------------------------

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. కొండలరావుగారూ, ఈ దైవసంబంధమైన ఆలోచనలూ, అభిమానాలూ, నమ్మకాలూ వంటివి విరుధ్ధభావనలు కలవారితో పంచుకోదగినవి కావు. అటువంటి వారితో వాదించదగినవీ కావు. ఎవరి వ్యక్తిగతమైన పధ్ధతి వారిది. ఇందులో చర్చనీయాంశం ఏమీ లేదు.


    ఈ మధ్యన నేను శ్యామలీయం బ్లాగులో వివేచన అనే శీర్షికక్రింద పద్యాలు వ్రాస్తున్నాను. అందులో వాదములకు జొచ్చి వీదినిబడ నేల అన్న ఒక పద్యం ఈ రోజు ఉదయమే ప్రకటించాను. ఈ చర్చలో నేను ఆ పద్యంలో చెప్పినదాని కన్నా వేఱుగా చెప్పవలసినది ఏమీ లేదు. వీలుంటే ఆ పద్యాన్ని పరిశీలించండి.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు, దేవుడు అనే భావన వ్యక్తిగత విశ్వాసానికి సంబంధించినది. భక్తి అనేది వ్యక్తిగతంగా ఉన్నంతవరకు లేదా ఇతర భక్తులను ఇబ్బంది పెట్టనంతవరకు ఫర్వాలేదు. దేవుడి పేరుతో మైకుల హోరు శృతిమించడం ఇబ్బందికరంగా ఉంటున్నది చాలా సందర్భాలలో. దేవుడు లేడని బలవంతంగా వాదించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం.మనిషిని మనిషి సంపూర్ణంగా నమ్మే స్తితి వచ్చే వరకు దేవుడుండి తీరతాడనేది నా అభిప్రాయం.

      Delete
  2. >>> దేవుడున్నాడా!? లేడా!? అనే వాదన అవసరమా!?

    అవసరం లేదు. అలాగే "దేవుడున్నాడు" అని బహిరంగంగా లౌడ్ స్పీకర్లు పెట్టి మరీ చెప్పడం, ప్రచారం చేయడం, ప్రదర్శనలు జరపడం మానుకోవాలి. అటువంటి కార్యక్రమాలు బహిరంగంగా చేసినప్పుడు అవి నమ్మని వారిచేత ప్రశ్నించ బడతాయి. అప్పుడు ఉన్నారని ఎవరు చెపుతున్నారో వారు ఆ విషయాన్ని ఋజువు చేయాల్సిన అగత్యం ఏర్పడుతుంది. వాదనలు మొదలవుతాయి.

    >>> దేవునిపై విశ్వాసం మరియు భక్తి ప్రకటనలు ఏ విధంగా ఉండాలి!?

    భక్తి ప్రకటన వ్యక్తి యొక్క ప్రైవేటు విషయం. అది అలాగే జరగాలి. అది చేసేటప్పుడు బహిరంగ ప్రదేశాలలో ధ్వని కాలుష్యం, దృశ్య కాలుష్యం, అలాగే ఇతరులకు ఎలాంటి అసౌకర్యం కలక్కుండా చూసుకోవలసిన బాధ్యత భక్తులదే.

    ReplyDelete

  3. ప్రశ్న: దేవుడున్నాడా! లేడా ?
    జవాబు : తెలీదు .
    ప్రశ్న: వాదన అవసరమా!?
    జవాబు : అనవసరం !

    ప్రశ్న: దేవునిపై విశ్వాసం ?
    జవాబు: విశ్వాసం ఉన్న చోట దేవుడు ఉన్నాడు !
    ప్రశ్న : భక్తి ప్రకటనలు ఏ విధంగా ఉండాలి!?

    జవాబు: భక్తి ఉన్న చోట ప్రకటన ఉండదు !!

    ప్రశ్న వేయువాడు ఎవడు ? జవాబు ఇచ్చు వాడు ఎవడు?
    ఎవడు ప్రశ్న? ఎవడు జవాబు?
    ప్రశ్న ఏది? జవాబు ఏది ?

