పట్టుదలతో ప్రయత్నిస్తే కులరహిత భారత సమాజం అసాధ్యం కాదని పల్లె ప్రపంచం ఫౌండేషన్‌ అధ్యక్షుడు పల్లా కొండరావు అన్నారు. బుధవారం పల్లె ప్రపంచం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో కుల వనభోజనాలను మానాలని, జన వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్‌క్లబ్‌ మధిర డివిజన్‌ కమిటీ సభ్యుడు సురభి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ భారత సంస్కృతిలో వనభోజనాలనేవి మొదట మంచిగానే జరిగినా ఇటీవల కాలంలో కులాల పేరుతో కులభోజనా కార్యక్రమంగా మారడం మంచి పరిణామం కాదన్నారు. ఈ నేపథ్యంలో కులాలతో సంబంధం లేకుండా జనభోజనాలుగా సామూహిక వనసమారాధన కార్యక్రమాన్ని పల్లెప్రంచం తరపున చేపట్టడం జరిగిందన్నారు. సమాజం ఎన్నో మార్పులకు గురవుతూ అనేక సంఘర్షణలతో మార్పువైపు పురోగమించడం చరిత్రలో చూస్తున్నామని తెలిపారు. కులం విషయంలో గతంతో పోలిస్తే కొంత పరిస్థితి మారినప్పటికీ నేటికీ కులాధిపత్య ధోరణులు ఉండటం శోచనీయమన్నారు. ప్రెస్‌క్లబ్‌ మధిర డివిజన్‌ కమిటీ సభ్యుడు తేనె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేయి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుందని, కులరహిత సమాజం కోసం వనభోజనాల విషయంలో బోనకల్‌ మండంలో ఇతరులకు భిన్నంగా మంచి ప్రయత్నం చేస్తున్న 'పల్లెప్రపంచం ఫౌండేషన్‌' భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాు చేయాలని కోరారు.ఈ సమావేశంలో సి.పి.యం బోనకల్‌ మండ కమిటీ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, తెలుగుదేశం మండల కమిటీ అధ్యక్షులు తన్నీరు రవికుమార్‌, సిఐటియు మధిర డివిజన్‌ అధ్యక్షులు వల్లంకొండ సురేష్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గుగులోతు నరేష్‌, ఎమ్‌ఆర్‌పీఎస్‌ మండల అధ్యక్షులు యంగల కనకయ్య, మొండితోక అఫ్జల్‌, పల్లెప్రపంచం ఫౌండేషన్‌ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, సభ్యులు చలమల అజయ్ కుమార్ రచ్చా మధు, రామన అప్పారావు, కంసాని చలపతిరావు, బలగాని నాగరాజు, వేల్పుల రమేష్ , కెవిపిఎస్‌ నాయకుడు ఏసుపోగు బాబు, ప్రెస్‌క్లబ్‌ మధిర డివిజన్‌ కార్యదర్శి పారా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
















వార్తల క్లిప్పింగులు








ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top