గందరగోళం తగ్గించడమంటే వ్యావహారికాన్నే గ్రాంధికం చేయడం కాకూడదు కదా?
వ్యావహారానికీ - గ్రాంధికానికీ తేడా లేదా?


తెలుగు భాష అభివృద్ధి ఎజెండాగా తెలుసుకుందామనే ప్రయత్నంలో భాగంగా నేను ప్రజ ద్వారా ఉంచుతున్న ప్రశ్నలకు ఇక్కడే గాక మరికొన్ని బ్లాగులలోను అక్కడి కామెంట్లలోనూ చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నందుకు ముందుగా విజ్ఞులైన తెలుగు బ్లాగర్లందరికీ ధన్యవాదములు. 

భాషలో పదాల గందరగోళం గురించిన విషయంలో సాహిత్యాభిమాని బ్లాగులో ఓ ఆర్టికల్ చదివాను. అందులో కొన్ని ఉదాహరణలు చదివాను. కానీ నాకు వచ్చిన సందేహంతో ఇక్కడ ఈ ప్రశ్న ఉంచుతున్నాను. ఇంటర్నెట్ ను అంతర్జాలం అనే బదులు ఇంటర్నెట్టు అని , రహదారి అనే బదులు రోడ్డు అని అనడమే తేలిక అని వాటిని ఉకారం కలుపుకుని ఇంగ్లీషునే తెలుగు పదాలుగా చేస్తే పోలా? అన్నట్లుగా ప్రసాద్ గారు అభిప్రాయపడ్డారు. దీనిని అక్కడే రాజేష్ వ్యతిరేకించాడు. 

నాకు ప్రసాద్ గారి అభిప్రాయంతో చాలావరకూ ఏకీభవిస్తూనే ఇక్కడేదో తప్పు సంకేతం వెళుతుందని మనసు ప్రశ్నిస్తోంది. కొంత సమాధానం దొరికింది. మరింత వివరణలు రాబట్టడం కోసం ఈ ప్రశ్న తయారయింది. 

వ్యావహారిక భాషలో ఎవరెన్ని రూల్స్ పెట్టినా జనాలు వారిష్టం వచ్చినట్లే మాట్లాడతారు. కానీ గ్రాంధికానికలా కుదరదు. నేను కోరే తెలుగు పదాలు గ్రాంధికంలో కూడా అంటే వ్యాకరణ బద్ధంగా ప్రతీ పదం విశిష్టత కోల్పోకుండా గందరగోళంగా కాకుండానూ పాండిత్య ప్రతిభ ప్రదర్శన కోసం కాకుండానూ ( అది తప్పని కాదు , అలా అయితేనే భాషాభివృద్ధి అని వాదించవద్దని నా ఉద్దేశం) తయారు చేయలేమా? 

వ్యావహారికంలో రోడ్డు, ఇంటర్నెట్టు అనాల్నా? వద్దా? అని చర్చించినా వారు పట్టించుకోరు. ఏది పలికి తమ భావాన్ని ఎదుటివాడికి అర్ధమయ్యేలా అందించి తన అవసరం తీరుతుందో అదే చేస్తాడు. సైగలు చేసైనా అవసరం తీర్చుకుంటాడు. 

కానీ పదాలను తయారు చేయడానికి వ్యాకరణ నియమాలు లేకుండా ఎలా? అని నా సందేహం. ఉదాహరణకు మార్జాలం, పిల్లి అని రెండూ ఒకే అర్ధాన్ని తెలిపే తెలుగు పదాలయితే మార్జాలానికి పిల్లి లాగా ఉండాలన్నది నేననేది. ఇంటర్నెట్టుకు సరయిన పదం అంతర్జాలం అయితే పట్టుదలతో దానిని వాడకంలో పెట్టేందుకు అందరూ ప్రయత్నిస్తే అదే అలవాటుగా మారిపోతుంది తప్పక. కాకుంటే సమయo పట్టవచ్చు. మొదట్లో నాకూ ఇంటర్నెట్ ఈజీగానూ అంతర్జాలం అదోరకంగానూ ఉండేది. అంతర్జాలం మన తెలుగు పదమ అనే పట్టుదలతో వాడడం చేస్తుంటే ఇప్పుడు అంతర్జాలం కూడా ఇంటరెంట్ లాగే ఈజీగానే కాదు కాదు తేలికగానే ఉన్నది. ఇంతకీ అంతర్జాలం సరైన తెలుగు పదమో కాదో నాకు తెలీదు. తెలిసినవారు, తేల్చినవారు చెప్పాలి.

