- పల్లా కొండలరావు
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

janavijayam@gmail.com

Post a Comment

  1. ఫలానా విషయాన్ని సమ్మతించడం లేదా వ్యతిరేకించడం కోర్టుల పని కాదు. అలాగే ఏది తప్పు/పాపం/ఘోరం/అనైతికం వగైరా ప్రశ్నలు న్యాయస్థానాల పరిధిలో రావు.

    రాజ్యాంగం & న్యాయవ్యవస్థ ప్రకారం ఫలానా సెక్షన్ చెల్లుతుందా లేదా తేల్చడం కోర్టుల బాధ్యత. ఎవరో కొందరు సెక్షన్ 497 కొట్టేయాలని వాదిస్తూ కోర్టు మెట్లు ఎక్కారు. అందరి వాదనలూ విన్నాక ధర్మాసనం పిటిషనర్ల వాదన సబబేనని నిర్ణయించింది. ఈ తీర్పును ఆ పరిమిత కోణంలోనే చూడాలి.

    ReplyDelete
  2. Supreme Court has no right to repeal any section from the IPC, Arms Act, Evidence Act etc. How could they judge against the section 497 of the IPC?

    ReplyDelete
    Replies
    1. Courts have the complete powers (rather it is their responsibility) to "strike down" any law or section thereof if it is "ultra vires". The struck down section (or complete act, if that is the case) becomes "null and void ab initio".

      కోర్టులకు రాజ్యాంగ వ్యతిరేకమని నిర్ధారించబడిన మొత్తం చట్టాలను (లేదా కొన్ని సెక్షన్లను) కొట్టేసే పూర్తి హక్కులు ఉన్నాయి. నిజానికి ఇది వారి బాధ్యత కూడా.

      మీకు ఎక్కడో/ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టుంది. Please check again: I can clarify if you have any doubts.

      Delete
    2. I was not misled by anyone. హిందూ వివాహ చట్టం ప్రకారం నాలుగు తరాల దగ్గర రక్త సంబంధీకులు పెళ్ళి చేసుకోవడం నేరం. ఒకడు వ్యక్తి స్వేచ్ఛ పేరు చెప్పి తన మూడు తరాల దగ్గర రక్త సంబంధీకురాలిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం అతను హిందూ వివాహ చట్టంలోని ప్రొహిబిటెడ్ డిగ్రీ ఆఫ్ రిలేషన్షిప్ అనే క్లాజ్‌ని రిపీల్ చెయ్యమని సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వేసాడనుకుందాం. నేను నాస్తికుణ్ణి కనుక ఆ క్లాజ్ వ్యక్తి స్వేచ్ఛకి వ్యతిరేకమనే అంటాను. కానీ వ్యక్తి స్వేచ్ఛ పేరు చెప్పి సుప్రీం కోర్ట్ ఆ క్లాజ్‌ని రిపీల్ చెయ్యడానికి ఒప్పుకుంటుందా? హిందూ వివాహ చట్టాన్ని మార్చే దమ్ము సుప్రీం కోర్ట్‌కి ఉందా అని నేను ఇంతకు ముందే ఒక కామెంట్‌లో అడిగాను.

      Delete
    3. @प्रवीण:

      మీరు పైన వ్యాఖ్యలో "Supreme Court has *no right* to *repeal* any section from the IPC, Arms Act, Evidence Act etc" అన్నారు. నేను దానికి ఇచ్చిన సమాధానంలో రెండు విషయాలు చెప్పాను: 1. complete powers 2. to "strike down" (not "repeal").

      ఉ. మిథూ వర్సెస్ పంజాబ్ కేసులో ఐపీసీ సెక్షన్ 303 కొట్టేసారు.

      I repeat: any act or section of any act can be struck down if it is ultra vires.

      Just for info, the word "repeal" is linked to a legislative (not judicial) function.

      ఇక హిందూ వివాహ చట్టం విషయానికి వస్తే ఎవరినయినా "పెళ్లి" చేసుకోవడం నేరం కాదు. సదరు సంబంధాన్ని చట్టం "హిందూ వివాహం" గుర్తించకుండా సహగమనంగా లెక్కిస్తుంది అంతే.

      Any marriage is a privilege, not a right. This distinction is essential for understanding the concept of natural rights.

      దమ్మూ ధైర్యం సత్తా లాంటి పెద్దపెద్ద మాటలు ఎందుకు? చట్టం హక్కులను హరిస్తే కోర్టులు తప్పక కొట్టేస్తాయి సందేహం వలదు నేస్తం.

      Delete
    4. నేను హిందూ సంప్రదాయం ప్రకారం వరస కాని స్త్రీని పెళ్ళి చేసుకుంటే నేను చనిపోయిన తరువాత నా ఆస్తి ఆమెకి దక్కదు. ఇది చాలదా హిందూ వివాహ చట్టంలోని ఒక క్లాజ్ వ్యక్తి స్వేచ్ఛకి అడ్డు తగలడానికి?

      ఆర్మ్‌స్ ఏక్ట్ అనేది లిబరల్ గన్ రైట్స్‌కి వ్యతిరేకం అని చెప్పి సుప్రీం కోర్ట్ ఆర్మ్‌స్ ఏక్ట్‌ని కొట్టివేసింది (రిపీల్ చెయ్యలేదు) అనుకుందాం. ఆర్మ్‌స్ ఏక్ట్ చెల్లదని తీర్పు వచ్చింది కదా అని పోలీసులు జనాన్ని లైసెన్స్ లేని తుపాకులు పట్టుకుని తిరగనిస్తారా? లైసెన్స్ లేనివాళ్ళకి తుపాకులు అమ్మడానికి గన్ డీలర్స్‌కి అనుమతిస్తారా? మరి ఒక చట్టాన్ని కొట్టివెయ్యడానికీ, రిపీల్ చెయ్యడానికీ మధ్య తేడా ఏమిటి?

