మార్క్సిజం గురించి కమ్యూనిజం గురించి సవ్యంగా చర్చించే దానిలో భాగంగా ఇంత క్రితం వ్రాసిన పోస్టులు 1-కమ్యూనిజం గురించి సవ్యంగా చర్చిద్దాం   2-కమ్యూనిజం మార్క్సిజం అంటే ఏమిటి ? దానికి కొనసాగింపుగా ఈ పోస్టు వ్రాస్తున్నాను. ఇంత క్రితం పోస్టులలో కామెంట్ల ద్వారా చర్చలలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు.

కమ్యూనిజం రావాలంటే కమ్యూనిస్టు పార్టీ రద్దు కావాలి !


భూమి మీద స్వర్గం లాంటి మరొక ప్రపంచం సాధించుకోవడమే కమ్యూనిజం అనీ క్లుప్తంగా అనుకున్నాం కదా !? అలాంటి మరో ప్రపంచం రావడం అసాధ్యమా !?  అందుకే స్వర్గం - నరకం ఉన్నాయా !?
 -------- ఇది ఒక రకం ఆలోచన.

స్వర్గం నరకం రెండూ భూమి మీదనే ఉన్నాయి . దోపిడీ రహిత సమాజం స్వర్గం అనీ , దోపిడీ ఉన్న సమాజం నరకం అనీ , నరకంగా ఉండే అంశాలను పోరాడి తొలగించుకోవాలనీ , మనిషి సృష్టించిన ఈ దోపిడీని దానికి గురయ్యే మనుషులే అనివార్యంగా రూపుమాపుతారనీ అది సాధ్యమేననీ చరిత్రను ఒక పద్ధతి ప్రకారం పరిశీలిస్తే మరో ప్రపంచం సాధన అసాధ్యమైనది కాదనీ అది మానవ సమూహం అనివార్యంగా సాధించుకోవలసిన ఒక బృహత్తర కార్యమనీ అవగతమవుతుంది. 
 -------- ఇది మరో రకం ఆలోచన.

మానవుడే మహనీయుడు . శక్తిపరుడు - యుక్తిపరుడు మానవుడే . ఎప్పటికప్పుడు మానవుడు తన అవసరాలను తీర్చుకునేందుకు , జీవనవిధానాన్ని మెరుగుపరచుకునేందుకు శ్రమ + ఆలోచన అనే ఆయుధాలతో కృషి చేస్తుంటాడు. వ్యక్తిగత విశ్వాసాలు , నమ్మకాలతో పని లేకుండా ప్రపంచ వ్యాపితంగా మనుషులెవరైనా కార్యాచరణలో చేసేది ఇదే . 

శ్రమ + ఆలోచన  అనే ఆయుధాలను ఎలా ఉపయోగిస్తాడు ? అనేది ఆలోచిస్తే దొరికే సమాధానం - " మనుషులు కలసికట్టుగా ప్రకృతి పై ఆధారపడుతూ ప్రకృతి శక్తులను ఉపయోగించుకుంటూ సామూహిక జీవనాన్ని కొనసాగిస్తారు. ఇందుకోసం కట్టుబాట్లతో మానవసమాజం నిరంతరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ కట్టుబాట్లు ఎలా ఉండాలి ? ఎలా ఉన్నాయి ? ఏ కట్టుబాటు ఎందుకు ఏర్పడింది ? ఎల్లప్పుడు ఒకే విధమైన కట్టుబాట్లతో మానవ జీవితం కొనసాగుతుందా !? ఏవి అవసరమైన కట్టుబాట్లు ? ఏవి అవసరం లేని కట్టుబాట్లు ? కట్టుబాట్లకు కట్టుబడాల్సిన అవసరం మనిషికి ఉందా ?

లేదంటే -  ఎందుకు ? ఎలా ?
ఉందంటే -  ఎందుకు ? ఎలా ?

వీటిని అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా ఏర్పాటు చేసుకునే వీలుందా ? ఉంటే అది ఎలా ఉంటుంది ? ఇవి తెలుసుకునేందుకు అలాంటి ఒక ఉన్నత సమాజం సృష్టించుకునేందుకు ఏర్పడినదే కమ్యూనిస్టు ప్రణాళిక. దీని ప్రకారం ఆయా దేశాల స్థానిక పరిస్తితులకు అనుగుణంగా కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడతాయి. కమ్యూనిస్టు పార్టీ తన కర్తవ్యాన్ని నిర్వహించే సందర్భం లో అనివార్యంగా ఒక వర్గానికి ( దోపిడీ చేసే ) వ్యతిరేకంగా పని చేస్తుంది. వర్గదోపిడీ రద్దయి ఒకానొక చైతన్యస్థితికి మానవ సమాజం చేరుకున్నాక కమ్యూనిస్టు పార్టీ కూడా ... అంటే మానవసమాజ మనుగడకు అవసరం లేని పార్టీలు అన్నీ రద్ధవుతాయి. అప్పుడే కమ్యూనిస్టు సమాజం ఏర్పడుతుంది.

ప్రజా చైతన్యం అత్యంత ఉన్నత స్థాయిలో ఉండే ఆ సమాజం లో మానవులు సమూహంగా , ఐకమత్యంగా , ఒకే కుటుంబం - ఒకే ప్రపంచం గా తమ అవసరాల కోసం , ఎప్పటికపుడు మెరుగైన పరిస్తితుల కోసం ప్రకృతితో పోరాటం కొనసాగిస్తూ వుంటారు. ఇలాంటి ఒక అత్యున్నత మానవ జీవన విధానాన్ని ఇప్పటి పరిస్తితులలో ఆషామాషీగా ఊహించడం అంత తేలిక కూడా కాదు. 

కానీ ఈ ప్రకృతిని , మానవ జీవన పరిణామ క్రమాన్ని శాస్త్రీయంగా అవగాహన చేసుకుంటే అటువంటి ఉన్నత సమాజం అసాధ్యం కాదనీ పైగా అది అనివార్యం అనీ అవగతమవుతుంది.

ఈ క్రమం లో మనకు చాలా అనుమానాలు , ప్రశ్నలు రావడం అత్యంత సహజం. సమాజం లో మార్పు కమ్యూనిస్టులే తీసుకు రావాలా ? దానంతట అది రాదా ? ఇపుడున్న పార్టీలు చాలవా ? వర్గపోరాటం పేరుతో మనం మనుషులని చీల్చాలా ? మంచి వ్యక్తులు మంచి ఆలోచనలతో - మంచి బోధనలతో సమాజాన్నీ మార్చలేరా ? మార్క్సిజం విఫలమయింది కదా ? ఈ బూజు పట్టిన సిద్ధాంతాన్ని పట్టుకుని ఇంకా వేలాడడమ ఏమిటి ? ఇలాంటి అనేక ప్రశ్నలతో పాటు కమ్యూనిస్టులపై ద్వేషంతో విషం కక్కే విపరీత విమర్శలు కూడా ఉంటాయి. 

