*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. లాభాలు పంచుకుంటాంం కాని నష్టాలొస్తే మాకేం పూచీ లేదు సుమా అని జనం డబ్బును విలాసంగా తగలేస్తున్న ప్రభుత్వసంస్థలను నిర్దాక్షిణ్యంగా మూసేయటమే ఈ సమస్యకు అసలైన పరిష్కొరం. అప్పుడు కాని ప్రభుత్వసంస్దలకు జవాబుదారీతనం రాదు.

    ReplyDelete
    Replies
    1. మీరన్నది నిజమే కానీ శ్యామలరావు గారూ, ఆర్.టీ.సీ లాంటి రవాణా సంస్ధ విషయంలో అమలు చేస్తే ఎక్కువ ఇబ్బంది పడేది సామాన్య ప్రజలే. ప్రభుత్వరంగ సంస్ధను మూసేస్తే ప్రైవేట్ వారికి / కార్పొ ”రెట్ట” లకు వరం అవుతుంది. వారి చేతుల్లో చిక్కుకుని ప్రజలు విపరీతమైన దోపిడీకి గురవుతారు. ఇప్పటికే ..... ప్రైవేట్ బస్సుల జవాబుదారీతనం లేమి ... హైవే మధ్యలో (ప్రైవేట్) బస్సుని వదిలేసి పరారయ్యే డ్రైవర్లు / పట్టించుకోని యాజమాన్యాలు ... హైవేల మీద కూడా నడిపించేస్తున్న కిక్కిరిసిన షేర్ ఆటోలు ... ముఖ్యంగా స్కూల్ కి పిల్లలను తీసుకువెళ్ళే ఆటోల విచ్చలవిడితనం / ప్రాణాంతక వ్యవహారంగా తయారయిన నిర్లక్యధోరణి ..... కనిపిస్తోందిగా. ప్రైవేట్ వ్యాపారాలు నిజాయితీ, విలువలు లేని వ్యాపారాలుగా తయారయినాయి. వారిని నమ్మలేం. ప్రైవేట్ రంగం వలన పోటీ పెరిగి నాణ్యత పెరుగుతుంది అనేది ఒక భ్రమ అనిపిస్తోంది ... వారంతా కుమ్మక్కు అయిపోతే జనాలు నిస్సహాయులు.

      కష్టమైనా, నష్టమేనా కొన్ని ప్రాధమిక రంగాలు (ప్రజారవాణా, విద్యుచ్ఛక్తి, ఇంధనం లాంటివి .... ఆ మాటకొస్తే విద్య, వైద్యం కూడా) ..... మరికొన్ని దశాబ్దాల పాటు ..... ప్రభుత్వం వారి చేతిలో ఉండడమే మంచిదనీ, విలువలు పతనమైపోయిన మనదేశానికి అమెరికన్ / ఇతర పాశ్చాత్య దేశాల మోడల్ అంతగా సరిపడదనీ నా అభిప్రాయం.

      Delete
    2. ప్రస్తుతం ఆర్టీసీలో డిపో మేనేజర్ ఉద్యోగాలు మెకానికల్ ఇంజినియర్లకు మాత్రమే పరిమితం. వారి పనికి టార్గెట్లు అన్నీ టెక్నీకల్ (మరమ్మత్తుల ఖర్చులు, టైర్ జీవితకాలం లాంటివి) గా నిర్ధారించారు.

      ఈ పద్దతిని మార్చి కొత్త/అదనపు ప్రామాణికాలు (ఉ. ఆక్యుపెన్సీ) కూడా పెడితే బాగుంటుందేమో?

      కేవలం సాంకేతిక అంశాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే లాభాలు రావు.

      ప్రతి డిపో ప్రాఫిట్ సెంటర్ చేస్తే మేనేజర్ల మధ్య పోటీ పెరుగుతుంది.

      Delete
    3. What bloody business government has got to do with business? అని ఒక మాట ఉంది. ప్రభుత్వసంస్థల్లో పని అంటే వాళ్ళంతా కాకపోయినా అధికసంఖ్యాకులు గవర్నమెంటు అల్లుళ్ళన్న మాటే. జవాబుదారీ తనం శూన్యం. పనితనం బాగుండకపోతే ఆట్టే చేయగలిగింది లేదు. ఉద్యోగంపేరుతో ఎప్పుడన్నా ఒకసారి వచ్చి సంతకాలు అన్నిపాతరోజులకూ పెట్టేస్తూ దినదినమూ సొంతవ్యాపారాలను నిర్వహించుకొన్న వాళ్ళూ తెలుసు నాకు. అలాంటి వాళ్ళు కొల్లలు. ఎన్నడూ ఆఫీసుముఖం కూడా చూడక, ఇంటర్వూకు పిలవలేదని పెద్ద యాగీచేసి రాష్టపతికే వెనుకబడ్డ ఫలానాఫలానా కాబట్టి ప్రమోషను ఇవ్వటంలేదని పితూరీచేసి ప్రత్యేకంగా ప్రమోషన్ తెచ్చుకున్న వాళ్ళూ తెలుసునాకు. జవాబుదారీ లేని జనాలతో నిండిన అనేక ప్రభుత్వసంస్థలు చేస్తున్నది అక్షరాలా ప్రజాధనాన్ని మేయటమే. ప్రైవేతు రంగంలో ఈవేషాలు కుదరవు కదా. లాబాలొచ్చినా రాకపోయినా జీతాలు పెంచుకొగలవా ప్రైవేటు సంస్థలు? ప్రజాధనం కాబట్టి కదా నిర్లజ్జగా పెంపుకోరటం సాధించుకోవటమూను?