      Delete
    5. "మరి ఒక చట్టాన్ని కొట్టివెయ్యడానికీ, రిపీల్ చెయ్యడానికీ మధ్య తేడా ఏమిటి?"

      Repeal ఆంటే ఉపసంహరించడం లేదా వెనక్కి తీసుకోవడం. చట్టాలు చేసే హక్కు శాసనసభలకు ఉంటుంది కనుక వారికే రిపీల్ అధికారం. This is a legislative function.

      Strike down అనగా కొట్టేయడం, చెల్లదనడం లేదా అసలు ఎప్పుడూ జారగానే లేదని (ab initio null and void) నిర్ధారించడం. Judicial supervision (న్యాయ ఆజమాయిషీ) is a judicial function.

      సమీప ఉదాహరణ కోసం మీ వ్యాఖ్య మీరే డిలీట్ చేయడం repeal, బ్లాగు యజమాని తీసేయడం striking down.

      "నేను హిందూ సంప్రదాయం ప్రకారం వరస కాని స్త్రీని పెళ్ళి చేసుకుంటే నేను చనిపోయిన తరువాత నా ఆస్తి ఆమెకి దక్కదు"

      మీ స్వార్జితం ఎవరికీ అయినా ఇవ్వొచ్చు.

      స్వార్జితం absolute right అయితే ఇతరులని నుండి సంక్రమించిన ఆస్తిపై ఉండే హక్కు regulated privilege అవుతుంది.

      If Arms Act is struck down, the very concept of gun license itself will vanish. Anyone can buy & sell guns in such a case.

      Delete
    6. నేను నోటరీ చేత విల్ వ్రాయించకుండా చనిపోతే నా భార్య పరిస్థితి ఏమిటి? ఆమెకి ఆమె మొదటి భర్త ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేను ఆమెకి హిందూ సంప్రదాయం ప్రకారం వరస అవ్వను కనుక సివిల్ కోర్ట్ ఆమె పిల్లలకి నన్ను సవతి తండ్రిగా గుర్తించలేదు. నా వల్ల ఆమెకి గర్భం వస్తుందనుకుని నేను నోటరీ చేత విల్ వ్రాయించలేదు. నేను విల్ వ్రాయించకుండా చనిపోతే అది నా తప్పు కానీ ఆమె మొదటి భర్త పిల్లల తప్పు కాదు కదా. మరి ఆమె మొదటి భర్త పిల్లలు నా ఆస్తిని తీసుకోకుండా నా బంధువులలోని ఒక వర్గం అడ్డుకుంటే? లెజిస్లేషన్ లిబరల్‌గా లేకపోయినా ఇలాంటి సమస్యలే వస్తాయి.

      Delete
    7. వ్యక్తిగత స్వేచ్ఛ ఆధారంగా ఆర్మ్‌స్ ఏక్ట్‌ని dismiss చేస్తే నాకే లాభం. నా గన్ లైసెన్స్ అప్లికేషన్ ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉంది. నాకు పర్సనల్ థ్రెట్ ఉందని స్టేషన్ హౌస్ ఆఫీసర్ రిపోర్ట్‌లో వ్రాసాడు. ఆ రిపోర్ట్‌ని కలెక్టర్ నమ్మితేనే నాకు గన్ లైసెన్స్ వస్తుంది. కేవలం తుపాకీ ఉంచుకునే స్వేచ్ఛ కోసం ఆర్మ్‌స్ ఏక్ట్ చెల్లదని తీర్పు చెప్పండి అంటే సుప్రీం కోర్ట్ ఒప్పుకుంటుందా?

      హిందూ వివాహ చట్టం విషయానికి వస్తే, "లా ఆఫ్ ద ల్యాండ్"కి వ్యతిరేకంగా ఏ చట్టమూ ఉండదు. సుప్రీం కోర్ట్ కూడా ఒక హిందువుకి తన పిన్నిని పెళ్ళి చేసుకోవడానికి అనుమతించదు, అనుమతించినా "సవతి పిల్లల పై హక్కులు" లాంటి విషయాల్లో సమస్యలు రాకుండా ఉండేందుకు గ్యారంటీ ఇవ్వదు.

      Delete
    8. ఒకవేళ వ్యక్తిగత చట్టపరమయిన ఇబ్బందులు ఉన్నట్టయితే దయ చేసి వాటిని బ్లాగులలో చర్చించవద్దు. నిపుణులను ఎవరినయినా సంప్రదించడం బెటర్.

      Delete
    9. నాకు కలెక్టర్ గన్ లైసెన్స్ ఇవ్వకపోతే నేను హైకోర్ట్ నుంచి డిక్రీ తెచ్చుకుని గన్ లైసెన్స్ తీసుకోగలను. అదేమీ నాకు సమస్య కాదు.

      ఆల్రెడీ ఒక లాయర్స్ క్లబ్ వెబ్‌సైట్‌లో ఎవరో అడిగారు, హిందూ వివాహ చట్టంలో పిన్నిని పెళ్ళి చేసుకోవడానికి అనుమతించడం సాధ్యమేనా అని. లా ఆఫ్ ద ల్యాండ్‌కి విరుద్ధంగా ఏ చట్టమూ ఉండదు అని ఒక లాయర్ సమాధానం చెప్పాడు. నేను నాస్తుకుణ్ణే. హిందూ కిన్షిప్ టెర్మినాలజీని సమర్థించాల్సిన అవసరం నాకు లేదు. అయినా కేవలం వ్యక్తి స్వేచ్ఛ ఆధారంగా చట్టాలు ఉండవు అని చెప్పాను, అంతే.

      Delete
    10. జై గారూ,

      తన సమస్యతో 497 ని పోలుస్తున్నారు. ఒక వ్యక్తి స్వేచ్చని బట్టి నిర్ణయం ఎలా తీసుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు.గమనించండి.

