‘యోగా చేస్తే మతం నుంచి బహిష్కరించారు’

మాచారెడ్డి: యోగా చేసినందుకు తనను మతం నుంచి బహిష్కరించారని కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన షహనాజ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. యోగా డే సందర్భంగా మండల కేంద్రంలోని ఓం శాంతి కేంద్రంలో యోగా చేశానని, పలువురు ముస్లిం యువకులు తనపై దాడి చేసి మతం నుంచి బహిష్కరించారని వాపోయింది. ఆరోగ్యం కోసం యోగా చేయడం తప్పెలా అవుతుం దని ఆమె ప్రశ్నించింది. తన మీద దాడి చేసినప్పుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసి పరువు తీశారంది. తనతో ఎవరు మాట్లాడినా రూ. 5 వేల జరిమానా విధిస్తామని బెదిరించడంతో ఎవరూ మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మసీదుకు చందా ఇవ్వడానికి వెళ్తే తీసుకోవడం లేదని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది. తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.
(సాక్షి డిజిటల్ నుండి సేకరణ)
*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com
 

Post a Comment

  1. పోలీసులు ఏ చర్యా తీసుకోకపోతే ఆమె మానవ హక్కుల కమిషన్ ఆఫీస్‌కి వెళ్ళాలి.

    ReplyDelete
    Replies
    1. వాళ్ళు ఏమతానికి సంభందించిందని ఆమెని వెలేశారో ఆ మతపెద్దలతోనే "యోగా ఏమతానిదీ కాదు.. అందరిదీ" అని చెప్పించాలి. ఇదే పర్మినెంట్ సొల్యూషన్.

      Delete
    2. అది జరిగే పని కాదు.

      మత ప్రచారకులు ప్రతిదాన్నీ మతకోణంలోనే చూస్తారు.తమ మతానికి విరుద్ధమైన వాటినీ తమ మతగ్రంధాలు చెప్పనివాటినీ తమ మతాన్ని పాటించేవాళ్ళు చెయ్యడాన్ని సహించలేరు.

      ఆ యోగా స్కూలువాళ్లతో ఆ విషయాన్ని చెప్పించడం చాలా తేలిక.నిజానికి ఈ పద్మాసనాలూ వజ్రాసనాలూ ఆఖరికి సూర్ఫ్యనమస్కారాలు సైతం మామూలు ఎక్సరసైజు లాంటువే. సూర్యనమస్కారాల్లో ఒక్కో భంగిమకీ ఒక్కో మంత్రం ఉంది గానీ అది చదవకపోయినా పర్లేదు.భంగిమల్ని వర్ణించడానికీ ఏ భంగిమ తర్వాత ఏ భంగిమలోకి వెళ్ళాలనే సీక్వెన్సుకీ అనేది చాలా శాస్త్రీయమైన వివరణ ఉంది.ఆయా భంగిమలు కొన్ని శరీర భాగాల్ని, ముఖ్యం గ్రంధుల్ని యాక్టివేట్ చేస్తాయి.అది ఆ యోగా స్కూలు వాళ్ళూ దాన్ని ప్రచారం చేస్తున్న వాళ్ళూ దాన్ని మాత్రం చెబితే చాలు,సమస్య చాలావార్కు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.

      జై శ్రీ రాం!

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top