కమ్యూనిస్టు సిద్ధాంతం ఉన్నతమైనది కాబట్టి అసలు దానిని విమర్శించకూడదనుకోవడం చాలా తప్పు. మార్క్సిజమే పరిపూర్ణమైన సిద్ధాంతం అని మొండిగా వాదించడం కూడా మార్కిజానికి ద్రోహం చేసే అంశమే అని నా అభిప్రాయం. 

మార్క్సిజాన్ని విమర్శించాలంటే ముందు మార్క్సిజం గురించి తెలుసుకోవాలి. అప్పుడు ఇదిగో ఇందులో ఈ లోపాలు ఉన్నాయి? కనుకు ఇది ఈ విధంగా తప్పు . ఈ విధంగా దీనివల్ల ప్రమాదం ఉంది.ఈ కారణాల చేత ఇది ఆచరణకు సాధ్యం కాదు. దీనిలో ఈ లోపాలున్నాయి? వాటికి ఇదిగో ఈ ప్రత్యామ్నాయాలు ఉన్నయి? అని చెప్పగలిగితే అది సరైన విమర్శ అవుతుంది. ఇవన్నీ సరిగా చేయాలంటే ముందు మార్క్సిజం గురించి అధ్యయనం చేయాలి .

మార్క్సిజం గురించి అధ్యయనం చేయకుండా దానిని పైపైన చర్చిండం కానీ , విమర్శించడం కానీ చేయడం వల్ల ఫలితం సరిగా ఉండదు.

అందుకే మనం మార్క్సిజం గురించిన ప్రాధమిక " అధ్యయనం " ను ఒక్కో అంశాలవారీగా కొనసాగిద్దాం. చర్చిద్దాము.

దీని తరువాత పోస్టు : అందరూ సమానం ఎప్పటికీ అసాధ్యం 

Post a Comment

  1. కమ్యూనిజం రావాలంటే కమ్యూనిస్టు పార్టీ రద్దు కావాలి

    At last I very well agree with you. Let the Commies wind up their show and let the society decide what they want. They do not need propagation of a foreign ism that too an ism followed by our enemy country like China. As long as China is our neighbor country by force (by occupying Tibet, erstwhile buffer country between India and China), communism has no future in our Country. By their misadventure against India in 1962 , China forever sealed the fate of Communists in India. The moment anybody says communism, it is identified with our enemy country and those who talk about such foreign ism are always suspicious. This is what the father land of communists have done to them.

    So let China go back to their country, leave Tibet as a free country and let China behave like a proper country and after about a decade or so maybe, I repeat, may be people shall be ready to listen to these foreign isms. Till then no matter what you people shout at the top of your voices, nobody cares to listen. So better tell the fatherland of China to behave properly first.

    By trying to forcibly implementing the so called communism first by China in 1962 attempting to invade our Country and the splinter groups taking up guns into their hands have permanently lost all opportunity to convince Indians to even to listen to the foreign ism. The foreign ism need not be implemented in India.We are better off without these idiotic isms imported into India.

    ReplyDelete
  2. శివరామప్రసాదుగారు..!
    నమస్తే..! మీరు చైనాని కమ్యూనిజానికి పితృదేశం అంటున్నారుగానీ, నా దృష్టిలో మాత్రం అది సామ్రాజ్యవాదదేశమే. ఎటొచ్చీ, కమ్యూనిజం ముసుగు తొడుగుకుంది అంతే..! స్వతంత్ర రాజ్యమైన టిబెట్ ని ఆక్రమించినపుడు, కాశ్మీరులో వాటా లాక్కునప్పుడు,అరుణాచల్ ప్రదేశ్ విషయంలోనూ, వియత్నాం సముద్రతీరంలో చమురు అన్వేషణ విషయంలో ఓ.ఎన్.జి.సి విదేశ్ సంస్థకి అభ్యంతరాలు చెబుతున్నప్పుడూ, 1962 భారతంకు మిత్రద్రోహం తలపెట్టినపుడు, హిందూ మహా సముద్ర విషయంలోనూ.. ఇలా చాలా చాలా ఉన్నాయి దాని సామ్రాజ్యవాద వైఖరి బయటపడుతున్న సందర్భాలు. ఏదో సిద్ధాంతాలకి కట్టుబడిపోయినట్టు ఫోజు ఇవ్వడం తప్ప, అదసలు సామ్యవాద దేశంకాదు. చైనా పాపాల చిట్టా అలా పెరిగిపోతూనే ఉంది. బహుశా, చైనాకున్నన్ని శత్రుదేశాలు మరే దేశానికీ ఉండి ఉండవు.

    ReplyDelete
  3. @ వామనగీత గారికి ,
    మీరు చెప్పిన వాటిలో ఉన్న వాస్తవ అంశాలతో నేను ఏకీభవిస్తాను. అసలు ఇంతవరకూ సోషలిజం అమలుకు కొన్ని దేశాలు ప్రయత్నాలు చేశాయి. చేస్తున్నాయి.

    ఇవి అమెరికన్‌ సామ్రజ్యవాదం కంటే చాలా చాలా బెటర్ తప్ప , కమ్యూనిజం సాధించే క్రమం లో , సోషలిజం దశను నిర్మించే క్రమం లో , కార్మిక వర్గ నియంతృత్వాన్ని తప్పుగా అమలు చేశాయనేదే నా అభిప్రాయం కూడా. దీనికి అమెరికాను బూచిగా చూపో , పెట్టుబడిదారీ వికృతాన్ని చూపో తప్పించుకోవడం కరెక్టు కాదు. అది సరైన కమ్యూనిస్టు చేసే లేదా చేయాల్సిన పని కాదు.

    అయితే దీనికి ఆ తప్పులనుండి పాఠాలను నేర్చుకుని కమ్యూనిజం సాధనకు మరింత ముందుకు పోవడమే తప్ప మార్క్సిజం - కమ్యూనిజం నుండి వెనుకకు మరలాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం . ముందు ముందు ఈ విషయాలను వివరంగా పరిశీలిద్ధామని మనవి.

    ReplyDelete
  4. @ శివరామప్రసాదు కప్పగంతు గారికి,

    చైనా దురాక్రమణ - భారత కమ్యూనిస్టుల వైఖరి అనే దానికి, కమ్యూనిజాన్ని చర్చించే దానికి ఒకే అంశం కాదు కనుక విడి విడి గానే చూద్దామని మనవి.

    తప్ప్పనిసరిగా ఈ అంశాన్ని కూడా ముందు ముందు చర్చించాలి గనుక ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నాను. చరిత్రను ఎలాగూ మార్చలేము, ఈ చర్చ ఒక్క పోస్టుతో పూర్తి అయ్యేది కాదు కనుక సౌలభ్యం కోసం వాయిదా వేస్తున్నాను. తేడాను గమనించగలరు.

    విదేశీయిజం గురించి మీ వాదన - నా సమాధానం గతం లోనే పూర్తి అయ్యాయి. అంతర్జాతీయ మానవతావాదం కలిగి వున్న మార్క్సిజానినికి ఎల్లలతో పని లేదు. స్థానిక సంస్కృతీ - సాంప్రదాయాలను , జీవన విధానాలను , కట్టు బొట్టూ వంటి ఆచారాలనూ అదేమీ తుడిచిపెట్టుకోమని చెప్పదు.