      Delete
    11. చట్టాలనేవి కేవలం వ్యక్తి స్వేచ్ఛ ఆధారంగా వ్రాయబడవు. సామాజిక-సాన్స్కృతిక అంశాలని కూడా పరిగణనలోకి తీసుకుని చట్టాలు వ్రాస్తారు. బహిరంగ ప్రదేశంలో సెక్స్ చెయ్యడానికి సామాజిక ఆమోదం లేదు కాబట్టే కదా ఐ.పి.సి.294(ఎ) కింద దాన్ని నిషేధించడం జరిగింది. బహిరంగ ప్రదేశంలో సెక్స్ చెయ్యడాన్ని సమాజం ఆమోదిస్తే 294(ఎ) సెక్షన్‌ని ఐ.పి.సి. నుంచి పార్లమెంటే తప్పకుండా తొలిగించేస్తుంది. అంతేకానీ వ్యక్తి స్వేచ్ఛ పేరుతో కోర్టులకి సొంత తీర్పులు చెప్పే అధికారం ఇవ్వడం ఎప్పటికీ మంచిది కాదు.

      Delete
    12. నీహారిక గారూ, నాకు ప్రవీణ్ ప్రశ్న అర్ధం అయింది. ఒకవేళ అది సొంత వ్యవహారాలకు సంబంధించింది అయినట్లయితే బ్లాగులు పరిష్కరణ వేదికలు కాజాలవు.

      ఒకరి ప్రయివేటు విషయాలలో రాజ్యం తలదూర్చకూడదన్న సూత్రం "negative rights" అంటారు. వాటికి ఫలానా హోదా ఇచ్చే తీరాలని పట్టు పడడం "positive rights" కోరడమే. A regulated privilege granted by the collective can't be demanded as a right.

      శ్యామలీయం మాస్టారు సూచించినట్టు చర్చ టపా పరిధిలో ఉంటేనే మంచిది.

      Delete
    13. నేనేమీ నా వ్యక్తిగత విషయాలకి పబ్లిసిటీ ఇచ్చుకోలేదు. మన స్వేచ్ఛకి చట్టాలే అడ్డు అనుకుని ఫలానా చట్టాన్ని కొట్టివెయ్యమని చెప్పలేము అన్నాను. కలెక్టర్ నాకు గన్ లైసెన్స్ ఇవ్వకపోతే నేను హై కోర్ట్‌కి వెళ్ళి డిక్రీ తెచ్చుకుంటాను కానీ ఆర్మ్‌స్ ఏక్ట్‌ని కొట్టి వెయ్యమని సుప్రీం కోర్ట్‌లో పిటిషన్ వెయ్యను అని చెప్పాను. అలా చెప్పడం నా వ్యక్తిగత విషయాలకి పబ్లిసిటీ ఇచ్చుకోవడం లాగ కనిపించిందా మీకు?

      Delete
    14. ఇక్కడ రాజ్యం ప్రైవేట్ విషయాల్లో తలదూర్చలేదు. ఒకడి పెళ్ళాంతో ఇంకొకడు పడుకోకూడదనే రూల్ శ్వేతకేతు మహర్షి కాలంలో కూడా ఉండింది. సమాజంలో ఉన్న నియమాల ఆధారంగా చట్టాలు వ్రాస్తారు కానీ చట్టాల ఆధారంగా సమాజంలో నియమాలు ఏర్పడవు. ఎస్.సి./ఎస్.టి. ఆటోసిటీస్ చట్టం వచ్చినా పల్లెటూర్లలో దళితుల్ని కులం పేరుతో తిట్టేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా.

      Delete
    15. >>ఎస్.సి./ఎస్.టి. ఆటోసిటీస్ చట్టం వచ్చినా పల్లెటూర్లలో దళితుల్ని కులం పేరుతో తిట్టేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా.

      ఎందుకో చెప్పగలరా ప్రవీణ్ గారూ?

      Delete
    16. పల్లెటూర్లలో భూమి ఎక్కువగా అగ్రకులాల చేతుల్లో ఉంది. వాళ్ళ భూమిలో కూలీ పనులు చేసేది మాత్రం దళితులు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రభుత్వం దళితులకి రాళ్ళూ, రప్పలూ గుట్టలు ఉన్న భూములు పంచిందే తప్ప భూస్వాముల భూములు మాత్రం ముట్టలేదు. అలాంటప్పుడు కుల సంబంధాలు ఇంచ్ కూడా కదలవు కదా.

      Delete
    17. మీరు ప్రతిసారీ అస్సలు విషయం మిస్స్ అవుతున్నారు.. నేను మొదటినుంచీ చెప్పేది అదే. చదువులేక పొతే.. విజ్ఞానం ఉండదు.. అది లేకపోతే.. చట్టాల గురించి ఏమీ తెలియదు. చట్టాల గురించి తెలియనివాడికి తమ గౌరవం కాపాడడం కోసం ఒక చట్టం ఉంది అని తెలిసే అవకాశం లేదు.. ఇప్పటికైనా అర్ధ ఐందా.. చదువుకి, గౌరవానికి ఉన్న సంబంధమేమిటో?

      Delete
    18. చదువుకున్నవాళ్ళు మాత్రం కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలని నమ్మడం లేదా? మధ్య ప్రదేశ్‌లో ఒక మహిళా న్యాయమూర్తిని ఆమె భర్త కట్నం కోసం కొట్టాడు. ఆమె భర్త ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్. ఇద్దరికీ హై ప్రొఫైల్ ఉద్యోగాలు ఉన్నా ఆమె కట్నం ఇచ్చుకోవాల్సి వచ్చింది. బహిరంగ ప్రదేశంలో సెక్స్ చేసేవాళ్ళు తక్కువే ఉంటారు కనుక ఐ.పి.సి.294ఎ కేసులు పెట్టడం ద్వారా ఆ పోకడని సులభంగానే కంట్రోల్ చెయ్యొచ్చు. కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలని 99% మంది పాటిస్తారు కనుక వాటిని చట్టాలతో కంట్రోల్ చెయ్యలేము.

