మన సినిమాలలో అన్ని విభాగాలలో విలువలు పతన మవుతున్నాయి. పాత సినిమాలనే ఆపాతమధురాలు అంటూ  అలనాటి చిత్రరాజాలను గుర్తుచేసుకుంటూ మధురానుభూతిని పొందడమే తప్ప ఇప్పటి సినిమాలలో మంచి సినిమాలు వేళ్లమీదనే లెక్కబెట్టొచ్చు.

అప్పట్లో చెత్త సినిమాలు కొన్ని వచ్చి ఎక్కువ మంచి సినిమాలు వచ్చేవి. ఇప్పుడేమో ఎక్కడో ఒకటి మంచి సినిమాలు వస్తున్నాయి. మంచి సినిమా అని టాక్ వచ్చే లోపే అవి సినిమా ధియేటర్లనుండి వెళ్ళి పోతున్నాయి. దానికి సవాలక్ష కారణాలు.

మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరించడంలేదని అందుకే వాళ్ళు ఏది చూస్తారో అదే తీస్తున్నామని నిర్మాతలంటుంటే , అది తప్పు అన్నమయ్య, శ్రీరామదాసు , శ్రీరామరాజ్యం లాంటి సినిమాలు హిట్ కాలేదా , హీరో లేకుండా తీసిన శంకరాభరణం వంటివి హిట్ కాలేదా? కాసుల కోసం కళను పక్కదోవ పట్టిస్తున్నారనేది మరో వాదన.

సినిమాలలో విలువల పతనానికి కారణం తీసేవాళ్లదా? చూసేవాళ్లదా? మీ అభిప్రాయం ఏమిటి?

- Palla Kondala Rao,

*Re-published

మీరేమంటారు? శీర్షికలో ఏదైనా అంశాన్ని చర్చించాలనుకుంటే క్రింది మెయిల్ ఐ.డికి వివరాలు పంపగలరు.

kondalarao.palla@gmail.com

Post a Comment

  1. సినిమాను ఒక కళగా చూడాలా వ్యాపారంగా చూడాలా?
    ఈ‌ ప్రశ్నకు జవాబు సమాధానం ఇచ్చే వారికోణం నుండి వివిధంగా ఉంటుంది.

    నిర్మాతలు, దర్శకులు, పెట్టుబడిదారులు, పంపిణీదారులు వంటి వారి కోణం నుండి అది వ్యాపారం.
    నటీనటుల కోణం‌నుండి అది ఒక కళ.
    ప్రేక్షకుల కోణం నుండి అది ఒక కళ.

    కళారాధకులు రసపోషణలూ, విలువల వంటి వాటి గురించి ఆలోచిస్తారు. వ్యాపారస్తులు అమ్మకాలూ, లాభనష్టాల గురించి ఆలోచిస్తారు.

    నిర్మాత లేనిదే సినిమా లేదు కాబట్టి సినిమా మొదట ఒక వ్యాపారమే. ఐతే మంచికళను ప్రదర్శించటం ద్వారా ప్రజలనుండి ఆదరణా లాభాలూ కోరుకునే కళగా అది మొదలయ్యింది. అందుకే ఆదరణకు కొలబద్దగా నూరు రోజుల పండుగలు మొదలయ్యాయి.

    ఆణిముత్యాలవంటి కళాకారుల యుగం అంతరించి వారసుల యుగం‌ మొదలయ్యాక. పతనం వేగం పుంజుకుంది. వారస, నీరస నటులు ఆడగలిగిన సినిమాలే తీసే రోజులు వచ్చాయి.ఆంగికవాచికాలు లేని నటులను క్లోజప్‌లో చూపే ధైర్యం దర్శకులకూ తగ్గుతుంది కదా.

    విలువలు పడి సినిమాలు సరిగా ఆడట‌మానాక, సినీ వ్యాపారులు కొత్త ఎత్తులకి దిగారు. ఒక ప్రింటుకయ్యే సగటు వేసే ప్రింట్ల సంఖ్యను బట్టే ఉంటుంది. వేల ప్రింట్లు వేసి, సినిమా రిలీజ్ చేస్తారు. బాగాలేదు అన్న పేరువచ్చినా ఈ లోగానే సొమ్ము బాగానే రాబట్టుకోవచ్చును. ఐతే సినీరంగ పతనం ఎలా ఉందంటే, ఈ యెత్తూ‌ పారని పరిస్థితి అప్పుడే వచ్చేసింది.

    వారసుల యుగం పూర్తిగా అంతరిస్తే సినీరంగం బాగుపడవచ్చును. లేకపోతే లేదు.

    ReplyDelete
  2. మార్కెట్‌స్వామ్యంలో ప్రతిదీ వినియోగదారుడి ప్రోత్సాహంతోనే వర్ధిల్లుతుంది. ఉత్పత్తిదారుడుచేసేదల్లా వినియోగదారుడు కోరుకొనేదాన్ని అందించడమే.

    తిరస్కరించగలిగిన సామర్ధ్యాన్ని వినియోగదారులుగా మనవద్ద పోగేసుకొని, చైతన్యాన్నిమాత్రం కలిగిలేము. (ఇది ఒకవేళ తప్పైతే) అది నూరుపాళ్ళూ మన తప్పే. మనను మెప్పించడానికి వాళ్ళు తీస్తున్నారు. వాళ్ళు తీస్తున్నవాటిని ఆనందించగల స్థాయిలో మన అభిరుచి ఉంటోంది. మనం చక్కా చూస్తున్నాం. మనకు కలిగే అపరాధభావనను దర్శక నిర్మాతల తప్పుగా అభ్వ్యక్తికరిస్తూ మన బలహీనతలపైనా, కుసంస్కారపు అభిరుచులపైనా జరుగవలసిన చర్చని మనం విజయవంతంగా దాటవేస్తున్నాం. షాపువాడు అమ్ముతున్నాడుకాబట్టి నేనుతాగుతున్నాను అన్న వాదన ఎంత సరైనదో, వాళ్ళు తీస్తున్నారుకాబట్టి నేను చూస్తున్నాను అన్న వాదనా అంతే సరైనది. మనకు నిఝ్ఝంగా వాళ్ళు తీస్తున్నది నచ్చకపోయినా, 'మా అభిరుచులు మీరూహించుకుంటున్న స్థాయిలో లేవు' అన్న మన వ్యక్తీకరణలమీద మనకు ఏమాత్రం గౌరవం ఉన్నా మనందరం సినిమాలు చూడ్డం మానేయడంద్వారా మన అభిప్రాయాన్ని వ్యక్తీకరించుండేవాళ్ళమేకాక, సినిమాచూడడాన్ని అష్టమ వ్యసనంగా పరిగణించుండేవాళ్ళం.

    బహుశా ప్రస్తుత సినిమాల ఉధృతిని సంస్కృతి పరదాలమాటున ఊపిరాడక కొట్టుకుంటున్న మన లోపలిమనిషి (Hyde) తిరిగిబాటుగా అభివర్ణించవచ్చేమో!

    ReplyDelete
  3. ఓ సినిమాలో బాలు పాడినట్టుగా (పిలిచేవారుంటే పలికేను నేను), సినిమాలు "చూసేవారుంటే తీసేను నేను" అన్నట్టు అయిపోయాయి - అది మంచి సినిమా అయినా చెడు సినిమా అయినా. అన్నమయ్య, రామదాసులలాంటి సినిమాలు కూడా మాయాబజార్, మల్లీశ్వరి లాంటి కళాఖండాలేమీకాదు. కానీ గుడ్డిలో మెల్ల. అంతే.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top