    పైగా వాటిని అందరికంటే ఎక్కువ గౌరవించేది , ప్రజలకు ఇష్టపూర్తిగా వాటిని కాపాడుకునే అవకాశం కల్పించగలిగేది మార్క్సిజం మాత్రమే. విదేశీ-స్వదేశీ అనే దాని పై మీ వాదన తో నేను ఏమాత్రం అంగీకరించలేను. ఆ అవసరం కూడా కనబడడం లేదు. ఆచరణ లో మీ వాదన సాధ్యమయ్యేది కూడా కాదు.

    పాత - కొత్తల మేలు కలయికే ఎపుడైనా అభివృద్ధికరంగా ఉంటుంది. తెలుగు భాష మీద మమకారంతో మరో భాషే నేర్చుకోకూడదంటే మన గొప్పదనాన్ని ఇతరులకు ఎలా చెప్పగలం - అలాగే ఇంగ్లీషు మీద మోజుతో తెలుగును చులకన చేసినా తప్పే.భాష అనేది భావ వ్యక్తీకరణ సౌలభ్యం కోసమే.అలాగే ఒక సిద్ధాంతం కూడా మానవత్వాన్ని నిలబెట్టే మంచి ఎక్కడున్నా అదే ముందడుగు వేస్తుంది.

    'మన' అనే పేరుతో - సంకుచితత్వంతో మానవత్వాన్ని మంటగలిపే చర్యలను, విధానాలను అనుసరించలేము. అనుసరించకూడదు కూడా ! అదే సందర్భం లో భారతీయ జీవన విధానం లో గొప్పదనాన్ని ఎవరో - ఏ ఇజమో వచ్చి తుడిచెపెట్టలేదు.తుడిచి పెడితే పోయే అంత అల్పమైనది కూడా కాదు భారతీయ సంస్కృతీ-జీవన విధానం.

    మరో వాదన కూడా మీరు గతం లో చేసినదే : ప్రజలు వారు తమంతట తామే తమకు కావలసింది మార్చుకుంటారని. చరిత్రను నిర్మించేది ప్రజలే కానీ ఎపుడూ ఏదో ఒక నాయకత్వం - మార్గదర్శకత్వం లేకుండా మార్పు సంభవించడం చరిత్రలోనే లేదు. కమ్యూనిస్టులే తీసుకురావాలని రూలేమీ లేదు.

    కమ్యూనిస్టులకంటే మెరుగ్గా ఎవరు ఉంటారో వారే చరిత్రలో మార్గదర్శకులుగా తప్పనిసరిగా ఉంటారు. కమ్యూనిస్టుల ఆత్మవిశ్వాసాన్ని కాదనాల్సిన అవసరం మాత్రం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు.

    ReplyDelete
  5. చైనా ఇండియా మీద దాడి చెయ్యటం,భారత దేశంలో కమ్యూనిజం వేరు వేరు విషయాలు ఎలా అవుతాయి. భారత్ మీద చైనా దాడి చేసినప్పుడు ఈ కమ్యూనిస్టుల ధోరణి ఏమిటి. ఆ దాడి జరిగి తీరాల్సిందే అని, చైనా గెలిచి ఎర్ర కోట మీద వీళ్ళ ఎర్ర జెండా ఎగరెయ్యాలని పథకం వేశారా లేక దేశ భక్తి గల "భారతీయులుగా" ఆ దాడిని ఖండించి మన దేశ రక్షణలో పాలు పంచుకున్నారా? రెండూ లేక స్థబ్దుగా ఊరుకుని ఆ దాడికి తమ లోపాయకారీ మద్దతు తెలుపుతూ ఇక్కడి విషయాలు అక్కడకు చేరవేసే ప్రక్రియ కొనసాగించారా? మనం ఒక దేశంగా ఉన్నప్పుడు వేరే ఏదో దేశంలో వాళ్ళ జీవన పధ్ధతులను బలవంతాన "విప్లవం" అంటూ మార్చుకుంటే, ఆ భావాల ప్రభావంలో మన దేశంలో కొందరు ఆ విప్లవం ఇక్కడా రావాలని, ఆ దేశం మన దేశం మీద దాడికి దిగినప్పుడు కూడా ఊరుకుంటే, అటువంటి వాళ్ళను ఎవరన్నా నమ్ముతారా?

    నిజానికి నేను చెప్పేది కమ్యూనిజం ఒక సిధ్ధాంతం గా గురించిన చర్చ కాదు. భారత్ లో ఈ కమ్యూనిజం పేరుతో జరుగుతున్న అల్లరి మూలాలు. వీళ్ళు చైనా రష్యాల సహకారంతో ఇక్కడ పార్టీ పేరుతో జరిగించే చర్యలు, ప్రజల్లో ప్రాచుర్యం ఎలా కలిగిస్తాయి!

    కొంతమందికి ఒక ఇజం ఇష్టం అయినంత మాత్రాన, వాళ్ళు అదే గొప్ప విషయం అంటూ ఊరికే ఊదరగొట్టి, అది ఇష్టం లేనివాళ్ళను పురుగులుగా చూస్తూ ఉంటే అలాంటివాళ్ళు ప్రజాభిష్టాన్ని ఎలా చూరగుంటారు. సిధ్ధాంతాలు అనేకం ఉంటాయి, కాని అవన్ని "వ్రాయబడ్డ" సిధ్ధాంతాలు. ఇలా ఉంటే బాగుండును అనుకుని వ్రాసినవి. నిజజీవితంలో ఆచరణకు అవకాశం పెద్దగా లేనివి, మానవ సహజ సిధ్ధమైన ఆలోచన పధ్ధతులకు, జీవన విధానాలకు వ్యతిరేకమైనవి.

    స్వర్గం స్వర్గం అంటూ గోలకెట్టేవాళ్ళు ఎవరన్నా స్వర్గానికి వెళ్ళటానికి ఉబలాటపడినట్టు ఎక్కడా దాఖలాలు లేవు. కారణం ఏమిటి, అలా ఉన్నదా, ఉంటుందా అన్న అనుమానమే. చూసొచ్చిన వాడు లేడు కనుక ఆ అనుమానం అలాగే ఉండి, స్వర్గానికి వెళ్ళాలంటే ఇవి మార్గాలు అని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా, సామాన్య ప్రజలు విననట్టే, ఈ ఇజం కూడా ఒక ఆలోచన, ఒక సిధ్ధాంతం అంతే. ఆచరణకు కుదరదని, ఆచరణలోకి తేవాలంటే, మనుష్యులను పూర్తిగా జడ పధార్ధాలుగా చేసినా సరే ఎక్కడా కూడా ఆచరణ చెయ్యలేకపొయ్యారని నిరూపితం అయినాక ఇంకా అప్పుడెప్పుడో లండన్ లైబ్రరీలో కూచుని ఒక జర్మన్ వ్రాసిన సిధ్ధాంతాలను చర్చించటం, అవి అద్భుతమైనవి అని చెప్పుకోవటానికి పనికి వస్తాయేమోకాని, మరిందుకూ ఎప్పటికీ కొరగావు.