      లైసెన్స్ లేకుండా సారా వ్యాపారం చెయ్యడం నేరం కానీ లైసెన్స్ లేనివాడి పాకకి వెళ్ళి సారా తాగడం నేరం కాదు. ఇక్కడ సారా తాగడం వ్యక్తిగత విషయం అనుకుంటారు కానీ అమ్మడానికి మాత్రమే ప్రభుత్వ అనుమతి మాండేటరీ. మనిషి యొక్క ప్రాథమిక హక్కులకి విరుద్ధంగా ప్రభుత్వం ఉండదు కదా.

      Delete
    19. >>చదువుకున్నవాళ్ళు మాత్రం కులం, కట్నం లాంటి సాంఘిక దురాచారాలని నమ్మడం లేదా?

      ఆడపిల్ల పుట్టడానికి మగాడే కారణమని... చదువుకుంటే తెలుస్తుంది. అలాగనిచదువుకున్నోల్లల్లో ఎవడో ఒకడు.. ఆడపిల్ల పుట్టినందుకు భార్యని పుట్టింటికి తరిమెస్తే.. చదువుకోవడమే అందరికీ వేస్ట్ అవుతుందా? చదువుగురించి అవగాహన లేని కాలానికీ, ఇప్పటి కాలానికీ బేరీజు వేసుకోని చూడండి.. వరకట్న చావులు... తగ్గాయా లేదా? ఆడపిల్ల పుట్టిందని... రెండోపెళ్ళి చేసుకోవడం.... తగ్గాయా లేదా? పల్లెల్లో కులంపేరుతో తిడుతున్నారు అని చెబుతున్న మీకు... పట్నాల్లో అలా జరగకపోవడానికి కారణం.. చదువే అని అర్ధం కావట్లేదా? అణుబాంబు పడ్డట్టు... ఒక్క దెబ్బతో అన్నీ మార్పోలేదని, చదువు వేస్ట్ అని ఎలా అంటారు?

      ఇవన్నీ ఎందుకు మీ తాత, అమ్మమ్మల జీవితానికీ... మీ నాన్న, అమ్మల జీవితానికీ తేడా తెలియట్లేదా?

      >>ఒక మహిళా న్యాయమూర్తిని ఆమె భర్త కట్నం కోసం కొట్టాడు.

      మరి ప్రవీణు, ప్రవీణు వాళ్ళ నాన్న, గొట్టిముక్కల, చిరంజీవి, శ్యామలీయం, హరిబాబు, కొండలరావు, నిహారికా వాళ్ళ ఆయన... ఎందుకు వాళ్ళ భార్యల్ని కట్నం కోసం తన్నట్లేదు?

      Delete
    20. పట్టణంలో వ్యాపారం చేసేవాడి లైఫ్ స్టాండర్డ్ అతనికి ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అక్కినేని కుటుంబ సభ్యులు కులాంతర వివాహాలు చేసుకోవడానికి కారణం చదువు మాత్రమే కాదు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో కులాన్ని నమ్ముకోవాల్సిన అవసరం వాళ్ళకి లేకపోవడం ఇక్కడ ప్రధాన కారణం. వాళ్ళు కులం విషయంలో అభిప్రాయాలు మార్చుకున్నంతమాత్రాన జెండర్ విషయంలో అభిప్రాయాలు మార్చుకోరు. అందుకే కదా అమల, డిస్కో శాంతి తదితరులు పెళ్ళైన తరువాత సినిమాల్లో నటించడం మానేసి గృహిణులుగా స్థిరపడ్డారు.

      Delete
    21. >>అక్కినేని కుటుంబ సభ్యులు కులాంతర వివాహాలు చేసుకోవడానికి కారణం చదువు మాత్రమే కాదు, వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో కులాన్ని నమ్ముకోవాల్సిన అవసరం వాళ్ళకి లేకపోవడం

      మాది మిడిల్ క్లాస్ ఫామిలీ.. మాదాన్లో అన్ని రకాల కులాంతర వివాహాలు జరిగాయి.. జరుగుతున్నాయి.. మరి దీన్నేమంటారు? గవర్నమెంటు జాబు దొరకనివాల్లంతా.. ప్రైవేటు జాబులు చేసుకుంటూన్నాం.. అంతేగానీ.. రిజర్వేషన్ ఉన్నాగానీ.. 1% మందికే జాబులొస్తయని.. చదువు మానేసి, వ్యవసాయం చేసుకోవట్లేదు.. మీ సైడు ఎలా ఉంటూందో తెలియదుగానీ.. ఎక్కడైనా గానీ, చివరికి పల్లెలతో సహా.. "చదువుకున్నోడు" అంటే.. ఒక గౌరవభావంతోనే చూస్తారు.. అంతేగానీ.. ఎవడో జడ్జి ఏదో చేశాడు, అక్కినేని ఫామిలీలో ఇలా ఉందీ.. అంటూ "కోడి గుడ్డుకి షేవింగ్" చేసుకుంటూఉ కూర్చోరు..

      >>వాళ్ళు కులం విషయంలో అభిప్రాయాలు మార్చుకున్నంతమాత్రాన జెండర్ విషయంలో అభిప్రాయాలు మార్చుకోరు.

      ఆడావాల్లు స్టేజీ ఎక్కరాదు అనే స్థాయినుంచీ.. ఇక్కడిదాకా వచ్చారు.. అదికూడా జరుగుతుంది.. మీరు మాత్రం అలా రాల్లెసుకుంటూనే ఉండండి..