(గమనిక : నేను ఎవరిపై కోపంతోనో లేదా కౌంటర్ గానో ఇక్కడ ప్రశ్నలుంచడం లేదు. అన్నింటినీ కలిపి ఒక్క చోట చేర్చడమే నా ఉద్దేశం. నా అభిప్రాయాలూ నాకు తెలిసిన జ్ఞానం మేరకే అని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణా - ఆంధ్రా భావోద్వేగాలూ తెలుగు భాషాభివృద్ధికి అడ్డు కాకూడదని విజ్ఞప్తి. నీళ్లూ - నిధులు - నియామకాలు పాలనలో లోపాలు రాజకీయాలు వేరు. ప్రజల అవసరాలు వేరు. భాష నియమాలు - పదాల ఏర్పాట్లు - అక్షరాల అవసరాలు కు ఈ భావోద్వేగాలకు సంబంధం లేదు. యాసలు - మాండలీకాలు వేరు. కనుక తెలుగు వారంతా ఈ చర్చలో దయచేసి ఆ భావొద్వేగాలను ఇక్కడ ఎట్టి పరిస్తితిలోనూ ప్రదర్శించవద్దని పొరపాటున వచ్చినా ఎవరికి వారే వెనుకకు తీసుకునే స్వీయ నియంత్రణను పాటించాలని విజ్ఞప్తి. వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటే కదా?)

సాహిత్యాభిమాని ప్రసాద్ గారి ఆర్టికల్ కోసం క్రింది హెడింగ్ పై నొక్కండి :

Post a Comment



  1. గందర 'గోల' అన్నారా ? లేక గందర గోళమన్నారా !! జేకే !!

    జిలేబి
    (జి 'ళే' బి) !

    ReplyDelete
    Replies
    1. ఎలా వ్రాయాలండీ? మీరన్నాక డౌట్ వస్తున్నది?

      Delete
  2. గందరగోలం కాదు మాష్టారూ, గందరగోళం సరైన పదకూర్పు అదే స్పెల్లింగ్. సరేనా అదే ఒకే

    ReplyDelete
    Replies
    1. ఇంటర్నెట్ అసలు ఆంగ్లలో ఎలా తయారయ్యిందో చూద్దాము. అప్పటికే ఉన్న ఇంటర్ అంటే 'మధ్య', నెట్ అంటే 'నెట్వర్క్స్ సముదాయం' రెండూ కలగలిపి అనేక నెట్వర్కుల మధ్య అని ఇంటర్-నెట్ అనన్న రెండు మాటలను ఒకే మాటగా నెట్వర్క్ వాడుకలో తయారు అయ్యిందే కాని, ఎవ్వరూ తీరి కూచుని తయారు చెయ్యలేదు. తెలుగులో అదే పదాన్ని యదాతధంగా అనువదించి అంతర్జాలం అనేసుకుంటే తెలుగుపదం అవుతుందా?! తెలుగులో నెట్వర్క్ కు తెలుగు మాట లేదసలు. నెట్ అంటే వల, ఆ మాటకు కొంచెం ఆడంబరంగా పలకాలంటే గ్రాంధిక పదం 'జాలం' తీసుకుని అంతర్జాలం చేసారు. ఇక్కడ వలలు లేవు. ఆంగ్లంలో నెట్ అంటే కూడా వల అనే అర్ధమే, కాని నెట్వర్క్ అంటే వలలా అల్లుకున్న నెట్వర్కుల సముదాయం. వల"లా" ఉన్నది చెప్పుకునే ఆంగ్లపదానికి వల అని ఎలా అనువదిస్తారు. ఆంగ్లంలో ఒకే పదానికి అనేక అర్ధాలు చెప్పుకునే సౌకర్యం ఉన్నది. తెలుగులో చాలా కొద్ది పదాలకు మాత్రమె ఆ పరిధి మనం ఏర్పరుచుకున్నాము. కాబట్టి ఇంటర్ నెట్ కు తెలుగు అంతర్జాలం ఒక భ్రష్ట అనువాద పదం మాత్రమె, పైగా అనువాదం కూడా సరిగ్గా లేని పదం.

      అనేకసార్లు ఉదాహరించినట్టు ఆంగ్లలో మనం అందరం చూసే యు ట్యూబ్ కు తెలుగు యధాతధంగా అనువదించి పదం తయారుచేస్తే చాలా అసహ్యకరమైన పదజాలం వస్తుంది. కాని ఆంగ్లంలో ట్యూబ్ కు తెలుగులో అనుకునే గొట్టం ఒక్కటే కాదు అనేకార్ధాలు ఉన్నాయి. అందులో ఒకటి టి వి అని కూడా. అందుకని "మీ టి వి" అని వాళ్ళు పెట్టుకున్నారు. ప్రస్తుత పద-ఉద్యమకారులు, అనువాదమే పునాదిగా పదాలు నిర్మిస్తే భ్రష్ట పదాలే వస్తాయి తప్ప వాడుక పదాలు రావు. మీరు చెప్పినట్టుగా ప్రయత్నించినా వాడటానికే కాదు, మరెందుకూ పనికి రావు అని ఇప్పటివరకూ అలా తయారయిన పదాలు మూలాన పడి చెబుతున్నాయి.