    మూడు దశాబ్దాలు ఎక్కడా బ్రేక్ పడకుండా పరిపాలించబడిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో తీసుకు రాబడ్డ అద్భుతమైన మార్పులు ఏమిటి? అక్కడి సామాన్య ప్రజల జీవన విధానంలో కాని, జీవన స్థితిగతులలో కాని తీసుకు వచ్చిన మార్పులు ఏమిటి. ప్రజాస్వామ్యంలో ఈ ఇజాన్ని అమలు పరచలేము అనుకున్నప్పుదు, ఎన్నికల్లో నిలబడి,ప్రజలను వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా పాలించగలిగే సత్తా ఉన్నవళ్ళకు అడ్డుపడటం దేనికి. పశ్చిమ బెంగాల్ మిగిలిన ఏ రాష్ట్రానికి ఇన్ని సంవత్సరాల తరువాత సమానంగా ఉన్నది!

    ReplyDelete
  6. @ శివరామప్రసాదు కప్పగంతు గారికి ,

    చైనా ఇండియా మీద దాడి చెయ్యటం, భారత దేశంలో కమ్యూనిజం అనేవి వేరు వేరు విషయాలు అని నేను వ్రాయలేదు. చైనా దురాక్రమణ-భారత కమ్యూనిస్టుల వైఖరి అనే దానికి, కమ్యూనిజాన్ని చర్చించడం అనే దానిని ఒకే అంశాలుగా చూడొద్దన్నాను.మరోసారి గమనిచగలరని విజ్నప్తి.

    నేను చెప్పేది సిద్ధాంతం గురించే. భారత్ లో కమ్యూనిజం పేరుతో అసలు తప్పులే చేయలేదని గానీ కాదు. ఒక్క భారత్ లోనే కాదు. లెనిన్‌ కాలం లో తప్ప మిగతా కాలం లో ప్రపంచ వ్యాపితంగా కూడా అప్పుడు , ఇప్పుడు చైనాతో సహా బ్రహ్మాండంగా ఏమీ లేదు అని నా అభిప్రాయం. లెనిన్‌ కాలం లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినా మార్క్సిజాన్ని అమలు చేయడం లో అవి పాఠాలుగా వున్నాయి.

    అయితే ఈ వైఫల్యాలకు సిద్ధాంతంగా మార్క్సిజం ఫెయిల్ అయిందని అనడానికి సరిపోదనే నా అభిప్రాయం. ఒక వేళ మార్క్సిజం ఫెయిల్ అయింది అనుకున్నా మరి ప్రత్యామ్నయం ఏమిటో చెప్పాలి. ఎట్టి పరిస్తితులలోనూ 'డబ్బే సర్వం అయి - విలువలన్నింటినీ పతనం చేసే' పెట్టుబడిదారీ సమాజం మాత్రం ఎంతమాత్రం ప్రత్యామ్నయం కాదు.

    లేని స్వర్గం-నరకం కూ , భూమి మీద ఇప్పటి దాకా జరిగిన చరిత్రను ఆధారం చేసుకుని , జరగబోయే దానిని మనుషులే ఇలా చేయవచ్చు అని చెప్పినదానికీ పోలిక సరి కాదు.

    పదార్ధానికే జడత్వం లేదనీ - అది చలన శీలం అనీ మార్క్సిజం చెపుతుంది. మీరేమో దానికి పూర్తి విరుద్ధంగా మనుషులను జడ పదార్ధాలుగా చేసినా...అంటున్నారు. మీరే మరో సందర్భం లో మనుషులను కావాలనీ మానసిక కాలుష్యం చేస్తున్నారు కమ్యూనిస్టులు అంటారు.ఇది ద్వంద్వప్రమాణాలను పాటించడం అవుతుంది. ఇందుకు కారణం కమ్యూనిస్టులను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకోవడం అయినా కావాలి. లేదా ఆ సిద్ధాంతం పూర్తిగా తెలుసుకోకుండా కమ్యూనిస్టుల చర్యలపై విసిగినదానిని సిద్ధాంతానికి ఆపాదించడమైనా కావాలి.

    విఫలం అనేదానికి చరిత్ర గమనాన్ని గమనిచవలసిందిగా విజ్ఞప్తి. చరిత్ర ఎపుడూ జిగ్ జాగ్ గానే వుంది. విఫల విప్లవాలే ఎక్కువ. ప్రతి విప్లవం నుండీ సమాజం ఎంతో కొంత అభివృద్ధికరంగా మారింది. అభివృద్ధికరంగా మారడం వేరు. మనిషిని మనిషి దోపిడీ చేయడం వేరు. దోపిడీ అనే పదానికి అర్ధం సరిగా అన్వయిచుకోకపోతే అది ఒక పడికట్టు పదం అవుతుంది. దోపిడీ అంటే దొంగతనం మాత్రమే కాదు. చట్టబద్ధంగా , న్యాయబద్ధంగా ,వ్యవస్తీకృతంగా జరిగే దోపిడీ.అందుకు అవకాశం కల్పించే వ్యవస్తలో మనుషులు తమ సహజ ధర్మగుణాన్ని(పరాయీకరణ చేందడం) కోల్పోతుంటారు. మొత్తం వ్యవస్థలో మార్పు వచ్చినపుడే మానవవికాసం అన్ని కోణాలలో సహజంగా జరుగుతుంది.

    "అపుడెపుడో లండన్‌ లైబ్రరీలో కూర్చుని ఒక జర్మన్‌ వ్రాసిన" అనే దానిని మీరు పదే పదే వాడుతున్నారు. ఈ వాదన పూర్తిగా అశాస్త్రీయం. అసంబద్ధం.ఎన్ని సార్లు చెప్పినా ఇందులో ఏ మాత్రం పస గానీ, పనికి వచ్చే అంశం గానీ నాకు కనపడడం లేదని మనవి.

    ఒక సిద్ధాంతం ఎక్కడ కూర్చుని ఎవరు వ్రాశారని కాదు. అది శాస్త్రీయంగా, ఆచరణకు అనుకూలంగా-మానవాళికి మేలు చేసేదిగా ఉందా? లేదా? అని మాత్రమే. మార్క్స్ ని జర్మన్‌ ప్రభుత్వం బహిష్కరించింది.ఆయన చనిపొయినపుడు కేవలం 18 మంది మాత్రమే ఉన్నారు. ఆ తరువాత ప్రపంచమే ఆయన్ను ప్రేమిస్తోంది.

    మీరన్నదానిలో "ఆచరణకు కుదరని తేలిపోయింది?" గురించి - మీరు అలా అభిప్రాయపడడంలో మీకు స్వేచ్చ ఉన్నట్లే , అలా అని పూర్తిగా ఋజువేమీ కాలేదు అని నా అభిప్రాయం. అలా అయితే మార్క్సిజం మాసిపోతుంది.ఒక్క విషయం ప్రసాద్ గారూ! ఏ సిద్ధాంతాన్నీ బలవంతంగా ప్రజలలోకి ఎక్కించలేము.