      Delete
    22. ఎం.బి.ఎ. చదివి గుమాస్తా ఉద్యోగం కూడా దొరక్క చికెన్ షాప్‌లో పని చేసేవాళ్ళు ఉన్నారు. ఎం.బి.ఎ. చదివి చికెన్ షాప్‌లో పని చేస్తే ఎం.బి.ఎ. చదువు చూసి గౌరవమిస్తారా? నేను బి.ఎ. చదివాను. టెంత్ క్లాస్ చదువుకున్న అమ్మాయి తల్లితండ్రుల దగ్గరకి వెళ్ళినా తాము తమ కూతురిని ప్రభుత్వ ఉద్యోగికే ఇచ్చి పెళ్ళి చేస్తామంటున్నారు, వ్యవసాయం చేసేవాడికి ఏమీ మిగలదు అని కూడా అంటున్నారు. తమ కంటే ఎక్కువ చదువుకున్నా కూడా వాడి ఆర్థిక స్థాయిని చూసే గౌరవిస్తారు. రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం దొరికే అవకాశం ఏమాత్రం లేని కూలీవాళ్ళ పిల్లలు ఎమ్మార్పీఎస్ మీటింగ్‌లకి వెళ్ళడం గురించి చర్చించే వేరే టాపిక్ ఇదే బ్లాగ్‌లో ఉంది. అక్కడ అడగాల్సిన ప్రశ్నలు ఇక్కడ అడగడం ఎందుకు?

      Delete
    23. >>ఎం.బి.ఎ. చదివి గుమాస్తా ఉద్యోగం కూడా దొరక్క చికెన్ షాప్‌లో పని చేసేవాళ్ళు ఉన్నారు

      "ఎర్ర మల్లెలు" సినిమా చూశారా?? ఆ కాలం మాటలు ఇవి..

      >>అక్కడ అడగాల్సిన ప్రశ్నలు ఇక్కడ అడగడం ఎందుకు?

      "ఎస్.సి./ఎస్.టి. ఆటోసిటీస్ చట్టం వచ్చినా పల్లెటూర్లలో దళితుల్ని కులం పేరుతో తిట్టేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు కదా."

      మీ ఈ వ్యాఖ్యకి ఎక్ష్టెన్షన్ ఇది..

      Delete
    24. ఎం.బి.ఎ. చదివినవాళ్ళందరికీ ఉద్యోగాలివ్వడానికి కావలసిన పరిశ్రమలు ఇప్పుడు మాత్రం ఉన్నాయా? ఎర్రమల్లెలు సినిమా తీసిన కాలంలో ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లు లేవు. ఇంగ్లిష్ మీడియం చదివి చికెన్ షాప్‌లో పని చేసేవాళ్ళు అప్పట్లో అయితే లేరు.

      Delete
    25. >>ఎం.బి.ఎ. చదివినవాళ్ళందరికీ ఉద్యోగాలివ్వడానికి కావలసిన పరిశ్రమలు ఇప్పుడు మాత్రం ఉన్నాయా?

      గుమస్తా జాబు కూడా రాలేదని ఏడ్చే ఎంబిఏ వాల్లని నాదగ్గరకి పంపండి.. గుమస్తా పోష్టులు ఇప్పిస్తాను.

      డిగ్రీలు చదువుకునీ "గుమస్తా" జాబుకోసం ఎదురుతెన్నులు చూసేది.. ఆ కాలంలోనే.. అదే "ఎర్రమల్లెలు" కాలం..

      >>ఇంగ్లిష్ మీడియం చదివి చికెన్ షాప్‌లో పని చేసేవాళ్ళు అప్పట్లో అయితే లేరు.

      చదువుకున్నా పని చెయ్యట్లేదంటే, వాడు సోమరి అయ్యుండాలి.. వాల్లని సమాజానికి ప్రతినిధులుగా చూపించకండి.. అది కూడా.. మీరు అధాటున అన్న "చదువు వల్ల గౌరవం రాదు".. మాట కవర్ చేసుకోడానికి..

      Delete
    26. కూలీవాడికి అతని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో ఎం.ఎ.ఫిలాసఫీ చదివే ఆసక్తి కలిగే అవకాశం లేదు. ఆర్థిక పరిస్థితులు మారకపోతే జనానికి చదువు మీద ఆసక్తి పెరగదు. ఆత్మ గౌరవం అనేది ఆర్థిక పరిస్థితి పై ఆధారపడి ఉంటుంది. అది కేవలం చదువు మీద మాత్రం కాదు. ఆకలిరాజ్యం సినిమా టైమ్‌లోనైనా, ఇప్పుడైనా అన్నిటి కంటే ముందు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారడం ముఖ్యం.

      Delete
    27. >>కూలీవాడికి అతని స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో ఎం.ఎ.ఫిలాసఫీ చదివే ఆసక్తి కలిగే అవకాశం లేదు.

      నాలుక గీసుకోడానికి తప్ప ఎందుకూ పనికి రాని ఫిలాసఫీ ఎందుకుగానీ, పెద్ద చదువులు చదివిన వాల్లని ఎంతమందిని చూపించాలి?

      >>ఆత్మ గౌరవం అనేది ఆర్థిక పరిస్థితి పై ఆధారపడి ఉంటుంది. అది కేవలం చదువు మీద మాత్రం కాదు.

      చదువులేకపోయినా రాజకీయాల్లో తెగ సంపాదించినవాడికి .. ముందు దణ్ణం పెట్టి, వెనక తిట్టుకోవడం వినలేదా మీరు?

      >>ఆకలిరాజ్యం సినిమా టైమ్‌లోనైనా, ఇప్పుడైనా అన్నిటి కంటే ముందు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మారడం ముఖ్యం.

