సేంద్రీయ వ్యవసాయం ద్వారా లాభాలు సాధించవచ్చు 




సేంద్రీయ వ్యవసాయం ద్వారా లాభాలు సాధించవచ్చని పల్లె ప్రపంచం ఫౌండేషన్ అధ్యక్షులు పల్లా కొండలరావు అన్నారు. ఆదివారం బొనకల్ లో జరిగిన సేంద్రీయ వ్యవసాయం అవగాహనా సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు అవసరానికి మించి పురుగుమందులు వాడటం ద్వారా ప్రకృతికీ, పర్యావరణానికీ హాని కలుగుతుందని తెలిపారు. లాభం కోసం వ్యవసాయం స్థానంలో అవసరం కోసం వ్యవసాయం అనే నినాదంతో రైతులు పంటల విధానంలో మార్పులు తీసుకురావడం కోసం పల్లె ప్రపంచం కృషి చేస్తుందన్నారు. పంటల మార్పిడి విధానం గోమూత్రం వంటి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయటమే కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చవచ్చని తెలిపారు. ఈ దిశగా రైతులలో మార్పు తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. రైతు నాయకుడు కాంసాని చలపతిరావు మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయంపై తగిన అవగాహన తీసుకువచ్చేందుకు పల్లె ప్రపంచం చేస్తున్న కృషిని అభినందించారు. ప్రభుత్వం కూడా ఈ దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. చలమల అజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సంస్థ కార్యదర్శి బోయనపల్లి అంజయ్య, విశ్రాంత అధ్యాపకుడు వజ్రాల పరబ్రహ్మం, సభ్యులు బలగాని నాగరాజు, బంధం శివ, రామన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
News Clippings

namaste telangana

sakshi

surya

visalandhra

ఈ బ్లాగులో గత టపాకోసం ఇక్కడ నొక్కండి

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top