      Delete
    2. పైన చెప్పిన దాంట్లో ట్యూబ్ టి వి ఎలా అయ్యిందో కూడా చెప్పాలిగా! టీవీ అనే టెలివిజన్ లో బొమ్మ ఎక్కడ వస్తుందీ? పిక్చర్ ట్యూబ్ లో. ఇక్కడ ట్యూబ్ అంటే గొట్టం కాదు. అందుకని వ్యావహారికంలో వాళ్ళు టి వి ని ట్యూబ్ అని పిలుచుకునే వాళ్ళు, టెలివిజన్ అంతం పెద్ద పదం అయ్యి టేల్లీ అనటం కూడా కద్దు. ప్రస్తుతం మన ఇళ్ళల్లో ఉండే టి వి లు సోనీ బ్రావియా వంటివి ట్యూబ్ కాదు మరో రకమైన సాంకేతికతో బొమ్మను చూపిస్తాయి. కాని టెలివిజన్ అంటే దూరాన ఉన్నది చూపించేదే కాబట్టి టెలివిజన్ పేరు అలాగే ఉండిపోయి, ట్యూబ్ పదం కనుమరుగయ్యింది.

      Delete
    3. నేను మొదట గందరగోళం అనే ఉంచానండి. జిలేబి గారే 'గందర ' గోల ' చేయించారు :))

      ఇప్పుడు మళ్లీ అన్ని చోట్లా ఈ పదాన్ని మార్చాలన్నమాట. సరే ప్రసాద్ గారు వీలు చూసుకుని సరి చేస్తాను తప్పకుండా.

      ఇంటర్ నెట్ , యూ ట్యూబ్ గురించి మీ వివరణనుండి కొత్తవి నేర్చుకున్నాను. నేనే కాదు. ఇలా పదాల వివరణ వల్ల అనువాదం భ్రష్టత్వం లేకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

      అనువాదంలో భ్రష్టత్వం తప్పేమోగానీ వ్యాకరణ నియమంగా తెలుగు పదాలు తయారు చేయగలమేమో, దానికి మరింత కృషి పెరగాలేమో తప్ప మీరన్నట్లుగా ఉకారాలు కలిపి అవే వాడడమూ సరి కాదని నా అభిప్రాయం.
      అయితే గందరగోళ పరచే భ్రష్టత్వంగా ఉండేవాటికంటే మీరన్నదే మేలు. భ్రష్టత్వం లేకుండా గందరగోళం లేకుండా అర్ధవంతంగా అచ్చ తెలుగు పదాలు వచ్చేదాకా మీరన్నది మధ్యేమార్గమా వర్ధిల్లుతుంది ఎవరూ చెప్పకుండానే ఆచరణలో జరిగేది అదే.

      ఓపికగా వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు ప్రసాద్ గారు.

      Delete

    4. ఇక ఈ టపా ఖచ్చితం గా 'గండర' గోల కావడం ఖాయం (కాయం అనాలా?)

      జిలేబి

      Delete
    5. ఖాయంగా ఖాయమే నండి. గందర'గోళం' గురించిన 'గోల' కాదు. ఖాయం గురించి మాత్రమే :))

      Delete
    6. కొంత మంది అంటున్నారు "స్వైన్ ఫ్లూని తమిళ్‌లో పణ్ఱి కాయిచ్చల్ (పంది జ్వరం) అనగా లేనిది మనం ఇంటర్నెట్‌ని అంతర్జాలం అంటే తప్పా?" అని. అంతర్జాలం అంటే అంత:+జాలం. ఈ సంధిలోని రెండూ తెలుగు పదాలు కాదు. ఇది వాళ్ళు మర్చిపోతున్నారు.

      Delete
  3. "ప్రస్తుత పద-ఉద్యమకారులు, అనువాదమే పునాదిగా పదాలు నిర్మిస్తే భ్రష్ట పదాలే వస్తాయి తప్ప వాడుక పదాలు రావు"....శివాగారు చెప్పినది నూటికి నూరుపాళ్ళు నిజం. వాడుక భాష అనేది ఎవరో కొందరు నాలుగ్గోడల మధ్య కూర్చుని సృష్టిస్తే "వాడుక" అవదు. జనపదాల నుండి వారు వాడుతున్నప్పుడు పుట్టేదే వాడుక భాష అవుతుంది.అంతే కానీ...ఎదో భాషలో పుట్టిన దానిని అలాగే మన భాషలోనికి ప్రతీపద అనువాదం చేస్తే, అది పుస్తకాలలో వ్రాసుకోటానికి పనికొస్తుందే తప్ప వాడుకోవటానికి పనికి రాదు.

    తరువాత, మన భాషలో స్వాతంత్రం ఎక్కువై కొన్ని అక్షరాలని తొలగించారు...అవే ...ళ...ణ.. ఇవ్వి లేకుండా కొన్ని తెలుగు పదాలకి అర్ధాలే ఉండవు...అర్ధాలు మారతాయి...కల-కళ, కల్లు-కళ్ళు, మంగలం-మంగళం (పూర్తి వ్యతిరేక అర్ధం), ప్రమాణం-ప్రమానం, కారు[వాహనం] [నీరు "కారు"[క్రియ]] కాఱు[చిక్కని.... దట్టమైన] ఈ రోజున ఇలా అనేకమైనటువంటివి మన టివి భాషలో పడి భ్రష్టు పట్టిపోతున్నాయి...

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top