      అది మారిందిగానీ.. ఇక మీరు కూడా మారండి..

      Delete
    28. బియ్యేల్లు, ఎమ్యేలు గురించి ఇంకా.... మాట్లాడుతున్నారంటేనే మీది "ఎర్ర మల్లెలు, ఆకలిరాజ్యం" కాలమని తెలుస్తోంది..

      Comeout of it

      Delete
    29. పల్లెటూర్లలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగులు పల్లెటూర్లలో ఇళ్ళు అద్దెకి తీసుకోకుండా పట్టణాల్లో ఉంటున్నారంటే దాని అర్థం పల్లెటూర్లలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏమాత్రం మారలేదనే కదా. పల్లెటూరిలో ఇల్లు అద్దెకి తీసుకున్న ఒక్క ప్రభుత్వ ఉద్యోగిని నువ్వు చూపించినా నేను పది కోట్లు బహుమతి ఇస్తాను. ఇది సీరియస్ చాలెంజ్, నాదెండ్ల ముసుగు వేసుకుని చేసే చాలెంజ్ కాదు.

      Delete
    30. "మీరు" నుంచి "నువ్వు" కి తీసుకొచ్చిన మీ అసహనాన్ని అర్ధం చేసుకోగలను.. సొల్లు కబుర్లు కాకుండా మీదగ్గరున్న 10 కోట్లు ప్రూఫ్ చూపండి.. మీ చాలెంజికి నేను సిద్దం

      నాదెండ్ల ముసుగు చాలెంజ్ అంటే?

      Delete
    31. first know the difference between standard of living and standard of education..

      Delete
    32. పల్లెటూరిలో ఇంటి అద్దె, లెట్రిన్‌తో సహా 700 ఉంటుంది. కానీ పల్లెటూర్లలో ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లు ఉండవు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగికి ఫ్రీ క్వాటర్స్ ఇచ్చినా అది తీసుకోడు. అతను పల్లెటూరికి 70 కిలో మీటర్ల దూరంలోని పట్టణంలో ఇల్లు 5,000 కి అద్దెకి తీసుకుని, అక్కడ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో తన పిల్లల్ని చదివించుకుంటాడు. ఇండియాలో ప్రతివాడికీ ప్రభుత్వ ఉద్యోగమే కావాలి కానీ ప్రభుత్వ స్కూల్‌లో చదువు వద్దు, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వద్దు. ఇండియా ఒక వెనుకబడిన దేశం అనడానికి ఈ ఎవిడెన్స్ చాలదా? ప్రభుత్వమే ఇంగ్లిష్ మీడియం పేరుతో జనాన్ని ఫూల్ చేస్తోంది. జపాన్‌వాళ్ళకి ఇంగ్లిష్ దాదాపుగా రాకపోయినా వాళ్ళు పెద్దపెద్ద స్టీల్ ప్లాంట్‌లు కట్టుకోగలిగారు. ఇండియాలో ఇంగ్లిష్ వచ్చినవాడు ప్రభుత్వ ఉద్యోగమే కావాలంటాడు, పరిశ్రమలో ఉద్యోగం ఇచ్చినా తీసుకోడు.

      Delete
  3. ఇంతకీ ఆ సెక్షన్ మీరు పూర్తిగా చదివారా?

    ReplyDelete
    Replies
    1. కొట్టేయబడిన ఐపీసీ సెక్షన్ ఇదండీ:

      497. Adultery.—Whoever has sexual intercourse with a person *who is and whom he knows or has reason to believe* to be the wife of another man, *without the consent or connivance of that man*, such sexual intercourse not amounting to the offence of rape, is guilty of the *offence of adultery*, and shall be *punished* with imprisonment of either description for a term which may extend to five years, or with fine, or with both. In such case the *wife shall not be punishable* as an abettor.

      Delete
  4. అక్రమ సంబంధాలు-ఇంచక్కా పెట్టుకోండి. స్వలింగ సంపర్కం-విచ్చలవిడిగా చేసుకోండి.మైలతోనే గుళ్లలోకి వెళ్ళండి.ద్యావుడా. ఇవేమి బుచికోయమ్మ బుచికి నిర్ణయాలు.

    ReplyDelete
    Replies
    1. >>మైలతోనే గుళ్లలోకి వెళ్ళండి.
      అస్సలు అన్ని గుడుల్లో... ఆడోల్లందర్నీ "మైల"లో వెలుతున్నారేమో మనిషుల్ని పెట్టి చెక్ చేసి మరీ పంపాలి.. ఎలాగైతే తీవ్రవాదులు బాంబులు పెడతారని చెక్ చేస్తామో..

      Delete


    2. గలదోయి బుచికి నీ బు
      ర్రలోన మైల మరి దాని రగడల మలిన
      మ్ముల నెట్లు తీసెదవురా
      పొలతుల మైలయు బృహత్తు పొత్తువు నొకటే!


      జిలేబి

      Delete
  5. ఇండియాలో ప్రబలంగా ఉన్నది హిందూ మతమే కానీ వ్యక్తి స్వేచ్ఛ కాదు. ఇక్కడి కోర్టులు వ్యక్తి స్వేచ్ఛ ఆధారంగా తీర్పులు చెప్పడమనేది నమ్మశక్యంగా లేదు.

    ReplyDelete
  6. నాకు కావలసినది సమాజంలో మార్పు తప్ప న్యాయ వ్యవస్థలో మార్పు కాదు.

    ReplyDelete
    Replies
    1. సమాజంలో ఎటువంటి మార్పు రావాలని మీరు కోరుకుంటున్నారు ? స్పష్టంగా తెలియజేయండి.

