మరో చక్కని గీతంతో నాకు నచ్చిన పాట శీర్షికన వచ్చేశాను. నేను ఏ కొంచెం ఆనందంగా వున్నా, ఈ పాటను బాగా చూడటానికి ఇష్టపడతాను. అందులోనూ సావిత్రమ్మ అభినయం, చుట్టూవున్న ప్రకృతి, కవుల ఊహలకు రూపమిచ్చినట్లుంటుంది. ఇక సాహిత్యమంటారా? ఆరోజుల్లో కవుల భావుకత ఆనాటి పరిస్తితులకు తగ్గట్టుగా ఉండేది. నేటి సాహిత్యం సంగతి చెప్పేదేమి ఉంది. వింటూనేవున్నాం, చూస్తూనే వున్నాం.

ఇక పాట విషయానికివస్తే  1964 లో వచ్చిన శ్రీ శంభు ఫిలింస్ వారి "పూజా ఫలం" చిత్రం లోని హాయి ఐన గీతం. సావిత్రి నటన అమోఘమని మరో మారు రుజువైన చిత్రం. 


    సుందర సురనందన వనమల్లి జాబిల్లి
    అందేనా ఈ చేతుల కందేనా,
    చంద మామ ఈ కనులకు విందేనా, 
    అందేనా ఈ చేతుల కందేనా.

    ఆ మడుగున కనిపించి నా మనసున నివసించి
    అంతలోనె ఆకాశపు అంచుల విహరించె
    చందమామ ఈ కనులకు విందెనా

    తలపుదాటనీక మనసు తలుపు వేయగలను గానీ
    నింగిపైకి ఆశలనే నిచ్చెనేయ గలను గానీ
    కొలనులోని కోర్కేలనె అలలపైన ఊగే కలువ పేద బ్రతుకులోన
    వలపు తేనే నింపేనా 

    చందమామ ఈ కనులకు విందేనా

    అందేనా ఈ చేతులకందేనా.

సంగీతం సమకూర్చిన యస్.రాజేశ్వరావుగారి సంగీతానికి ధీటు వేరు కలదా అనిపించక మానదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కలానికి తిరుగుందా?.నేడువిన్నా ఇలానే స్పురిస్తుంది. పదికాలాలపాటు మదిలో నిలిచిపోయే ఇంత చక్కని గీతన్ని మీరూ అస్వాదిస్తారని ఆశిస్తూ....
- మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి.
 
*** *** *** మీరూ మీకు నచ్చిన పాట గురించి వ్రాయాలనుకుంటే ఇక్కడ నొక్కండి. *** *** *** 
*Republished

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top