    " ప్రజాస్వామ్యంలో ఈ ఇజాన్ని అమలు పరచలేము అనుకున్నప్పుదు, ఎన్నికల్లో నిలబడి,ప్రజలను వాళ్ళ అభిష్టానికి అనుగుణంగా పాలించగలిగే సత్తా ఉన్నవళ్ళకు అడ్డుపడటం దేనికి? "

    ఎవరు అడ్డుపడుతున్నారు? అందరూ కాదు. అసలు పూర్తిగా ప్రజాస్వామ్యయుతంగా, పూర్తి స్వేచ్చగా ఎన్నికలు జరిగిందెపుడు మన దేశంలో!? ఎన్నికలలో గెలిచినంత మాత్రాన కమ్యూనిస్టులు అద్భుతాలు ఏమీ చేయలేరు. ఒక పక్క కార్మిక వర్గ నియంతృత్వం లోనే లోపాలు జరిగి కూలిపోతుంటే ఇక్కడ ఎన్నికలలో నెగ్గి ఏమి చేయగలరు. ప్రజలను చైతన్యవంతం చేయకుండా కమ్యూనిస్టులు అయినా అద్భుతాలు ఏమీ చేయలేరు. ఎన్నికలలో పాల్గొనడం ద్వారా మిగతావారికంటే కమ్యూనిస్టులు అద్భుతంగానే ఉన్నారు. సాపేక్షంగా అనేక విషయాలలో గణాంకాలతో సహా మనం వాటిని గమనించవచ్చు.అయితే సమాజం లో మార్పుకు అది మాత్రమే సరిపోదు.

    మూడు దశాబ్దాలు ఎక్కడా బ్రేక్ పడకుండా పరిపాలించబడిన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో మన దేశం లో ఏ ఇతర రాష్ట్రం కన్నా పాలన-అభివృద్ధి బాగానే ఉంది. ఇది చాలా సందర్భాలలో పత్రికలలో వివరణాత్మకంగా వచ్చిన అంశమే . ప్రభుత్వాల అధికారిక గణాంకాలు కూడా వీటిని వివరిస్తాయి.అది కామెంట్ గా సమాధానం చెప్పేది కాదు.అవసరమైతే బెంగాల్ పాలనలో కమ్యూనిస్టులు సాధించినది - మిగతా వారికంటే వారి ప్రత్యేకత ఏమిటి అనేది ఒక పోస్టుగా వ్రాస్తాను.

    ReplyDelete
  7. ఏ ఇజానికైనా మనలో మనం ఎన్ని చర్చలు చేసుకొని మన తెలివితేటలు ఉపయోగించి అవతలి వాళ్ళని కన్విన్సు చేసినా ప్రయోజనం లేదు. అసలు ప్రజలకి ఇది ఎంత ఉపయోగకరంగా వున్నది....? ఎంత ప్రాక్టికల్‌గా ఉంటుందా లేదా....అన్నదే ముఖ్యం. ఏదైనా ప్రజలకి అనువుగా వున్నదని ఒకసారి తెలిస్తే దానిని అదే పనిగా ప్రచారం చెయ్యవలసిన పని లేదు. దానంతల అదే ప్రజలలోనికి వెళుతుంది. ఉదాహరణకి ఎలక్ట్రిక్ స్టవ్వులు ఎప్పటి నుండో వున్నప్పటికీ వాటిని కాదని గ్యాస్ స్టవ్వులకే ప్రాధాన్యత ఇచ్చారు. నిజానికి కరెంటు ఇంట్లోనే లబ్యం అయినప్పటికీ అది గ్యాస్ కన్నా ప్రమాదకరం కాబట్టి దానిని పట్టించుకోలేదు. ప్రపంచంలో ఎన్నో వందల దేశాలున్నప్పటికీ పదుల సంఖ్య కన్నా తక్కువ దేశాలలోనే ఈ కమ్యూనిజం వున్నది. మరి మిగిలిన దేశాలలోని ప్రజలు ఎందుకు పట్టించుకోలేదు....అలా అని వారి మీద బలవంతంగా కమ్యూనిజం కానివి రుద్దుతున్నారా......? ప్రపంచ పరిణామాలు చూస్తుంటే కాదని మనకి తెలుస్తూనేవున్నది........ విప్లవాలకి, ఉద్యమాలకి కమ్యూనిజమే అవసరం లేదని తెలుస్తుంది...ఈ మధ్య కాలంలో రాజులకీ, ప్రజా ప్రభుత్వాలకీ వ్యతిరేకించి వారికి బుద్ధి చెప్పి వేరే ప్రభుత్వాలని ఏర్పాటు చేసుకొన్న ప్రజా ఉద్యమాలు ఎన్నొ ఎన్నెన్నొ ఉన్నాయి అని మనందరికీ తెలుసు. ప్రజల చదువు సంధ్యలు మరియు తెలివి తేటల గురించి కూడా మనం ప్రత్యేకించి చెప్పుకోవల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏమాత్రం అక్షరజ్ఞానం లేని వారు కూడా సెల్లు ఫోనులు వాడుతున్నరోజులివి......

    సరే కమ్యూనిజం అనేదేదో చాలా గొప్పది. దానికి అవకాశం లేకపోవడం వల్లనే దానిలోని మంచి ఏమిటో ప్రజలకి తెలియటం లేదు అనుకోవటాని ఉన్నదంటారా....? లేదు, ఎందుకంటే ఎన్నో దేశాలలో ఈ కమ్యునిజాన్ని అమలు చేసి దశాబ్దాలుగా ప్రయోగాలు చేసినప్పటికీ ఆ దేశాలు మిగిలిన దేశాల కంటే ఏమీ అద్భుతంగా లేవు. పేదవారికీ పెద్దవారికీ తారతమ్యం అలాగే కొనసాగింది...తూర్పు యూరప్పులో కమ్యునిస్టులకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నడిచి వారిని తొలగించారు. అనేక కమ్యునిస్టు పెద్దల భవనాలు ఇదివరకటి రాజులు కోటలని మరిపించేటట్లుగా ఉన్నవి. పంపుల దగ్గరనుండి పడుకొనే మంచాల దాకా బంగారంతో చేసుకొన్నవి తూర్పు యురప్ కమ్యునిస్టు అధినేతల ఇళ్ళలో చూసిన ప్రజలకి కమ్యునిజం ఏదొ గొప్ప అనే భావం పొయింది. అది కూడా ఏదో విధంగా ప్రభుత్వాధికారాన్ని దొరకపుచ్చుకొనే ప్రక్రియే అని తెలుసు కొన్నారు.