      Delete
  7. మాదకద్రవ్యాలు సేవించడం కూడా అనుమతి ఇచ్చేస్తే బాగుంటుంది. స్వలింగ సంపర్కులు అక్రమ సంబంధాలు మాదక ద్రవ్యాలనుతీసుకొని స్వైరవిహారం చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించండి. మీకు అండగా నిలబడే వాల్లు ఉన్నారు

    ReplyDelete
    Replies
    1. మాదకద్రవ్యాల్ని అనుమతించే రోజు కూడా ఎక్కువ దూరంలో లేకపోవచ్చు “బుచికి” గారూ. సోకాల్డ్ లిబరల్ దృక్పథం వేగంగా విస్తరిస్తోంది కదా 🙂.

      Delete
    2. నిజానికి ... లిబరల్ సమాజం అనే కన్నా పర్మిసివ్ సొసైటీ (permissive) గా తయారవుతోంది అనడం కరక్టేమో?

      Delete
  8. జై గారు చెప్పదలచుకున్నది ఏమిటి? క్రిమినల్ చట్టాలు వ్యక్తి స్వేచ్ఛ ఆధారంగా ఉండాలి కానీ సివిల్ చట్టాలు మాత్రం లా ఆఫ్ ద ల్యాండ్ ఆధారంగా ఉండొచ్చనా? నాకు తెలిసినంత వరకు కోర్ట్‌కి కొన్ని సందర్భాలలో మాత్రమే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. నువ్వు నీ ఇంట్లో అద్దెకి ఉండేవాణ్ణి ఖాళీ చెయ్యించడానికి సివిల్ కోర్ట్‌కి వెళ్ళావు. నువ్వు టెనెంట్‌తో కలిసి అగ్రీమెంట్ వ్రాసుకోలేదు. అప్పుడు అతనికి ఇల్లు ఖాళీ చెయ్యడానికి ఎంత టైమ్ ఇవ్వాలో న్యాయమూర్తే తన సొంత విచక్షణాధికారంతో నిర్ణయిస్తాడు. క్రిమినల్ కేస్‌లో అలా కాదు. ఆర్మ్స్ ఏక్ట్ కేస్‌లో నేరం ఋజువైతే మినిమం ఆరు నెలలు, మాక్సిమం ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుంది. "నాకు తుపాకీ ఉంచుకునే స్వేచ్ఛ ఉంది కనుక లైసెన్స్ లేని తుపాకీ ఉంచుకున్నాను" అని నిందితుడు చెప్పినా కూడా అతనికి మినిమం ఆరు నెలలు, మాక్సిమం ఏడేళ్ళు శిక్ష వెయ్యాల్సిందే. ఇక్కడ న్యాయమూర్తికి సొంత నిర్ణయాధికారం ఉండదు. ఆ నిందితుని వ్యక్తి స్వేచ్ఛ పేరుతో ఆర్మ్స్ ఏక్ట్‌ని కొట్టివెయ్యడానికి అవ్వదు.

    నీహారిక గారు సమాజంలో మార్పు గురించి అడిగారు. దళితవాదం, స్త్రీవాదం లాంటివాటిని కబుర్ల కోసమైనా అంగీకరిస్తారు. కానీ కమ్యూనిజం అలా కాదు కదా. నేను కమ్యూనిస్ట్‌ని. సొంత ఆస్తి కాకుండా ఉమ్మడి ఆస్తి ఉండాలంటాను. దానికి ఎంత మంది ఒప్పుకునే పరిస్థితి ఇప్పుడు ఉంది? ఈ లింక్ చదవండి: http://teluguman.teluguland.info/post/660521258/

    ReplyDelete
    Replies
    1. ఐపీసీ సెక్షన్లు కొట్టేసే అధికారం కోర్టులకు ఉందన్న విషయం మీరు ఒప్పుకున్నారా లేదా? ఇది తేల్చాక నెక్స్ట్ స్టెప్పుకు వెళదాం.

      Delete
  9. వ్యక్తి స్వేచ్ఛ పేరుతో ఒక ఐ.పి.సి. సెక్షన్‌ని ఎలా కొట్టివేస్తారు అనేదే ఇక్కడి ప్రశ్న. చట్టాలు కేవలం వ్యక్తి స్వేచ్ఛ ఆధారంగా వ్రాయరు. సామాజిక, సాంస్కృతిక విషయాలని పరిగణనలోకి తీసుకుని అవి వ్రాస్తారు. ఈ విషయం బి.ఎ. పొలిటికల్ సైన్స్ సిలబస్‌లోనే వ్రాసుంటుంది. ఇది సుప్రీం కోర్ట్ న్యాయమూర్తులకి తెలియదా?

    ReplyDelete
  10. ప్రవీణ్ గారూ, మీరు కోర్టులకు చట్టాలను లేదా సెక్షన్లను కొట్టేసే అధికారం ఉందన్న విషయం ఒప్పుకుంటున్నారా లేదా? ఈ విషయం తేలకుండా బీయే పొలిటికల్ సైన్స్ సిలబస్ గురించో జడ్జీల గురించో మాట్లాడడం చర్చను డైవర్ట్ చేయడం అవుతుంది.

    "వ్యక్తి స్వేచ్ఛ పేరుతో ఒక ఐ.పి.సి. సెక్షన్‌ని ఎలా కొట్టివేస్తారు"

    రాజ్యాంగంలో ఈ కిందన ఇచ్చే అధికారణాలను చూద్దాం:

    Article 13 (1):

    All laws in force in the territory of India immediately before the commencement of this Constitution, in so far as they are inconsistent with the provisions of this Part (*), shall, to the extent of such inconsistency, be void

    Article 13 (2):

    The State shall not make any law which takes away or abridges the rights conferred by this Part (*) and any law made in contravention of this clause shall, to the extent of the contravention, be void

    * Part III, Fundamental Rights i.e. articles 13 through 35 (both inclusive)

    Article 21:

    Protection of life and personal liberty No person shall be deprived of his life or personal liberty except according to procedure established by law

    21వ అధికరణ వ్యక్తి స్వేచ్ఛను ప్రాధమిక హక్కుగా గుర్తిస్తుంది. ఆర్టికల్ 13(1) ప్రకారం ప్రాధమిక హక్కులను ఉల్లంఘించే పాత (అనగా రాజ్యాంగ పూర్వ) చట్టాలు ఉల్లంఘన మేరకు రాజ్యాంగం అమలు కాగానే చెల్లకుండా పోయాయి. ఆ తదితర 13(2) అనుసారం కొత్తగా అటువంటి చట్టాలు చేసే అధికారం శాసనసభలకు లేదు.

