వ్యవసాయాన్ని కాపాడుకుందాం


వ్యవసాయాన్ని కాపాడుకోవడం ద్వారా మనలను మనం కాపాడుకోవాలని పల్లెప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షుడు పల్లా కొండల రావు తెలిపారు. ఆదివారం బోనకల్ లోని సంస్థ కార్యాలయంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. వ్యవసాయరంగంలో వ్యాపారధృక్పధం లేకుండా సాగుకు సంబంధించిన అన్ని విషయాలలో రైతాంగానికి ప్రభుత్వమే సహకారం అందిస్తే పలు ప్రయోజనాలు పొందవచ్చన్నారు. సేంద్రియ వ్యవసాయం చేయడం, పంట ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం, గ్రామం యూనిట్ గా పంటలభీమా పథకం , ఎరువులు-పురుగు మందులను సంపూర్ణంగా ప్రభుత్వమే తయారు చేసి అందించడం , భూసార పరీక్షల ద్వారా అనువైన పంటలను సాగు చేయడం వంటివి చేస్తే పర్యవారణం పరిరక్షించడంతో పాటు ఆరొగ్యకరమైన పంట ఉత్పత్తులు రాబట్టవచ్చన్నారు. అవసరానికి మించి పురుగుమందులు వాడడం, వాణిజ్య పంటలను పండించడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయన్నారు. మనిషికి అవసరమైన పోషక విలువలను అందిచే విధంగా పంటలు, పండ్లతోటలు, కూరగాయల సాగు జరిగేలా ప్రణాళికాబద్ధమైన వ్యవసాయాన్ని చేయించేందుకు ప్రభుత్వమే కృషి చేయాలన్నారు. వ్యవసాయరంగంలో అధునాతన పనిముట్లను ఎలా వాడాలి, మార్కెట్ రవాణా కు రైల్వేను ఉపయోగించడం ద్వారా ఎలా లాభం పొందవచ్చనే విషయాలపై సంపూర్ణ అధ్యయనం చేసి దేశవ్యాపితంగా నూతన వ్యవసాయ విధానాన్ని చేపడితే భారతదేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మరీదు రోషయ్య అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో సురభి వెంకటేశ్వర రావు, మరీదు కిషోర్, బంధం శివ తదితరులు పాల్గొన్నారు.
andhrajyothy 28-3-2016




ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి.

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top