    ఇప్పుడు మనవాళ్ళు పెద్దగా గొప్పగా [దొంగ లింకులు పెట్టిమరీ] చెప్పుకొనే చైనాలో కూడా అసలు కమ్యునిజం పోయి పెట్టుబదీదారి కమ్మునిస్టు పార్టీనే మిగిలింది. ఏదైనా వస్తువుకు కేవలం శ్రామిక శక్తితోనే దానికి విలువకలుగుతుంది అన్న అసలు సిద్ధంతానికే తిలోదకాలిచ్చి వీరు తమ దేశం లోని కార్మికుల శ్రామిక శక్తికి అతి తక్కువ వెల కట్టి, వస్తువులను అతి తక్కువ ధరలకి ఇతర దేశాలకి అమ్మి అక్కడి శ్రామికుల పొట్ట కూడా కొడుతున్నారు. భవిష్యత్తులో ప్రపంచంలోని అన్ని దేశాలలో కమ్యూనిజం వస్తే[?] కార్మికుల గతి ఏమిటో కళ్ళకి కట్టినట్లు చూపిస్తోంది.

    ReplyDelete
  8. ఇకపోతే, పాతకాలంలో రాజ్యాంగం క్రింద ఉన్న మతాలలో లాగానే కమ్మ్యునిజంలో కొన్ని విధి విధానాలు ఏర్పడిపోయినాయి. ఉదాహరణకి...,ఎర్ర రంగు వెయ్యటం, ఎర్ర చొక్కాలు వెయ్యటం[పెద్ద నాయకులు మాత్రం వైట్ అండ్ వైట్ వేస్తారనుకోండి], గుప్పిడి బిగించి [అఖర్లేనప్పుడు కూడా] చూపించటం, వ్యక్తి పూజలకి దూరం అంటూనే పటాలని పెట్టి దండలు వెయ్యటం, "ప్రముఖులు"[.....? అందరూ సమానమేకదా!!!] పోయినప్పుడు వారిని ఒకే రకమైన పద్ధతిలో సాగనంపటం....పోయిన వ్యక్తి భావాలకన్నా అతని శరిరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం..వారికి సమాధులు కట్టి వాటిమీద విప్లవ చిహ్నాలని పెట్టడం............ఇవన్నీ మత ధొరణులనే చూపిస్తున్నాయేగానీ ...."పేద ప్రజల కోసం పని చేసే ఎటువంటి సెంటిమంటులు కానరావు".

    ఇక మన దేశానికొస్తే, ఇక్కడి కమ్మునిస్టులు నెలవారీ జీతాలు తీసుకొనే వ్యక్తుల పట్ల చూపించే శ్రద్ధ ఇసుమంతైనా ఏరొజుకారోజు బ్రతికేవారి మీద చూపించటం లేదు. వారిని కేవలం మిగిలిన పార్టీలవారు వాడుకొన్నాట్లే తమ అవసరాల కార్యకర్తలుగా మాత్రమే వాడుకొని వదిలి వేస్తున్నారు. నాకు తెలిసినంతవరకూ విజయవాడలో....ఒక స్కూలు మాస్తారు కొడుకు, ఒక కిళ్ళి షాపు యజమాని, ఏ ఉద్యోగం సద్యోగం లేని ఒకాయన ఇలా ఉన్న కమ్మునిస్టు నాయకులు ఇప్పుడు కోట్లకి అధిపతులయినారు. ఇలా ప్రజల బాబోగులు చూడటానికి ఎంతమాత్రం ఉపయోగించక స్వార్ధ ప్రయోజనాలకే వాడుకోవటంవల్లనే వాటిలోని "మంచి అనే పదార్ధం" ప్రజలకి కనపడటం లేదు. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే కేవలం అధికారం సంపాయించటానికే ఏ ఇజాన్ని అయినా వాడుకొంటున్నారు.

    చివరలో, ప్రజల మంచి కోసం మనం కేవలం కమ్మ్యునిజమే చూడఖర్లేదు......అన్ని పార్టీల మానిఫాస్టులలోను పేద ప్రజల అబ్యున్నతే మాధ్యేయం అని ఉంటుంది. ప్రపంచం లోని అన్ని మతాలలోనూ "సాటి వారిని ప్రేమతో దయతో చూడండి, వారికి కష్టం వస్తే ఆదుకోండని" ఉన్నదే కానీ.....మీరు తప్ప మిగిలిన వారిని అంతమొందించడని ఎక్కడా లేదు. తేడా ఎక్కడంటే వాటిని అమలు పరచటంలో....ఏదైతే "అభ్యుదయ భావాలు" అని అంటున్నారో వాటిని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజలందరి కోసం వాడినట్లైతే ఏ ఇజం, ఏ మతం ఉన్నప్పటికీ ప్రజలకి అనుసరణనీయమే..... అలా కాకుండా బలవత్‌ప్రచారాలకి పాల్పడి ప్రజలకి ఇబ్బంది కలిగించే పనులు చేస్తూ ఉన్నట్లైతే అటువంటి స్వేచ్చలేని, బలవంతపు, హింసతో కూడిన ఎటువంటి ఇజాన్నీ ప్రజలు ఎప్పటికీ ఆమోదించరు.

    ReplyDelete
  9. @ రాధాకృష్ణ గారూ!
    ఒక వస్తువు దానంతట అదే ప్రజలలోకి వెళితే ... ' అమితాబ్,సచిన్‌ల నుండి మహేష్ బాబు దాకా ఆఖరుకు కె.విశ్వనాధ్ తో సహా ప్రచారాలెందుకు? ఇది మీరు ఆలోచించాలని మనవి. మీరన్నట్లు ప్రజలకు ఏది అవసరమో అదే తయారుకావాలి.అదే మార్క్సిజం చెప్పేది. అసలు మార్క్స్ కాపిటల్ గ్రంధంలో మొదలు అంశమే సరుకు - వస్తువు గురించి.

    కమ్యూనిజం ఎన్ని దేశాలలో ఉంది? అన్నది ప్రశ్నే కాదు. అలా అనుకుంటే మార్క్స్ సిద్ధాంతం ప్రవేశపెట్టినప్పటికీ - ఇప్పటికీ ఎలా ఉంది. ఒక సిద్ధాంతాన్ని చర్చింటేపుడు ఇది ప్రధాన అంశం అని నేను భావించడం లేదు. కూలిపోయిన కమ్యూనిస్టు దేశాలలో ప్రజల ప్రస్తుత పరిస్తితేమిటి ? వారి పోరాటాలు దేనికోసం - గమనించాలి.

    విప్లవాలు రావడానికి కమ్యూనిజమే అవసరం అని ఎవరన్నారు ? కమ్యూనిజం అనే ఆలోచన లేక ముందే విప్లవాల చరిత్ర ఉంది. ఆ చరిత్రను గమనించే విప్లవం ఏ విధంగా ఉండాలి ? అనే ప్రతిపాదన వచ్చింది.ఇప్పుడు కమ్యూనిస్టు దేశాలలో మీరు చెప్పిన లోపాలను ఎలా సవరించుకోవాలో కూడా చరిత్ర్రే చెపుతుంది.