    The following conclusions emerge:

    - Liberty is a fundamental right
    - All old laws violating any fundamental rights extinguished to the extent at the commencement of the constitution
    - Any new law can't violate any fundamental right

    ReplyDelete
  11. I did not say that liberty is not the fundamental right. Laws are not necessarily based on individual liberty. They are also based on socio-cultural matters. Therefore Hindu Marriage Act cannot permit things like aunt-nephew marriage etc. Similarly, IPC is also not merely based on individual liberty. Example: IPC 294a prohibits sexual act in public places.

    ReplyDelete
  12. బ్లాగు నిర్వాహకులకు ఒక ప్రశ్న. ఇక్కడ ప్రవీణ్ -జై గార్ల మధ్య నడుస్తున్న చర్చ టపాకు నేరుగా సంబంధించినది కాకపోయినా ఎందుకు అనుమతిస్తున్నారు?

    ReplyDelete
    Replies
    1. This discussion is about 497 only....please let them discuss...

      Delete
  13. వ్యక్తి స్వేచ్ఛ ఆధారంగా చట్టాలని సవరించడం సాధ్యమా, కాదా అని అడగడం తప్పు కాదు కదా. ఈ చట్టం గురించి మాత్రమే మాట్లాడితే, తమకి ఉన్న అడ్డు తొలిగిపోయిందని సంతోషించే మగవాళ్ళు కొందరు ఉంటారు. ఈ తీర్పు వల్ల ఆడవాళ్ళకి మాత్రం వచ్చిన లాభం ఏమీ లేదు.

    ReplyDelete
    Replies
    1. >>>ఈ తీర్పు వల్ల ఆడవాళ్ళకి మాత్రం వచ్చిన లాభం ఏమీ లేదు.>>>
      లాభం లేకపోతే ఈ పాటికి సంధ్య, సత్యవతిగారు,దేవి గారు ఊరుకునేవారా ? బృందా కారత్ గారు కూడా సమర్ధించారు.

      Delete
  14. On Facebook, when Sandhya welcomed the verdict on 497, I wrote this comment:

    "అందాల పోటీలు నిర్వహించేవాళ్ళు కూడా అది వ్యక్తిస్వేచ్ఛేనని చెప్పుకుంటారు. మిస్ వైజాగ్ పోటీల్లో ఆడవాళ్ళని అర్ధ నగ్నంగా, శ్రీమతి విశాఖ పోటీల్లో ఆడవాళ్ళని ఒంటి నిండా బట్టలతో చూపిస్తారు. పెళ్ళికాని స్త్రీలని ఒకలాగ, పెళ్ళైన స్త్రీలని ఇంకొకలాగ చూపించే ఈ పోటీల్లో పురుషాధిక్య భావజాలం స్పష్టంగా కనిపిస్తున్నా దాన్ని వ్యక్తి స్వేచ్ఛ అనుకుని సమర్థించలేము కదా."

    ReplyDelete
  15. I don't support homosex because I am not a homosexual. అమెరికాలో హోమోసెక్స్ సివిల్ చట్టాల ప్రకారం కూడా చెల్లుతుంది. అక్కడ ఇద్దరు స్వలింగ సంపర్కులు పెళ్ళి చేసుకుంటామంటే అది రిజిస్టర్ చెయ్యడానికి అక్కడి అధికారులు ఒప్పుకుంటారు. ఇండియాలో హోమోసెక్స్ నేరం కాదని సుప్రీం కోర్ట్ తీర్పు చెప్పింది కానీ ఇక్కడి సివిల్ చట్టాల ప్రకారం స్వలింగ వివాహాలు ఇప్పటికీ చెల్లవు. స్వలింగ జంటలో ఒకరు ట్రెయిన్ ఏక్సిడెంట్‌లో చనిపోయారనుకుందాం. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భాగస్వామి రైల్వే నుంచి నష్ట పరిహారం క్లెయిం చెయ్యడానికి అవ్వదు, వాళ్ళ వివాహాన్ని సివిల్ చట్టం ఆమోదించలేదు కాబట్టి. "క్రిమినల్ చట్టాలు వ్యక్తి స్వేచ్ఛ ఆధారంగా ఉండాలనీ, సివిల్ చట్టాలు మాత్రం లా ఆఫ్ ద ల్యాండ్ ఆధారంగా ఉండొచ్చనీ" నమ్మితే ఇలాగే జరుగుతుంది.

    ReplyDelete
  16. ప్రవీణ్ భాయ్ గొట్టిముక్కలు సార్ మాట్లాడే లీగల్ పరిభాష కోర్టులిచ్చే తీర్పుల్లెక్క సమజైత లేదు.స్వలింగ జంట యాక్సిడెంట్లో పోతే. ఎక్కడికో ఎల్లిపోయావు బయ్యా. మైండ్ బ్లాకయితుంది.

    ReplyDelete
  17. ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. హిందూ సంప్రదాయం ప్రకారం వరస కాని స్త్రీని పెళ్ళి చేసుకోవడం నేరం కాదు కానీ ఆ పెళ్ళిని సివిల్ కోర్ట్ గుర్తించదు అని జై గారే ఒప్పుకున్నారు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top