    అంతా విష్ణు మాయ !!

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,

      దేవుడున్నాడా? లేడా? అంటే తెలీదు అన్నారు.
      విశ్వాసం ఉన్న చోట దేవుడుంటాడు అంటున్నారు.
      విశ్వాసం ఉన్నవారికి దేవుడు కనిపించాడా?

      నేను దేవునిపై అపరిమితమైన విశ్వాసం కలిగి ఉన్న కాలంలో ఎప్పుడూ నాకు దేవుడు కనిపించలేదు. దేవుడి గురించిన రకరకాల తాత్విక ప్రశ్నలకు నాకు దేవుడు గానీ భక్తులు గానీ సమాధానం ఇవ్వలేదు. దేవుడు లేడని వాదించేవారినుండీ కూడా నాకు సరైన సమాధానం వారెందుకు అలా వాదించాలనేదానిపై సమాధానం లభించలేదు. దేవుడు లేడని వాదించడం వల్ల సమాజానికి వచ్చే ఇసుమంత ప్రయోజనమూ నాకు కనిపించలేదు.

      మనిషికి మనిషి తోడుండే సమాజం ఏర్పడితే మనిషి దేనికైనా భయపడాల్సిన అవసరం లేదనుకున్నప్పుడే దేవుడనే భావన లేదా ఈ ప్రపంచాన్ని లేదా విశ్వాన్ని ఏ శక్తి అయినా నడిపిస్తున్నదా? అది దేవుడేనా ? అనే ఆలోచనలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఇంత సుదీర్ఘమైన లోతైన ఈ అంశానికి సంబంధించి పనిగట్టుకుని వాదించాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం.


      అయితే దేవుని పై విశ్వాసం అనేది మానసిక ప్రశాంతతను ఇస్తుంది. పాపభీతి భూతదయ లాంటివి మనిషిలో అంతర్గతంగా మంచిని ప్రేరేపించడానికి పనికి రావచ్చు. అవి లేనివారు మంచిని కలిగి ఉండరని మాత్రం కాదు.

      సహజంగా మనిషి మంచివాడు. నిరంతరం సమాజం ప్రభావితం చేసే పరిస్తితులను బట్టే మనిషిలోని మంచిని చెడులు నిరంతరం వెలికి వస్తుంటాయి.

      నిరంతరం మనిషిలోని మంచిని ప్రేరేపించే పరిస్తితులుండే సమాజాన్ని నిర్మించుకోగలిగితే మనిషిలోని దైవత్వం నిండుగా నిరంతరం ప్రకటించబడుతుంటుంది.

      Delete
  4. కొందల రావు గారు, దేవుడు , ఆత్మ అనేవి కేవలం వ్యక్తిగతమైనవి. అవి వ్యక్తం చేయలేనివి. ఒక పుట్టు గుడ్డి వ్యక్తికి గులాబి రంగును ఎలా ఉంటుందో మనం చెప్పలేమో, (ఇక్కడ గుడ్డి అని ఎవరినీ అనడం లేదు.ఒక ఉదాహరణ కొరకు మాత్రమే ఆ ఉపమానమును తీసుకున్నాను) అదే విదముగా దేవుడు అనే ఒక అనుభూతిని కూడా వర్ణించ్లేము. అది ఎవరికి వారు అనుభవింపవలసినదే.
    manohar

    ReplyDelete
  5. దేవుడు ఉన్నాడని వాదించేవాళ్ళు అతను ఎలా ఉంటాడో చెప్పగలగాలి. దేవుడు మనిషి రూపంలో ఉంటాడని చెపితే ముస్లింలు నమ్మరు కానీ హిందువులు నమ్ముతారు. దేవుడు ఎలా ఉంటాడనే విషయంలో బైబిల్ పాత నిబంధనల్లోనే ఒకదానికి ఒకటి విరుద్ధమైన కథలు ఉన్నాయి.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top