    విప్లవం అంటే కేవలం రాజకీయాలకో - రాజ్యాలు మారడానికో అని మాత్రమే కాకూడదు. విప్లవం అంటే ఒక మౌలిక మార్పు మాత్రమే. యుద్ధాలు చేసి రక్తపాతం సృస్టించి రాజ్యాలు ఆక్రమించి దోపిడీని కొనసాగించడానికి ప్రపంచం మీద పెత్తనం చేయాలని చూడడం కాదు. ఉన్నతమైన మానవుడు అల్పుడిగా మారకుండా , తన సహజ మానవత్వ లక్షణాలు వీడకుండా వాటిని మరింత ఉన్నతంగా కాపాడుకునేందుకు ప్రయత్నించే ప్రతీ అంశమూ విప్లవమే. భార్య అంటే మగవాడి చెప్పుచేతలలో ఉండాలి అనే మూర్ఖపు భావన నుండి శాస్త్రీయ అధ్యయనం ద్వారా (కమ్యూనిస్టులే కానవసరం లేదు)భార్యాభర్తల సంబంధం ఎందుకు ? ఎలా ఉండాలీ ? ఆ భౌతిక అవసరం ఒక ఆదర్శవంతమైన కుటుంబ వ్యవస్థకు - తద్వారా ఆదర్శవంతమైన సమాజం ఏర్పదేందుకు ఒక మనిషిలో మార్పును తెస్తే అది చాలామందిని ఆలోచింపజేస్తే - ఆదర్శంగా నిలిస్తే అది విప్లవమే. దీనికి వ్యతిరేకంగా పొగరుగా అడ్డం తగులుతానంటే పోరాటం తప్పదు. తరతరాలుగా వస్తుంది కాబట్టి .. అని సంప్రదాయకంగా ఉండడం కుదరదు.

    మీరు చెప్పినంత తేలికగా దానంతత అదే ఎక్కడా సమాజం మారలేదని చరిత్ర చెపుతుంది.భవిష్యత్తులో కూడా అంతే. కమ్యూనిస్టులే అవసరమా? కాదా? అనేది కూడా చరిత్ర తేల్చాల్సిందే. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడాన్ని బట్టీ - వారిని చైతన్య చేసేదానిని బట్టీ అది ఉంటుంది.

    అవసరం - తెలివి - చైతన్యం ఈ మూడు వేరు రాధాకృష్ణ గారూ ! ఎదుటి మనిషితో మాట్లాడాలనే అవసరం మొబైల్ మాట్లాడించే తెలివిని అనివార్యంగా నేర్పుతుంది. కాకపోతే ఒకరికి ఎక్కువ - మరొకరికి తక్కువా. కానీ .. అవసరానికి మించి మొబైల్ వాడకం వల్ల పర్యావరణం సమతుల్యంలో కలిగే మార్పులను ఎలా ఎదుర్కోగలం అనేది చైతన్యం ద్వారా మాత్రమే వస్తుంది. ఇది అందరికీ సమానంగా ఉండదు.అవసరాల కోసం మొబైల్ వాడే వారికీ , అవసరం ఆధారంగా మరింతా వ్యాపారం చేద్దామనుకునే వారికి చైతన్యం తో పనిలేదు.

    స్వాతంత్రోద్యమ కాలం లో స్వదేశీ నినాదానికీ నేటి పాలకులు అనుసరిస్తున్న విదేశీ అనుకూల విధానాలకీ కారణం ఏమిటి ? భారత్ పేద ప్రజలున్న సంపన్న దేశంగా ఉండడానికి కారణం ఏమిటి ? ప్రపంచం లోనే ఉన్నత జీవన విధానం - సంస్కృతీ - విలువలు కలిగిన పుణ్యభూమి లో విలువలు దిగజారడానికి కారణం ఏమిటి ? ఇక్కడేమీ కమ్యూనిస్టులు పాలన చేయడం లేదుకదా ?

    మీరన్నట్లు మార్క్సిస్టు మూలసూత్రాలాను పక్కన బెట్టడం ద్వారానే , ప్రపంచ దేశాలలో అగ్రగామిగా ఉండేందుకు, అవసరం లేని ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు తమ దేశం లోని కార్మికులను దోపిడీ చేయడం కమ్యూనిస్టు దేశాల వారు చేయడం కూడా మార్క్సిస్టు సూత్రాలకు విరుద్ధమైనదే. పెట్టుబడిదారీ దేశాలను బూచిగా చూపి ఇలాంటి చేష్టలు చేయడం సరైనది కాదు.

    ప్రపచ వ్యాపితంగా కమ్యూనిజం వస్తే ఇంకా దోచుకునేదెవడు? అసలు ఇంతవరకూ సరిగా సోషలిజమే అమలు జరగడం లేదు. అపుడే కమ్యూనిజం ఆచరణ గురించి చర్చించలేము. సిద్ధాంతంగా మాత్రమే ప్రస్తుతానికి చర్చించగలం.

    ReplyDelete
  10. @ రాధాకృష్ణగారూ !
    మీ రెండో కామెంట్ కు సమాధానంగా కామెంట్ గానే సమాధానం చెప్పడానికి స్పేస్ ప్రాబ్లం గా వుంది కనుక " అందరూ సమానం ఎప్పటికీ అసాధ్యం" అనే శీర్షిక తో పోస్టు రూపం లో వ్రస్స్తున్నాను. గమనించగలరు.

    ReplyDelete
  11. కొండలరఒ గారు
    "మార్కిజమే పిరిపూర్న సిద్దాంతమని మొండిగా వాదించడం కూడా మార్కిజానికి ద్రొహంచెసె అంచమని నా అభిప్రాయం"
    మార్కిజం పరిపూర్న సిద్దాంతం కాదని అంటున్నారు మరి పిరిపూర్న సిద్దాంతం వెరే ఎమైనా వుందెమొ చెప్పండి దీన్ని పట్టిచెప్పవచ్చు మీకు మర్కిజం ఏ మాత్రం అర్దమైదొ ఈ మద్య యర్ర బుర్జువాలు మార్కిజాన్ని సంస్కరించాలని అనుకున్నారట .అంటె విప్లవాలు గిప్లవాలు ఏ మీవద్దు మెము అదికారంలొకి వచ్చి సిహాసనం మీద కూర్చుంటాం అనేమొ ఈ కమ్మునిస్టు ముసుగు పార్టిలు మార్కిజం మీద విపరీతమైన ద్వెసాన్ని ప్రజలకు కల్గించినాయి