      ప్రైవేటు ఐనా పబ్లిక్కు ఐనా అన్నిసంస్థల నిర్వహణనూ ప్రభుత్వం
      పర్యవేక్షించవచ్చునే! జనాన్ని పీడించకుండా ధనందుర్వినియోగం కాకుండా నిఘాపెట్టవచ్చునే?

      అంతే కాని ప్రజాసౌకర్యార్థం అంటూ జనంసొమ్ముల్ని దుబారాచేసే సంస్థలను పోషించటం తప్పు కదా?

      ప్రబుత్వ సంస్థలో నిర్వహణాధికారులకు వాళ్ళ సొంతసొమ్ములు కావు కాబట్టి బాధ్యతతో వ్యవహరించరని ఇన్నాళ్ళకూ మనదొరతనాలకి తెలిసి రావటం లేదు.

      ప్రభుత్వసంస్థలు జనాన్ని మోసం చేయవన్నది పెద్ద అపోహ - ప్రబుత్వబ్యాంకులు వేలకోట్లు జనంసొమ్మును మోసపూరితంగానే కదా పోగొట్టినది?

      అసలు ప్రభుత్వాలే మోసాలకు తెగబడుతున్న కాలం.

      ఎవర్నని ఏమి లాభం లెండి!

      Delete

  2. ప్రభుత్వ vs ప్రైవేట్ విషయంలో భిన్న అభిప్రాయాలుంటాయి కదా. అందువల్ల నేను ఆ చర్చలోకి దిగను. మీ అనుభవంలోకి వచ్చినవి కాదనడం లేదు గానీ ఒక్కటి మాత్రం చెబుతాను - ప్రభుత్వరంగ సంస్ధల్లో కొందరు ఉద్యోగులు (అదిన్నీ చెదురుమదురుగా మాత్రమే) డ్యూటీకి రాని రోజులకి కూడా జీతం డబ్బుల కోసం కక్కుర్తి పడడమో, ప్రమోషన్ కోసం యాగీ చెయ్యడమో లాంటివి జరుగుతుండచ్చు. అయినప్పటికీ సమర్ధవంతంగా పనిచేస్తూ “నవరత్న”, “మహారత్న” గుర్తింపులు పొందుతున్న పలు ప్రభుత్వరంగ పరిశ్రమలు ఉన్నాయి కదా.

    మరి ..... కొందరు ప్రైవేట్ వ్యాపారులు దేశసంపదనే కొల్లగొడదామని చూస్తారే. ఒక ఆసక్తికరమైన వార్త పంచుకుంటాను - ఈ క్రింది లింక్ లో. వైజాగ్ లోనున్న హిందుస్ధాన్ జింక్ లిమిటెడ్ సంస్ధ మన చిన్నప్పటి నుండీ విన్న పేరే కదా. ఆ మధ్య దాన్ని disinvestment పేరుతో ప్రైవేట్ పరం చేసారు ప్రభుత్వం వారు. కొనుక్కున్న ప్రైవేట్ కంపెనీ వేదాంత గ్రూప్ వారు ఇప్పుడు తలపెట్టిన పని చూడండి. కొంతకాలం నడిపారు, ఇప్పుడు ఆ ప్లాంట్ యొక్క వందల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ గా మార్చే ప్రతిపాదన చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ప్రస్తుతం బద్దలవుతోంది కదా, దాంట్లో దూరి సొమ్ములు చేసుకోవడానికి ఉత్పత్తి రంగంలో ఉన్న ప్లాంట్ నైనా సరే పడుకోబెట్టడానికి కూడా సిద్ధం అన్నమాట. పైగా, వైజాగ్ ప్లాంట్ ని మూసేస్తారట, అటువంటిదే ప్లాంట్ వేరే ఊరిలో పెడతారట, దాని కోసం భూమి కేటాయించాలట. ఇంత విడ్డూరమా? ఒకవేళ ప్రభుత్వం వేరే ఊరిలో భూమి ఇచ్చినా కొన్నేళ్ళ తరువాత ఈ ప్రైవేట్ కంపెనీ దాన్ని కూడా రియల్ ఎస్టేట్ గా మార్చరని నమ్మకమేమిటి? అసలు వాళ్ళకి ఆనాడిచ్చిన వైజాగ్ భూమిని ఆనాటి రేటుకే ప్రభుత్వం వెనక్కి లాగేసుకుంటే సరి, ఇటువంటి కంపెనీలకు బుద్ధి చెప్పినట్లవుతుంది. అన్నట్లు ఇటీవల వార్తల్లో నలిగిన తూత్తుకుడి (తమిళనాడు) లోని స్టెర్లైట్ ప్లాంట్ కూడా ఈ గ్రూప్ వారిదే. అలాగే సెజ్ లంటూ భూములు దక్కించుకుని పరిశ్రమలు ఆరంభించని ప్రైవేట్ వారు లేరా? మనదేశపు ప్రైవేట్ రంగమూ, వారి నిజాయితీనూ - నేతిబీరకాయలో నెయ్యిలాంటిదని నా అభిప్రాయం.

