ప్రజలు పౌరులుగా బ్రతికే వ్యవస్థ కోసం కృషి చేద్దాం!


ప్రజలు ఓటర్లుగా కాక పౌరులుగా బ్రతికేలా తీర్చిదిద్దేందుకు పాలకులు కృషి చేయాలని పల్లె ప్రపంచం అధ్యక్షులు పల్లా కొండల రావు కోరారు. ఆదివారం బోనకల్‌లోని పల్లె ప్రపంచం ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన సెమినార్లో ఆయన మాట్లాడారు. సంస్థ అధ్యయన కేంద్రం కన్వీనర్ చలమల అజయ్ కుమార్ అధ్యక్షత వహించారు. ప్రజాస్వామ్యం ద్వారా లభించే స్వేచ్చ విచ్చలవిడితనంగా మారకుండా ఉండాలన్నా, మెరుగైన వ్యవస్థ ఏర్పడాలన్నా ప్రజల చైతన్యం పెరగాలన్నారు. ప్రజలలో శాస్త్రీయ ధృక్పథం పెంచేందుకు పాలకులు ప్రయత్నించాలన్నారు. ఎన్నికలలో గెలుపు ద్వారా ప్రజలపై పెత్తనం చేసేందుకు కాక వారిని చైతన్యవంతులైన పౌరులుగా తయారు చేయాలని కోరారు. దురదృష్ట వశాత్తూ రాజకీయ పార్టీలు ప్రజలను ఓటర్లుగా మాత్రమే చూస్తున్నారన్నారు. ఓటు బేంక్ రాజకీయాలకు చెక్ చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన, సమానమైన విద్యా, వైద్య అవకాశాలు, పని అవకాశాలు ప్రభుత్వమే కల్పించేలా ఉండాలన్నారు. ప్రజలు ఏది కోరుకుంటున్నారనేది కాక, ప్రజలకు ఏది అవసరం అన్న ధృక్పథంలో పాలకుల ఆలోచనలు ఉంటేనే సమాజ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, బంధ శివ ప్రసాద్, సురభి వెంకటేశ్వర రావు, మరీదు రోశయ్య తదితరులు పాల్గొన్నారు.


25-1-2016 andhrajyothy

25-1-2016 navatelangana

ఈ బ్లాగులో ఇంతక్రితం టపాకోసం ఇక్కడ నొక్కండి

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top