    ReplyDelete
  12. @ రాం మోహన్‌రావు గారూ !
    మార్క్సిజమే పరిపూర్ణ సిద్ధాంతం అని మొండిగా వాదించకూడదు అంటే అర్ధం "మార్క్సిజం పరిపూర్ణ సిద్ధాంతం కాదు" అని కాదు. తెలియని వారితో ఒక సిద్ధాంతాన్ని చర్చించి రాద్ధాంతం చేసే కంటే ఆచరణలో పనుల ద్వారా వారిని ఆకర్శించవచ్చు-వారి విశ్వాసం పొందవచ్చు అనీ నేను చెప్పదలచుకున్నది. ప్రతీ సిద్ధాంతం ప్రజలందరికీ అణువణువూ అర్ధమయ్యే ఫాలో కారు. మార్క్సిజం పై ద్వేషం పెట్టుకుని గుడ్డిగా దానిని వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్న వారికి ఎన్ని చెప్పినా ఏమి చెప్పినా ఎక్కవు. నిద్రపోతున్నట్లు నటిస్తున్నవాడిని లేపలేము కదా? మార్క్సిజం తెలుసుకుని విమర్శించేవాల్లకి-తెలియకుండా విమర్శించే వాళ్ళకీ తేడా ఉంటుంది. ఎవరు ఎలా విమర్శిస్తున్నారో ఆ విమర్శను బట్టి అవగతమవుతుంది.నాకు అర్ధమయిన మేరకే నేను చర్చించగలను.నేను పండితుడను కాను అని మొదటే చెప్పాను.మళ్ళీ చెపుతున్నాను.చర్చలలో ఏ మాత్రం తెలుసుకునే వీలున్నా తెలుసుకుంటాను. తప్పు అని తెలిసినదానిని వ్యక్తులతో పని లేకుండా ఆ అంశానికి పరిమితమై తప్పు అని చెప్పగలను. మీరన్నట్లు ప్రజలకు విపరీతంగా ద్వేషాన్ని కల్గించే చర్యలుంటే వాటిని మార్క్సిస్టులు సరిచేసుకోవాలి. కానీ మీరు ద్వేషం మాత్రమే ప్రదర్సిస్తున్నారు తప్ప ఏమీ సూచనలు చేయలేదు.

    ReplyDelete
  13. పల్లా కొండల రావు గారూ మీరు చెప్పినది బాగానే ఉన్నది. ప్రజల బాగు కోరే ఎటువంటి సిధాంతాన్ని ద్వేషించాల్సిన పని లేదు. అటువంటి సిధాంత కర్తలు లేక నమ్మేవారు ఒకరి సిద్ధాంతాన్ని ఒకరు విమర్శించకోకుండా....వాటిలో ఉన్న లోపాలను ఒకరికొకరు తెలిజేసుకొంటే బాగుంటుంది కదా. ఎందుకంటే అందరికీ కావల్సింది ప్రజలందరి బాబోగులేకదా....!!! ఏఒక్క సిద్ధాంతంతో కాకుండా అన్ని సిద్ధాంతాల కలయిక ద్వారామాత్రమే ప్రజాభివృధి సాధ్యమవుతుంది. అలా కాకుండా మా సిద్ద్ధాంతం ద్వారానే ప్రజలు బాగుపడతారని ఒకరినొకరు విమర్శించుకొంటే అసలు సిద్ధాంతాలు మూలబడి ప్రజాదరణ పొందకుండా ఉంటాయి.

    ప్రజల బాగుకోరే సిద్ధాంతాలు అమలు చేస్తున్నప్పుడు వచ్చే సమస్యలను చర్చిస్తే బాగుంటుంది కదా....అందుకనే నేను ఆ సిధాంతాలు ఇప్పటికే అమలు జరిగినదాని గురించే వివరించాను. వాటిని అమలు పరిచేవారిలో చిత్త శుద్ధి వుంటే ఎటువంటి వ్యవస్థలోనైనా ప్రజలు సుఖంగానే ఉంటారని నా ఉద్దేశం. అందుకనే "ఆత్మశుద్ధిలేని ఆచారమదిఏల..........భాండశుద్ధిలేని పాకమేల....చిత్తశుద్ధిలేని శివ పూజ లేలరా ........అని వేమన ఇదివరకే చెప్పారు. కాబట్టి సిద్ధంతాల గురించి కన్నా వాటిని అమలు చేస్తున్న విధానాల మీద చర్చ చేస్తే బాగుంటుంది అని అనుకొంటున్నాను.

    ReplyDelete
  14. @ రాధాకృష్ణగారూ !
    మీ అభిప్రాయం మంచిదే.

    కానీ విరుద్ధ భావాలున్న సిద్ధాంతాలు కలవలేవు. అంటే ప్రస్తుత సమాజం లో డబ్బు ఎందుకు మనుషులను శాసిస్తోంది. అనేది తెలియాలంటే దాని మూలాలోకి అంటే అసలు డబ్బు ఎందుకు సృష్టించబడింది? సహజ మానవ జీవితానికి ఇది అవసరమా? అనే దానిలో తప్పనిసరిగా సిద్ధాంత విభేధం వచ్చి తీరుతుంది.

    డబ్బు అనేది రద్దు కావాలి అని మార్క్సిజం చెపితే అసలదేలా సాధ్యం అని నవ్వేంతగా మరొకరికి అనిపిస్తుంది. కానీ సమాజ పరిణామాన్ని లోతుగా అధ్యయనం చేయగలిగితే అది సాధ్యమే పైగా మనుషులను విడదీసే - మానవత్వాన్ని మంటగలిపే ఈ డబ్బు మహమ్మారిని ఎంత త్వరగా నాశనం చేస్తే అంత మంచిది కొందరికి అనిపించవచ్చు. మరి ఈ రెండు భావాలు ఒకటిగా ఎలా ఉంటాయి?

    అయితే సిద్ధాంత విభేధాలు ఉండడం వేరు. మంచిపనులను కలసి చేయడం వేరు. అభివృద్ధి వేరు అసమానతలు-అణచివేత లు లేకుండా ఉండడం వేరు. అభివృద్ధిని అనదరూ కలసి సాధించుకోవచ్చు తప్పులేదు.కానీ సమాజం లో విలువలు పెంపొదడం వేరు.వీటిని రెండింటినీ ఒకే దృష్టితో చూడలేము.

    ప్రజల బాగు కోరే సిద్ధాంతాలు అమలు చేసే విషయం లో చిత్తశుద్ధికి సంబంధించి మీ సూచనలు-విమర్శలు తప్పనిసరిగా ఆహ్వానించదగినవి -ఆమోదయోగ్యమైనవి.

    సిద్ధాంతం-ఆచరణ రెండూ పరసపర ప్రభావితాలు రాధాకృష్ణ గారూ ! ఆచరణ లేని సిద్ధాంతం కుంటిది. సిద్ధాంతమ లేని ఆచరణ కుంటిది. కాబట్టి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయాల్సి ఉంటుంది. వేమన చెప్పింది కూడా అదే కదా!?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అధ్యయనం అలవాట్లు అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీష్ నేర్చుకుందాం ఇంటర్వ్యూలు ఉగ్రవాదం ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కులం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనరల్ సైన్సు జనవిజయం జమాఖర్చుల వివరాలు జర్నలిజం జీనియస్ జ్ఞాపకాలు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నిద్ర నీతి లేనివాడు జాతికెంతో కీడు న్యాయం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బయాలజీ బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మనం మారగలం మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు వస్త్రధారణ వార్త-వ్యాఖ్య వికాసం విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం విప్లవం వీడియోలు వేదాలు వ్యక్తిగతం వ్యవసాయం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా
 
Top