    http://www.thehindu.com/news/national/andhra-pradesh/vedantas-realty-plan-kicks-up-a-row/article23550400.ece

    నా వాదనల్లా మౌలికరంగంలోనికి మాత్రం ప్రైవేట్ వారిని రానివ్వద్దని, అది మనదేశానికి సరిపడదని. ఉదాహరణకి భూమి గురించి ఆర్థికశాస్త్రవేత్త Adam Smith 18వ శతాబ్దంలోనే ఈ క్రింద విధంగా సెలవిచ్చాడు - As soon as the land of any country has all become private property, the landlords, like all other men, love to reap where they never sowed, and demand a rent even for its natural produce.

    ReplyDelete
  3. // “ప్రస్తుతం ఆర్టీసీలో డిపో మేనేజర్ ఉద్యోగాలు మెకానికల్ ఇంజినియర్లకు మాత్రమే పరిమితం.” //

    ఇప్పుడు అదా నిబంధన, జై గారూ? 47 సంవత్సరాల క్రితం ఆర్.టీ.సీ. లో (అవిభక్త రాష్ట్రంలోలెండి 🙂) డిపో మేనేజర్ ఉద్యోగానికి అప్లై చేశాను. ఆరో, ఏడో ఖాళీలు. 1000 మంది .. అనుకుంటాను .. వ్రాసిన వ్రాతపరీక్షలో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూ కి పిలవబడ్డ 30 మందిలో నేనొకడిని. ఇంటర్వ్యూలో తన్నేసిందిలెండి 🤨. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే మాలో అధికశాతం ఇంజనీర్లు కాదు ... నాతో సహా. మరిప్పుడు ఆ పోస్ట్ మెకానికల్ ఇంజనీర్లకే పరిమితం చేసారన్నమాట.

    ప్చ్, 47 సం||లు .... గాంధీ సినిమాలో రెవరెండ్ సి.ఎఫ్.ఆండ్రూస్ తో గాంధీ గారు అన్నట్లు must be getting old 🙁.

    మీరన్నట్లు టెక్నికల్ టార్గెట్లతో బాటు కమర్షియల్ గోల్స్ కూడా ఉంటేనే వ్యాపారం వృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. అలా లేకపోతే టెక్నికల్ విషయాల్లో కూరుకుపోయి, తదితర విషయాలు పట్టించుకోలేకపోతారు డిపో మేనేజర్లు.

    ReplyDelete
  4. తుత్తుకుడి సమీప గ్రామాలలో ఇంటికొకరు చొప్పున కేన్సర్ బాధితులు ఉండడంతో స్టెరిలైట్ కంపెనీ మూసివేయాలని ప్రజలు ఆందోళన చేసారు.వ్యాపార సంస్థలన్నీ (కేసీఆర్ లాగా) జనం డబ్బుతో భూములు స్వాధీనం చేసుకుని,పరిశ్రమలూ పెడుతుంటాయి. ఆ కంపెనీ మూసివేస్తే వాళ్ళకొచ్చే నష్టమేదీ ఉండదు.అటు 3000 వేలకుపైగా ఉపాది కోల్పోయిన కుటుంబాలు వాళ్ళమీద ఆధరపడిన వాళ్ళూ ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి ఉంది.

    ఒక పరిశ్రమ నడపాలన్నా మూసివేయాలన్నా ప్రజలపై పడే భారం ఎక్కువ ! అందుకే మర్క్స్ చెప్పిన విలువైన సూత్రం ఒకటే ఇప్పటికీ చరిత్రలో చెక్కుచెదరకుండా నిలచిపోయి ఉంది.ప్రపంచ కార్మికులారా ఏకంకండి !

    ReplyDelete
    Replies
    1. @విన్నకోట నరసింహా రావు:

      "మాలో అధికశాతం ఇంజనీర్లు కాదు"

      ఆర్టీసీ గురించి మిత్రుల ద్వారా విన్నదేనండీ, నాకు సొంతంగా తెలీదు.

      డిపో మేనేజర్లు మెకానికల్ ఇంజినియర్లు కావాలన్న నిబంధన ఎప్పుడు వచ్చిందో (మీ ఇంటర్వ్యూ తరువాత కాలంలోనే అయి ఉండాలి) కానీ అప్పట్లో ఇదే గొప్ప సంస్కరణ అంటారు.

      కాలానికి అనుగుణంగా మారకపోతే ఒకప్పుడు మంచి చేసినవే అవరోధాలు అవుతాయి.
      ప్రయోజనాలు చేకూర్చలేని వ్యవస్థ కేవలం "మమతంతు"గా మిగిలిపోతుంది.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top